logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఈ నెల 13న టెక్కలిలో బాల బాలికలకు జిల్లా స్థాయి రగ్బీ పోటీ ఎంపికలు టెక్కలి : శ్రీకాకుళం జిల్లా రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు అండర్ 18 జూనియర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షులు డొoకన రామకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈనెల 13న ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం జిల్లా జట్లు ఎంపికలు జరుగుతాయన్నారు. 2008 సంవత్సరం తర్వాత క్రీడాకారులు జన్మించి ఉండాలన్నారు. ఇందుకోసం ఆధార్ కార్డు డేట్ అఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకొని ఎంపికకు హాజరు కావాలనే అన్నారు. ఈ జట్టులో ఎంపికైన క్రీడాకారులు పల్నాడు జిల్లా నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఈ నెల 24, 25 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ రగ్బీ ఛాంపియన్షిప్ 2026 పోటీల్లో పాల్గొంటారని అన్నారు. మరిన్ని వివరాలకు శ్రీకాకుళం జిల్లా రగ్బీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బాడాన నారాయణరావు ఫోన్ నెంబర్ 8500007272 కి సంప్రదించాలని కోరారు.

2 hrs ago
user_Karri Sankara Reddy
Karri Sankara Reddy
జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago
cdb2fd47-18d5-41aa-9fef-3e65efdd9595

ఈ నెల 13న టెక్కలిలో బాల బాలికలకు జిల్లా స్థాయి రగ్బీ పోటీ ఎంపికలు టెక్కలి : శ్రీకాకుళం జిల్లా రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు అండర్ 18 జూనియర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షులు డొoకన రామకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈనెల 13న ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం జిల్లా జట్లు ఎంపికలు జరుగుతాయన్నారు. 2008 సంవత్సరం తర్వాత క్రీడాకారులు జన్మించి ఉండాలన్నారు. ఇందుకోసం ఆధార్ కార్డు డేట్ అఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకొని ఎంపికకు హాజరు కావాలనే అన్నారు. ఈ జట్టులో ఎంపికైన క్రీడాకారులు పల్నాడు జిల్లా నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఈ నెల 24, 25 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ రగ్బీ ఛాంపియన్షిప్ 2026 పోటీల్లో పాల్గొంటారని అన్నారు. మరిన్ని వివరాలకు శ్రీకాకుళం జిల్లా రగ్బీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బాడాన నారాయణరావు ఫోన్ నెంబర్ 8500007272 కి సంప్రదించాలని కోరారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • బిజెపి ఆధ్వర్యంలో ప్రజా సమస్యలు అధికారుల దృష్టికి. శ్రీకాకుళం జిల్లా బిజెపి అధ్యక్షులు ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమం. ప్రజా దర్బార్ లో పాల్గొన్న బిజెపి నాయకులు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం లభించేలా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఆదేశాల మేరకు, శ్రీకాకుళం జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమం. శ్రీకాకుళం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో ప్రజా సమస్యలను స్వీకరించిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు.. బీజేపీ నాయకులు మాట్లాడుతూ జిల్లాలోని సమస్యలను,ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులకు తెలియజేసి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బిజెపి పనిచేస్తుందని తెలిపారు.అలాగే జిల్లా లో బీజేపీ నాయకుల సమస్యలే కాకుండా ప్రజా సమస్యలు అన్నిటిని బీజేపీ జనతా వారధి జిల్లా కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పనిచేస్తారు అని అన్నారు. *ముఖ్యంగా ఈరోజు మా రాష్ట్ర పార్టీ సూచన మేరకు భూగర్భ జలాల రక్షణ, వర్షపు నీటి సంరక్షణ, గ్రామ పారిశుద్యం, భవిష్యత్ నీటి భద్రతపై* జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాలం గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్టాడ రవిబాబ్జి గారు, సెవ్వనా ఉమామహేశ్వరీ గారు,జిల్లా ప్రధాన కార్యదర్శి, జనతావారది ఇంచార్జ్ చింతు పాపారావు గారు, జనతావారధి కో ఇంచార్జ్లు నారాయణాశెట్టి కల్పన శ్రీనివాస్ గారు,ఎర్రగుంట్ల జగన్మోహన్ గారు,జిల్లా ఉపాధ్యక్షులు బైరి అప్పారావు గారు,నరసన్నపేట నియోజకవర్గ BLA1 ఇంచార్జ్ పోకతోట సింహాచలం గారు,ఓబీసీ మోర్చా నాయకుడు పేరూరి శ్రీనివాసరావు గారు, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు, పూర్వ జిల్లా ఉపాధ్యక్షుడు సాధు కిరణ్ కుమార్, శ్రీకాకుళం సెంట్రల్ మండల ప్రధాన కార్యదర్శి సింగిడి వాసు, బీజేపీ నాయకుడు పంచిరెడ్డి జగ్గన్న తదితరులు పాల్గున్నారు.
    1
    బిజెపి ఆధ్వర్యంలో ప్రజా సమస్యలు అధికారుల దృష్టికి. శ్రీకాకుళం జిల్లా బిజెపి అధ్యక్షులు ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమం. ప్రజా దర్బార్ లో పాల్గొన్న బిజెపి నాయకులు.
ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం లభించేలా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్  ఆదేశాల మేరకు, శ్రీకాకుళం జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు  ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమం. శ్రీకాకుళం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో ప్రజా సమస్యలను స్వీకరించిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు..
బీజేపీ నాయకులు మాట్లాడుతూ జిల్లాలోని సమస్యలను,ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులకు తెలియజేసి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బిజెపి పనిచేస్తుందని  తెలిపారు.అలాగే జిల్లా లో బీజేపీ నాయకుల సమస్యలే కాకుండా ప్రజా సమస్యలు అన్నిటిని బీజేపీ జనతా వారధి జిల్లా కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పనిచేస్తారు అని అన్నారు. *ముఖ్యంగా ఈరోజు మా రాష్ట్ర పార్టీ సూచన మేరకు భూగర్భ జలాల రక్షణ, వర్షపు నీటి సంరక్షణ, గ్రామ పారిశుద్యం, భవిష్యత్ నీటి భద్రతపై* జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది అన్నారు.
ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాలం గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్టాడ రవిబాబ్జి గారు, సెవ్వనా ఉమామహేశ్వరీ గారు,జిల్లా ప్రధాన కార్యదర్శి, జనతావారది ఇంచార్జ్ చింతు పాపారావు గారు, జనతావారధి కో ఇంచార్జ్లు నారాయణాశెట్టి కల్పన శ్రీనివాస్ గారు,ఎర్రగుంట్ల జగన్మోహన్ గారు,జిల్లా ఉపాధ్యక్షులు బైరి అప్పారావు గారు,నరసన్నపేట నియోజకవర్గ BLA1 ఇంచార్జ్ పోకతోట సింహాచలం గారు,ఓబీసీ మోర్చా నాయకుడు పేరూరి శ్రీనివాసరావు గారు, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు, పూర్వ జిల్లా ఉపాధ్యక్షుడు సాధు కిరణ్ కుమార్, శ్రీకాకుళం సెంట్రల్ మండల ప్రధాన కార్యదర్శి సింగిడి వాసు, బీజేపీ నాయకుడు పంచిరెడ్డి జగ్గన్న తదితరులు పాల్గున్నారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మే 16న శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతుండగా, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులతో కలిసి ప్రతిపాదిత స్థలాలను పరిశీలించారు. హెలిప్యాడ్, వాహనాల పార్కింగ్, ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారులకు కీలక సూచనలు చేస్తూ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
    4
    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మే 16న శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతుండగా, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులతో కలిసి ప్రతిపాదిత స్థలాలను పరిశీలించారు. హెలిప్యాడ్, వాహనాల పార్కింగ్, ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారులకు కీలక సూచనలు చేస్తూ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    జర్నలిస్ట్ శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • విజయనగరం జిల్లా, సంతకవిటి మండలం మండవ కురిటిలో ఎమ్మెల్యే కొండ్రు మురళి మోహన్ ప్రోత్సాహంతో 18 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలు వీడి ప్రభుత్వ బడిలో చేరారు. నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలున్న ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని ఎమ్మెల్యే తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు.
    1
    విజయనగరం జిల్లా, సంతకవిటి మండలం మండవ కురిటిలో ఎమ్మెల్యే కొండ్రు మురళి మోహన్ ప్రోత్సాహంతో 18 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలు వీడి ప్రభుత్వ బడిలో చేరారు. నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలున్న ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని ఎమ్మెల్యే తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు.
    user_HARIBABU  TALADA
    HARIBABU TALADA
    Farmer రాజాం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • MGM వెస్ట్స్ రోజూ వేసుకునే దుస్తులలో పూర్తి సౌకర్యాన్ని అందిస్తాయి. పగలు లేదా రాత్రి, ఏ సమయంలోనైనా వీటి ప్రీమియం ఫీల్ తో హాయిగా ఉండవచ్చు. మీ రోజువారీ జీవితంలో ఆనందం, విశ్వాసం పెంచుకోవడానికి ఇవి సరైన ఎంపిక.
    1
    MGM వెస్ట్స్ రోజూ వేసుకునే దుస్తులలో పూర్తి సౌకర్యాన్ని అందిస్తాయి. పగలు లేదా రాత్రి, ఏ సమయంలోనైనా వీటి ప్రీమియం ఫీల్ తో హాయిగా ఉండవచ్చు. మీ రోజువారీ జీవితంలో ఆనందం, విశ్వాసం పెంచుకోవడానికి ఇవి సరైన ఎంపిక.
    user_M G M Hosiery Works.
    M G M Hosiery Works.
    Entrepreneur చీపురుపల్లె, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • 'అట్ట‌హాసంగా జిల్లా టీడీపీ కార్యాల‌య శంకుస్థాప‌న‌' తెలుగుదేశం పార్టీని ప్ర‌జ‌ల చెంత‌కు తీసుకువెళ్లే దేవాల‌య‌మే తెలుగుదేశం పార్టీ కార్యాల‌యం అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సోమ‌వారం విజయనగరం రూరల్ మండలం అయ్యన్నపేట సమీపంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన జిల్లా టీడీపీ కార్యాలయ శంకుస్థాప‌న కార్య‌క్ర‌మంలో ఎంపీ, జిల్లా ఎమ్మెల్యేల‌తో క‌లిసి మంత్రి పాల్గొన్నారు. శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం అనంత‌రం విలేక‌ర్ల స‌మావేశంలో మంత్రి మాట్లాడుతూ స‌మాజ‌మే దేవాల‌యం ప్ర‌జ‌లే దేవుళ్లు అన్న నినాదంతో అన్న నంద‌మూరి తార‌క రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే... గౌర‌వ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు గారు అదే నినాదంతో పాలిస్తూ పార్టీని ప్ర‌జ‌ల‌కు దగ్గ‌ర చేశార‌ని కొనియాడారు. తెలుగుదేశం ఎప్పుడూ ప్ర‌జ‌ల ధీర్ఘ‌కాలిక ల‌క్ష్యాలకు అనుగుణంగానే పాల‌న చేసింద‌న్నారు.
    2
    'అట్ట‌హాసంగా జిల్లా టీడీపీ కార్యాల‌య శంకుస్థాప‌న‌'
తెలుగుదేశం పార్టీని ప్ర‌జ‌ల చెంత‌కు తీసుకువెళ్లే దేవాల‌య‌మే తెలుగుదేశం పార్టీ కార్యాల‌యం అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సోమ‌వారం విజయనగరం రూరల్ మండలం అయ్యన్నపేట సమీపంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన జిల్లా టీడీపీ కార్యాలయ శంకుస్థాప‌న కార్య‌క్ర‌మంలో ఎంపీ, జిల్లా ఎమ్మెల్యేల‌తో క‌లిసి మంత్రి పాల్గొన్నారు. శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం అనంత‌రం విలేక‌ర్ల స‌మావేశంలో మంత్రి మాట్లాడుతూ స‌మాజ‌మే దేవాల‌యం ప్ర‌జ‌లే దేవుళ్లు అన్న నినాదంతో అన్న నంద‌మూరి తార‌క రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే... గౌర‌వ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు గారు అదే నినాదంతో పాలిస్తూ పార్టీని ప్ర‌జ‌ల‌కు దగ్గ‌ర చేశార‌ని కొనియాడారు. తెలుగుదేశం ఎప్పుడూ ప్ర‌జ‌ల ధీర్ఘ‌కాలిక ల‌క్ష్యాలకు  అనుగుణంగానే పాల‌న చేసింద‌న్నారు.
    user_Kumar
    Kumar
    Reporter విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    42 min ago
  • ఎర్రవరం జలపాతం సందర్శకుల సందడి.. చింతపల్లి మండలంలోని గొందిపాకలు పంచాయతీ పరిధిలో ఉన్న ఎర్రవరం జలపాతం ప్రకృతి అందాలతో సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఎత్తయిన కొండల మధ్య నుంచి జాలువారుతున్న జలధారలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. జలపాతం నుంచి వెదజల్లే చల్లటి పొగమంచు సందర్శకులకు ప్రశాంతతను, ఆహ్లాదాన్ని పంచుతోంది. వేసవి వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కుటుంబ సమేతంగా జలపాతం వద్దకు చేరుకొని సేదతీరుతున్నారు. ప్రకృతి సోయగాల నడుమ యువత సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ సందడి చేస్తున్నారు. పర్యాటక ప్రాంతంగా పేరుగాంచుతున్న ఈ జలపాతానికి మరిన్ని సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    ఎర్రవరం జలపాతం సందర్శకుల సందడి.. చింతపల్లి మండలంలోని గొందిపాకలు పంచాయతీ పరిధిలో
ఉన్న ఎర్రవరం జలపాతం ప్రకృతి అందాలతో సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఎత్తయిన కొండల మధ్య నుంచి జాలువారుతున్న జలధారలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. జలపాతం నుంచి వెదజల్లే చల్లటి పొగమంచు సందర్శకులకు ప్రశాంతతను, ఆహ్లాదాన్ని పంచుతోంది.
వేసవి వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కుటుంబ సమేతంగా జలపాతం వద్దకు చేరుకొని సేదతీరుతున్నారు. ప్రకృతి సోయగాల నడుమ యువత సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ సందడి చేస్తున్నారు. పర్యాటక ప్రాంతంగా పేరుగాంచుతున్న ఈ జలపాతానికి మరిన్ని సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • ఏలూరు జిల్లాలో భారీ అక్రమ రేషన్ మాఫియా బట్టబయలు టీడీపీ నాయకులే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు – కూటమి నేతలు, పోలీసు అధికారులు అండగా ఉన్నారంటూ సంచలన ఆరోపణలువంగర సాయి దత్తు, గరిమెళ్ళ చలపతి ఆర్థిక లావాదేవీలపై విచారణ జరపాలని డిమాండ్ – ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఎస్పీ ఆదేశాలు ఏలూరులో బహిర్గతమైన అక్రమ PDS మాఫియా..? టీడీపీ నాయకులే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు – కూటమి నేతలు, అధికారులపై సంచలన ఆరోపణలు ఏలూరు, మే 11 (ప్రత్యేక ప్రతినిధి): ఏలూరు జిల్లాలో భారీ స్థాయిలో జరుగుతున్న అక్రమ PDS (పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్) రేషన్ బియ్యం దందాపై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. చింతలపూడి నియోజకవర్గంలోని చింతలపూడి, లింగపాలెం మండలాల్లో చాలా కాలంగా కొనసాగుతున్న అక్రమ రేషన్ బియ్యం రవాణాకు రాజకీయ నాయకులు, కొందరు ప్రభుత్వ అధికారులు అండగా ఉన్నారంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జిల్లాలో కలకలం రేపుతోంది. సోమవారం ఏలూరులో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో లింగపాలెం మండలం మఠంగూడెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గంటా సాయి కృష్ణ జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివ కిషోర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో ఆయన పలు కీలక ఆరోపణలు చేశారు. చింతలపూడి ప్రాంతంలో పెద్దిరెడ్డి రామచంద్రరావు ఆధ్వర్యంలో వంగర సాయి దత్తు అనే వ్యక్తి అక్రమ రేషన్ బియ్యం మాఫియాను నడుపుతున్నాడని, ఈ వ్యవహారానికి టీడీపీ లింగపాలెం మండల అధ్యక్షుడు గరిమెళ్ళ చలపతి, ధర్మాజీగూడెం ఎస్సై సహా పలువురు అధికారులు, రాజకీయ నేతలు సహకరిస్తున్నారని ఆరోపించారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ పోలీసు, ఇతర శాఖల అధికారులను ప్రభావితం చేసి అక్రమ రవాణాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ అక్రమాలపై ప్రశ్నించినందుకు తనపై ఒత్తిళ్లు, బెదిరింపులు వస్తున్నాయని గంటా సాయి కృష్ణ తెలిపారు. ఇటీవల తన ఇంటి వద్ద రేషన్ మాఫియా వ్యక్తులు రెక్కీ నిర్వహించారని, తన ప్రాణాలకు ముప్పు ఉందని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. స్థానిక ఎస్సైకు సమాచారం ఇచ్చినా “రేషన్ బియ్యం ఏమైనా డ్రగ్సా?” అంటూ నిర్లక్ష్యంగా స్పందించారని ఆరోపించారు. అక్రమ రేషన్ వ్యాపారంలో నిందితుడిగా ఉన్న వంగర సాయి దత్తు నుంచి గరిమెళ్ళ చలపతికి భారీ ఎత్తున నగదు, ఆన్‌లైన్ లావాదేవీలు జరిగినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ లావాదేవీలపై సమగ్ర విచారణ చేపడితే అసలు నిజాలు బయటపడతాయని అన్నారు. అదేవిధంగా, అక్రమాలకు సహకరించిన పోలీసు సిబ్బంది, ఇతర శాఖల అధికారుల పాత్రపై కూడా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చింతలపూడి ప్రాంతంలో కొనసాగుతున్న రేషన్ మాఫియాను పూర్తిగా అరికట్టాలని, తనకు భద్రత కల్పించాలని ఎస్పీని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివ కిషోర్ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఈ వ్యవహారం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
    2
    ఏలూరు జిల్లాలో భారీ అక్రమ రేషన్ మాఫియా బట్టబయలు
టీడీపీ నాయకులే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు – కూటమి నేతలు, పోలీసు అధికారులు అండగా ఉన్నారంటూ సంచలన ఆరోపణలువంగర సాయి దత్తు, గరిమెళ్ళ చలపతి ఆర్థిక లావాదేవీలపై విచారణ జరపాలని డిమాండ్ – ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఎస్పీ ఆదేశాలు
ఏలూరులో బహిర్గతమైన అక్రమ PDS మాఫియా..?
టీడీపీ నాయకులే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు – కూటమి నేతలు, అధికారులపై సంచలన ఆరోపణలు
ఏలూరు, మే 11 (ప్రత్యేక ప్రతినిధి):
ఏలూరు జిల్లాలో భారీ స్థాయిలో జరుగుతున్న అక్రమ PDS (పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్) రేషన్ బియ్యం దందాపై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. చింతలపూడి నియోజకవర్గంలోని చింతలపూడి, లింగపాలెం మండలాల్లో చాలా కాలంగా కొనసాగుతున్న అక్రమ రేషన్ బియ్యం రవాణాకు రాజకీయ నాయకులు, కొందరు ప్రభుత్వ అధికారులు అండగా ఉన్నారంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జిల్లాలో కలకలం రేపుతోంది.
సోమవారం ఏలూరులో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో లింగపాలెం మండలం మఠంగూడెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గంటా సాయి కృష్ణ జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివ కిషోర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో ఆయన పలు కీలక ఆరోపణలు చేశారు.
చింతలపూడి ప్రాంతంలో పెద్దిరెడ్డి రామచంద్రరావు ఆధ్వర్యంలో వంగర సాయి దత్తు అనే వ్యక్తి అక్రమ రేషన్ బియ్యం మాఫియాను నడుపుతున్నాడని, ఈ వ్యవహారానికి టీడీపీ లింగపాలెం మండల అధ్యక్షుడు గరిమెళ్ళ చలపతి, ధర్మాజీగూడెం ఎస్సై సహా పలువురు అధికారులు, రాజకీయ నేతలు సహకరిస్తున్నారని ఆరోపించారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ పోలీసు, ఇతర శాఖల అధికారులను ప్రభావితం చేసి అక్రమ రవాణాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ అక్రమాలపై ప్రశ్నించినందుకు తనపై ఒత్తిళ్లు, బెదిరింపులు వస్తున్నాయని గంటా సాయి కృష్ణ తెలిపారు. ఇటీవల తన ఇంటి వద్ద రేషన్ మాఫియా వ్యక్తులు రెక్కీ నిర్వహించారని, తన ప్రాణాలకు ముప్పు ఉందని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. స్థానిక ఎస్సైకు సమాచారం ఇచ్చినా “రేషన్ బియ్యం ఏమైనా డ్రగ్సా?” అంటూ నిర్లక్ష్యంగా స్పందించారని ఆరోపించారు.
అక్రమ రేషన్ వ్యాపారంలో నిందితుడిగా ఉన్న వంగర సాయి దత్తు నుంచి గరిమెళ్ళ చలపతికి భారీ ఎత్తున నగదు, ఆన్‌లైన్ లావాదేవీలు జరిగినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ లావాదేవీలపై సమగ్ర విచారణ చేపడితే అసలు నిజాలు బయటపడతాయని అన్నారు.
అదేవిధంగా, అక్రమాలకు సహకరించిన పోలీసు సిబ్బంది, ఇతర శాఖల అధికారుల పాత్రపై కూడా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చింతలపూడి ప్రాంతంలో కొనసాగుతున్న రేషన్ మాఫియాను పూర్తిగా అరికట్టాలని, తనకు భద్రత కల్పించాలని ఎస్పీని కోరారు.
ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివ కిషోర్ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఈ వ్యవహారం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
    user_Ashok
    Ashok
    Local News Reporter జగ్గంపేట, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • బూరగంలో అట్టహాసంగా ప్రారంభమైన గ్రామదేవత ఉత్సవాలు. ఇంటింటికి ఊరేగింపుగా గ్రామదేవరా. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం బోరగం గ్రామంలో గ్రామ దేవత చిన్ని పోలమ్మ తల్లి మూడు రోజు సంబర ఉత్సవములు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. గ్రామంలో భక్తులు గ్రామ దేవత దేవరను ఇంటింటికి ఊరేగింపుగా తీసుకువెళ్లి మొక్కులు ముడుపులు చెల్లించుకున్నారు. దేవరను ఊరేగింపుగా తీసుకు వెళ్ళిన తర్వాత ఆలయం ప్రధానంగా ఉంచి పసుపు నీరు వసంతాలు సమర్పించుకుంటారు. భక్తి పరవశంతో భక్తులు ఈ మూడు రోజులు పండగను గ్రామస్థాయిలో సాంస్కృతిక కోలాట సత్సంగ కార్యక్రమాలతో ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి గ్రామానికి చట్టబంధువులు చేరుకుని గ్రామ దేవత సంబరాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించడం అయింది.
    1
    బూరగంలో అట్టహాసంగా ప్రారంభమైన గ్రామదేవత ఉత్సవాలు. ఇంటింటికి ఊరేగింపుగా గ్రామదేవరా. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం బోరగం గ్రామంలో గ్రామ దేవత చిన్ని పోలమ్మ తల్లి మూడు రోజు సంబర ఉత్సవములు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. గ్రామంలో భక్తులు గ్రామ దేవత దేవరను ఇంటింటికి ఊరేగింపుగా తీసుకువెళ్లి మొక్కులు ముడుపులు చెల్లించుకున్నారు. దేవరను ఊరేగింపుగా తీసుకు వెళ్ళిన తర్వాత ఆలయం ప్రధానంగా ఉంచి పసుపు నీరు వసంతాలు సమర్పించుకుంటారు. భక్తి పరవశంతో భక్తులు ఈ మూడు రోజులు పండగను గ్రామస్థాయిలో సాంస్కృతిక కోలాట సత్సంగ కార్యక్రమాలతో ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి గ్రామానికి చట్టబంధువులు చేరుకుని గ్రామ దేవత సంబరాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించడం అయింది.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.