logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గిరిజనం మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం... పవన్ కళ్యాణ్ గిరిజనం మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం • ప్రధానమంత్రి జన్ మన్ (అడవితల్లి బాట) ద్వారా నిర్మించిన రోడ్ల పరిశీలన • నిర్మాణం పూర్తయిన రహదారుల ప్రారంభోత్సవం • పాడేరు నియోజకవర్గం, నందిగరువు గ్రామ ప్రజలతో శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాటా-మంతి • గిరిపుత్రులతో కలసి మధ్యాహ్న భోజనం జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను ఈ సారి గిరి పుత్రుల మధ్య నిర్వహించుకోవాలని పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. పార్టీ శ్రేణులకు ఇచ్చిన పిలుపు మేరకు గ్రామ స్థాయిలో జరిగే వేడుకల్లో స్వయంగా పాల్గొననున్నారు. శనివారం పాడేరు నియోజకవర్గం, నందిగరువు అనే గిరిజన గ్రామంలో ఈ వేడుకలను నిర్వహించనున్నారు. తొలుత పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓనూరు జంక్షన్ వద్ద జనసేన జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం ప్రధాన మంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం జన్ మన్), జాతీయ గ్రామీణ ఉపాధి హామీ తదితర పథకాల ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో చేపట్టిన రోడ్ల నిర్మాణం పనులను పరిశీలిస్తారు. పీఎం జన్ మన్ పథకం నిధులతో ఓనూరు జంక్షన్ నుంచి నందిగరువు గ్రామం వరకు నిర్మించిన 2.4 కిలోమీటర్ల రహదారిని కాలి నడకన పరిశీలిస్తారు. నాణ్యతా ప్రమాణాలు తనిఖీ చేస్తూ, మార్గమధ్యంలో గిరిజనులతో మమేకం అవుతారు. అనంతరం అడవితల్లి బాట కార్యక్రమం ద్వారా నిర్మాణం పూర్తయిన రోడ్లను శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభిస్తారు. నందిగరువు గ్రామ ప్రజలతో నిర్వహించే మాటా-మంతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం గిరిజనులతో కలసి మధ్యాహ్న భోజనం చేస్తారు.

on 14 March
user_మీడియా ఇన్చార్జి
మీడియా ఇన్చార్జి
Animal Protection Organisation చిలకలూరిపేట హెచ్.ఓ. పురుషోత్తపట్నం, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
on 14 March
9f09e459-f306-4241-83d5-b2e3735b8045

గిరిజనం మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం... పవన్ కళ్యాణ్ గిరిజనం మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం • ప్రధానమంత్రి జన్ మన్ (అడవితల్లి బాట) ద్వారా నిర్మించిన రోడ్ల పరిశీలన • నిర్మాణం పూర్తయిన రహదారుల ప్రారంభోత్సవం • పాడేరు నియోజకవర్గం, నందిగరువు గ్రామ ప్రజలతో శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాటా-మంతి • గిరిపుత్రులతో కలసి మధ్యాహ్న భోజనం జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను ఈ సారి గిరి పుత్రుల మధ్య నిర్వహించుకోవాలని పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. పార్టీ శ్రేణులకు ఇచ్చిన పిలుపు మేరకు గ్రామ స్థాయిలో జరిగే వేడుకల్లో స్వయంగా పాల్గొననున్నారు. శనివారం పాడేరు నియోజకవర్గం, నందిగరువు అనే గిరిజన గ్రామంలో ఈ వేడుకలను నిర్వహించనున్నారు. తొలుత పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓనూరు జంక్షన్ వద్ద జనసేన జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం ప్రధాన మంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం జన్ మన్), జాతీయ గ్రామీణ ఉపాధి హామీ తదితర పథకాల ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో చేపట్టిన రోడ్ల నిర్మాణం పనులను పరిశీలిస్తారు. పీఎం జన్ మన్ పథకం నిధులతో ఓనూరు జంక్షన్ నుంచి నందిగరువు గ్రామం వరకు నిర్మించిన 2.4 కిలోమీటర్ల రహదారిని కాలి నడకన పరిశీలిస్తారు. నాణ్యతా ప్రమాణాలు తనిఖీ చేస్తూ, మార్గమధ్యంలో గిరిజనులతో మమేకం అవుతారు. అనంతరం అడవితల్లి బాట కార్యక్రమం ద్వారా నిర్మాణం పూర్తయిన రోడ్లను శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభిస్తారు. నందిగరువు గ్రామ ప్రజలతో నిర్వహించే మాటా-మంతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం గిరిజనులతో కలసి మధ్యాహ్న భోజనం చేస్తారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • గుంటూరు లో ఘనంగా అంబేత్కర్ జయంతి గుంటూరు:అంబేద్కర్ జయంతి సందర్భంగా మూవ్ మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ముస్తఫా గుంటూరు లో దళిత నాయకులతో కోరిట పాడు లోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. 'అంటరానితనంతో కులవివక్షకు గురై కూడా ఉన్నత విద్యను అభ్యసించి దేశం గర్వించే అత్యున్నత స్థాయికి ఎదిగిన అంబేద్కర్ ఆదర్శప్రాయులు అని, ప్రపంచంలో బలమైన ప్రజాస్వామ్య దేశంగా మన దేశం నిలుస్తోంది అంటే దానికి కారణం ఆయన మనకు ఇచ్చిన రాజ్యాంగం. సమాన అవకాశాలు, హక్కులు అందించి, ప్రతి పౌరుడికి రాజ్యాంగ రక్షణ కల్పించారు' అని నాయకులు కొనియాడారు.రాజ్యాంగానికి తూట్లు పోవటానికి కొందరు ప్రయత్నిస్తున్న వేళ ఆయన స్ఫూర్తితో పోరాడటానికి అంబేద్కర్ వాదులు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు.
    1
    గుంటూరు లో ఘనంగా అంబేత్కర్ జయంతి 
గుంటూరు:అంబేద్కర్ జయంతి సందర్భంగా మూవ్ మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ముస్తఫా గుంటూరు లో దళిత నాయకులతో కోరిట పాడు లోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. 'అంటరానితనంతో కులవివక్షకు గురై కూడా ఉన్నత విద్యను అభ్యసించి దేశం గర్వించే అత్యున్నత స్థాయికి ఎదిగిన అంబేద్కర్ ఆదర్శప్రాయులు అని, ప్రపంచంలో బలమైన ప్రజాస్వామ్య దేశంగా మన దేశం నిలుస్తోంది అంటే దానికి కారణం ఆయన మనకు ఇచ్చిన రాజ్యాంగం. సమాన అవకాశాలు, హక్కులు అందించి, ప్రతి పౌరుడికి రాజ్యాంగ రక్షణ కల్పించారు' అని నాయకులు కొనియాడారు.రాజ్యాంగానికి తూట్లు పోవటానికి కొందరు ప్రయత్నిస్తున్న వేళ ఆయన స్ఫూర్తితో పోరాడటానికి అంబేద్కర్ వాదులు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • #Ambedkar #AmbedkarJayanti #Motivation #Inspiration #Success #Education #Shorts #Trending
    1
    #Ambedkar #AmbedkarJayanti #Motivation #Inspiration #Success #Education #Shorts #Trending
    user_Kumar Kurapati
    Kumar Kurapati
    కొల్లూరు, బాపట్ల, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • Post by Paramesh Ratnagiri
    1
    Post by Paramesh Ratnagiri
    user_Paramesh Ratnagiri
    Paramesh Ratnagiri
    జర్నలిస్ట్ Rolla, Sri Sathya Sai•
    10 hrs ago
  • అమరావతి (M) దిడుగు-ఏటూరు వెళ్లే పడవ ప్రయాణికులకు దారి కష్టాలు మొదలయ్యాయి. లంక భూముల్లోని ప్రభుత్వ దారికి గుర్తు తెలియని వ్యక్తులు అడ్డంగా గండి కొట్టడంతో రాకపోకలు స్తంభించాయి. ఏప్రిల్ 8న జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పడవ పాటలు నిర్వహించినప్పటికీ, ప్రయాణికుల సౌకర్యాలను మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు, ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి దారిని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గండి కొట్టిన వ్యక్తులపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వ్యక్తులను సహించరాదని ప్రయాణికులు హెచ్చరించారు.
    1
    అమరావతి (M) దిడుగు-ఏటూరు వెళ్లే పడవ ప్రయాణికులకు దారి కష్టాలు మొదలయ్యాయి. లంక భూముల్లోని ప్రభుత్వ దారికి గుర్తు తెలియని వ్యక్తులు అడ్డంగా గండి కొట్టడంతో రాకపోకలు స్తంభించాయి. ఏప్రిల్ 8న జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పడవ పాటలు నిర్వహించినప్పటికీ, ప్రయాణికుల సౌకర్యాలను మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు, ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి దారిని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గండి కొట్టిన వ్యక్తులపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వ్యక్తులను సహించరాదని ప్రయాణికులు హెచ్చరించారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    15 hrs ago
  • నకిరేకల్ నియోజకవర్గం:- ఈ రోజు చందుపట్ల గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో పాల్గొని ప్రజలతో కలిసి అంబేద్కర్ గారి ఆశయాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా దైద రవీందర్ మాట్లాడుతూ, అంబేద్కర్ గారు అన్ని వర్గాల కోట్లాది ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అంబేద్కర్ గ్రామ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, గ్రామ ప్రజలు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    3
    నకిరేకల్ నియోజకవర్గం:-
ఈ రోజు చందుపట్ల గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో పాల్గొని ప్రజలతో కలిసి అంబేద్కర్ గారి ఆశయాలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా దైద రవీందర్ మాట్లాడుతూ, అంబేద్కర్ గారు అన్ని వర్గాల కోట్లాది ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అంబేద్కర్ గ్రామ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, గ్రామ ప్రజలు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Nagesh Kothapalli
    Nagesh Kothapalli
    Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
    8 hrs ago
  • నల్లగొండ బ్రేకింగ్: నల్లగొండలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు మర్రిగూడ బైపాస్ వద్ద మరియు స్థానిక డిఈఓ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు.. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని అంబేద్కర్ సేవలను స్మరణ... అంబేద్కర్ ఆశయాల సాధనే నిజమైన నివాళి” – మంత్రి... కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు... అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహణ...
    1
    నల్లగొండ బ్రేకింగ్: 
నల్లగొండలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు
మర్రిగూడ బైపాస్ వద్ద మరియు స్థానిక డిఈఓ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు..
రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని అంబేద్కర్ సేవలను స్మరణ...
అంబేద్కర్ ఆశయాల సాధనే నిజమైన నివాళి” – మంత్రి...
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు...
అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహణ...
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    12 hrs ago
  • అమరావతి (M) దిడుగు-ఏటూరు వెళ్లే పడవ ప్రయాణికులకు దారి కష్టాలు మొదలయ్యాయి. లంక భూముల్లోని ప్రభుత్వ దారికి గుర్తు తెలియని వ్యక్తులు అడ్డంగా గండి కొట్టడంతో రాకపోకలు స్తంభించాయి. ఏప్రిల్ 8న జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పడవ పాటలు నిర్వహించినప్పటికీ, ప్రయాణికుల సౌకర్యాలను మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి దారిని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
    1
    అమరావతి (M) దిడుగు-ఏటూరు వెళ్లే పడవ ప్రయాణికులకు దారి కష్టాలు మొదలయ్యాయి. లంక భూముల్లోని ప్రభుత్వ దారికి గుర్తు తెలియని వ్యక్తులు అడ్డంగా గండి కొట్టడంతో రాకపోకలు స్తంభించాయి. ఏప్రిల్ 8న జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పడవ పాటలు నిర్వహించినప్పటికీ, ప్రయాణికుల సౌకర్యాలను మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి దారిని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.