logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ జనగామ జిల్లా చిల్పూర్ మండలం రాజావరం గ్రామంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని టి. రాజా సింగ్ ఆవిష్కరించారు. కార్యక్రమానికి హాజరైన రాజా సింగ్‌కు బీజేపీ కార్యకర్తలు, బజరంగ్ దళ్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. విగ్రహావిష్కరణ అనంతరం రాజా సింగ్‌కు ఖడ్గాన్ని బహుమతిగా అందించారు. ‘జై భవాని, జై శివాజీ, భారత్ మాతాకీ జై’ నినాదాలతో ప్రాంతం మార్మోగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజావరం బస్టాండ్ పరిసరాలు కాషాయ జెండాలతో కిటకిటలాడాయి.

2 hrs ago
user_M D Azizuddin
M D Azizuddin
జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
2 hrs ago

ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ జనగామ జిల్లా చిల్పూర్ మండలం రాజావరం గ్రామంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని టి. రాజా సింగ్ ఆవిష్కరించారు. కార్యక్రమానికి హాజరైన రాజా సింగ్‌కు బీజేపీ కార్యకర్తలు, బజరంగ్ దళ్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. విగ్రహావిష్కరణ అనంతరం రాజా సింగ్‌కు ఖడ్గాన్ని బహుమతిగా అందించారు. ‘జై భవాని, జై శివాజీ, భారత్ మాతాకీ జై’ నినాదాలతో ప్రాంతం మార్మోగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజావరం బస్టాండ్ పరిసరాలు కాషాయ జెండాలతో కిటకిటలాడాయి.

More news from తెలంగాణ and nearby areas
  • వరంగల్ :వర్ధన్నపేట పట్టణం కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలు మానుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రెండున్నరేళ్లుగా అధికారంలో ఉన్న మీరు, మా నాయకుడు 2 వేల ఎకరాల భూమి కబ్జా చేశాడని చెబితే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మండలానికో గెస్ట్ హౌస్ పేరుతో ఏర్పాటు చేసిన కార్యాలయాలు ప్రజా సేవ కోసం వినియోగిస్తున్నవేనని, సిఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కూడా అక్కడే జరిగిందని పేర్కొన్నారు. అక్రమ మార్గాల్లో పదవులు చేపట్టి మా నాయకులను విమర్శిస్తే కార్యకర్తలు ఊరుకోరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గోధుమలు మధుసూదన్, మండల అధ్యక్షుడు తూల్ల కుమారస్వామి, మాజీ జెడ్పిటిసి మార్గం బిక్షపతి, కౌన్సిలర్లు మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు.
    2
    వరంగల్ :వర్ధన్నపేట పట్టణం కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలు మానుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రెండున్నరేళ్లుగా అధికారంలో ఉన్న మీరు, మా నాయకుడు 2 వేల ఎకరాల భూమి కబ్జా చేశాడని చెబితే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
మండలానికో గెస్ట్ హౌస్ పేరుతో ఏర్పాటు చేసిన కార్యాలయాలు ప్రజా సేవ కోసం వినియోగిస్తున్నవేనని, సిఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కూడా అక్కడే జరిగిందని పేర్కొన్నారు. అక్రమ మార్గాల్లో పదవులు చేపట్టి మా నాయకులను విమర్శిస్తే కార్యకర్తలు ఊరుకోరని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గోధుమలు మధుసూదన్, మండల అధ్యక్షుడు తూల్ల కుమారస్వామి, మాజీ జెడ్పిటిసి మార్గం బిక్షపతి, కౌన్సిలర్లు మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెరా గ్రామంలో దొంగలు హల్చల్ తాళం వేసి ఉన్న ఆవుల సంపత్ ఇంట్లో 5 తులాల బంగారం,లక్ష యాభై వేల నగదు అపహరణ. దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
    1
    హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెరా గ్రామంలో దొంగలు హల్చల్ తాళం వేసి ఉన్న ఆవుల సంపత్ ఇంట్లో 5 తులాల బంగారం,లక్ష యాభై వేల నగదు అపహరణ.
దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
    user_Amar valmhikhi
    Amar valmhikhi
    ఎల్కతుర్తి, హనుమకొండ, తెలంగాణ•
    12 hrs ago
  • వరంగల్ జిల్లాలోని పాకాల సరస్సును ఏకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయడానికి అటవీ శాఖ చర్యలు చేపట్టింది. పర్యాటకుల కోసం బోటు షికారు, కాటేజీలు, అంతర్గత రహదారులు, టాయిలెట్లు వంటి సౌకర్యాల అభివృద్ధికి నిధులు కేటాయించినట్లు వరంగల్ డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్ తెలిపారు. ఈ పనులతో పాకాల సరస్సు పర్యాటక ఆకర్షణగా మారనుంది.
    2
    వరంగల్ జిల్లాలోని పాకాల సరస్సును ఏకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయడానికి అటవీ శాఖ చర్యలు చేపట్టింది. పర్యాటకుల కోసం బోటు షికారు, కాటేజీలు, అంతర్గత రహదారులు, టాయిలెట్లు వంటి సౌకర్యాల అభివృద్ధికి నిధులు కేటాయించినట్లు వరంగల్ డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్ తెలిపారు. ఈ పనులతో పాకాల సరస్సు పర్యాటక ఆకర్షణగా మారనుంది.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    6 hrs ago
  • వరంగల్ జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం పాకాల సరస్సును ఏకో టూరిజం హబ్‌గా అభివృద్ధి చేసేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రకృతి సోయగాలను కాపాడుతూ అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు వరంగల్ డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్ తెలిపారు. వరంగల్ అటవీశాఖ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పాకాల సరస్సులో బోటు షికారును మరింత విస్తరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అదనంగా పర్యాటకుల కోసం కాటేజీల నిర్మాణం, అంతర్గత రహదారుల అభివృద్ధి, శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ టాయిలెట్ల మరమ్మత్తులు చేపడుతున్నట్లు వివరించారు. పర్యావరణానికి హాని కలగకుండా, సహజ వనరులను సంరక్షిస్తూ ఏకో టూరిజం ప్రమాణాలకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. కుటుంబాలతో వచ్చే సందర్శకులకు సురక్షిత వాతావరణం కల్పించడం లక్ష్యంగా ప్రత్యేక భద్రతా చర్యలు కూడా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ అభివృద్ధి చర్యలతో పాకాల సరస్సు ప్రాంతానికి పర్యాటకుల రాక మరింత పెరిగే అవకాశముందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
    2
    వరంగల్ జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం పాకాల సరస్సును ఏకో టూరిజం హబ్‌గా అభివృద్ధి చేసేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రకృతి సోయగాలను కాపాడుతూ అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు వరంగల్ డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్ తెలిపారు.
వరంగల్ అటవీశాఖ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పాకాల సరస్సులో బోటు షికారును మరింత విస్తరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అదనంగా పర్యాటకుల కోసం కాటేజీల నిర్మాణం, అంతర్గత రహదారుల అభివృద్ధి, శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ టాయిలెట్ల మరమ్మత్తులు చేపడుతున్నట్లు వివరించారు.
పర్యావరణానికి హాని కలగకుండా, సహజ వనరులను సంరక్షిస్తూ ఏకో టూరిజం ప్రమాణాలకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. కుటుంబాలతో వచ్చే సందర్శకులకు సురక్షిత వాతావరణం కల్పించడం లక్ష్యంగా ప్రత్యేక భద్రతా చర్యలు కూడా అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ అభివృద్ధి చర్యలతో పాకాల సరస్సు ప్రాంతానికి పర్యాటకుల రాక మరింత పెరిగే అవకాశముందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    7 hrs ago
  • మహబూబాబాద్ జిల్లా:కొత్తగూడ మండలంలోని మొండ్రాయిగూడెం గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ బంగారి నరేష్, తన కుమారుడు లక్కీతో కలిసి​ గుండం రాజరాజేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో తండ్రీకొడుకులిద్దరూ కలిసి లయబద్ధంగా డ్యాన్స్ చేశారు. తండ్రీకొడుకులు ఇలా కలిసి డ్యాన్స్ చేయడం చూడటానికి ఎంతో కనువిందుగా ఉందని స్థానికులు ప్రశంసించారు. చిన్న వయసులోనే లక్కీ ప్రదర్శించిన ప్రతిభ అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ డ్యాన్స్‌కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
    1
    మహబూబాబాద్ జిల్లా:కొత్తగూడ మండలంలోని మొండ్రాయిగూడెం గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ బంగారి నరేష్, తన కుమారుడు లక్కీతో కలిసి​ గుండం రాజరాజేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో తండ్రీకొడుకులిద్దరూ కలిసి లయబద్ధంగా డ్యాన్స్ చేశారు.
తండ్రీకొడుకులు ఇలా కలిసి డ్యాన్స్ చేయడం చూడటానికి ఎంతో కనువిందుగా ఉందని స్థానికులు ప్రశంసించారు. చిన్న వయసులోనే లక్కీ ప్రదర్శించిన ప్రతిభ అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ డ్యాన్స్‌కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • ఎస్సారెస్పీ అధికారులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. చేసిన పనులకు కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లించడంలో జాప్యంపై జగిత్యాల జిల్లా మెట్ పల్లి కార్యాలయ ఆస్తులు జప్తుకు ఆదేశాలు జారీచేసింది. గాయత్రి ప్రాజెక్ట్ లిమిటెడ్ కంపెనీ వారు 2002 లో మెట్ పల్లి ప్రాంతంలో ఎస్సారెస్పీ కెనాల్ లో రెండు ప్యాకేజీల క్రింద పనులు చేపట్టారు. ఆ పనులకు సంబంధించి 51 కోట్ల బకాయి. చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ కోర్టును ఆశ్రయించారు. 2018 లో క్రింది కోర్టు డబ్బులు చెల్లించాలని ఆర్డర్ ఇచ్చింది. అయినా బకాయిలు చెల్లించలేదు. దీంతో కంపెనీ ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించడంతో 2021లో పూర్తిస్థాయిలో డబ్బులు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం రంగారెడ్డి కోర్టులో కేసు నడుస్తుంది. డబ్బులు చెల్లించాలని ఆర్డర్ వచ్చినప్పటికీ ఎస్సారెస్పీ అధికారులు బిల్లుల చెల్లింపులో జాప్యం చేయడంతో మరోసారి కాంట్రాక్ట్ కంపెనీ కోర్టును ఆశ్రయించడంతో మెట్ పల్లి ఎస్సారెస్పీ కార్యాలయ ఆస్తులు జప్తుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆర్డర్ తో కంపెనీ ప్రతినిధులు మెట్ పల్లి సివిల్ కోర్ట్ అధికారులు ఎస్సారెస్పీ కార్యాలయానికి చేరారు. బకాయిలు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉన్నాయని,వారంలో బకాయిలు చెల్లిస్తామని రాతపూర్వకంగా ఎస్సారెస్పీ అధికారులు స్పష్టం చేయడంతో కంపెనీ ప్రతినిధులు కోర్టు అధికారులు వెనుతిరిగారు.
    1
    ఎస్సారెస్పీ అధికారులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. చేసిన పనులకు కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లించడంలో జాప్యంపై జగిత్యాల జిల్లా మెట్ పల్లి కార్యాలయ ఆస్తులు జప్తుకు ఆదేశాలు జారీచేసింది. గాయత్రి ప్రాజెక్ట్ లిమిటెడ్ కంపెనీ వారు 2002 లో మెట్ పల్లి ప్రాంతంలో ఎస్సారెస్పీ కెనాల్ లో రెండు ప్యాకేజీల క్రింద పనులు చేపట్టారు. ఆ పనులకు సంబంధించి 51 కోట్ల బకాయి. 
చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ కోర్టును ఆశ్రయించారు. 2018 లో క్రింది కోర్టు డబ్బులు చెల్లించాలని ఆర్డర్ ఇచ్చింది. అయినా బకాయిలు చెల్లించలేదు. దీంతో కంపెనీ ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించడంతో 2021లో పూర్తిస్థాయిలో డబ్బులు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం రంగారెడ్డి కోర్టులో కేసు నడుస్తుంది. డబ్బులు చెల్లించాలని ఆర్డర్ వచ్చినప్పటికీ ఎస్సారెస్పీ అధికారులు బిల్లుల చెల్లింపులో  జాప్యం చేయడంతో మరోసారి కాంట్రాక్ట్ కంపెనీ కోర్టును ఆశ్రయించడంతో మెట్ పల్లి ఎస్సారెస్పీ కార్యాలయ ఆస్తులు జప్తుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆర్డర్ తో కంపెనీ ప్రతినిధులు మెట్ పల్లి సివిల్ కోర్ట్ అధికారులు ఎస్సారెస్పీ కార్యాలయానికి చేరారు. బకాయిలు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉన్నాయని,వారంలో బకాయిలు చెల్లిస్తామని రాతపూర్వకంగా ఎస్సారెస్పీ అధికారులు స్పష్టం చేయడంతో కంపెనీ ప్రతినిధులు కోర్టు అధికారులు వెనుతిరిగారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపల్ నూతన పాలకవర్గం ఈరోజు అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించింది. మున్సిపల్ కమిషనర్ టీ. మనోహర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఒకటో వార్డు సభ్యురాలు వడ్లూరి సరిత చైర్ పర్సన్‌గా, 14వ వార్డు సభ్యురాలు పెరుమాండ్ల మానస వైస్ చైర్ పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. నూతన కౌన్సిలర్లు కూడా తమ పదవులను స్వీకరించగా, మున్సిపల్ అధికారులు వారిని ఘనంగా సన్మానించారు. పట్టణ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తామని నూతన పాలకవర్గం హామీ ఇచ్చారు
    1
    కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపల్ నూతన పాలకవర్గం ఈరోజు అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించింది. మున్సిపల్ కమిషనర్ టీ. మనోహర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఒకటో వార్డు సభ్యురాలు వడ్లూరి సరిత చైర్ పర్సన్‌గా, 14వ వార్డు సభ్యురాలు పెరుమాండ్ల మానస వైస్ చైర్ పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. నూతన కౌన్సిలర్లు కూడా తమ పదవులను స్వీకరించగా, మున్సిపల్ అధికారులు వారిని ఘనంగా సన్మానించారు. పట్టణ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తామని నూతన పాలకవర్గం హామీ ఇచ్చారు
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • జనగామ జిల్లా చిల్పూర్ మండలం రాజావరం గ్రామంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని టి. రాజా సింగ్ ఆవిష్కరించారు. కార్యక్రమానికి హాజరైన రాజా సింగ్‌కు బీజేపీ కార్యకర్తలు, బజరంగ్ దళ్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. విగ్రహావిష్కరణ అనంతరం రాజా సింగ్‌కు ఖడ్గాన్ని బహుమతిగా అందించారు. ‘జై భవాని, జై శివాజీ, భారత్ మాతాకీ జై’ నినాదాలతో ప్రాంతం మార్మోగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజావరం బస్టాండ్ పరిసరాలు కాషాయ జెండాలతో కిటకిటలాడాయి.
    1
    జనగామ జిల్లా చిల్పూర్ మండలం రాజావరం గ్రామంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని టి. రాజా సింగ్ ఆవిష్కరించారు. కార్యక్రమానికి హాజరైన రాజా సింగ్‌కు బీజేపీ కార్యకర్తలు, బజరంగ్ దళ్ సభ్యులు ఘన స్వాగతం పలికారు.
విగ్రహావిష్కరణ అనంతరం రాజా సింగ్‌కు ఖడ్గాన్ని బహుమతిగా అందించారు. ‘జై భవాని, జై శివాజీ, భారత్ మాతాకీ జై’ నినాదాలతో ప్రాంతం మార్మోగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజావరం బస్టాండ్ పరిసరాలు కాషాయ జెండాలతో కిటకిటలాడాయి.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.