Shuru
Apke Nagar Ki App…
దాదాసాహెబ్ కాలనీలో అక్రమ ఇసుక రవాణాపై ఎస్సై ప్రతిజ్ఞ జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని దాదాసాహెబ్ కాలనీలో అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న నేపథ్యంలో ఎస్సై ఊర సృజన్ కుమార్ కాలనీకి వెళ్లి నివాసులతో సమావేశమయ్యారు. ఇకపై అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేయబోమని, ఎవరైనా పాల్పడితే పోలీసులకు సమాచారం అందిస్తామని కాలనీ వాసులతో ప్రతిజ్ఞ చేయించారు. ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
M D Azizuddin
దాదాసాహెబ్ కాలనీలో అక్రమ ఇసుక రవాణాపై ఎస్సై ప్రతిజ్ఞ జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని దాదాసాహెబ్ కాలనీలో అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న నేపథ్యంలో ఎస్సై ఊర సృజన్ కుమార్ కాలనీకి వెళ్లి నివాసులతో సమావేశమయ్యారు. ఇకపై అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేయబోమని, ఎవరైనా పాల్పడితే పోలీసులకు సమాచారం అందిస్తామని కాలనీ వాసులతో ప్రతిజ్ఞ చేయించారు. ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
More news from తెలంగాణ and nearby areas
- జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని దాదాసాహెబ్ కాలనీలో అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న నేపథ్యంలో ఎస్సై ఊర సృజన్ కుమార్ కాలనీకి వెళ్లి నివాసులతో సమావేశమయ్యారు. ఇకపై అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేయబోమని, ఎవరైనా పాల్పడితే పోలీసులకు సమాచారం అందిస్తామని కాలనీ వాసులతో ప్రతిజ్ఞ చేయించారు. ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.1
- హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెరా గ్రామంలో దొంగలు హల్చల్ తాళం వేసి ఉన్న ఆవుల సంపత్ ఇంట్లో 5 తులాల బంగారం,లక్ష యాభై వేల నగదు అపహరణ. దర్యాప్తు చేస్తున్న పోలీసులు.1
- మోకుదెబ్బ రమేష్ గౌడ్ పిలుపు... తొలి బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్పోర్తి తో రాజకీయంగా ఎదగాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ అన్నారు.నర్సంపేట పట్టణం లోని కంఠ మహేశ్వరుని ఆలయం ఆవరణలో వరంగల్ జిల్లాలో ఇటీవల నూతనం గా కౌన్సిలర్ లుగా ఎన్నికైన వేముల సంధ్య- సాంబయ్య గౌడ్, జూలూరి రోజా రాణి, దొమ్మటి రమ్య-సంతోష్ గౌడ్ లకు గౌడ కులస్తులకు గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదె బ్బ వరంగల్ జిల్లాకమిటీ,నర్సం పేట జిడబ్ల్యూఎస్, నర్సంపేట పట్టణ గౌడ సంఘాల నాయకులు కోల వెంకటేశ్వర్లు గౌడ్, మద్దెల శ్రీనివాస్ గౌడ్,గండి లింగయ్య గౌడ్, మాచర్ల ఐలుమల్లు గౌడ్, గోపగాని వెంకటేశ్వర్లు గౌడ్, గోడిశాల సదానందం గౌడ్, మద్దెల సాంబయ్య గౌడ్ అధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం బుధవారం నిర్వహించడం జరి గింది. ఈ సంధర్బంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ మూడు దశబ్దాల క్రితమే సామాన్య గీత కార్మికుల కుటుంబంలో జన్మించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 12 కోటలను జయించి గోల్కొండ కోట పరిపాలన చేసిన చక్రవర్తిగా పేరు గదించడం జరిగిందన్నారు.ఈ రోజు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగిన రాజకీయంగా వెనుకబడి పోతున్నామన్నారు.గౌడ కులస్తులు ఐక్యతగా ఉండి అభివృద్ధి చెందా లని రమేష్ గౌడ్ తెలిపారు.అనంతరం నూతన గౌడ కౌన్సిలర్ కు శాలువ, షీల్డ్, పూలమాలతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు గిరాగాని సాంబయ్య గౌడ్, కారుపోతుల విజయ్ కుమార్ గౌడ్, తాళ్లపెల్లి చంద్ర మౌళి గౌడ్,జూలూరి మనీష్ గౌడ్, కల్లెపు వెంకట్ నారాయణ గౌడ్, మర్ద గణేష్ గౌడ్, జనగాం మల్లికార్జున్ గౌడ్, నాంపల్లి వెంకటేశ్వర్లు గౌడ్,వేముల ఐలు సమ్మయ్య గౌడ్,నాగేల్లి సారంగం గౌడ్, గండి నర్సయ్య గౌడ్,నాతి సదానందం గౌడ్, గాదెగోని బాబు గౌడ్,కక్కేర్ల అశోక్ గౌడ్, తాళ్లపెల్లి కృష్ణ గౌడ్, ఊడ్గుల శ్రీనివాస్ గౌడ్, గండి రాము గౌడ్, బూర వేణు గౌడ్, వేముల కృష్ణ గౌడ్,తాబేటీ లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.2
- వరంగల్ జిల్లాలోని పాకాల సరస్సును ఏకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయడానికి అటవీ శాఖ చర్యలు చేపట్టింది. పర్యాటకుల కోసం బోటు షికారు, కాటేజీలు, అంతర్గత రహదారులు, టాయిలెట్లు వంటి సౌకర్యాల అభివృద్ధికి నిధులు కేటాయించినట్లు వరంగల్ డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్ తెలిపారు. ఈ పనులతో పాకాల సరస్సు పర్యాటక ఆకర్షణగా మారనుంది.2
- వరంగల్ జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం పాకాల సరస్సును ఏకో టూరిజం హబ్‌గా అభివృద్ధి చేసేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రకృతి సోయగాలను కాపాడుతూ అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు వరంగల్ డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్ తెలిపారు. వరంగల్ అటవీశాఖ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పాకాల సరస్సులో బోటు షికారును మరింత విస్తరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అదనంగా పర్యాటకుల కోసం కాటేజీల నిర్మాణం, అంతర్గత రహదారుల అభివృద్ధి, శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ టాయిలెట్ల మరమ్మత్తులు చేపడుతున్నట్లు వివరించారు. పర్యావరణానికి హాని కలగకుండా, సహజ వనరులను సంరక్షిస్తూ ఏకో టూరిజం ప్రమాణాలకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. కుటుంబాలతో వచ్చే సందర్శకులకు సురక్షిత వాతావరణం కల్పించడం లక్ష్యంగా ప్రత్యేక భద్రతా చర్యలు కూడా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ అభివృద్ధి చర్యలతో పాకాల సరస్సు ప్రాంతానికి పర్యాటకుల రాక మరింత పెరిగే అవకాశముందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.2
- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా ఆందోళనకు గురిచేస్తుంది. రైతులను రోడ్డెక్కించే పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో మానేర్, మోయతుమ్మెద, మూల వాగుల్లో ప్రభుత్వం ఇసుక రీచ్ ల ఏర్పాటు చేసి ప్రభుత్వ అవసరాలకు ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక రవాణా చేస్తుంది. ఆన్లైన్ పద్ధతిలో ఇసుక రవాణా చేసే అవకాశం ఉన్నప్పటికీ అక్రమార్కులు కొందరు ఇందిరమ్మ ఇళ్ల టోకెన్ల పేరుతో అక్రమ దందా సాగిస్తున్నారు. సక్రమం కంటే అక్రమంగా భారీ ఎత్తున ఇసుక రవాణా జరుగుతుండడంతో వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి, బొల్లారం గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. మూలవాగు నుంచి ఇసుక రవాణా చేసే 400 ట్రాక్టర్లను అడ్డుకున్నారు. ప్రభుత్వ అనుమతితోనే ఇసుక రవాణా చేస్తున్నామని ట్రాక్టర్ యాజమానులు, డ్రైవర్లు చెప్పినప్పటికీ ఇసుక రవాణాతో భూగర్భ జలాలు అడగంటి పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతన్నలు నిరసనతో ఆందోళనకు దిగారు. ఇసుక రీచ్ వల్ల పంటలు కోల్పోయో పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక తీయడం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రూరల్ తహశిల్దార్ అబూకర్ అక్కడికి చేరుకోగా పర్మిషన్ ఎలా ఇస్తారని రైతులు నిలదీశారు. రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు ఇసుక రవాణాను తాత్కాలికంగా నిలిపివేశారు. పంటలు చేతికందేవరకూ వాగుల నుంచి ఇసుక తీయొద్దని రైతులు డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.4
- కరీంనగర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు మండలం దేవంపల్లి గ్రామానికి చెందిన వివాహిత పోలవేణి అనుష (25) కాకతీయ కెనాల్‌లో పడి మృతి చెందింది. ఇంటి వద్ద నుంచి బయటకు వెళ్లిన ఆమె కోసం గాలింపు చేపట్టగా రంగపేట శివారులో మృతదేహం లభ్యమైంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు.1
- మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ఉత్కంఠగా సాగాయి. మొత్తం 16 వార్డుల్లో 9 బీఆర్ఎస్, 7 కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందగా, ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్-బీఆర్ఎస్ సమానంగా 9-9కి చేరాయి. దీంతో అధికారులు లక్కీ డ్రా నిర్వహించారు. చైర్మన్ పదవికి జరిగిన డ్రాలో కాంగ్రెస్ అభ్యర్థి తునం శ్రవణ్ పేరు రావడంతో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఎంపీ కడియం కావ్య ఆనందంతో కేరింతలు కొట్టారు. వైస్ చైర్మన్ డ్రాలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి పేరు రావడంతో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.1