Shuru
Apke Nagar Ki App…
కంది మండల పరిధిలోని ఇంద్రకరణ్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో వన మహోత్సవం ఇంద్రకరణ్‌లో ఘనంగా వన మహోత్సవం కందం మండలం ఇంద్రకరణ్ ప్రభుత్వ పాఠశాలలో వన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, నాటిన మొక్కలను జాగ్రత్తగా సంరక్షించాలని ఉపాధ్యాయులు సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు శ్రీనివాస్ గౌడ్, సరిత, స్వరూప, శ్రీవాణి, రుచిత పాల్గొన్నారు.
SREEYAN
కంది మండల పరిధిలోని ఇంద్రకరణ్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో వన మహోత్సవం ఇంద్రకరణ్‌లో ఘనంగా వన మహోత్సవం కందం మండలం ఇంద్రకరణ్ ప్రభుత్వ పాఠశాలలో వన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, నాటిన మొక్కలను జాగ్రత్తగా సంరక్షించాలని ఉపాధ్యాయులు సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు శ్రీనివాస్ గౌడ్, సరిత, స్వరూప, శ్రీవాణి, రుచిత పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- రాఖీ పౌర్ణమి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మెదక్ రీజియన్ పరిధిలో 250 ప్రత్యేక బస్సులు రాఖీ పౌర్ణమి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మెదక్ రీజియన్ పరిధిలో 250 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం భాస్కర్ తెలిపారు. పండుగ రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచినట్లు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక సర్వీసుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు వెల్లడించారు. పండుగకు రెండు రోజుల ముందుగానే, బుధవారం నుంచి అదనపు ఛార్జీలు అమల్లోకి వస్తాయని తెలిపారు. అయితే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు కల్పిస్తున్న ఉచిత ప్రయాణ సదుపాయం యథావిధిగా కొనసాగుతుందని ఆర్ఎం స్పష్టం చేశారు.1
- ANS Comfort Mattresses Manufacturers in Hyderabad Call Now: 9912524242 Orthopedic Mattresses Mattresses Manufacturers company #Hyderabad sleep mattress manufacturers1
- బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మద్దతు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కార్యాలయం ఎదుట బ్రాహ్మణుల సమస్యల పరిష్కారం కోసం నిరాహార దీక్ష చేస్తున్న దేశపాండేకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. షామీర్‌పేట్ నివాసంలో దేశపాండేను కలిసిన ఈటల, బ్రాహ్మణ పరిషత్‌కు నిధులు, ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు అందించాలని కోరారు. పేద బ్రాహ్మణుల అభివృద్ధికి ప్రభుత్వం సానుకూలంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. దీక్ష పోస్టర్‌ను ఆవిష్కరించారు.1
- బోయినపల్లిలోని ప్రభుత్వ గిరిజన వాటర్ స్పోర్ట్స్ అకాడమీని సందర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి విజయవాడ భారతి జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సభ్యురాలు విజయభారతి సాయని మంగళవారం బోయినపల్లిలోని ప్రభుత్వ గిరిజన వాటర్ స్పోర్ట్స్ అకాడమీని సందర్శించి, అక్కడి విద్యార్థుల జీవన పరిస్థితులు, వసతి సదుపాయాలు, ఆహారం, విద్య, పారిశుధ్యం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా విజయభారతి సాయని విద్యార్థులతో నేరుగా మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి అవసరాలు, అందుతున్న సదుపాయాల గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి కూర్చొని వారి ఆహారం, చదువు, వసతి మరియు రోజువారీ జీవన పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు. NHRC బృందం పరిశీలన సందర్భంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ పీఆర్వో, గిరిజన సంక్షేమ శాఖ అధికారి, హాస్టల్ వెల్ఫేర్ అధికారి తదితర సంబంధిత ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు.1
- భూములను నిషేధిత జాబితాలో ఎవరు పెట్టమన్నారు: హరీష్ రావు ఎవడు ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టమని చెప్పాడు ఇన్ని లక్షల మంది నిద్ర లేని రాత్రులు గడపడానికి కారకుడైన వాడిని శిక్షించాలి ఈ భూములను రేపు నిషేధిత జాబితా నుండి తీసేసినా, మళ్లీ పెడతారేమో అని భయపడి కొనడానికి ఎవరైనా ముందుకు వస్తారా? ఇంతమందిని ఆగం చేయడానికి కారణమైనోడు ఎవడో తెలియాలి కదా అందుకే దీని మీద తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది * మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు1
- ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి యూరియా వచ్చిందని తెలిసి.. రైతుల పరుగులు చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి యూరియా చేరిందన్న సమాచారంతో రైతులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచే కేంద్రం వద్ద బారులు తీరిన రైతులు గంటల తరబడి క్యూలో నిలబడి ఎరువుల కోసం ఎదురుచూశారు. వరి నాట్లు వేసి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు యూరియా అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటకు కీలక సమయంలో ఎరువు కోసం ఇలా రోజుల తరబడి తిరగాల్సి రావడం ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. తమ అవసరాలకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.1
- హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఘోర బస్సు ప్రమాదం... ఐదుగురి మృతి హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్(ఫ్రెష్ బస్) బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ DCM ను వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. 20మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.1