కరీంనగర్ జైల్లో ముస్లిం ఖైదీలకు ఇఫ్తార్ సామాగ్రి పంపిణీ...నమాజ్ కోసం దుస్తులు క్యాప్ లు అందజేసిన ఎంఐఎం.. కరీంనగర్ జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తూ రంజాన్ ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం ఖైదీలకు ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ కోసం పండ్లు, డ్రైఫ్రూట్స్, నమాజ్ కోసం జానిమాజులు, టోపీలు, తస్బీహ్, సూరే యాసిన్, సూరే రహమాన్, ఖురాన్ మజీద్, సుర్మా, అత్తర్ లను పంపిణీ చేశారు. ఎంఐఎం కార్పొరేటర్లు, నాయకులు, ఖైదీల జిల్లా జైలు పర్యవేక్షడికి, జైలర్ కు సామాగ్రిని అందజేశారు. ఈసందర్భంగా గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ తమ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సూచనల మేరకు గత 28 సంవత్సరాలుగా ఎంఐఎం ఆధ్వర్యంలో ఖైదీలకు ఇఫ్తార్ సామాగ్రి, నమాజ్ ఆచరించడం కోసం సామాగ్రి, ఖురాన్ లను అందిస్తున్నామన్నారు. ఇదే కాకుండా రంజాన్ పర్వదినం ఈదుల్ ఫితర్ సందర్భంగా కుల మతాలకు అతీతంగా యావత్తు ఖైదీలకు, జైలు సిబ్బంది మొత్తం 500 మందికి చికెన్ బిర్యానీ, షీర్ ఖుర్మా సెమియాలను పంపిణీ చేస్తున్నామన్నారు. అసదుద్దీన్ ఒవైసీ, శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం పార్టీ అభివృద్ధి కోసం, నాయకుల కోసం పవిత్ర రంజాన్ మాసంలో ప్రత్యేక ప్రార్థనలు చేయాలని ఖైదీలకు, ముస్లిం సమాజానికి విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ ముస్లిం సమాజానికి పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రంజాన్ మాసంలో చెడును పారద్రోలి.. మంచిని ప్రసాదించాలని కోరారు.
కరీంనగర్ జైల్లో ముస్లిం ఖైదీలకు ఇఫ్తార్ సామాగ్రి పంపిణీ...నమాజ్ కోసం దుస్తులు క్యాప్ లు అందజేసిన ఎంఐఎం.. కరీంనగర్ జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తూ రంజాన్ ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం ఖైదీలకు ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ కోసం పండ్లు, డ్రైఫ్రూట్స్, నమాజ్ కోసం జానిమాజులు, టోపీలు, తస్బీహ్, సూరే యాసిన్, సూరే రహమాన్, ఖురాన్ మజీద్, సుర్మా, అత్తర్ లను పంపిణీ చేశారు. ఎంఐఎం కార్పొరేటర్లు, నాయకులు, ఖైదీల జిల్లా జైలు పర్యవేక్షడికి, జైలర్ కు సామాగ్రిని అందజేశారు. ఈసందర్భంగా గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ తమ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సూచనల మేరకు గత 28
సంవత్సరాలుగా ఎంఐఎం ఆధ్వర్యంలో ఖైదీలకు ఇఫ్తార్ సామాగ్రి, నమాజ్ ఆచరించడం కోసం సామాగ్రి, ఖురాన్ లను అందిస్తున్నామన్నారు. ఇదే కాకుండా రంజాన్ పర్వదినం ఈదుల్ ఫితర్ సందర్భంగా కుల మతాలకు అతీతంగా యావత్తు ఖైదీలకు, జైలు సిబ్బంది మొత్తం 500 మందికి చికెన్ బిర్యానీ, షీర్ ఖుర్మా సెమియాలను పంపిణీ చేస్తున్నామన్నారు. అసదుద్దీన్ ఒవైసీ, శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం పార్టీ అభివృద్ధి కోసం, నాయకుల కోసం పవిత్ర రంజాన్ మాసంలో ప్రత్యేక ప్రార్థనలు చేయాలని ఖైదీలకు, ముస్లిం సమాజానికి విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ ముస్లిం సమాజానికి పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రంజాన్ మాసంలో చెడును పారద్రోలి.. మంచిని ప్రసాదించాలని కోరారు.
- కరీంనగర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు మండలం దేవంపల్లి గ్రామానికి చెందిన వివాహిత పోలవేణి అనుష (25) కాకతీయ కెనాల్‌లో పడి మృతి చెందింది. ఇంటి వద్ద నుంచి బయటకు వెళ్లిన ఆమె కోసం గాలింపు చేపట్టగా రంగపేట శివారులో మృతదేహం లభ్యమైంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు.1
- జనగామ జిల్లా చిల్పూర్ మండలం రాజావరం గ్రామంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని టి. రాజా సింగ్ ఆవిష్కరించారు. కార్యక్రమానికి హాజరైన రాజా సింగ్‌కు బీజేపీ కార్యకర్తలు, బజరంగ్ దళ్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. విగ్రహావిష్కరణ అనంతరం రాజా సింగ్‌కు ఖడ్గాన్ని బహుమతిగా అందించారు. ‘జై భవాని, జై శివాజీ, భారత్ మాతాకీ జై’ నినాదాలతో ప్రాంతం మార్మోగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజావరం బస్టాండ్ పరిసరాలు కాషాయ జెండాలతో కిటకిటలాడాయి.1
- వరంగల్ జిల్లాలోని పాకాల సరస్సును ఏకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయడానికి అటవీ శాఖ చర్యలు చేపట్టింది. పర్యాటకుల కోసం బోటు షికారు, కాటేజీలు, అంతర్గత రహదారులు, టాయిలెట్లు వంటి సౌకర్యాల అభివృద్ధికి నిధులు కేటాయించినట్లు వరంగల్ డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్ తెలిపారు. ఈ పనులతో పాకాల సరస్సు పర్యాటక ఆకర్షణగా మారనుంది.2
- వరంగల్ జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం పాకాల సరస్సును ఏకో టూరిజం హబ్‌గా అభివృద్ధి చేసేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రకృతి సోయగాలను కాపాడుతూ అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు వరంగల్ డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్ తెలిపారు. వరంగల్ అటవీశాఖ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పాకాల సరస్సులో బోటు షికారును మరింత విస్తరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అదనంగా పర్యాటకుల కోసం కాటేజీల నిర్మాణం, అంతర్గత రహదారుల అభివృద్ధి, శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ టాయిలెట్ల మరమ్మత్తులు చేపడుతున్నట్లు వివరించారు. పర్యావరణానికి హాని కలగకుండా, సహజ వనరులను సంరక్షిస్తూ ఏకో టూరిజం ప్రమాణాలకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. కుటుంబాలతో వచ్చే సందర్శకులకు సురక్షిత వాతావరణం కల్పించడం లక్ష్యంగా ప్రత్యేక భద్రతా చర్యలు కూడా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ అభివృద్ధి చర్యలతో పాకాల సరస్సు ప్రాంతానికి పర్యాటకుల రాక మరింత పెరిగే అవకాశముందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.2
- కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లికి చెందిన మహమ్మద్ సవాజ్ (40) చెరువులో పడి మృతి చెందినట్లు కుటుంబీకులు, గ్రామస్థులు తెలిపారు. గురువారం ఉదయం చెరువులో మృతదేహం తేలడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు.1
- బంజారాలలో జ్ఞానజ్యోతిని వెలిగించిన గొప్ప ఆధ్యాత్మిక గురువు, ఆరాధ్యదైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ అని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం మెదక్ జిల్లా కేంద్రంలో దుర్గా మీరా కాలనీ బంజారాలకు కేటాయించిన స్థలం నందు సేవలాల్ మహారాజ్ 287 జయంతి సందర్భంగా సందర్భంగా సేవాలాల్ మహారాజ్ కి ప్రత్యేక పూజలు చేశారు.. బంజారాల అభివృద్ధి కోసం ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని గుర్తు చేశారు. మెదక్ జిల్లా కేంద్రంలోని మీరా కాలనీలో బంజారాల కోసం కేటాయించిన స్థలాన్ని పరిరక్షించడంలో పటిష్ట చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. బంజారాల సంస్కృతికి ఆధ్యాత్మికతను జోడిస్తూ, దేశమంతా సంచరిస్తూ, హితబోధ చేశారన్నారు. దేశమంతా ఛిన్నాభిన్నంగా ఉన్న బంజారా సమాజాన్ని సేవాలాల్ ఏకం చేశారన్నారు. బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా అహింసా సిద్ధాంతానికి పునాదులు వేసిన మహానీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీవో రమాదేవి, గిరిజన సంక్షేమ అధికారి నీలిమ, లంబాడా హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గోపాల్ నాయక్, బంజారా సంఘం పూజారులు తదితరులు పాల్గొన్నారు.1
- రైతులు ఎరువుల కోసం పడే ఇబ్బందులను దూరం చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించిన ఫర్టిలైజర్ యాప్ సేవలను రైతులు వినియోగించుకోవాలని సిరిసిల్ల ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. తంగళ్ళపల్లిలోని గ్రోమోర్ ఎరువుల షాప్ ను ఇంచార్జి కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. యాప్ ద్వారా ఎందరు రైతులు ఎరువులు బుకింగ్ చేసుకున్నారు? ఎందరు తీసుకువెళ్లారో ఆరా తీసి.. రిజిస్టర్లు పరిశీలించారు. యాప్ ద్వారా ఎరువులు కొనుగోలు చేసిన రైతుల వివరాలను రిజిస్టర్లలో తనిఖీ చేశారు. షాప్ లో నిన్న రాత్రి స్టాక్ వివరాలు, ఈ రోజు ఉదయం స్టాక్ వివరాలు పరిశీలించారు. అలాగే గోడౌన్ లో ప్రస్తుతం ఉన్న ఎరువుల నిలువలను అక్కడ ఉన్న సిబ్బందితో లెక్కింపజేసి సరి చూసారు. అనంతరం ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లా డుతూ.. రాష్ట్ర వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఫర్టిలైజర్ యాప్ రైతులు డౌన్ లోడ్ చేసుకోవాలని, దాని ద్వారానే ఎరువులు బుకింగ్ చేసుకోవాలని స్పష్టం చేశారు. అన్ని ఫెర్టిలైజర్ షాప్ లు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద వద్ద రైతులకు సహాయం అందించేందుకు హెల్ప్ డెస్క్, ఒక సహాయకుడు ఉంటారని పేర్కొన్నారు. జిల్లాలోని రైతులందరూ యాప్ లో యూరియా బుక్ చేసుకుని తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు నిత్యం తమ పరిధిలోని అన్ని ఎరువుల షాపుల్లో తనిఖీ చేయాలని సూచించారు. యాప్ డౌన్ లోడ్, బుకింగ్ విషయంలో రైతులకు అందుబాటులో ఉండి.. సేవలు అందించాలని ఆదేశించారు. జిల్లాలో ఈనెల 1 వ తేదీ నుంచి ఈరోజు వరకు 92 వేల 735 సంచుల యూరియా వచ్చిందని, యాప్ ద్వారా జిల్లాలోని 84 వేల 68 మంది రైతులు ఎరువుల కోసం బుకింగ్ చేసుకున్నారని తెలిపారు. 79 వేల 948 మంది కొనుగోలు చేయగా, ఇంకా 11వేల 694 నిలువ ఉందని, 740 మంది రైతులు యూరియా కోసం బుకింగ్ చేసుకుని ఇంకా తీసుకువెళ్ల లేదని వివరించారు. జిల్లాలో ఎరువులకు కొరత లేదని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ స్పష్టం చేశారు.3
- వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా సర్పంచ్ జక్కి అనిత శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. శివాజీ చిత్రపటానికి నివాళులు అర్పించి వేణుగోపాలస్వామి ఆలయం నుంచి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జక్కి శ్రీకాంత్ మాట్లాడుతూ శివాజీ ఆశయాలను యువత అనుసరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.1
- కలెక్టరేట్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) మ్యాపింగ్‌పై జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సమీక్ష సమావేశం నిర్వహించారు. 2025 ఓటర్ జాబితాను 2002 ఎస్.ఐ.ఆర్‌తో మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రోజుకు కనీసం 50 మ్యాపింగ్‌లు పూర్తి చేసి, వారం రోజుల్లో ప్రక్రియ పూర్తిచేయాలని సూచించారు.1