Shuru
Apke Nagar Ki App…
నల్లబెల్లిలో శివాజీ జయంతి శోభాయాత్ర, బైక్ ర్యాలీ వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా సర్పంచ్ జక్కి అనిత శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. శివాజీ చిత్రపటానికి నివాళులు అర్పించి వేణుగోపాలస్వామి ఆలయం నుంచి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జక్కి శ్రీకాంత్ మాట్లాడుతూ శివాజీ ఆశయాలను యువత అనుసరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
M D Azizuddin
నల్లబెల్లిలో శివాజీ జయంతి శోభాయాత్ర, బైక్ ర్యాలీ వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా సర్పంచ్ జక్కి అనిత శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. శివాజీ చిత్రపటానికి నివాళులు అర్పించి వేణుగోపాలస్వామి ఆలయం నుంచి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జక్కి శ్రీకాంత్ మాట్లాడుతూ శివాజీ ఆశయాలను యువత అనుసరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా సర్పంచ్ జక్కి అనిత శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. శివాజీ చిత్రపటానికి నివాళులు అర్పించి వేణుగోపాలస్వామి ఆలయం నుంచి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జక్కి శ్రీకాంత్ మాట్లాడుతూ శివాజీ ఆశయాలను యువత అనుసరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.1
- హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెరా గ్రామంలో దొంగలు హల్చల్ తాళం వేసి ఉన్న ఆవుల సంపత్ ఇంట్లో 5 తులాల బంగారం,లక్ష యాభై వేల నగదు అపహరణ. దర్యాప్తు చేస్తున్న పోలీసులు.1
- వరంగల్ జిల్లాలోని పాకాల సరస్సును ఏకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయడానికి అటవీ శాఖ చర్యలు చేపట్టింది. పర్యాటకుల కోసం బోటు షికారు, కాటేజీలు, అంతర్గత రహదారులు, టాయిలెట్లు వంటి సౌకర్యాల అభివృద్ధికి నిధులు కేటాయించినట్లు వరంగల్ డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్ తెలిపారు. ఈ పనులతో పాకాల సరస్సు పర్యాటక ఆకర్షణగా మారనుంది.2
- వరంగల్ జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం పాకాల సరస్సును ఏకో టూరిజం హబ్‌గా అభివృద్ధి చేసేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రకృతి సోయగాలను కాపాడుతూ అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు వరంగల్ డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్ తెలిపారు. వరంగల్ అటవీశాఖ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పాకాల సరస్సులో బోటు షికారును మరింత విస్తరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అదనంగా పర్యాటకుల కోసం కాటేజీల నిర్మాణం, అంతర్గత రహదారుల అభివృద్ధి, శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ టాయిలెట్ల మరమ్మత్తులు చేపడుతున్నట్లు వివరించారు. పర్యావరణానికి హాని కలగకుండా, సహజ వనరులను సంరక్షిస్తూ ఏకో టూరిజం ప్రమాణాలకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. కుటుంబాలతో వచ్చే సందర్శకులకు సురక్షిత వాతావరణం కల్పించడం లక్ష్యంగా ప్రత్యేక భద్రతా చర్యలు కూడా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ అభివృద్ధి చర్యలతో పాకాల సరస్సు ప్రాంతానికి పర్యాటకుల రాక మరింత పెరిగే అవకాశముందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.2
- లక్కీ డ్రాలో తొర్రూరు మున్సిపల్ చైర్మన్ గా తునం శ్రావణ్ గెలవడంతో స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఎంపీ కడియం కావ్య ఆనందోత్సవానికి సంబందించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది తొర్రూరు చైర్మన్ పీఠాన్ని దక్కింఛుకునేందుకు ఇరు పార్టీలకు సమానం ఓట్లు రాగా ఎన్నికల అధికారులు లక్కీ డ్రా తీస్తున్న సమయంలో మున్సిపల్ కార్యాలయంలో నెలకొన్న ఉత్కంఠ క్షణాలు గెలిచిన ఆనందం లో ఎంపీ కడియం కావ్య ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కాంగ్రెస్ నేతల సంబరాలు ఈ వీడియోలో పార్టీ కార్యకర్తలను ఆకట్టుకుంది1
- కరీంనగర్ జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తూ రంజాన్ ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం ఖైదీలకు ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ కోసం పండ్లు, డ్రైఫ్రూట్స్, నమాజ్ కోసం జానిమాజులు, టోపీలు, తస్బీహ్, సూరే యాసిన్, సూరే రహమాన్, ఖురాన్ మజీద్, సుర్మా, అత్తర్ లను పంపిణీ చేశారు. ఎంఐఎం కార్పొరేటర్లు, నాయకులు, ఖైదీల జిల్లా జైలు పర్యవేక్షడికి, జైలర్ కు సామాగ్రిని అందజేశారు. ఈసందర్భంగా గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ తమ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సూచనల మేరకు గత 28 సంవత్సరాలుగా ఎంఐఎం ఆధ్వర్యంలో ఖైదీలకు ఇఫ్తార్ సామాగ్రి, నమాజ్ ఆచరించడం కోసం సామాగ్రి, ఖురాన్ లను అందిస్తున్నామన్నారు. ఇదే కాకుండా రంజాన్ పర్వదినం ఈదుల్ ఫితర్ సందర్భంగా కుల మతాలకు అతీతంగా యావత్తు ఖైదీలకు, జైలు సిబ్బంది మొత్తం 500 మందికి చికెన్ బిర్యానీ, షీర్ ఖుర్మా సెమియాలను పంపిణీ చేస్తున్నామన్నారు. అసదుద్దీన్ ఒవైసీ, శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం పార్టీ అభివృద్ధి కోసం, నాయకుల కోసం పవిత్ర రంజాన్ మాసంలో ప్రత్యేక ప్రార్థనలు చేయాలని ఖైదీలకు, ముస్లిం సమాజానికి విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ ముస్లిం సమాజానికి పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రంజాన్ మాసంలో చెడును పారద్రోలి.. మంచిని ప్రసాదించాలని కోరారు.2
- కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపల్ నూతన పాలకవర్గం ఈరోజు అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించింది. మున్సిపల్ కమిషనర్ టీ. మనోహర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఒకటో వార్డు సభ్యురాలు వడ్లూరి సరిత చైర్ పర్సన్‌గా, 14వ వార్డు సభ్యురాలు పెరుమాండ్ల మానస వైస్ చైర్ పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. నూతన కౌన్సిలర్లు కూడా తమ పదవులను స్వీకరించగా, మున్సిపల్ అధికారులు వారిని ఘనంగా సన్మానించారు. పట్టణ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తామని నూతన పాలకవర్గం హామీ ఇచ్చారు1
- మహబూబాబాద్‌లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ గురుకుల పాఠశాల విద్యార్థులు అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నాకు దిగారు. ప్రిన్సిపాల్ తమతో అసభ్యంగా ప్రవర్తిస్తూ దూషిస్తున్నారని ఆరోపించారు. ప్రిన్సిపాల్‌ను వెంటనే తొలగించాలంటూ డిమాండ్ చేస్తూ రోడ్డుపై ఆందోళన చేపట్టారు. సమస్య పరిష్కారం వరకు గురుకులానికి వెళ్లబోమని విద్యార్థులు స్పష్టం చేశారు.1