వేములవాడ మూలవాగు నుంచి ఇసుక రవాణాను అడ్డుకున్న రైతులు... ఇసుక రీచ్ ల పేరుతో అక్రమ దందాను అరికట్టాలని డిమాండ్... అధికారులతో వాగ్వాదం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా ఆందోళనకు గురిచేస్తుంది. రైతులను రోడ్డెక్కించే పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో మానేర్, మోయతుమ్మెద, మూల వాగుల్లో ప్రభుత్వం ఇసుక రీచ్ ల ఏర్పాటు చేసి ప్రభుత్వ అవసరాలకు ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక రవాణా చేస్తుంది. ఆన్లైన్ పద్ధతిలో ఇసుక రవాణా చేసే అవకాశం ఉన్నప్పటికీ అక్రమార్కులు కొందరు ఇందిరమ్మ ఇళ్ల టోకెన్ల పేరుతో అక్రమ దందా సాగిస్తున్నారు. సక్రమం కంటే అక్రమంగా భారీ ఎత్తున ఇసుక రవాణా జరుగుతుండడంతో వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి, బొల్లారం గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. మూలవాగు నుంచి ఇసుక రవాణా చేసే 400 ట్రాక్టర్లను అడ్డుకున్నారు. ప్రభుత్వ అనుమతితోనే ఇసుక రవాణా చేస్తున్నామని ట్రాక్టర్ యాజమానులు, డ్రైవర్లు చెప్పినప్పటికీ ఇసుక రవాణాతో భూగర్భ జలాలు అడగంటి పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతన్నలు నిరసనతో ఆందోళనకు దిగారు. ఇసుక రీచ్ వల్ల పంటలు కోల్పోయో పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక తీయడం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రూరల్ తహశిల్దార్ అబూకర్ అక్కడికి చేరుకోగా పర్మిషన్ ఎలా ఇస్తారని రైతులు నిలదీశారు. రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు ఇసుక రవాణాను తాత్కాలికంగా నిలిపివేశారు. పంటలు చేతికందేవరకూ వాగుల నుంచి ఇసుక తీయొద్దని రైతులు డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
వేములవాడ మూలవాగు నుంచి ఇసుక రవాణాను అడ్డుకున్న రైతులు... ఇసుక రీచ్ ల పేరుతో అక్రమ దందాను అరికట్టాలని డిమాండ్... అధికారులతో వాగ్వాదం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా ఆందోళనకు గురిచేస్తుంది. రైతులను రోడ్డెక్కించే పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో మానేర్, మోయతుమ్మెద, మూల వాగుల్లో ప్రభుత్వం ఇసుక రీచ్ ల ఏర్పాటు
చేసి ప్రభుత్వ అవసరాలకు ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక రవాణా చేస్తుంది. ఆన్లైన్ పద్ధతిలో ఇసుక రవాణా చేసే అవకాశం ఉన్నప్పటికీ అక్రమార్కులు కొందరు ఇందిరమ్మ ఇళ్ల టోకెన్ల పేరుతో అక్రమ దందా సాగిస్తున్నారు. సక్రమం కంటే అక్రమంగా భారీ ఎత్తున ఇసుక రవాణా జరుగుతుండడంతో వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి, బొల్లారం గ్రామాల రైతులు ఆందోళనకు
దిగారు. మూలవాగు నుంచి ఇసుక రవాణా చేసే 400 ట్రాక్టర్లను అడ్డుకున్నారు. ప్రభుత్వ అనుమతితోనే ఇసుక రవాణా చేస్తున్నామని ట్రాక్టర్ యాజమానులు, డ్రైవర్లు చెప్పినప్పటికీ ఇసుక రవాణాతో భూగర్భ జలాలు అడగంటి పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతన్నలు నిరసనతో ఆందోళనకు దిగారు. ఇసుక రీచ్ వల్ల పంటలు కోల్పోయో పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇసుక తీయడం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రూరల్ తహశిల్దార్ అబూకర్ అక్కడికి చేరుకోగా పర్మిషన్ ఎలా ఇస్తారని రైతులు నిలదీశారు. రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు ఇసుక రవాణాను తాత్కాలికంగా నిలిపివేశారు. పంటలు చేతికందేవరకూ వాగుల నుంచి ఇసుక తీయొద్దని రైతులు డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
- రైతులు ఎరువుల కోసం పడే ఇబ్బందులను దూరం చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించిన ఫర్టిలైజర్ యాప్ సేవలను రైతులు వినియోగించుకోవాలని సిరిసిల్ల ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. తంగళ్ళపల్లిలోని గ్రోమోర్ ఎరువుల షాప్ ను ఇంచార్జి కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. యాప్ ద్వారా ఎందరు రైతులు ఎరువులు బుకింగ్ చేసుకున్నారు? ఎందరు తీసుకువెళ్లారో ఆరా తీసి.. రిజిస్టర్లు పరిశీలించారు. యాప్ ద్వారా ఎరువులు కొనుగోలు చేసిన రైతుల వివరాలను రిజిస్టర్లలో తనిఖీ చేశారు. షాప్ లో నిన్న రాత్రి స్టాక్ వివరాలు, ఈ రోజు ఉదయం స్టాక్ వివరాలు పరిశీలించారు. అలాగే గోడౌన్ లో ప్రస్తుతం ఉన్న ఎరువుల నిలువలను అక్కడ ఉన్న సిబ్బందితో లెక్కింపజేసి సరి చూసారు. అనంతరం ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లా డుతూ.. రాష్ట్ర వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఫర్టిలైజర్ యాప్ రైతులు డౌన్ లోడ్ చేసుకోవాలని, దాని ద్వారానే ఎరువులు బుకింగ్ చేసుకోవాలని స్పష్టం చేశారు. అన్ని ఫెర్టిలైజర్ షాప్ లు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద వద్ద రైతులకు సహాయం అందించేందుకు హెల్ప్ డెస్క్, ఒక సహాయకుడు ఉంటారని పేర్కొన్నారు. జిల్లాలోని రైతులందరూ యాప్ లో యూరియా బుక్ చేసుకుని తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు నిత్యం తమ పరిధిలోని అన్ని ఎరువుల షాపుల్లో తనిఖీ చేయాలని సూచించారు. యాప్ డౌన్ లోడ్, బుకింగ్ విషయంలో రైతులకు అందుబాటులో ఉండి.. సేవలు అందించాలని ఆదేశించారు. జిల్లాలో ఈనెల 1 వ తేదీ నుంచి ఈరోజు వరకు 92 వేల 735 సంచుల యూరియా వచ్చిందని, యాప్ ద్వారా జిల్లాలోని 84 వేల 68 మంది రైతులు ఎరువుల కోసం బుకింగ్ చేసుకున్నారని తెలిపారు. 79 వేల 948 మంది కొనుగోలు చేయగా, ఇంకా 11వేల 694 నిలువ ఉందని, 740 మంది రైతులు యూరియా కోసం బుకింగ్ చేసుకుని ఇంకా తీసుకువెళ్ల లేదని వివరించారు. జిల్లాలో ఎరువులకు కొరత లేదని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ స్పష్టం చేశారు.3
- కరీంనగర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు మండలం దేవంపల్లి గ్రామానికి చెందిన వివాహిత పోలవేణి అనుష (25) కాకతీయ కెనాల్‌లో పడి మృతి చెందింది. ఇంటి వద్ద నుంచి బయటకు వెళ్లిన ఆమె కోసం గాలింపు చేపట్టగా రంగపేట శివారులో మృతదేహం లభ్యమైంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు.1
- హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెరా గ్రామంలో దొంగలు హల్చల్ తాళం వేసి ఉన్న ఆవుల సంపత్ ఇంట్లో 5 తులాల బంగారం,లక్ష యాభై వేల నగదు అపహరణ. దర్యాప్తు చేస్తున్న పోలీసులు.1
- వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా సర్పంచ్ జక్కి అనిత శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. శివాజీ చిత్రపటానికి నివాళులు అర్పించి వేణుగోపాలస్వామి ఆలయం నుంచి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జక్కి శ్రీకాంత్ మాట్లాడుతూ శివాజీ ఆశయాలను యువత అనుసరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.1
- జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ గా ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో శ్రీమతి సమిండ్ల వాణి శ్రీనివాస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా బుధవారం హైదరాబాద్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సంక్షేమ శాఖ మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి, జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ గా తన నియామకంకు సహకరించినందుకు కృతజ్ఞతలుచెపుతూ, జగిత్యాలఅభివృద్ధికి సహక్రించాలని శ్రీమతి సమిండ్ల వాణి శ్రీనివాస్ దంపతులు కోరారు.1
- Post by Ravi Poreddy1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 19 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో Bharatiya Janata Party ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భైరి శంకర్ ముదిరాజ్ బిఆర్ఎస్ నేతలపై ఘాటు విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమకారులను అణగదొక్కడం, పార్టీ లోపలే విభేదాలు రెచ్చగొట్టడం, స్వార్థ ఎజెండాతో వ్యవహరించడం బిఆర్ఎస్ నేతల లక్ష్యమైందని ఆయన ఆరోపించారు. Bharat Rashtra Samithi లో పనిచేస్తూ నియోజకవర్గంలో ఉద్యమకారులకు, నిజమైన కేడర్‌కు పదవులు రాకుండా అడ్డుపడుతున్నారని, తన అనుచరులకు మాత్రమే పదవులు కట్టబెట్టే రాజకీయాలు నడుపుతున్నారని ప్రతాప్ రెడ్డిపై మండిపడ్డారు. “పార్టీ పతనం కోసం లోపలే కుయుక్తులు పన్నేవాడు నాయకుడా?” అని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో మచ్చలేని నాయకుడు Raghunandan Rao కోటి రూపాయలు తీసుకుని వేరే పార్టీకి మద్దతిచ్చారనే ఆరోపణలు చేసిన వారు గజ్వేల్ కోట మైసమ్మ దేవాలయం వద్ద వాటిని రుజువు చేయాలని సవాల్ విసిరారు. “నిజం ఉంటే దేవాలయం వద్ద ప్రమాణం చేయి… లేకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి తప్పుకో” అని ఘాటుగా హెచ్చరించారు. గతంలో K. Chandrashekar Rao ను ఓడించాలని T. Harish Rao ఫోన్ చేశారని ప్రచారం చేసి, బిఆర్ఎస్ నేతల వద్ద ఎంత డబ్బులు దోచుకున్నావో గజ్వేల్ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. “ఇతరులపై ఆరోపణలు చేసి డబ్బులు సంపాదించడం నీ రాజకీయ జీవన విధానమా?” అంటూ తీవ్ర విమర్శలు చేశారు.సర్పంచ్ ఎన్నికల సమయంలో పార్టీ ఫండ్ పంపకాలపై జరిగిన వివాదాన్ని ప్రస్తావిస్తూ, ఎమ్మెల్సీ యాదవ రెడ్డితో జరిగిన రచ్చను ప్రజలు మర్చిపోలేదన్నారు. “బ్లాక్మెయిల్ రాజకీయాలతో జీవితం గడిపేవాడిని ప్రజలు ఇక నమ్మరు” అని భైరి శంకర్ ముదిరాజ్ ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మనోహర్ యాదవ్, నాయిని సందీప్, ఎల్కంటి సురేష్, టెలికం బోర్డు మెంబర్ కమ్మరి శ్రీనివాస్, నత్తి శివకుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు.4
- అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్న చందంగా మారింది టమాటా రైతుల పరిస్థితి. కిలో టమాట ధర రూపాయికి పడిపోవడంతో కరీంనగర్ జిల్లాలో రైతన్నలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. కూలీ కూడా గిట్టుబాటు కాక పంట చేల్లోనే టమాటను వదిలేస్తున్నారు. గంగాధర మండలం వెంకటాయపల్లి గ్రామంలో దాదాపు 25 ఎకరాలలో రైతులు టమాట పంటను సాగు చేశారు. ఓవైపు కోతుల బెడద, మరోవైపు పకృతి వైపరీత్యాలను తట్టుకుని పంటను పండిస్తే చివరకు చేతికందిన పంటను అమ్ముకుందామంటే మార్కెట్లో ధరలేని పరిస్థితి ఏర్పడింది. కిలో టమాట ధర రూపాయి నుంచి రెండు రూపాయలు మాత్రమే పలుకుంది. ధర పడిపోవడంతో రైతులకు కూలీ కూడా గిట్టుబాటు కాకపోవడంతో టమాటాను తెంపకుండా చేల్లోనే వదిలేస్తున్నారు. టమాటా పంట వేసి తీవ్ర నష్టాలను కొని తెచ్చుకున్నామని టమాటా రైతులు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో పండించిన పంటను చేనులోనే వదిలేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి సుమారు 50 వేల వరకు పెట్టుబడి పెట్టినప్పటికీ, మార్కెట్లో కిలోకు రూపాయి నుంచి 2 రూపాయల వరకు మాత్రమే ధర లభిస్తుందని, దీంతో ఖర్చులు కూడా రాక పంటను చేల్లోనే వదిలేస్తున్నామని రైతులు చెబుతున్నారు. ఇంత నష్టం ఎప్పుడూ జరగలేదంటున్నారు రైతు గుండు అంజయ్య. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని లేదంటే తగిన నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు.2