Shuru
Apke Nagar Ki App…
దేవంపల్లి గ్రామానికి చెందిన వివాహిత పోలవేణి అనూష అనే మహిళ కాకతీయ కెనాల్ లో పడి మృతి కరీంనగర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు మండలం దేవంపల్లి గ్రామానికి చెందిన వివాహిత పోలవేణి అనుష (25) కాకతీయ కెనాల్‌లో పడి మృతి చెందింది. ఇంటి వద్ద నుంచి బయటకు వెళ్లిన ఆమె కోసం గాలింపు చేపట్టగా రంగపేట శివారులో మృతదేహం లభ్యమైంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
దేవంపల్లి గ్రామానికి చెందిన వివాహిత పోలవేణి అనూష అనే మహిళ కాకతీయ కెనాల్ లో పడి మృతి కరీంనగర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు మండలం దేవంపల్లి గ్రామానికి చెందిన వివాహిత పోలవేణి అనుష (25) కాకతీయ కెనాల్‌లో పడి మృతి చెందింది. ఇంటి వద్ద నుంచి బయటకు వెళ్లిన ఆమె కోసం గాలింపు చేపట్టగా రంగపేట శివారులో మృతదేహం లభ్యమైంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు.
More news from తెలంగాణ and nearby areas
- కరీంనగర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు మండలం దేవంపల్లి గ్రామానికి చెందిన వివాహిత పోలవేణి అనుష (25) కాకతీయ కెనాల్‌లో పడి మృతి చెందింది. ఇంటి వద్ద నుంచి బయటకు వెళ్లిన ఆమె కోసం గాలింపు చేపట్టగా రంగపేట శివారులో మృతదేహం లభ్యమైంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు.1
- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా ఆందోళనకు గురిచేస్తుంది. రైతులను రోడ్డెక్కించే పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో మానేర్, మోయతుమ్మెద, మూల వాగుల్లో ప్రభుత్వం ఇసుక రీచ్ ల ఏర్పాటు చేసి ప్రభుత్వ అవసరాలకు ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక రవాణా చేస్తుంది. ఆన్లైన్ పద్ధతిలో ఇసుక రవాణా చేసే అవకాశం ఉన్నప్పటికీ అక్రమార్కులు కొందరు ఇందిరమ్మ ఇళ్ల టోకెన్ల పేరుతో అక్రమ దందా సాగిస్తున్నారు. సక్రమం కంటే అక్రమంగా భారీ ఎత్తున ఇసుక రవాణా జరుగుతుండడంతో వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి, బొల్లారం గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. మూలవాగు నుంచి ఇసుక రవాణా చేసే 400 ట్రాక్టర్లను అడ్డుకున్నారు. ప్రభుత్వ అనుమతితోనే ఇసుక రవాణా చేస్తున్నామని ట్రాక్టర్ యాజమానులు, డ్రైవర్లు చెప్పినప్పటికీ ఇసుక రవాణాతో భూగర్భ జలాలు అడగంటి పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతన్నలు నిరసనతో ఆందోళనకు దిగారు. ఇసుక రీచ్ వల్ల పంటలు కోల్పోయో పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక తీయడం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రూరల్ తహశిల్దార్ అబూకర్ అక్కడికి చేరుకోగా పర్మిషన్ ఎలా ఇస్తారని రైతులు నిలదీశారు. రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు ఇసుక రవాణాను తాత్కాలికంగా నిలిపివేశారు. పంటలు చేతికందేవరకూ వాగుల నుంచి ఇసుక తీయొద్దని రైతులు డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.4
- జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ గా ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో శ్రీమతి సమిండ్ల వాణి శ్రీనివాస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా బుధవారం హైదరాబాద్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సంక్షేమ శాఖ మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి, జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ గా తన నియామకంకు సహకరించినందుకు కృతజ్ఞతలుచెపుతూ, జగిత్యాలఅభివృద్ధికి సహక్రించాలని శ్రీమతి సమిండ్ల వాణి శ్రీనివాస్ దంపతులు కోరారు.1
- హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెరా గ్రామంలో దొంగలు హల్చల్ తాళం వేసి ఉన్న ఆవుల సంపత్ ఇంట్లో 5 తులాల బంగారం,లక్ష యాభై వేల నగదు అపహరణ. దర్యాప్తు చేస్తున్న పోలీసులు.1
- మోకుదెబ్బ రమేష్ గౌడ్ పిలుపు... తొలి బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్పోర్తి తో రాజకీయంగా ఎదగాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ అన్నారు.నర్సంపేట పట్టణం లోని కంఠ మహేశ్వరుని ఆలయం ఆవరణలో వరంగల్ జిల్లాలో ఇటీవల నూతనం గా కౌన్సిలర్ లుగా ఎన్నికైన వేముల సంధ్య- సాంబయ్య గౌడ్, జూలూరి రోజా రాణి, దొమ్మటి రమ్య-సంతోష్ గౌడ్ లకు గౌడ కులస్తులకు గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదె బ్బ వరంగల్ జిల్లాకమిటీ,నర్సం పేట జిడబ్ల్యూఎస్, నర్సంపేట పట్టణ గౌడ సంఘాల నాయకులు కోల వెంకటేశ్వర్లు గౌడ్, మద్దెల శ్రీనివాస్ గౌడ్,గండి లింగయ్య గౌడ్, మాచర్ల ఐలుమల్లు గౌడ్, గోపగాని వెంకటేశ్వర్లు గౌడ్, గోడిశాల సదానందం గౌడ్, మద్దెల సాంబయ్య గౌడ్ అధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం బుధవారం నిర్వహించడం జరి గింది. ఈ సంధర్బంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ మూడు దశబ్దాల క్రితమే సామాన్య గీత కార్మికుల కుటుంబంలో జన్మించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 12 కోటలను జయించి గోల్కొండ కోట పరిపాలన చేసిన చక్రవర్తిగా పేరు గదించడం జరిగిందన్నారు.ఈ రోజు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగిన రాజకీయంగా వెనుకబడి పోతున్నామన్నారు.గౌడ కులస్తులు ఐక్యతగా ఉండి అభివృద్ధి చెందా లని రమేష్ గౌడ్ తెలిపారు.అనంతరం నూతన గౌడ కౌన్సిలర్ కు శాలువ, షీల్డ్, పూలమాలతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు గిరాగాని సాంబయ్య గౌడ్, కారుపోతుల విజయ్ కుమార్ గౌడ్, తాళ్లపెల్లి చంద్ర మౌళి గౌడ్,జూలూరి మనీష్ గౌడ్, కల్లెపు వెంకట్ నారాయణ గౌడ్, మర్ద గణేష్ గౌడ్, జనగాం మల్లికార్జున్ గౌడ్, నాంపల్లి వెంకటేశ్వర్లు గౌడ్,వేముల ఐలు సమ్మయ్య గౌడ్,నాగేల్లి సారంగం గౌడ్, గండి నర్సయ్య గౌడ్,నాతి సదానందం గౌడ్, గాదెగోని బాబు గౌడ్,కక్కేర్ల అశోక్ గౌడ్, తాళ్లపెల్లి కృష్ణ గౌడ్, ఊడ్గుల శ్రీనివాస్ గౌడ్, గండి రాము గౌడ్, బూర వేణు గౌడ్, వేముల కృష్ణ గౌడ్,తాబేటీ లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.2
- జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని దాదాసాహెబ్ కాలనీలో అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న నేపథ్యంలో ఎస్సై ఊర సృజన్ కుమార్ కాలనీకి వెళ్లి నివాసులతో సమావేశమయ్యారు. ఇకపై అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేయబోమని, ఎవరైనా పాల్పడితే పోలీసులకు సమాచారం అందిస్తామని కాలనీ వాసులతో ప్రతిజ్ఞ చేయించారు. ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.1
- కామారెడ్డి : రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని కామారెడ్డి పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె పట్టణంలోని బుర్ర మత్తడి, ఫిల్టర్ బెడ్లను మున్సిపల్ అధికారులతో కలిసి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ సూచన మేరకు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా ఫిల్టర్ బెడ్ల పనితీరును పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడుతూ పట్టణంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. బుర్ర మత్తడి వద్ద ప్రస్తుతం ఉన్న వనరులకు అదనంగా మరో మూడు కొత్త బోర్లు వేయించాలని, వీటికి అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేకంగా ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, ఏఈ వేణు ప్రసాద్‌లకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఫిల్టర్ బెడ్ల వద్ద పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదని, ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించాలని సూచించారు. ప్రతి ఇంటికి తాగునీరు సక్రమంగా అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. వేసవి ప్రణాళికలో ఏవైనా లోపాలు ఉంటే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి,ఏఈ వేణు ప్రసాద్‌లతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు అన్వర్,కాల్ల గణేష్, భాస్కర్ గౌడ్,గడ్డమీద మహేష్,అంజద్,లడ్డు, భూపతి,గంగాధర్, వాజిద్,లోలం శ్రీనివాస్, జెర్సీ నర్సింహులు, మామిడి లక్ష్మణ్,కె. లలిత, బబ్లు,మాజీద్, జావేద్,యూనుస్, సిద్దిఖ్,గ్యార సాయిలు, మన్సూర్ మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1
- కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం పరిధిలో ఉన్న తుర్ఖాసినగర్ రైల్వే గేట్ వద్ద నిత్యం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రం అయిన కరీంనగర్ నుండి జగిత్యాల జిల్లా కేంద్రం వరకు వెళ్లే ప్రధాన మార్గంలో ఈ రైల్వే గేట్ ఉండటంతో ప్రతిరోజూ రైళ్లు రాకపోకల సమయంలో గేటు మూసివేయడంతో వందలాది వాహనాలు గంటల తరబడి నిలిచిపోతున్నాయి. ముఖ్యంగా జగిత్యాల నుండి కరీంనగర్‌కు అత్యవసర వైద్యం కోసం రోగులను తరలిస్తున్న అంబులెన్సులు కూడా ఇక్కడే ఆగిపోవాల్సి వస్తుండటంతో ప్రాణాపాయం ఏర్పడుతున్నదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని వాహనదారులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.1