వట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ దాబాలో పనిచేస్తున్న బీరప్ప అనే 22 ఏళ్ల యువకుడు చెట్టుకు ఉరివేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి సంగారెడ్డి జిల్లా వట్ పల్లి పోలీస్ స్టేషన్‌ను దరఖాస్తుపల్లి గ్రామస్తులు ముట్టడించారు. స్టేషన్‌పై దాడికి దిగి ఫర్నిచర్, అద్దాలను ధ్వంసం చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ దాబాలో పనిచేస్తున్న బీరప్ప అనే 22 ఏళ్ల యువకుడు చెట్టుకు ఉరివేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే, మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించకుండానే పోలీసులు మృతదేహాన్ని చెట్టుపై నుంచి కిందకు దించడంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో పాటు దాబా యజమానుల తీరుపై మండిపడుతూ పోలీస్ స్టేషన్‌కు తరలివచ్చిన దరఖాస్తుపల్లి గ్రామస్తులు, పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఆందోళన తీవ్రమవడంతో పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి ధ్వంసం చేశారు. సంగారెడ్డి జిల్లా వట్ పల్లి పోలీస్ స్టేషన్ వద్ద పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి. వట్ పల్లి పరిధిలోని ఓ దాబాలో పనిచేస్తున్న 22 ఏళ్ల బీరప్ప అనే యువకుడు సమీపంలో ఉన్న చెట్టుకు ఉరివేసుకొని అనుమానాస్పదంగా మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని చెట్టుపై నుంచి కిందకు దించారు. అయితే మృతుడి కుటుంబ సభ్యులకు కానీ, గ్రామస్తులకు కానీ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని కిందకు ఎలా దించుతారంటూ దరఖాస్తుపల్లి గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని, దాబా యజమానులు మరియు పోలీసుల తీరుపై అనుమానం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున గ్రామస్తులు వట్ పల్లి పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. పోలీసులతో గ్రామస్తుల వాగ్వాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆవేశంతో రగిలిపోయిన దరఖాస్తుపల్లి వాసులు పోలీస్ స్టేషన్‌పై దాడికి దిగారు. స్టేషన్‌లోని ఫర్నిచర్, కిటికీల అద్దాలను ధ్వంసం చేశారు. ఘటనతో వట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సిఐ అనిల్ కుమార్ అదనపు సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. బీరప్ప మృతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

- జిల్లా బాలల ఉన్నత పాఠశాలకు వంట గ్యాస్ పొయ్యిలు అందజేసిన దాతలు పెద్దశంకరంపేట మండలంలోని జిల్లా బాలల ఉన్నత పాఠశాలకు సామాజిక సేవాభావాన్ని చాటుతూ గడ్డం వెంకన్న, మల్లన్న వంట గ్యాస్ పొయ్యిలను విరాళంగా అందజేశారు. వర్షాకాలంలో మధ్యాహ్న భోజనాల తయారీలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ సహాయం చేసినట్లు వారు తెలిపారు. పాఠశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ శిరీష సమక్షంలో గ్యాస్ పొయ్యిలను పాఠశాలకు అందజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శిరీష మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడంలో ఈ విరాళం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొంటూ దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల సిబ్బంది కూడా వారి సేవాభావాన్ని అభినందించారు.1
- రుద్రారం గీతం యూనివర్సిటీలో పాల్గొన్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి హైదరాబాద్‌లోని గీతం డీమ్డ్ యూనివర్సిటీలో 17వ స్నాతకోత్సవం వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు హాజరై స్నాతకోపన్యాసం చేశారు. మొత్తం 1990 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయగా, 17 బంగారు పతకాలు అందజేశారు. చేనేత కళాకారుడు కు గౌరవ డాక్టరేట్ (డీ.లిట్) ప్రదానం చేశారు. రాజమౌళి రాకతో విద్యార్థులు ఫోటోలు సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం కనబరిచారు.1
- హుస్నాబాద్ లో పూర్తిస్థాయి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని నిరుద్యోగ యువత ఆందోళన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పూర్తి స్థాయి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని నిరుద్యోగ యువత డిమాండ్ చేశారు. ఈ మేరకు హుస్నాబాద్ పట్టణంలోని నూతన గ్రంథాలయం ఎదుట నిరసన తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలో శాశ్వత గ్రంథాలయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నిరుద్యోగ యువత వాపోయారు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయం నుండి వెళ్లిపోవాలని అక్కడ ఉన్నవారు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. హుస్నాబాద్ లో కట్టించిన నూతన గ్రంథాలయ భవనాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు కేటాయించడం తగదన్నారు. హుస్నాబాద్ చుట్టుపక్కల 24 గ్రామాల నిరుద్యోగ యువతకు హుస్నాబాద్ లో శాశ్వత గ్రంథాలయం అత్య అవసరం ఉందన్నారు. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి అన్ని వసతులతో కూడిన శాశ్వత గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.2
- ప్రధానమంత్రిని జెన్ జీ యువత తిడుతుంటే నా కళ్ళలో నీళ్లు వచ్చాయి: పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రిని జెన్ జీ యువత తిడుతుంటే నా కళ్లలో నీళ్లు వచ్చాయి కొత్త తరానికి ఏం తెలుసు ఆయన పడ్డ కష్టం ఒక్కరోజు కూడా ప్రధాని సెలవు తీసుకోలేదు - పవన్ కళ్యాణ్1
- తెలంగాణ రక్షణ సేన కార్మికుల ఫ్రెండ్లీ పార్టీ.. అధికారంలోకి వచ్చాక కార్మికుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటది : టిఆర్ఎస్ ఛీఫ్ కవిత హైదరాబాద్ : ప్రైవేటు సంస్థలు శ్రమ దోపిడీ చేస్తే కొరడా జులిపించాల్సిన ప్రభుత్వమే అదే కార్మికుల శ్రమను దోపిడీ చేస్తుందని తెలంగాణ రక్షణ సేన ఛీఫ్ కవిత అన్నారు. శుక్రవారం బంజారా హిల్స్ పార్టీ కార్యాలయంలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. అనంతరం తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మికులు రోడ్లమీదకు వచ్చి హక్కుల కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ఎట్టి పరిస్థితుల్లో కార్మికులు, ఉద్యోగులు, టీచర్లకు అన్యాయం జరుగనివ్వదు.2
- భారత దేశంలో 5 శక్తి పీఠాలలో ఒకటిగా మన ఆలేరు నియోజకవర్గం లోని కొలనుపాక కోటిలింగాల శివుడు భారతదేశంలోనే ఐదు శివశక్తి పీఠాలు అందులో ఒకటిగా మన భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం కొలనుపాక లో ఉన్న కోటిలింగాల శివుడు ని దర్శించుకున్న వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయి1
- నిజాంపేట మండలంలో మూడు నెలల రేషన్ కోటా కోసం లబ్ధిదారుల రద్దీ నిజాంపేట మండలంలో మూడు నెలల రేషన్ కోటా పంపిణీ శనివారం నుంచి ప్రారంభమైంది. ప్రభుత్వ నిర్ణయం మేరకు అర్హులైన లబ్ధిదారులకు బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను రేషన్ దుకాణాల ద్వారా అందజేస్తున్నారు. పంపిణీ ప్రక్రియ సజావుగా సాగేందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు. రేషన్ కార్డుదారులు నిర్ణయించిన తేదీలు, సమయాల్లో దుకాణాలకు వెళ్లి తమ కోటాను తీసుకోవాలని అధికారులు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.1
- మండల కేంద్రంలో బెజ్జంకి లో ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవ వేడుకలు బెజ్జంకి, ఆగస్టు 1: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో శనివారం ప్రపంచ ఆటో డ్రైవర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల సేవలను కొనియాడుతూ, ప్రజల దైనందిన జీవితంలో వారి పాత్ర ఎంతో కీలకమని వక్తలు పేర్కొన్నారు. ఎండ, వాన, చలి తేడా లేకుండా నిత్యం ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతూ సమాజానికి విశేష సేవలందిస్తున్న ఆటో కార్మికులను అభినందించారు. "మూడు చక్రాలపై ప్రయాణం... వెనుక వేలాది కుటుంబాల జీవనం" అనే సందేశంతో ఆటో డ్రైవర్ల శ్రమను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పిలుపునిచ్చారు. ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ప్రజలు కూడా వారికి సహకారం అందించాలని కోరారు. అనంతరం మండలంలోని ఆటో డ్రైవర్లందరికీ ప్రపంచ ఆటో డ్రైవర్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.2
- సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని సీఎం దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేవైఎం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ రేవంత్ రెడ్డి విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి – బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మెదక్, శనివారం: భారతీయ జనతా యువ మోర్చా (BJYM) రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే పిలుపు మేరకు, మెదక్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు వాల్దాస్ అరవింద్ గౌడ్ మాట్లాడుతూ, ఇంజినీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని ఆరోపించారు. విద్యార్థులను అవమానించేలా మాట్లాడటం సరికాదని, వెంటనే విద్యార్థులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థుల రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విద్యార్థుల పట్ల ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. నిరసనలో భాగంగా కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. అనంతరం పోలీసు అధికారులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు బీజేవైఎం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయకుడు వాల్దాస్ అరవింద్ గౌడ్, బీజేపీ టౌన్ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, బీజేవైఎం నాయకులు ప్రేమ్, గణేష్, నర్సింగ్, రవి, రమేష్, గిరి, ప్రవీణ్, మధు, బబ్లూ, సన్నీ, మహేందర్, శ్యామ్ గౌడ్, చందు, సాయి, రాజేష్, దశరథ్, అనిల్, రాహుల్, విక్రమ్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.1