logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ దంపతులు జగిత్యాల జిల్లా సారంగాపూర్ ఫిబ్రవరి 14 : శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ దంపతులు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం సారంగాపూర్ మండలం పెంబట్ల కోనాపూర్ గ్రామంలో వెలసిన శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవానికి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ దంపతులు హాజరై పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు కలెక్టర్ దంపతులను ఆశీర్వదించి శాలువాతో ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ ఆధ్యాత్మిక శాంతి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మరియు శివపార్వతుల దివ్య ఆశీస్సులు జిల్లా ప్రజలందరికీ కలగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ, ఆలయ ఈవో అనూష ,ఎమ్మార్వో వహీద్, ఎంపీడీవో సలీం, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

on 14 February
user_Venu Gopal
Venu Gopal
Jagitial, Telangana•
on 14 February

శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ దంపతులు జగిత్యాల జిల్లా సారంగాపూర్ ఫిబ్రవరి 14 : శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ దంపతులు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం సారంగాపూర్ మండలం పెంబట్ల కోనాపూర్ గ్రామంలో వెలసిన శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవానికి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ దంపతులు హాజరై పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు కలెక్టర్ దంపతులను ఆశీర్వదించి శాలువాతో ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ ఆధ్యాత్మిక శాంతి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మరియు శివపార్వతుల దివ్య ఆశీస్సులు జిల్లా ప్రజలందరికీ కలగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ, ఆలయ ఈవో అనూష ,ఎమ్మార్వో వహీద్, ఎంపీడీవో సలీం, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం లో ఆలయ ఈవో ఎల్. రమాదేవి శుక్రవారం ఆలయాన్ని సందర్శించి పర్యవేక్షణ నిర్వహించారు. హాలిడేస్ సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులతో మాట్లాడి వారికి ఇంకా ఎలాంటి సౌకర్యాలు అవసరమో అడిగి తెలుసుకున్నారు. వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని చిన్నపిల్లలు ఎండలో ఎక్కువసేపు తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. అలాగే ఆలయంలో తాగునీరు, విశ్రాంతి ఏర్పాట్లు, క్యూలైన్ నిర్వహణ వంటి అంశాలను పరిశీలించి భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించాలని సంబంధిత సిబ్బందికి ఈవో సూచించా
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం లో ఆలయ ఈవో ఎల్. రమాదేవి శుక్రవారం ఆలయాన్ని సందర్శించి పర్యవేక్షణ నిర్వహించారు. హాలిడేస్ సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులతో మాట్లాడి వారికి ఇంకా ఎలాంటి సౌకర్యాలు అవసరమో అడిగి తెలుసుకున్నారు. వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని చిన్నపిల్లలు ఎండలో ఎక్కువసేపు తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.
అలాగే ఆలయంలో తాగునీరు, విశ్రాంతి ఏర్పాట్లు, క్యూలైన్ నిర్వహణ వంటి అంశాలను పరిశీలించి భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించాలని సంబంధిత సిబ్బందికి ఈవో సూచించా
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    9 hrs ago
  • Post by KR NEWS 369
    1
    Post by KR NEWS 369
    user_KR NEWS 369
    KR NEWS 369
    Reporter మామడ, నిర్మల్, తెలంగాణ•
    5 hrs ago
  • కరీంనగర్ జిల్లాలో కన్నతండ్రే కవల పిల్లల పట్ల కాలయముడులా మారాడు. ఆడపిల్లలనే అక్కసుతో భార్యతో గొడవ పడి ఇద్దరు కవల పిల్లలకు విషమిచ్చి బావిలో పడేశాడు. ఈ ఘటన కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జూబ్లీ నగర్ లో చోటు చేసుకుంది. ప్రైవేట్ ఉద్యోగం చేసే కచ్చు శ్రీశైలంకు కవల ఆడపిల్లలు జన్మించారు. వారికి గీతాన్ శ్రీ, గీతాన్విక నామకరణం చేశారు. ఇద్దరు ఆడబిడ్డలేనన్న కారణంతో తరుచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. బంధువులు జోక్యం చేసుకుని పలుమార్లు సర్దిచెప్పారు. ఇద్దరు ఆడబిడ్డలే పుట్టారన్న విషయంపై ఈరోజు ఉదయం కూడా భార్యతో గొడవ పడ్డాడు. బిడ్డలు ఇద్దరికీ గడ్డి మందు తాగించి బావిలో పడేశాడు. ఏమి ఎరగనట్లు స్థానికులతో కలిసి పిల్లల కోసం వెతికి బావిలో నుంచి వెలికి తీసే ప్రయత్నం చేశాడు. ఒక పాప మృతదేహం లభించగా మరొకరి కోసం స్థానికులు గాలిస్తున్నారు. చూడ ముచ్చటగా ఉన్న పసి పిల్లలను ప్రాణం తీసిన తండ్రి శ్రీశైలం పై స్థానికులు ఆగ్రహంతో దాడి చేశారు. పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. ఆడపిల్లలు అనే కోపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు భావిస్తున్నారు.
    4
    కరీంనగర్ జిల్లాలో కన్నతండ్రే కవల పిల్లల పట్ల కాలయముడులా మారాడు.  ఆడపిల్లలనే అక్కసుతో భార్యతో గొడవ పడి ఇద్దరు కవల పిల్లలకు విషమిచ్చి బావిలో పడేశాడు. ఈ ఘటన కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జూబ్లీ నగర్ లో చోటు చేసుకుంది. ప్రైవేట్ ఉద్యోగం చేసే కచ్చు శ్రీశైలంకు కవల ఆడపిల్లలు జన్మించారు. వారికి గీతాన్ శ్రీ, గీతాన్విక నామకరణం చేశారు. ఇద్దరు ఆడబిడ్డలేనన్న కారణంతో తరుచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. బంధువులు జోక్యం చేసుకుని పలుమార్లు సర్దిచెప్పారు. ఇద్దరు ఆడబిడ్డలే పుట్టారన్న విషయంపై ఈరోజు 
ఉదయం కూడా భార్యతో గొడవ పడ్డాడు. బిడ్డలు ఇద్దరికీ గడ్డి మందు తాగించి బావిలో పడేశాడు. ఏమి ఎరగనట్లు స్థానికులతో కలిసి పిల్లల కోసం వెతికి బావిలో నుంచి వెలికి తీసే ప్రయత్నం చేశాడు. ఒక పాప మృతదేహం లభించగా మరొకరి కోసం స్థానికులు గాలిస్తున్నారు. చూడ ముచ్చటగా ఉన్న పసి పిల్లలను ప్రాణం తీసిన తండ్రి శ్రీశైలం పై స్థానికులు ఆగ్రహంతో దాడి చేశారు. పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. ఆడపిల్లలు అనే కోపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు భావిస్తున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    11 hrs ago
  • కామారెడ్డి జిల్లా పిట్లం మండలం తిమ్మనగర్లో శుక్రవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. సర్పంచ్ ప్రవీణ్, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి మల్లయోధులు తరలివచ్చారు. హోరాహోరీగా సాగిన ఈ కుస్తీలు ప్రేక్షకులను అలరించాయి. గెలుపొందిన విజేతలకు సర్పంచ్ నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో AMC వైస్ ఛైర్మన్ కృష్ణారెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.
    1
    కామారెడ్డి జిల్లా పిట్లం మండలం తిమ్మనగర్లో శుక్రవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. సర్పంచ్ ప్రవీణ్, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి మల్లయోధులు తరలివచ్చారు. హోరాహోరీగా సాగిన ఈ కుస్తీలు ప్రేక్షకులను అలరించాయి. గెలుపొందిన విజేతలకు సర్పంచ్ నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో AMC వైస్ ఛైర్మన్ కృష్ణారెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    12 hrs ago
  • ఈ నెల 6వ తేదీన బాసర పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ *అనుముల రేవంత్ రెడ్డి *గారి పర్యటన ఏర్పాట్లను సమీక్షించేందుకు, రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు మరియు వివేక్ వెంకటస్వామి గారు నేడు బాసరకు విచ్చేశారు.ఈ సమీక్షా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ అభిలాష అభినవ్ గారు, బాసర సర్పంచ్ శ్రీ తీగల వెంకటేష్ గౌడ్ గారు మరియు EX MLA జి.విఠల్ రెడ్డి గారు EX సర్పంచ్ దయల లక్ష్మణ్ రావు గారు EX సర్పంచ్ కిర్గుల్ శ్రీ పెద్దకొండూరి సుధాకర్ రెడ్డి గారు ఉప సర్పంచ్ సయ్యద్ అలీ గారు బాసర గ్రామ టీమ్ విఠల్ రెడ్డి గారు కాంగ్రెస్ కార్యకర్తలు ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.ముఖ్యమంత్రి గారి పర్యటనకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రత మరియు ఇతర ఏర్పాట్లపై వారు క్షేత్రస్థాయిలో చర్చించారు.
    1
    ఈ నెల 6వ తేదీన బాసర పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ *అనుముల రేవంత్ రెడ్డి *గారి పర్యటన ఏర్పాట్లను సమీక్షించేందుకు, రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు మరియు వివేక్ వెంకటస్వామి గారు నేడు బాసరకు విచ్చేశారు.ఈ సమీక్షా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ అభిలాష అభినవ్ గారు, బాసర సర్పంచ్ శ్రీ తీగల వెంకటేష్ గౌడ్ గారు మరియు EX MLA జి.విఠల్ రెడ్డి గారు EX సర్పంచ్ దయల లక్ష్మణ్ రావు గారు EX సర్పంచ్ కిర్గుల్ శ్రీ పెద్దకొండూరి సుధాకర్ రెడ్డి గారు ఉప సర్పంచ్ సయ్యద్ అలీ గారు బాసర గ్రామ టీమ్ విఠల్ రెడ్డి గారు కాంగ్రెస్ కార్యకర్తలు  ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.ముఖ్యమంత్రి గారి పర్యటనకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రత మరియు ఇతర ఏర్పాట్లపై వారు క్షేత్రస్థాయిలో చర్చించారు.
    user_Anantoji Kalidas
    Anantoji Kalidas
    నిజామాబాద్ నార్త్, నిజామాబాద్, తెలంగాణ•
    9 hrs ago
  • *నేడు క్యాంపస్‌లోనే మంత్రి బస; అధికారులతో సమీక్ష* బాసర, ఏప్రిల్ 3: బాసర రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ట్రిపుల్ ఐటీ)లో జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం సందర్శించారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. భోజనానంతరం విద్యార్థులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి మాట్లాడారు. మీ కష్టసుఖాలు తెలుసుకునేందుకే నేను ఇక్కడికి వచ్చాను. విద్యాలయంలో మీకు ఎదురవుతున్న ఇబ్బందులేమిటి? బోధన సక్రమంగా జరుగుతోందా? మౌలిక సదుపాయాల పరిస్థితి ఎలా ఉంది? అని ఆరా తీశారు. క్యాంపస్ నెలకొన్న పరిస్థితులు, వాటిని చక్కదిద్దేందుకు ఇక్కడకు వచ్చానని, ఎవరూ భయపడకుండా నిర్భయంగా తమ సమస్యలను తెలియజేయాలని విద్యార్థులకు భరోసానిచ్చారు. క్యాంపస్‌లో నెలకొన్న పరిస్థితులపై మంత్రి జూపల్లి ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా తాగునీరు, హాస్టల్ గదుల నిర్వహణ, విద్యా ప్రమాణాల మెరుగుదలపై చర్చించారు. విద్యార్థుల సమస్యలను మరింత లోతుగా అధ్యయనం చేయడం, వారికి భరోసా కల్పించేందుకు చేసేందుకు మంత్రి ఈ రాత్రికి ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోనే బస చేయాలని నిర్ణయించుకున్నారు. మంత్రి రాకతో క్యాంపస్‌లో తమ సమస్యలు పరిష్కారమవుతాయని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
    1
    *నేడు క్యాంపస్‌లోనే మంత్రి బస; అధికారులతో సమీక్ష*
బాసర, ఏప్రిల్ 3: బాసర రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ట్రిపుల్ ఐటీ)లో జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం సందర్శించారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. 
భోజనానంతరం విద్యార్థులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి మాట్లాడారు.
మీ కష్టసుఖాలు తెలుసుకునేందుకే నేను ఇక్కడికి వచ్చాను. విద్యాలయంలో మీకు ఎదురవుతున్న ఇబ్బందులేమిటి? బోధన సక్రమంగా జరుగుతోందా? మౌలిక సదుపాయాల పరిస్థితి ఎలా ఉంది? అని ఆరా తీశారు. 
క్యాంపస్ నెలకొన్న పరిస్థితులు,  వాటిని చక్కదిద్దేందుకు ఇక్కడకు వచ్చానని,  ఎవరూ భయపడకుండా నిర్భయంగా తమ సమస్యలను తెలియజేయాలని విద్యార్థులకు భరోసానిచ్చారు.
క్యాంపస్‌లో నెలకొన్న పరిస్థితులపై మంత్రి జూపల్లి ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా తాగునీరు, హాస్టల్ గదుల నిర్వహణ, విద్యా ప్రమాణాల మెరుగుదలపై చర్చించారు. విద్యార్థుల సమస్యలను మరింత లోతుగా అధ్యయనం చేయడం, వారికి భరోసా కల్పించేందుకు చేసేందుకు మంత్రి ఈ రాత్రికి ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోనే బస చేయాలని నిర్ణయించుకున్నారు. మంత్రి రాకతో క్యాంపస్‌లో తమ సమస్యలు పరిష్కారమవుతాయని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    7 hrs ago
  • గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకొని మెదక్ సిఎస్ఐ చర్చ్ మహాదేవాలయంలో ప్రెస్ బీటర్ ఇంచార్జీ శాంతయ్య ఆధ్వర్యంలో మొదట సిలువ ఊరేగింపు తో ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభించారు. ఈ సందర్భంగా బిషప్ ఎమెరిటస్ ఆర్.టి. రెవ. టి.ఎస్. కనక ప్రసాద్ భక్తులకు దైవ సందేశాన్ని అందజేశారు. సకల మానవాళి రక్షణ కోసం యేసు సిలువ లో మరణించిన దినాన్ని గుడ్ ఫ్రైడే అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.
    1
    గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకొని మెదక్ సిఎస్ఐ చర్చ్ మహాదేవాలయంలో ప్రెస్ బీటర్ ఇంచార్జీ శాంతయ్య ఆధ్వర్యంలో మొదట సిలువ ఊరేగింపు తో ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభించారు.  ఈ సందర్భంగా బిషప్ ఎమెరిటస్ ఆర్.టి. రెవ. టి.ఎస్. కనక ప్రసాద్ భక్తులకు దైవ సందేశాన్ని అందజేశారు. సకల మానవాళి రక్షణ కోసం యేసు సిలువ లో మరణించిన దినాన్ని గుడ్ ఫ్రైడే అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.
    user_MERCY
    MERCY
    Local News Reporter మెదక్, మెదక్, తెలంగాణ•
    11 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం లో భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులు చెల్లించుకునే ఆనవాయితీ కొనసాగుతోంది.శుక్రవారం ఆలయంలో నిర్వహణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న సందర్భంగా ఆలయ ఈవో రమాదేవి ఒక కోడె నీరసంగా ఉన్నట్లు గమనించారు. వెంటనే స్పందించిన , ఆ కోడెను ఆలయంలో విశ్రాంతి కోసం ఏర్పాటు చేసిన గోశాలకు తరలించి వెటర్నరీ డాక్టర్‌ను పిలిపించి వైద్య పరీక్షలు నిర్వహింపజేశారు.డాక్టర్ కోడె ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి తగిన చికిత్స అందించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రమాదేవి ఆలయ సిబ్బందికి, వెటర్నరీ వైద్యులకు కోడెల సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచనలు చేశారు.భక్తులు మొక్కుల రూపంలో తీసుకువచ్చే కోడెల ఆరోగ్యం మరియు సంరక్షణపై ఆలయ యాజమాన్యం ఎల్లప్పుడూ జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు. భక్తుల విశ్వాసాన్ని గౌరవిస్తూ కోడెలకు తగిన ఆహారం, విశ్రాంతి మరియు వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారుఅలాగే ఆలయానికి తీసుకువచ్చే కోడెలు ఆరోగ్యంగా ఉండేలా భక్తులు ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆలయ అధికారులు సూచించారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం లో భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులు చెల్లించుకునే ఆనవాయితీ కొనసాగుతోంది.శుక్రవారం ఆలయంలో నిర్వహణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న సందర్భంగా ఆలయ ఈవో రమాదేవి ఒక కోడె నీరసంగా ఉన్నట్లు గమనించారు. వెంటనే స్పందించిన , ఆ కోడెను ఆలయంలో విశ్రాంతి కోసం ఏర్పాటు చేసిన గోశాలకు తరలించి వెటర్నరీ డాక్టర్‌ను పిలిపించి వైద్య పరీక్షలు నిర్వహింపజేశారు.డాక్టర్ కోడె ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి తగిన చికిత్స అందించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రమాదేవి ఆలయ సిబ్బందికి, వెటర్నరీ వైద్యులకు కోడెల సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచనలు చేశారు.భక్తులు మొక్కుల రూపంలో తీసుకువచ్చే కోడెల ఆరోగ్యం మరియు సంరక్షణపై ఆలయ యాజమాన్యం ఎల్లప్పుడూ జాగ్రత్తలు తీసుకుంటుందని  తెలిపారు. భక్తుల విశ్వాసాన్ని గౌరవిస్తూ కోడెలకు తగిన ఆహారం, విశ్రాంతి మరియు వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారుఅలాగే ఆలయానికి తీసుకువచ్చే కోడెలు ఆరోగ్యంగా ఉండేలా భక్తులు ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆలయ అధికారులు సూచించారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.