logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రాష్ట్రవ్యాప్తంగా నేతన్నలు, హస్తకళాకారులు గౌరవప్రదమైన జీవనం సాగించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, త్వరలో 'నేతన్న భరోసా' పథకానికి శ్రీకారం చుట్టనున్నామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత వెల్లడించారు. విదేశాల్లో కూడా 'లేపాక్షి' షోరూమ్‌లు ఏర్పాటు చేయనున్నామని, అమరావతిలోని శాఖమూరులో పది ఎకరాల విస్తీర్ణంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) ఏర్పాటుకు నిర్ణయించామని తెలిపారు. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మండలి ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల ప్రగతిపై శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, అన్న ఎన్టీఆర్ నినాదం స్ఫూర్తితో సీఎం చంద్రబాబు నేతన్నల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నారని, చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే టెక్స్‌టైల్స్ అపారెల్ & గార్మెంట్స్ పాలసీ 2024-29 తీసుకొచ్చామని, ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలో టెక్స్‌టైల్స్ రంగంలో ₹10 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు 2 లక్షల మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గతేడాది విశాఖలో జరిగిన సీఐఐ సమ్మిట్‌లో టెక్స్‌టైల్స్ రంగంలో ఐదు ఒప్పందాలు జరిగాయని, ₹4,700 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వాటిలో కొన్ని పరిశ్రమలకు భూములు, ఇతర మౌలిక సదుపాయాలు కేటాయించామని మంత్రి వివరించారు. 50 ఏళ్లు నిండిన నేతన్నలకు పెన్షన్లు అందజేస్తున్నామని, బడ్జెట్‌లో థ్రిఫ్ట్ ఫండ్ నిధులు కేటాయించామని మంత్రి తెలిపారు. 2024-25లో 90 సంఘాలకు ₹71.21 కోట్ల విలువైన నూలు సరఫరా చేశామని, 2025-26లో 109 సంఘాలకు ₹175.20 కోట్ల విలువైన నూలు సరఫరా చేశామని, రెండేళ్లలో కలిపి ₹246.41 కోట్ల విలువైన నూలు అందించి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించామన్నారు. గత సంవత్సరం వన్ డిస్ట్రిక్ట్-వన్ ప్రొడక్ట్ కింద ఏపీకి 10 అవార్డులు వస్తే, వాటిలో నాలుగు చేనేత రంగానికే వచ్చాయన్నారు. నేతన్నలకు ఉచిత విద్యుత్ సరఫరా హామీని నెరవేర్చామని, ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి 50,565 చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు అందిస్తున్నామని, మగ్గం నేతన్నలకు నెలకు ₹720లు (ఏడాదికి ₹8,640లు), మరమగ్గం నేతన్నలకు నెలకు ₹1,860లు (ఏడాదికి ₹21,600లు) లబ్ధి కలుగుతోందని వివరించారు. ఉచిత విద్యుత్ పథకం కోసం ₹150 కోట్లు వెచ్చిస్తున్నామని, ఈ పథకం అమలుతో నేతన్నల కుటుంబాల్లో వెలుగులు నిండాయని మంత్రి అన్నారు. చేనేత కార్మికులకు రంగులు వేయడం, బ్లీచింగ్ ఛార్జీల వేతనాలు పెంచామని, 90 శాతం సబ్సిడీతో మగ్గం పనిముట్లు అందజేస్తున్నామని, చేనేత కార్మికుల గుర్తింపు కార్డులు ఇస్తున్నామని తెలిపారు. వస్త్రాలకు క్యూఆర్ కోడింగ్ ఇచ్చి, నేతన్నల కష్టం, వస్త్రం తయారీ గురించి ఆ కోడ్‌లో పేర్కొంటున్నామని, ఈ కోడింగ్‌తో నకిలీ వస్త్రాల అమ్మకాలకు అడ్డుకట్టపడుతుందని చెప్పారు. నేతన్నలకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ₹10.44 కోట్లతో 10 చిన్న క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని, ధర్మవరంలో ₹38.31 కోట్లతో మెగా చేనేత క్లస్టర్ నిర్మిస్తున్నామని మంత్రి సవిత వెల్లడించారు. అమరావతిలో చేనేత, హస్తకళల మ్యూజియం నిర్మించబోతున్నామని, పిఠాపురంలోని ఉప్పాడలో ₹15.01 కోట్లతో, మంగళగిరిలో హ్యాండ్లూమ్ ప్రాజెక్టుకు ₹22.50 కోట్లతో చేనేత పార్క్‌లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అమరావతిలోని శాఖమూరులో పది ఎకరాల విస్తీర్ణంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) ఏర్పాటుకు నిర్ణయించామన్నారు. 7 వేల మంది చేనేతలకు ₹65.35 కోట్లు ముద్ర రుణాలు మంజూరు చేశామని, నేత వస్త్రాల అమ్మకాలు పెంచేలా ఆద్యం, టాటా తనేరియా, కో ఆప్టెక్స్ వంటి సంస్థలతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానంతో కూడా ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. చేనేత వస్త్రాలు, హస్త కళారూపాలు ఒకే చోట విక్రయించేలా షోరూమ్‌లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఆప్కో బ్రాండ్‌ను నిలబెట్టేలా షోరూమ్‌లలో కేవలం మగ్గం మీద నేసే వస్త్రాలనే విక్రయాలకు చర్యలు తీసుకుంటున్నామని, ఆప్కో షోరూమ్‌లను ప్రక్షాళన చేస్తున్నామని, రెడీమేడ్ వస్త్రాల అమ్మకాలతో పాటు కొత్త స్టాక్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పారదర్శకత పెంచేలా ఆప్కోలో కంప్యూటరీకరణ చేపట్టామని, డిజిటల్ పేమెంట్లను చెల్లించేలా చర్యలు తీసుకున్నామని, ఆప్కోలో డిజిటలైజేషన్‌కు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు 2025 లభించిందని సవిత తెలియజేశారు. ఆప్కో ద్వారా 24 నెలల కాలంలో ₹190 కోట్ల అమ్మకాలు చేశామని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఐదు చోట్ల (పుట్టపర్తి, ఎమ్మిగనూరు, ప్రొద్దుటూరు, టెక్కలి, అనకాపల్లి) ఆప్కో షోరూమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని, రెండేళ్లలో ప్రదర్శనల ద్వారా ₹20 కోట్ల మేర చేనేత వస్త్రాల అమ్మకాలు జరిపామని తెలిపారు. 40, 50 శాతం డిస్కౌంట్లతో చేనేత వస్త్రాల అమ్మకాలు చేస్తున్నామని, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని చెప్పారు. చేనేత సహకార సంఘాలకు ఆప్కో బకాయిలు చెల్లిస్తున్నామని, గత డిసెంబర్, జనవరి నెలల్లో ₹9 కోట్లకు పైగా బకాయిలను చేనేత సహకార సంఘాల ఖాతాల్లో జమ చేశామని మంత్రి వివరించారు. రాష్ట్రంలో 2.05 లక్షల హస్తకళాకారులను గుర్తించామని, వారికి ఆర్థిక భరోసా కల్పిస్తూ గౌరవప్రద జీవనం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. రాష్ట్రంతో పాటు జాతీయ స్థాయిలో 19 లేపాక్షి షోరూమ్‌లు ఉన్నాయని, వాటన్నింటినీ ఆధునీకరిస్తున్నామని, ఇటీవలే రాజమండ్రి ఎయిర్‌పోర్టులో లేపాక్షి షోరూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. విదేశాల్లోనూ లేపాక్షి షోరూమ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కళాక్షి వాట్సాప్, తరంగ సేవ పేరుతో ఆన్‌లైన్‌లోనూ హస్తకళల విక్రయాలు చేస్తున్నామని, లేపాక్షి షోరూమ్‌ల పారదర్శకంగా నిర్వహణకు తరంగ ఏపీ ఆధారిత రియల్ టైమ్ వ్యవస్థ రూపకల్పన చేశామన్నారు. హస్తకళారూపాల అమ్మకాలు పెరిగేలా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 65 ప్రదర్శనలు ఏర్పాటు చేశామని, 2024-25లో ₹56.47 కోట్లు, 2025-26లో ₹60.78 కోట్ల అమ్మకాలు జరిపామని చెప్పారు. హస్తకళాకారులను ప్రోత్సహించేలా అవార్డులు బహూకరించామని, 20 మంది కళాకారులకు ₹3 లక్షల వరకు నగదు బహుమతి అందజేశామని తెలిపారు. వన్ డిస్ట్రిక్ట్-వన్ ప్రొడక్ట్ (ఓడీఓపీ) కింద ప్రతి జిల్లా నుంచి హస్తకళలకు గుర్తింపునకు కృషి చేస్తున్నామన్నారు. విశాఖపట్నం సీఐఐ - 2025 సదస్సు, సింగపూర్‌లో జరిగిన భారతదేశ గణతంత్ర వేడుకలకు, హాంకాంగ్ మరియు ఇతర అంతర్జాతీయ వేడుకలకు ఏపీ హస్తకళల గిఫ్ట్ బాక్స్‌లు సరఫరా చేశామని మంత్రి వివరించారు. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మండలి ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) పథకం కింద 2024-25లో 974 యూనిట్లు స్థాపించి, ₹38.51 కోట్ల మార్జిన్ మనీ అందజేసి, 10,714 మందికి ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. 2025-26లో 2,319 యూనిట్ల ఏర్పాటుకు నిర్ణయించామని, వాటికి ₹70.15 కోట్ల మార్జిన్ మనీ మంజూరు చేశామని, ఈ యూనిట్ల స్థాపన ద్వారా 25,509 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రి చెప్పారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా 463 మంది యువతకు, మహిళలకు టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్, కాగితం తయారీ, కొవ్వొత్తుల తయారీ తదితర ఉపాధి ఆధారిత కోర్సుల్లో శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు. 2014-19 మధ్య కాలం చేనేత రంగానికి స్వర్ణయుగమని, ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం నేతన్నల మేలు కోసం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి సవిత తెలిపారు. ఆ తరువాత వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అన్ని రంగాల మాదిరిగానే చేనేత రంగానికి తీవ్ర నష్టం కలిగిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నేతన్నలు ఊపిరిపీల్చుకోగలిగారని మంత్రి సవిత అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మండలి సీఈవో సింహాచలం, కమిషనర్ రేఖారాణి, లేపాక్షి ఎండీ విశ్వ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

12 hrs ago
user_జేమ్స్
జేమ్స్
Vijayawada East, Ntr•
12 hrs ago
8e71c76f-ded1-42dd-ab03-3651bb29e5b4

More news from Ntr and nearby areas
  • ఎన్టీఆర్ జిల్లాలో జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో జనసేన నేతలు గాదే సాయి కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సాయి కృష్ణ కుటుంబానికి జనసేన అండగా ఉంటుందని సామినేని ఉదయభాను హామీ ఇచ్చారు. పోలీసులు గాదే సాయి కృష్ణ పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించిన ఉదయభాను, బాధ్యులపై చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ధృవీకరించారు. సాయి కృష్ణ కుటుంబం మొదటి నుండి జనసేనతోనే ప్రయాణం చేసిందని ఆయన గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. శవ రాజకీయాలు చేయడం మొదటి నుండి వైసీపీకి అలవాటేనని, వైసీపీ నాయకులు ప్రతి విషయాన్ని రాజకీయంగా వాడుకోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి వైసీపీ శవ రాజకీయాలు చేయడం దారుణమని ఆయన అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అనేక దారుణాలు జరిగిన విషయం వాస్తవమని కూడా ఆయన పేర్కొన్నారు.
    1
    ఎన్టీఆర్ జిల్లాలో జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో జనసేన నేతలు గాదే సాయి కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సాయి కృష్ణ కుటుంబానికి జనసేన అండగా ఉంటుందని సామినేని ఉదయభాను హామీ ఇచ్చారు.

పోలీసులు గాదే సాయి కృష్ణ పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించిన ఉదయభాను, బాధ్యులపై చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ధృవీకరించారు. సాయి కృష్ణ కుటుంబం మొదటి నుండి జనసేనతోనే ప్రయాణం చేసిందని ఆయన గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. శవ రాజకీయాలు చేయడం మొదటి నుండి వైసీపీకి అలవాటేనని, వైసీపీ నాయకులు ప్రతి విషయాన్ని రాజకీయంగా వాడుకోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి వైసీపీ శవ రాజకీయాలు చేయడం దారుణమని ఆయన అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అనేక దారుణాలు జరిగిన విషయం వాస్తవమని కూడా ఆయన పేర్కొన్నారు.
    user_జేమ్స్
    జేమ్స్
    Vijayawada East, Ntr•
    11 hrs ago
  • రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి రాందేవ్ బాబాను ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని జన చైతన్య వేదిక తీవ్రంగా ఖండించింది. కోవిడ్ సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టించే తప్పుడు ప్రకటనలు ఇచ్చి ఆధునిక వైద్య విధానాన్ని (అలోపతి) కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని, ప్రజలను మోసం చేశారని వేదిక నాయకులు ఆరోపించారు. గుంటూరులోని జన చైతన్య వేదిక హాలులో ఈ నెల 20వ తేదీన జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ, రాందేవ్ బాబాకు సంబంధించి 2023లో సుప్రీంకోర్టు విచారణ జరిపి బహిరంగ క్షమాపణలు చెప్పించిందని గుర్తుచేశారు. డ్రగ్స్ మరియు మ్యాజిక్ రెమిడీస్ యాక్ట్ 1954ను ఉల్లంఘిస్తూ పతంజలి మందులతో వివిధ వ్యాధులను నయం చేస్తామని పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టడాన్ని సుప్రీంకోర్టు వ్యతిరేకించిందని ఆయన పేర్కొన్నారు. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులైన కరోనిల్‌తో కోవిడ్ ను సంపూర్ణంగా నయం చేస్తామని, ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని ఆమోదించిందని తప్పుడు ప్రకటనలు చేసి మోసం చేశారన్నారు. బిపి, షుగర్, అస్తమా వంటి దీర్ఘకాలిక వ్యాధులను పూర్తిగా నయం చేస్తామని పత్రికలలో భారీ ప్రకటనలు ఇవ్వడాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో సవాల్ చేసిందని, సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి బాబా రాందేవ్ ప్రజలకు బహిరంగ క్షమాపణలు ప్రకటిస్తూ పత్రికలకు ప్రకటనలు ఇచ్చారని వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు. ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డి.ఎ.ఆర్. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, యోగా గురువుగా ప్రసిద్ధి గాంచిన బాబా రాందేవ్ పతంజలి సంస్థ ద్వారా ప్రతి ఏటా 40 వేల కోట్ల రూపాయల ఉత్పత్తులను అమ్ముతూ ప్రజల నమ్మకాలను లాభాలుగా మార్చుకున్నారని చెప్పారు. సుదీర్ఘ అనుభవం గల నారా చంద్రబాబు నాయుడు నేడు హిందుత్వ భావజాలాన్ని ప్రోత్సహిస్తున్నారని, అందులో భాగంగానే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముఖ్యఅతిథిగా బాబా రాందేవ్ ను ఆహ్వానించారని వివరించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీని సంతృప్తి పరచడానికే హిందుత్వ వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన ఆరోపించారు. భారతీయ ప్రజల్లో ఉన్న సనాతన భావాలను, మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తూ బాబా రాందేవ్ పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల ద్వారా ప్రతి ఏటా వేలాది కోట్ల రూపాయల లాభాలను పొందుతున్నారని ఆయన వివరించారు.
    1
    రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి రాందేవ్ బాబాను ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని జన చైతన్య వేదిక తీవ్రంగా ఖండించింది. కోవిడ్ సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టించే తప్పుడు ప్రకటనలు ఇచ్చి ఆధునిక వైద్య విధానాన్ని (అలోపతి) కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని, ప్రజలను మోసం చేశారని వేదిక నాయకులు ఆరోపించారు.

గుంటూరులోని జన చైతన్య వేదిక హాలులో ఈ నెల 20వ తేదీన జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ, రాందేవ్ బాబాకు సంబంధించి 2023లో సుప్రీంకోర్టు విచారణ జరిపి బహిరంగ క్షమాపణలు చెప్పించిందని గుర్తుచేశారు. డ్రగ్స్ మరియు మ్యాజిక్ రెమిడీస్ యాక్ట్ 1954ను ఉల్లంఘిస్తూ పతంజలి మందులతో వివిధ వ్యాధులను నయం చేస్తామని పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టడాన్ని సుప్రీంకోర్టు వ్యతిరేకించిందని ఆయన పేర్కొన్నారు. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులైన కరోనిల్‌తో కోవిడ్ ను సంపూర్ణంగా నయం చేస్తామని, ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని ఆమోదించిందని తప్పుడు ప్రకటనలు చేసి మోసం చేశారన్నారు. బిపి, షుగర్, అస్తమా వంటి దీర్ఘకాలిక వ్యాధులను పూర్తిగా నయం చేస్తామని పత్రికలలో భారీ ప్రకటనలు ఇవ్వడాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో సవాల్ చేసిందని, సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి బాబా రాందేవ్ ప్రజలకు బహిరంగ క్షమాపణలు ప్రకటిస్తూ పత్రికలకు ప్రకటనలు ఇచ్చారని వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు.

ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డి.ఎ.ఆర్. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, యోగా గురువుగా ప్రసిద్ధి గాంచిన బాబా రాందేవ్ పతంజలి సంస్థ ద్వారా ప్రతి ఏటా 40 వేల కోట్ల రూపాయల ఉత్పత్తులను అమ్ముతూ ప్రజల నమ్మకాలను లాభాలుగా మార్చుకున్నారని చెప్పారు. సుదీర్ఘ అనుభవం గల నారా చంద్రబాబు నాయుడు నేడు హిందుత్వ భావజాలాన్ని ప్రోత్సహిస్తున్నారని, అందులో భాగంగానే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముఖ్యఅతిథిగా బాబా రాందేవ్ ను ఆహ్వానించారని వివరించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీని సంతృప్తి పరచడానికే హిందుత్వ వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన ఆరోపించారు. భారతీయ ప్రజల్లో ఉన్న సనాతన భావాలను, మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తూ బాబా రాందేవ్ పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల ద్వారా ప్రతి ఏటా వేలాది కోట్ల రూపాయల లాభాలను పొందుతున్నారని ఆయన వివరించారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency Guntur, Andhra Pradesh•
    16 hrs ago
  • ఎమ్మిగనూరు నియోజకవర్గంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి ఫౌండర్ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. గత 76 సంవత్సరాలుగా మదాసి కురువ/మదారి కురువ కులస్తులకు జరుగుతున్న అన్యాయంపై ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, కన్వర్టెడ్ క్రిస్టియన్ పాస్టర్లకు SC సర్టిఫికెట్లను అంగడిలో పప్పుల బెల్లాలు లాగా పంచిపెడుతూ రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. నిజమైన ఎస్సీలైన మదాసి కురువ/మదారి కురువ సోదరులకు SC సర్టిఫికెట్ ఇస్తే, కురుబ/కురుమలు తీసుకొని దుర్వినియోగం చేస్తున్నారని ప్రచారం చేయడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి ఈ విషయాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేసింది. SCలో ఉన్న 59 కులాలకు సమన్యాయం జరిగేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని సమితి తెలియజేసింది. రాయలసీమ జిల్లాలలో అత్యధిక జనాభా కలిగినటువంటి మదాసి కురువ/మదారి కురువ కులస్తులను కుల మార్పిడి చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎస్సీలోని 58 కులాలు హక్కులను పొందుతూ ముందుకు పోతూ ఉంటే, ఏకైక కులమైనటువంటి మదాసి కురువ/మదారి కురువ కులస్తులు ఇప్పటివరకు కోల్పోయిన రాజ్యాంగ హక్కులను పునరుద్ధరించేంతవరకు షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి పోరాడుతూనే ఉంటుందని ప్రసన్నకుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ డాక్టర్ మద్దిలేటి మదాసి కురువ, సాల్వాడి సురేంద్ర, మహదేవప్ప పవన్, జూలకల్లు మునిష్, సుంకేసుల హుస్సేన్ అప్ప, అలువాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
    1
    ఎమ్మిగనూరు నియోజకవర్గంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి ఫౌండర్ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. గత 76 సంవత్సరాలుగా మదాసి కురువ/మదారి కురువ కులస్తులకు జరుగుతున్న అన్యాయంపై ఈ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, కన్వర్టెడ్ క్రిస్టియన్ పాస్టర్లకు SC సర్టిఫికెట్లను అంగడిలో పప్పుల బెల్లాలు లాగా పంచిపెడుతూ రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. నిజమైన ఎస్సీలైన మదాసి కురువ/మదారి కురువ సోదరులకు SC సర్టిఫికెట్ ఇస్తే, కురుబ/కురుమలు తీసుకొని దుర్వినియోగం చేస్తున్నారని ప్రచారం చేయడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి ఈ విషయాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేసింది.

SCలో ఉన్న 59 కులాలకు సమన్యాయం జరిగేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని సమితి తెలియజేసింది. రాయలసీమ జిల్లాలలో అత్యధిక జనాభా కలిగినటువంటి మదాసి కురువ/మదారి కురువ కులస్తులను కుల మార్పిడి చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎస్సీలోని 58 కులాలు హక్కులను పొందుతూ ముందుకు పోతూ ఉంటే, ఏకైక కులమైనటువంటి మదాసి కురువ/మదారి కురువ కులస్తులు ఇప్పటివరకు కోల్పోయిన రాజ్యాంగ హక్కులను పునరుద్ధరించేంతవరకు షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి పోరాడుతూనే ఉంటుందని ప్రసన్నకుమార్ వివరించారు.

ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ డాక్టర్ మద్దిలేటి మదాసి కురువ, సాల్వాడి సురేంద్ర, మహదేవప్ప పవన్, జూలకల్లు మునిష్, సుంకేసుల హుస్సేన్ అప్ప, అలువాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
    user_User7105
    User7105
    Citizen Reporter శ్రీశైలం, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శనివారం ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కలికివాయి గ్రామంలో జరిగిన అన్నదాత సుఖీభవ పథకం కార్యక్రమంలో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఈ పథకం ద్వారా రైతులకు చేయూతను అందిస్తుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 46.85 లక్షల మంది రైతులకు తొలి విడతగా రూ.7 వేలు జమ చేస్తున్నట్లు మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.
    1
    ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శనివారం ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కలికివాయి గ్రామంలో జరిగిన అన్నదాత సుఖీభవ పథకం కార్యక్రమంలో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఈ పథకం ద్వారా రైతులకు చేయూతను అందిస్తుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 46.85 లక్షల మంది రైతులకు తొలి విడతగా రూ.7 వేలు జమ చేస్తున్నట్లు మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.
    user_Sasi Kumar reddy
    Sasi Kumar reddy
    గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • గుంటూరులోని జన చైతన్య వేదిక హాలులో ఈనెల 20వ తేదీన జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి బాబా రాందేవ్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డి.ఎ.ఆర్. సుబ్రమణ్యం తీవ్రంగా ఖండించారు. రాందేవ్ బాబా కోవిడ్ సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టించే తప్పుడు ప్రకటనలు ఇచ్చి ఆధునిక వైద్య విధానాన్ని (అలోపతి) కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని వారు గుర్తుచేశారు. డ్రగ్స్ మరియు మ్యాజిక్ రెమిడీస్ యాక్ట్ 1954ను ఉల్లంఘిస్తూ వివిధ వ్యాధులను పతంజలి మందులతో నయం చేస్తామని పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టడాన్ని సుప్రీంకోర్టు వ్యతిరేకించిందని తెలిపారు. 2023లో సుప్రీంకోర్టు ఈ విషయాలపై విచారించి రాందేవ్ బాబాతో బహిరంగ క్షమాపణలు చెప్పించిందని, పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులతో కోవిడ్ ను సంపూర్ణంగా నయం చేస్తామని, ప్రపంచ ఆరోగ్య సంస్థ పతంజలి కరోనిల్‌ను ఆమోదించిందని తప్పుడు ప్రకటనలతో ప్రజలను మోసం చేశారని వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ అన్నారు. బిపి, షుగర్, అస్తమా వంటి దీర్ఘకాలిక వ్యాధులను పూర్తిగా నయం చేస్తామంటూ పత్రికలలో భారీ ప్రకటనలు ఇవ్వడాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో సవాలు చేయగా, కోర్టు తీర్పును అనుసరించి రాందేవ్ బాబా పత్రికలకు ప్రకటనలు ఇచ్చి బహిరంగ క్షమాపణలు చెప్పిన వ్యక్తి అని పేర్కొన్నారు. ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డి.ఎ.ఆర్. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, యోగా గురువుగా ప్రసిద్ధి చెందిన రాందేవ్ బాబా పతంజలి సంస్థ ద్వారా ప్రతి ఏటా ₹40,000 కోట్ల ఉత్పత్తులను అమ్ముతూ ప్రజల నమ్మకాలను లాభాలుగా మార్చుకుంటున్నారని తెలిపారు. భారతీయ ప్రజలలో ఉన్న సనాతన భావాలను, మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తూ బాబా రాందేవ్ పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల ద్వారా ప్రతి ఏటా వేలాది కోట్ల రూపాయల లాభార్జన పొందుతున్నారని ఆయన వివరించారు. సుదీర్ఘ అనుభవం గల నారా చంద్రబాబు నాయుడు నేడు హిందుత్వ భావజాలాన్ని ప్రోత్సహిస్తున్నారని, అందులో భాగంగానే బాబా రాందేవ్ ను అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆహ్వానించారని సుబ్రమణ్యం ఆరోపించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీని సంతృప్తి పరచడానికే ఈ హిందుత్వ వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన అన్నారు. అందువల్ల, అంతర్జాతీయ యోగా దినోత్సవ వానికి రాందేవ్ బాబాను ముఖ్యఅతిథిగా ఆహ్వానించడం తగదని జన చైతన్య వేదిక పునరుద్ఘాటించింది.
    1
    గుంటూరులోని జన చైతన్య వేదిక హాలులో ఈనెల 20వ తేదీన జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి బాబా రాందేవ్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డి.ఎ.ఆర్. సుబ్రమణ్యం తీవ్రంగా ఖండించారు.

రాందేవ్ బాబా కోవిడ్ సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టించే తప్పుడు ప్రకటనలు ఇచ్చి ఆధునిక వైద్య విధానాన్ని (అలోపతి) కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని వారు గుర్తుచేశారు. డ్రగ్స్ మరియు మ్యాజిక్ రెమిడీస్ యాక్ట్ 1954ను ఉల్లంఘిస్తూ వివిధ వ్యాధులను పతంజలి మందులతో నయం చేస్తామని పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టడాన్ని సుప్రీంకోర్టు వ్యతిరేకించిందని తెలిపారు. 2023లో సుప్రీంకోర్టు ఈ విషయాలపై విచారించి రాందేవ్ బాబాతో బహిరంగ క్షమాపణలు చెప్పించిందని, పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులతో కోవిడ్ ను సంపూర్ణంగా నయం చేస్తామని, ప్రపంచ ఆరోగ్య సంస్థ పతంజలి కరోనిల్‌ను ఆమోదించిందని తప్పుడు ప్రకటనలతో ప్రజలను మోసం చేశారని వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ అన్నారు. బిపి, షుగర్, అస్తమా వంటి దీర్ఘకాలిక వ్యాధులను పూర్తిగా నయం చేస్తామంటూ పత్రికలలో భారీ ప్రకటనలు ఇవ్వడాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో సవాలు చేయగా, కోర్టు తీర్పును అనుసరించి రాందేవ్ బాబా పత్రికలకు ప్రకటనలు ఇచ్చి బహిరంగ క్షమాపణలు చెప్పిన వ్యక్తి అని పేర్కొన్నారు.

ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డి.ఎ.ఆర్. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, యోగా గురువుగా ప్రసిద్ధి చెందిన రాందేవ్ బాబా పతంజలి సంస్థ ద్వారా ప్రతి ఏటా ₹40,000 కోట్ల ఉత్పత్తులను అమ్ముతూ ప్రజల నమ్మకాలను లాభాలుగా మార్చుకుంటున్నారని తెలిపారు. భారతీయ ప్రజలలో ఉన్న సనాతన భావాలను, మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తూ బాబా రాందేవ్ పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల ద్వారా ప్రతి ఏటా వేలాది కోట్ల రూపాయల లాభార్జన పొందుతున్నారని ఆయన వివరించారు. సుదీర్ఘ అనుభవం గల నారా చంద్రబాబు నాయుడు నేడు హిందుత్వ భావజాలాన్ని ప్రోత్సహిస్తున్నారని, అందులో భాగంగానే బాబా రాందేవ్ ను అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆహ్వానించారని సుబ్రమణ్యం ఆరోపించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీని సంతృప్తి పరచడానికే ఈ హిందుత్వ వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన అన్నారు.

అందువల్ల, అంతర్జాతీయ యోగా దినోత్సవ వానికి రాందేవ్ బాబాను ముఖ్యఅతిథిగా ఆహ్వానించడం తగదని జన చైతన్య వేదిక పునరుద్ఘాటించింది.
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    8 hrs ago
  • ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కొనసాగుతున్న వివిధ ప్రాజెక్టుల పనుల ప్రగతిని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా, చంద్రబాబు గారి విజన్‌కు అనుగుణంగా రాజధాని నగరం ప్రపంచం మెచ్చే విధంగా రూపుదిద్దుకుంటోందని, ఈ విషయాన్ని పూర్తి విశ్వాసంతో తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
    1
    ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కొనసాగుతున్న వివిధ ప్రాజెక్టుల పనుల ప్రగతిని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా, చంద్రబాబు గారి విజన్‌కు అనుగుణంగా రాజధాని నగరం ప్రపంచం మెచ్చే విధంగా రూపుదిద్దుకుంటోందని, ఈ విషయాన్ని పూర్తి విశ్వాసంతో తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
    user_పల్లె నరేష్
    పల్లె నరేష్
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట మండలం, ధర్మవరప్పాడు తండా గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర (SASA) కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు, జిల్లా కలెక్టర్ లక్ష్మీశా గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, పరిశుభ్రత కార్యక్రమాలను వారు స్వయంగా పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు. గ్రామ పారిశుద్ధ్యాన్ని ఆదర్శవంతంగా నిర్వహిస్తూ, తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్న ఐదుగురు పారిశుద్ధ్య కార్మికులను జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా గారు, ఎమ్మెల్యే తాతయ్య గారు ప్రత్యేకంగా సత్కరించారు. వారికి ప్రశంసాపత్రాలను అందజేసి, ఆర్థిక ప్రోత్సాహకాలు, నిత్యావసర సరుకులతో అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే తాతయ్య గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు అమలు జరుగుతున్న స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమపాళ్లలో అమలు చేస్తూనే, ప్రజలలో పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే తాతయ్య గారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ కో కన్వీనర్ & పోచంపల్లి సొసైటీ చైర్మన్ ముల్లంగి రామకృష్ణారెడ్డితో పాటు జిల్లా అధికారులు, గ్రామ ప్రజాప్రతినిధులు, పారిశుద్ధ్య సిబ్బంది, గ్రామస్తులు, పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు.
    4
    ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట మండలం, ధర్మవరప్పాడు తండా గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర (SASA) కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు, జిల్లా కలెక్టర్ లక్ష్మీశా గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, పరిశుభ్రత కార్యక్రమాలను వారు స్వయంగా పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు.

గ్రామ పారిశుద్ధ్యాన్ని ఆదర్శవంతంగా నిర్వహిస్తూ, తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్న ఐదుగురు పారిశుద్ధ్య కార్మికులను జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా గారు, ఎమ్మెల్యే తాతయ్య గారు ప్రత్యేకంగా సత్కరించారు. వారికి ప్రశంసాపత్రాలను అందజేసి, ఆర్థిక ప్రోత్సాహకాలు, నిత్యావసర సరుకులతో అభినందించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే తాతయ్య గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు అమలు జరుగుతున్న స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమపాళ్లలో అమలు చేస్తూనే, ప్రజలలో పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే తాతయ్య గారు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ కో కన్వీనర్ & పోచంపల్లి సొసైటీ చైర్మన్ ముల్లంగి రామకృష్ణారెడ్డితో పాటు జిల్లా అధికారులు, గ్రామ ప్రజాప్రతినిధులు, పారిశుద్ధ్య సిబ్బంది, గ్రామస్తులు, పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు.
    user_Kakaraparthi someswarao
    Kakaraparthi someswarao
    జగ్గయ్యపేట, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • ఇబ్రహీంపట్నంలో గత రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనం నడుపుతున్న ఒక వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. తాను మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీత్యా నేరమని పోలీసులు చెప్పగా, ఆ వ్యక్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'నన్నే ఆపుతావా, నేను ఎమ్మెల్యే తాలూకా, పలానా తమ్ముడిని' అంటూ పోలీసులపై మండిపడ్డాడు. అంతేకాకుండా, తాను ఒక రిపోర్టర్‌నని పేర్కొంటూ పోలీసులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. 'మీ అంతు చూస్తాం' అంటూ పోలీసులను, ముఖ్యంగా ఒక మహిళా ఎస్సైపై దురుసుగా ప్రవర్తించి, వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది.
    1
    ఇబ్రహీంపట్నంలో గత రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనం నడుపుతున్న ఒక వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. తాను మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీత్యా నేరమని పోలీసులు చెప్పగా, ఆ వ్యక్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'నన్నే ఆపుతావా, నేను ఎమ్మెల్యే తాలూకా, పలానా తమ్ముడిని' అంటూ పోలీసులపై మండిపడ్డాడు. అంతేకాకుండా, తాను ఒక రిపోర్టర్‌నని పేర్కొంటూ పోలీసులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. 'మీ అంతు చూస్తాం' అంటూ పోలీసులను, ముఖ్యంగా ఒక మహిళా ఎస్సైపై దురుసుగా ప్రవర్తించి, వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది.
    user_జేమ్స్
    జేమ్స్
    Vijayawada East, Ntr•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.