విఘ్నాలను తొలగించి, సకల శుభాలను ప్రసాదించే విఘ్నేశ్వరుడి ఆరాధనకు ప్రతీకగా నిలిచే వినాయక చవితి వేడుకలు గోకవరం సీఎండీ లే అవుట్‌లో వైభవంగా వినాయక చవితి వేడుకలు... గణనాథుడికి కంబాల దంపతులు ప్రత్యేక పూజ విఘ్నాలను తొలగించి, సకల శుభాలను ప్రసాదించే విఘ్నేశ్వరుడి ఆరాధనకు ప్రతీకగా నిలిచే వినాయక చవితి వేడుకలు గోకవరం–తంటికొండ రోడ్డులోని సీఎండీ లే అవుట్ వద్ద సోమవారం భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించారు. విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జగ్గంపేట నియోజకవర్గం బీఎల్ఏ-1 కంబాల శ్రీనివాసరావు, శ్రీమతి పద్మావతి దేవి గంగారత్నం దంపతులు ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎండీ లే అవుట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద ఉదయం నుంచే ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మండపాన్ని ప్రత్యేకంగా అలంకరించి గణనాథుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు దంపతులు గణపతి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ వేదమంత్రోచ్ఛారణలు, నడుమ గణపతి పూజా కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. గణపతికి పసుపు, కుంకుమ, పుష్పాలు, పత్రి సమర్పించి ప్రత్యేక అర్చనలు చేశారు. అనంతరం గణనాథుడికి నైవేద్యం సమర్పించి, మంగళహారతి నిర్వహించారు. ఈ సందర్బంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ వినాయక చవితి కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, భక్తి, ఐక్యత, ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకగా నిలిచే మహత్తర పర్వదినమని పేర్కొన్నారు. గణనాథుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ భక్తితో గణనాథుడిని ఆరాధిస్తూ పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత, సామాజిక బాధ్యత వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పండుగలను అందరూ కలిసి ఆనందంగా జరుపుకోవడం ద్వారా సమాజంలో సోదరభావం మరింత బలపడుతుందన్నారు...

- లోకేష్ పర్యటన నీ విజయవంతం చేయాలి.. పెడన ఎమ్మెల్యే కాగిత పెడన నియోజకవర్గంలో ఈ నెల 17న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొననున్న కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు. కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన, గూడూరు మండలాల TDP నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.1
- ఇన్స్టా లవ్... ఆపై పెద్దలను ఒప్పించి పెళ్లి...భార్యను చూసి భర్త షాక్...!! గుజరాత్ లో ఓ యువకుడికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువతి పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో సుమారు 10 నెలల పాటు ఫోన్‌లోనే వారి రొమాన్స్ సాగింది. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే పెళ్లి జరిగినప్పటి నుంచి ఆ నవవధువు భర్తకు ఎప్పుడూ దూరంగానే ఉంటూ వచ్చింది. ఆమె ప్రవర్తనపై అనుమానం కలిగిన కుటుంబ సభ్యులు చివరికి పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు వధువు ముఖంపై ఉన్న ముసుగు తొలగించి అసలు నిజం బయటపెట్టడంతో ఖాకీలు సైతం అవాక్కయ్యారు. ముసుగు వెనుక ఉన్నది వధువు కాదని, స్వయంగా ఓ అబ్బాయని పెళ్లి కోసం ఈ వేషధారణ వేసినట్లు తేలింది. ఈ వింత ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.1
- భద్రాచలం: గరుడ ఆకారంలో గణనాథుడు.. ఆకట్టుకుంటున్న అలంకరణ భద్రాచలం బస్టాండ్ ఎదురుగా అశోక్‌నగర్ కాలనీలో గరుడ పక్షి ఆకారంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రంగురంగుల లైట్లతో ప్రత్యేక డెకరేషన్ చేసి మండపాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ‘భద్రాద్రి కా మహారాజ్’ పేరుతో మూడో ఏడాది వేడుకలు నిర్వహిస్తున్నారు. విగ్రహం, డెకరేషన్‌కు సుమారు రూ.14 లక్షలు ఖర్చయినట్లు నిర్వాహకులు తెలిపారు1
- పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ పత్రికా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం జిల్లా స్థాయి అభివృద్ధి సమన్వయ మరియు మానిటరింగ్ కమిటీ (DISHA) సమీక్షా సమావేశము అనంతరము అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ పత్రికా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం1
- మైదుకూరు ఆదరణ సేవా సంస్థకు నేషనల్ సేవా రత్నా పురస్కార్ 2026ప్రధానం కడప జిల్లా మైదుకూరు పట్టణానికి చెందిన ఆదరణ సేవా సంస్థ వారి సేవలను గుర్తించి కర్ణాటక రాష్ట్రంలోనీ బెంగళూరు పట్టణానికి చెందిన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారి 15వ వార్షికోత్సవం సందర్భంగా ఆదరణ సేవా సంస్థ అధ్యక్షుడు ప్రసన్న కుమార్ నేషనల్ సేవా రత్నా పురస్కార్ 2026 అవార్డు ప్రముకుల చేతుల మీదుగా అవార్డు అందుకోవడం జరిగినది.ఈ సందర్భంగా ఆదరణ సేవా సంస్థ అధ్యక్షుడు ప్రసన్న కుమార్ మాట్లాడుతూ సమాజములో స్వచ్ఛందంగా నిస్వార్ధంలో సేవలు అందిస్తున్న వారిని గుర్తించి అభినందిస్తూ వారికి అవార్డు ప్రధానం చేయడం చాలా సంతోషం అని తెలిపారు.అలాగే తమ తల్లి తల్లిదండ్రులకు ,విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు,తన మిత్రులకు , శ్రేయోభిలాషులకు ,దాతలకు ,సంస్థలోని సభ్యులకు ఆదరణ సేవా సంస్థ తరపున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను.1
- ప్రత్యేక ఆకర్షణ: బేగంబజార్‌లో అద్భుతం.. 48 కిలోల ‘బంగారు గణేశుడు *ప్రత్యేక ఆకర్షణ:* వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఫీల్‌ఖానాలో కొలువుదీరిన దివ్య మూర్తి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. *స్వర్ణ శోభ:* సుమారు 3.83 లక్షలకు పైగా అమెరికన్ డైమండ్స్ మరియు 24K బంగారు పూతతో అత్యంత శోభాయమానంగా ఈ విగ్రహాన్ని అలంకరించారు. *కళా నైపుణ్యం:* అత్యంత నిపుణులైన కళాకారుల హస్తకళా నైపుణ్యంతో ఈ అరుదైన విగ్రహం రూపుదిద్దుకుంది. *ప్రత్యేక ప్రేరణ:* ప్రసిద్ధ లాల్‌బాగ్చా రాజా, తిరుపతి బాలాజీ రూపాల స్ఫూర్తితో ఈ స్వర్ణ గణనాథుడిని అద్భుతంగా మలిచారు. ఇండియాలోనే అత్యంత కాస్ట్లీ మరియు అరుదైన వినాయక విగ్రహంగా బేగంబజార్‌లోని ఈ స్వర్ణ గణేశుడు భక్తుల పూజలందుకుంటూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.1
- పాల ధరల పెంపు, నిత్యవసర వస్తువుల ధరల భారాలకు వ్యతిరేకంగా సిపిఎం నిరసన, ధర్నా పెంచిన పాల ధరలు తగ్గించాలని, నిత్యవసర వస్తువుల ధరలు అరికట్టాలని, రేషన్ డిపోల ద్వారా సరసమైన ధరలకు అన్ని రకాల సరుకులు అందించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ కృష్ణలంక , భ్రమరాంబపురంలో సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన, ధర్నా జరిగింది.సిపిఎం కార్యకర్తలు, స్థానికులు పాల ప్యాకెట్లను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు, పెరిగిన ధరలకు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ బియ్యం మొదలు అన్ని నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య, మధ్యతరగతి ప్రజలు సతమతమవుతుండగా, దానిని పట్టించుకోకుండా ముఖ్యమంత్రి టిడిపి కార్యకర్తల ఆదాయం పెంపు గురించి మాట్లాడటం సిగ్గుచేటని కలెక్టర్ల సమావేశంలో ధరల నియంత్రణకు ఎటువంటి చర్చ, చర్యలు చేపట్టకపోవడం గర్హనీయమన్నారు. విజయ డైరీ (కృష్ణాజిల్లా మిల్క్ యూనియన్) చైర్మన్ ను ప్రభుత్వ పెద్దలు బలవంతంగా రాజీనామా చేయించారు, నేడు చైర్మన్ లేరు, అయినా పండగ రోజు నుండి లీటర్ రెండు రూ.. చొప్పున పాలధర పెంచడం అమానుషం అన్నారు.1
- హైదరాబాద్‌లో దారునా హత్యా సెటిల్మెంట్లు చేసిన డబ్బుల విషయంలో గోదావ *లైవ్ మర్డర్ వీడియో..!* హైదరాబాద్‌లో ఇదీ లా అండ్ ఆర్డర్ దుస్థితి హత్యతో నగరంలో భయాందోళనలు ఇద్దరు రౌడీషీటర్ల మధ్య నెలకొన్న వివాదం కారణంగానే హత్య ప్రాణ స్నేహితుడినే దారుణంగా హత్య నాగోల్ బండ్లగూడలో పాత కక్షల నేపథ్యంలోనే మహమ్మద్ నహీమ్‌ను దారుణంగా హత్య చేసిన మహేష్ హైదరాబాద్ - నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ ఆనంద్ నగర్ చౌరస్తా సమీపంలో ఖమ్మం ఇల్లెందుకి చెందిన రౌడీషీటర్ మహమ్మద్ నహీమ్ దారుణ హత్య ఇల్లందు పట్టణానికి చెందిన రౌడీషీటర్లు ఉమామహేశ్వర్ అలియాస్ జేకే మహేష్, మహమ్మద్ నహీమ్ చిన్ననాటి నుండి కలిసి చదువుకున్న ఆప్తమిత్రులు బండ్లగూడ సహభావన అపార్ట్‌మెంట్లో నివాసముంటున్న మహమ్మద్ నహీమ్ సెటిల్మెంట్లు చేసిన డబ్బుల విషయంలో గత మూడు నెలలుగా వీరిద్దరి మధ్య ఘర్షన ముఠా కక్షలే హత్యకు కారణంగా గుర్తింపు ఇద్దరిపైనా ఇప్పటికే పలు హత్య కేసులు, ఇల్లందు పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్లు నిందితులు మహేష్ అండ్ టీం కోసం ప్రత్యేక బృందంతో గాలిస్తున్న నాగోల్ పోలీసులు1
- జైనూర్‌లో భారీగా గంజాయి మొక్కలు స్వాధీనం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పట్నాపూర్ గ్రామ శివారులో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1,245 గంజాయి మొక్కలు విలువ: రూ.1.54 కోట్లు 11 గ్రాముల ఎండు గంజాయి కూడా స్వాధీనం ఈ వ్యవహారంలో ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ వివరాలను ఎస్పీ నితిక పంత్ వెల్లడించారు.1