logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అసత్య ఆరోపణలు మానుకోవాలి: బిఆర్ఎస్ నేతల డిమాండ్ వరంగల్ :వర్ధన్నపేట పట్టణం కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలు మానుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రెండున్నరేళ్లుగా అధికారంలో ఉన్న మీరు, మా నాయకుడు 2 వేల ఎకరాల భూమి కబ్జా చేశాడని చెబితే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మండలానికో గెస్ట్ హౌస్ పేరుతో ఏర్పాటు చేసిన కార్యాలయాలు ప్రజా సేవ కోసం వినియోగిస్తున్నవేనని, సిఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కూడా అక్కడే జరిగిందని పేర్కొన్నారు. అక్రమ మార్గాల్లో పదవులు చేపట్టి మా నాయకులను విమర్శిస్తే కార్యకర్తలు ఊరుకోరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గోధుమలు మధుసూదన్, మండల అధ్యక్షుడు తూల్ల కుమారస్వామి, మాజీ జెడ్పిటిసి మార్గం బిక్షపతి, కౌన్సిలర్లు మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు.

1 hr ago
user_M D Azizuddin
M D Azizuddin
జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
1 hr ago

అసత్య ఆరోపణలు మానుకోవాలి: బిఆర్ఎస్ నేతల డిమాండ్ వరంగల్ :వర్ధన్నపేట పట్టణం కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలు మానుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రెండున్నరేళ్లుగా అధికారంలో ఉన్న మీరు, మా నాయకుడు 2 వేల ఎకరాల భూమి కబ్జా చేశాడని చెబితే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మండలానికో గెస్ట్ హౌస్ పేరుతో ఏర్పాటు చేసిన కార్యాలయాలు ప్రజా సేవ కోసం వినియోగిస్తున్నవేనని, సిఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కూడా అక్కడే జరిగిందని పేర్కొన్నారు. అక్రమ మార్గాల్లో పదవులు చేపట్టి మా నాయకులను విమర్శిస్తే కార్యకర్తలు ఊరుకోరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గోధుమలు మధుసూదన్, మండల అధ్యక్షుడు తూల్ల కుమారస్వామి, మాజీ జెడ్పిటిసి మార్గం బిక్షపతి, కౌన్సిలర్లు మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • కలెక్టరేట్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌.ఐ‌.ఆర్) మ్యాపింగ్‌పై జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సమీక్ష సమావేశం నిర్వహించారు. 2025 ఓటర్ జాబితాను 2002 ఎస్‌.ఐ‌.ఆర్‌తో మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రోజుకు కనీసం 50 మ్యాపింగ్‌లు పూర్తి చేసి, వారం రోజుల్లో ప్రక్రియ పూర్తిచేయాలని సూచించారు.
    1
    కలెక్టరేట్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌.ఐ‌.ఆర్) మ్యాపింగ్‌పై జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సమీక్ష సమావేశం నిర్వహించారు. 2025 ఓటర్ జాబితాను 2002 ఎస్‌.ఐ‌.ఆర్‌తో మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రోజుకు కనీసం 50 మ్యాపింగ్‌లు పూర్తి చేసి, వారం రోజుల్లో ప్రక్రియ పూర్తిచేయాలని సూచించారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    23 hrs ago
  • లక్కీ డ్రాలో తొర్రూరు మున్సిపల్ చైర్మన్ గా తునం శ్రావణ్ గెలవడంతో స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఎంపీ కడియం కావ్య ఆనందోత్సవానికి సంబందించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది తొర్రూరు చైర్మన్ పీఠాన్ని దక్కింఛుకునేందుకు ఇరు పార్టీలకు సమానం ఓట్లు రాగా ఎన్నికల అధికారులు లక్కీ డ్రా తీస్తున్న సమయంలో మున్సిపల్ కార్యాలయంలో నెలకొన్న ఉత్కంఠ క్షణాలు గెలిచిన ఆనందం లో ఎంపీ కడియం కావ్య ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కాంగ్రెస్ నేతల సంబరాలు ఈ వీడియోలో పార్టీ కార్యకర్తలను ఆకట్టుకుంది
    1
    లక్కీ డ్రాలో తొర్రూరు మున్సిపల్ చైర్మన్ గా తునం శ్రావణ్ గెలవడంతో స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఎంపీ కడియం కావ్య ఆనందోత్సవానికి సంబందించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది తొర్రూరు చైర్మన్ పీఠాన్ని దక్కింఛుకునేందుకు ఇరు పార్టీలకు సమానం ఓట్లు రాగా ఎన్నికల అధికారులు లక్కీ డ్రా తీస్తున్న సమయంలో మున్సిపల్ కార్యాలయంలో నెలకొన్న ఉత్కంఠ క్షణాలు గెలిచిన ఆనందం లో ఎంపీ కడియం కావ్య ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కాంగ్రెస్ నేతల సంబరాలు ఈ వీడియోలో పార్టీ కార్యకర్తలను ఆకట్టుకుంది
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • కరీంనగర్ జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తూ రంజాన్ ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం ఖైదీలకు ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ కోసం పండ్లు, డ్రైఫ్రూట్స్, నమాజ్ కోసం జానిమాజులు, టోపీలు, తస్బీహ్, సూరే యాసిన్, సూరే రహమాన్, ఖురాన్ మజీద్, సుర్మా, అత్తర్ లను పంపిణీ చేశారు. ఎంఐఎం కార్పొరేటర్లు, నాయకులు, ఖైదీల జిల్లా జైలు పర్యవేక్షడికి, జైలర్ కు సామాగ్రిని అందజేశారు. ఈసందర్భంగా గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ తమ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సూచనల మేరకు గత 28 సంవత్సరాలుగా ఎంఐఎం ఆధ్వర్యంలో ఖైదీలకు ఇఫ్తార్ సామాగ్రి, నమాజ్ ఆచరించడం కోసం సామాగ్రి, ఖురాన్ లను అందిస్తున్నామన్నారు. ఇదే కాకుండా రంజాన్ పర్వదినం ఈదుల్ ఫితర్ సందర్భంగా కుల మతాలకు అతీతంగా యావత్తు ఖైదీలకు, జైలు సిబ్బంది మొత్తం 500 మందికి చికెన్ బిర్యానీ, షీర్ ఖుర్మా సెమియాలను పంపిణీ చేస్తున్నామన్నారు. అసదుద్దీన్ ఒవైసీ, శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం పార్టీ అభివృద్ధి కోసం, నాయకుల కోసం పవిత్ర రంజాన్ మాసంలో ప్రత్యేక ప్రార్థనలు చేయాలని ఖైదీలకు, ముస్లిం సమాజానికి విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ ముస్లిం సమాజానికి పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రంజాన్ మాసంలో చెడును పారద్రోలి.. మంచిని ప్రసాదించాలని కోరారు.
    2
    కరీంనగర్ జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తూ రంజాన్ ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం ఖైదీలకు ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ కోసం పండ్లు, డ్రైఫ్రూట్స్, నమాజ్ కోసం జానిమాజులు, టోపీలు, తస్బీహ్, సూరే యాసిన్, సూరే రహమాన్, ఖురాన్ మజీద్, సుర్మా, అత్తర్ లను పంపిణీ చేశారు. ఎంఐఎం కార్పొరేటర్లు, నాయకులు, ఖైదీల  జిల్లా జైలు పర్యవేక్షడికి, జైలర్ కు సామాగ్రిని అందజేశారు. ఈసందర్భంగా గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ తమ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సూచనల మేరకు గత 28 సంవత్సరాలుగా ఎంఐఎం ఆధ్వర్యంలో ఖైదీలకు
ఇఫ్తార్ సామాగ్రి, నమాజ్ ఆచరించడం కోసం సామాగ్రి, ఖురాన్ లను అందిస్తున్నామన్నారు. ఇదే కాకుండా రంజాన్ పర్వదినం ఈదుల్ ఫితర్ సందర్భంగా కుల మతాలకు అతీతంగా యావత్తు ఖైదీలకు, జైలు సిబ్బంది మొత్తం 500 మందికి చికెన్ బిర్యానీ, షీర్ ఖుర్మా సెమియాలను పంపిణీ చేస్తున్నామన్నారు. అసదుద్దీన్ ఒవైసీ, శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం పార్టీ అభివృద్ధి కోసం, నాయకుల కోసం పవిత్ర రంజాన్ మాసంలో ప్రత్యేక ప్రార్థనలు చేయాలని ఖైదీలకు, ముస్లిం సమాజానికి విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ ముస్లిం సమాజానికి పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రంజాన్ మాసంలో చెడును పారద్రోలి.. మంచిని ప్రసాదించాలని కోరారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • ఈరోజు నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని,అనుముల గ్రామమును సోలార్ మోడల్ విలేజ్ ఎంపికైన సందర్భంగా సోలార్ విద్యుత్ పై అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన TGSPDCL-CMD గౌరవ శ్రీ ముషరఫ్ అలీ ఫరూక్ IAS మరియు నల్గొండ జిల్లా సబ్-కలెక్టర్ శ్రీ అమిత్ నారాయన్ IAS గారితో పాటు హాజరై అనుముల గ్రామానికి 41.63 కోట్ల రూపాయలతో సోలార్ మోడల్ విలేజ్ గా ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉందని తెలుపుతూ,సౌర విద్యుత్ వలన ఉన్న లాభాలను,కరెంటు వినియోగించుకునే పద్ధతులను రైతులకు మరియు ప్రజలకు సవివరంగా తెలియజేసిన స్థానిక శాసనసభ్యులు గౌరవ శ్రీ కుందూరు జయవీర్ రెడ్డి గారు
    1
    ఈరోజు నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని,అనుముల గ్రామమును సోలార్ మోడల్ విలేజ్  ఎంపికైన సందర్భంగా సోలార్ విద్యుత్ పై అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన TGSPDCL-CMD గౌరవ శ్రీ ముషరఫ్ అలీ ఫరూక్ IAS మరియు నల్గొండ జిల్లా సబ్-కలెక్టర్ శ్రీ అమిత్ నారాయన్ IAS గారితో పాటు హాజరై అనుముల గ్రామానికి 41.63 కోట్ల రూపాయలతో సోలార్ మోడల్ విలేజ్ గా ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉందని తెలుపుతూ,సౌర విద్యుత్ వలన ఉన్న లాభాలను,కరెంటు వినియోగించుకునే పద్ధతులను రైతులకు మరియు ప్రజలకు సవివరంగా తెలియజేసిన స్థానిక శాసనసభ్యులు గౌరవ శ్రీ కుందూరు జయవీర్ రెడ్డి గారు
    user_Journalist pk
    Journalist pk
    Journalist Nalgonda, Telangana•
    6 hrs ago
  • కరీంనగర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు మండలం దేవంపల్లి గ్రామానికి చెందిన వివాహిత పోలవేణి అనుష (25) కాకతీయ కెనాల్‌లో పడి మృతి చెందింది. ఇంటి వద్ద నుంచి బయటకు వెళ్లిన ఆమె కోసం గాలింపు చేపట్టగా రంగపేట శివారులో మృతదేహం లభ్యమైంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు.
    1
    కరీంనగర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు మండలం దేవంపల్లి గ్రామానికి చెందిన వివాహిత పోలవేణి అనుష (25) కాకతీయ కెనాల్‌లో పడి మృతి చెందింది. ఇంటి వద్ద నుంచి బయటకు వెళ్లిన ఆమె కోసం గాలింపు చేపట్టగా రంగపేట శివారులో మృతదేహం లభ్యమైంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    8 hrs ago
  • Post by Sk Noori
    4
    Post by Sk Noori
    user_Sk Noori
    Sk Noori
    Financial Analyst చిట్యాల, నల్గొండ, తెలంగాణ•
    14 hrs ago
  • వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా సర్పంచ్ జక్కి అనిత శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. శివాజీ చిత్రపటానికి నివాళులు అర్పించి వేణుగోపాలస్వామి ఆలయం నుంచి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జక్కి శ్రీకాంత్ మాట్లాడుతూ శివాజీ ఆశయాలను యువత అనుసరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
    1
    వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా సర్పంచ్ జక్కి అనిత శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. శివాజీ చిత్రపటానికి నివాళులు అర్పించి వేణుగోపాలస్వామి ఆలయం నుంచి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా జక్కి శ్రీకాంత్ మాట్లాడుతూ శివాజీ ఆశయాలను యువత అనుసరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    5 hrs ago
  • మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల అనంతారం, పెద్ద తండా, సిరోలు మండలంలోని తాళ్ల సంకీసా వసరం తండా మన్నెగూడెం మరియు కొత్త తండాలలో మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్, వరంగల్ ఎన్ఫోర్స్మెంట్, DTF- మహబూబాబాద్ & STF- హైదరాబాద్ టీంలు సంయుక్తంగా సారాయి స్థావరాలపై దాడులు నిర్వహించారు ఇట్టి దాడుల్లో (05) మంది ముద్దాయిలను అదుపులో కి తీసుకుని వారి పై కేసులు నమోదు చేసి, తదుపరి వారిని సంబంధిత తాహసిల్దార్ గారి ముందు బైండోవర్ చేసారు,ఈ దాడుల్లో (19) లీటర్ల సారాయి, (50) కిలోల బెల్లం,(30) కిలోల పటిక స్వాధీనం చేసుకుని (600)లీటర్ల సారాయి తయారీకి ఉపయోగించే బెల్లం పానకం ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.
    1
    మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల అనంతారం, పెద్ద తండా, సిరోలు మండలంలోని  తాళ్ల సంకీసా వసరం తండా మన్నెగూడెం మరియు కొత్త తండాలలో 
మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్, వరంగల్ ఎన్ఫోర్స్మెంట్, DTF- మహబూబాబాద్ & STF- హైదరాబాద్ టీంలు  సంయుక్తంగా సారాయి స్థావరాలపై దాడులు నిర్వహించారు 
ఇట్టి దాడుల్లో  (05) మంది ముద్దాయిలను అదుపులో కి తీసుకుని వారి పై 
కేసులు నమోదు చేసి, తదుపరి వారిని సంబంధిత తాహసిల్దార్ గారి ముందు బైండోవర్ చేసారు,ఈ దాడుల్లో 
(19) లీటర్ల సారాయి, (50) కిలోల బెల్లం,(30) కిలోల పటిక స్వాధీనం చేసుకుని
(600)లీటర్ల సారాయి తయారీకి ఉపయోగించే బెల్లం పానకం 
ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • రైతులు ఎరువుల కోసం పడే ఇబ్బందులను దూరం చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించిన ఫర్టిలైజర్ యాప్ సేవలను రైతులు వినియోగించుకోవాలని సిరిసిల్ల ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. తంగళ్ళపల్లిలోని గ్రోమోర్ ఎరువుల షాప్ ను ఇంచార్జి కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. యాప్ ద్వారా ఎందరు రైతులు ఎరువులు బుకింగ్ చేసుకున్నారు? ఎందరు తీసుకువెళ్లారో ఆరా తీసి.. రిజిస్టర్లు పరిశీలించారు. యాప్ ద్వారా ఎరువులు కొనుగోలు చేసిన రైతుల వివరాలను రిజిస్టర్లలో తనిఖీ చేశారు. షాప్ లో నిన్న రాత్రి స్టాక్ వివరాలు, ఈ రోజు ఉదయం స్టాక్ వివరాలు పరిశీలించారు. అలాగే గోడౌన్ లో ప్రస్తుతం ఉన్న ఎరువుల నిలువలను అక్కడ ఉన్న సిబ్బందితో లెక్కింపజేసి సరి చూసారు. అనంతరం ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లా డుతూ.. రాష్ట్ర వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఫర్టిలైజర్ యాప్ రైతులు డౌన్ లోడ్ చేసుకోవాలని, దాని ద్వారానే ఎరువులు బుకింగ్ చేసుకోవాలని స్పష్టం చేశారు. అన్ని ఫెర్టిలైజర్ షాప్ లు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద వద్ద రైతులకు సహాయం అందించేందుకు హెల్ప్ డెస్క్, ఒక సహాయకుడు ఉంటారని పేర్కొన్నారు. జిల్లాలోని రైతులందరూ యాప్ లో యూరియా బుక్ చేసుకుని తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు నిత్యం తమ పరిధిలోని అన్ని ఎరువుల షాపుల్లో తనిఖీ చేయాలని సూచించారు. యాప్ డౌన్ లోడ్, బుకింగ్ విషయంలో రైతులకు అందుబాటులో ఉండి.. సేవలు అందించాలని ఆదేశించారు. జిల్లాలో ఈనెల 1 వ తేదీ నుంచి ఈరోజు వరకు 92 వేల 735 సంచుల యూరియా వచ్చిందని, యాప్ ద్వారా జిల్లాలోని 84 వేల 68 మంది రైతులు ఎరువుల కోసం బుకింగ్ చేసుకున్నారని తెలిపారు. 79 వేల 948 మంది కొనుగోలు చేయగా, ఇంకా 11వేల 694 నిలువ ఉందని, 740 మంది రైతులు యూరియా కోసం బుకింగ్ చేసుకుని ఇంకా తీసుకువెళ్ల లేదని వివరించారు. జిల్లాలో ఎరువులకు కొరత లేదని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ స్పష్టం చేశారు.
    3
    రైతులు ఎరువుల కోసం పడే ఇబ్బందులను దూరం చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించిన ఫర్టిలైజర్ యాప్ సేవలను రైతులు వినియోగించుకోవాలని సిరిసిల్ల ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. తంగళ్ళపల్లిలోని గ్రోమోర్ ఎరువుల షాప్ ను ఇంచార్జి కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. యాప్ ద్వారా ఎందరు రైతులు ఎరువులు బుకింగ్ చేసుకున్నారు? ఎందరు తీసుకువెళ్లారో ఆరా తీసి.. రిజిస్టర్లు పరిశీలించారు. 
యాప్ ద్వారా ఎరువులు కొనుగోలు చేసిన రైతుల వివరాలను రిజిస్టర్లలో తనిఖీ చేశారు. షాప్ లో నిన్న రాత్రి స్టాక్ వివరాలు, ఈ రోజు ఉదయం స్టాక్ వివరాలు పరిశీలించారు. అలాగే గోడౌన్ లో ప్రస్తుతం ఉన్న ఎరువుల నిలువలను అక్కడ ఉన్న సిబ్బందితో లెక్కింపజేసి సరి చూసారు. అనంతరం ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లా డుతూ.. రాష్ట్ర వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఫర్టిలైజర్ యాప్ రైతులు డౌన్ లోడ్ చేసుకోవాలని, దాని ద్వారానే ఎరువులు బుకింగ్ చేసుకోవాలని స్పష్టం చేశారు. అన్ని ఫెర్టిలైజర్ షాప్ లు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద వద్ద రైతులకు సహాయం అందించేందుకు హెల్ప్ డెస్క్, ఒక సహాయకుడు ఉంటారని పేర్కొన్నారు. జిల్లాలోని రైతులందరూ యాప్ లో యూరియా బుక్ చేసుకుని తీసుకోవాలని సూచించారు.   వ్యవసాయ శాఖ అధికారులు నిత్యం తమ పరిధిలోని అన్ని ఎరువుల షాపుల్లో తనిఖీ చేయాలని సూచించారు. యాప్ డౌన్ లోడ్, బుకింగ్ విషయంలో రైతులకు అందుబాటులో ఉండి.. సేవలు అందించాలని ఆదేశించారు.
జిల్లాలో ఈనెల 1 వ తేదీ నుంచి ఈరోజు వరకు 92 వేల 735 సంచుల యూరియా వచ్చిందని, యాప్ ద్వారా జిల్లాలోని 84 వేల 68 మంది రైతులు ఎరువుల కోసం బుకింగ్ చేసుకున్నారని తెలిపారు. 
79 వేల 948 మంది కొనుగోలు చేయగా, ఇంకా 11వేల 694 నిలువ ఉందని, 740 మంది రైతులు యూరియా కోసం బుకింగ్ చేసుకుని ఇంకా తీసుకువెళ్ల లేదని వివరించారు. జిల్లాలో ఎరువులకు కొరత లేదని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ స్పష్టం చేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.