logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మందమర్రి బీసీ గురుకుల బాలికలకు షీ టీమ్స్ అవగాహన కార్యక్రమం మందమర్రి, ఆగస్టు 1 ( జ్యోతి పవర్ ): మహిళలు, బాలికల భద్రతే లక్ష్యంగా మందమర్రి బీసీ గురుకుల బాలికలకు షీ టీమ్స్ అవగాహన కార్యక్రమం మందమర్రి, ఆగస్టు 1 ( జ్యోతి పవర్ ): మహిళలు, బాలికల భద్రతే లక్ష్యంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో షీ టీమ్స్ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాయి. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, మంచిర్యాల డీసీపీ భాస్కర్ పర్యవేక్షణలో, మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఎస్‌ఐ హైమ ఆధ్వర్యంలో మందమర్రిలోని **మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ గురుకుల పాఠశాల మరియు కళాశాల (బాలికలు)**లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా షీ టీమ్ సిబ్బంది విద్యార్థినులకు మహిళల భద్రత, ఈవ్‌టీజింగ్, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, ట్రాఫిక్ నియమాలు, టి-సేఫ్ యాప్ వినియోగం, షీ టీమ్స్ సేవలపై సమగ్ర అవగాహన కల్పించారు. ఎలాంటి వేధింపులు ఎదురైనా భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్-100, రామగుండం షీ టీమ్ వాట్సాప్ నంబర్ 6303923700, మంచిర్యాల జిల్లా షీ టీమ్ నంబర్ 8712659385కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ పటిష్ట చర్యలు తీసుకుంటోందని పేర్కొంటూ, ప్రతి మహిళ, బాలిక తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, ఎలాంటి వేధింపులనైనా ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ కానిస్టేబుళ్లు శ్రవణ్, శ్రీలత, పాఠశాల ప్రిన్సిపాల్ మంజుల, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

4 hrs ago
user_Thalapalli Ramesh
Thalapalli Ramesh
బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
4 hrs ago
0c1a1fc1-961a-42d3-b90a-1a5e2900d96b

మందమర్రి బీసీ గురుకుల బాలికలకు షీ టీమ్స్ అవగాహన కార్యక్రమం మందమర్రి, ఆగస్టు 1 ( జ్యోతి పవర్ ): మహిళలు, బాలికల భద్రతే లక్ష్యంగా మందమర్రి బీసీ గురుకుల బాలికలకు షీ టీమ్స్ అవగాహన కార్యక్రమం మందమర్రి, ఆగస్టు 1 ( జ్యోతి పవర్ ): మహిళలు, బాలికల భద్రతే లక్ష్యంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో షీ టీమ్స్ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాయి. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, మంచిర్యాల డీసీపీ భాస్కర్ పర్యవేక్షణలో, మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఎస్‌ఐ హైమ ఆధ్వర్యంలో మందమర్రిలోని **మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ గురుకుల పాఠశాల మరియు కళాశాల (బాలికలు)**లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా షీ టీమ్ సిబ్బంది విద్యార్థినులకు మహిళల భద్రత, ఈవ్‌టీజింగ్, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, ట్రాఫిక్ నియమాలు, టి-సేఫ్ యాప్ వినియోగం, షీ టీమ్స్ సేవలపై సమగ్ర అవగాహన కల్పించారు. ఎలాంటి వేధింపులు ఎదురైనా భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్-100, రామగుండం షీ టీమ్ వాట్సాప్ నంబర్ 6303923700, మంచిర్యాల జిల్లా షీ టీమ్ నంబర్ 8712659385కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ పటిష్ట చర్యలు తీసుకుంటోందని పేర్కొంటూ, ప్రతి మహిళ, బాలిక తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, ఎలాంటి వేధింపులనైనా ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ కానిస్టేబుళ్లు శ్రవణ్, శ్రీలత, పాఠశాల ప్రిన్సిపాల్ మంజుల, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • గోదావరి తల్లికి వాయనం సమర్పించిన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు లో వరద నీటిని పరిశీలించారు. అనంతరం గోదావరి తల్లికి వాయనం సమర్పించారు.
    1
    గోదావరి తల్లికి వాయనం సమర్పించిన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు లో వరద నీటిని పరిశీలించారు. అనంతరం గోదావరి తల్లికి వాయనం సమర్పించారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    46 min ago
  • లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు...... ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో పాలిచ్చే తల్లులకు ఉచితంగా ప్రోటీన్ పౌడర్, విటమిన్ బిళ్లలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి 35వ డివిజన్ కార్పొరేటర్ సదావేణి సుజాత శ్రీనివాస్ ముఖ్య అతిథిగా, డాక్టర్ విజయ రేకులపల్లి గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తల్లులకు 200 ప్రోటీన్ పౌడర్ బాక్సులు, రూ.50,000 విలువగల ఈఎస్‌వివై కంపెనీ విటమిన్ మాత్రలతో పాటు ప్లాస్టిక్ నివారణకు గుడ్డ సంచులను అందజేశారు. నవజాత శిశువుల సమగ్ర ఎదుగుదలకు, ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో శ్రేష్ఠమని, ప్రతి తల్లి పోషకాహారం తీసుకోవాలని వైద్యులు సూచించారు. సమాజ సేవలో లయన్స్ క్లబ్ కృషిని కార్పొరేటర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు మ్యాడం శివకాంత్, కార్యదర్శి బట్టు వినోద్, కోశాధికారి మేతుకు కృష్ణ చైతన్య, ఉదారంగా సహకరించిన గజవాడ రాధాకృష్ణ, గజవాడ ప్రభు, లయన్స్ క్లబ్ సభ్యులు మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
    3
    లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు......
ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో పాలిచ్చే తల్లులకు ఉచితంగా ప్రోటీన్ పౌడర్, విటమిన్ బిళ్లలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి 35వ డివిజన్ కార్పొరేటర్ సదావేణి సుజాత శ్రీనివాస్ ముఖ్య అతిథిగా, డాక్టర్ విజయ రేకులపల్లి గౌరవ అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా తల్లులకు 200 ప్రోటీన్ పౌడర్ బాక్సులు, రూ.50,000 విలువగల ఈఎస్‌వివై కంపెనీ విటమిన్ మాత్రలతో పాటు ప్లాస్టిక్ నివారణకు గుడ్డ సంచులను అందజేశారు. నవజాత శిశువుల సమగ్ర ఎదుగుదలకు, ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో శ్రేష్ఠమని, ప్రతి తల్లి పోషకాహారం తీసుకోవాలని వైద్యులు సూచించారు. సమాజ సేవలో లయన్స్ క్లబ్ కృషిని కార్పొరేటర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు మ్యాడం శివకాంత్, కార్యదర్శి బట్టు వినోద్, కోశాధికారి మేతుకు కృష్ణ చైతన్య, ఉదారంగా సహకరించిన గజవాడ రాధాకృష్ణ, గజవాడ ప్రభు, లయన్స్ క్లబ్ సభ్యులు మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    27 min ago
  • ఇల్లంతకుంట :వాణినికేతన్ హైస్కూల్లో ఘనంగా పోచమ్మ బోనాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం కేంద్రంలోని వాణి నికేతన్ హై స్కూల్లో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో పోచమ్మ చిత్రపటం వద్ద శనివారం పూజలు నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులు ధరించి వచ్చిన విద్యార్థినిలు పోచమ్మ బోనాలు ఎత్తుకున్నారు. డప్పు చప్పుళ్ళు, పోతరాజుల విన్యాసాల మధ్య బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం పోచమ్మ ఆలయానికి చేరుకొని నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బోనాల పండుగను పాఠశాలలో నిర్వహించడం గర్వకారణం అన్నారు. పిల్లలకు చదువుతోపాటు సాంప్రదాయాలు, ఆచారాలపై అవగాహన కల్పించాలని లక్ష్యంతో కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. బోనాల పండుగ ఐక్యమత్యానికి, సంస్కృతికి నిదర్శనం అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ తూముకుంట శ్రీనిధి, ఉపాధ్యాయనీలు సుమంగళి, శోభ, మహాలక్ష్మి, లావణ్య, సునంద, మౌనిక, కళ్యాణి, శమిమా, రేణుక, జలజ, శాంత, పద్మ, స్వాతి, రేణుక, సునీత, ఉష, ఉపాధ్యాయులు శ్రీనివాస్, రాజు, సంతోష్, రమేష్, రాజు, తిరుపతి లతోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.
    1
    ఇల్లంతకుంట :వాణినికేతన్ హైస్కూల్లో ఘనంగా పోచమ్మ బోనాలు.
 
రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం కేంద్రంలోని  వాణి నికేతన్  హై స్కూల్లో  పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో పోచమ్మ చిత్రపటం వద్ద శనివారం పూజలు నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులు ధరించి వచ్చిన  విద్యార్థినిలు పోచమ్మ బోనాలు ఎత్తుకున్నారు.
డప్పు చప్పుళ్ళు, పోతరాజుల విన్యాసాల మధ్య బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం పోచమ్మ ఆలయానికి చేరుకొని నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బోనాల పండుగను పాఠశాలలో  నిర్వహించడం గర్వకారణం అన్నారు. పిల్లలకు చదువుతోపాటు  సాంప్రదాయాలు, ఆచారాలపై  అవగాహన  కల్పించాలని  లక్ష్యంతో  కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. బోనాల పండుగ ఐక్యమత్యానికి, సంస్కృతికి నిదర్శనం అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ తూముకుంట శ్రీనిధి, ఉపాధ్యాయనీలు సుమంగళి, శోభ, మహాలక్ష్మి, లావణ్య, సునంద, మౌనిక, కళ్యాణి, శమిమా, రేణుక, జలజ, శాంత, పద్మ,  స్వాతి, రేణుక, సునీత, ఉష, ఉపాధ్యాయులు శ్రీనివాస్, రాజు, సంతోష్, రమేష్, రాజు, తిరుపతి లతోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.
    user_Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Interior designer Manakondur, Karimnagar•
    3 hrs ago
  • మురికి కాలువలు శుభ్రం చేయక దుర్వాసన.. దేవునిగూడలో వ్యాధుల భయం జన్నారం మండలం దేవునిగూడ గ్రామంలో గత కొద్ది రోజులుగా మురికి కాలువలను శుభ్రం చేయకపోవడంతో అవి గడ్డి, చెత్తాచెదారంతో పూర్తిగా నిండిపోయాయి. కాలువల్లో నీరు నిల్వ ఉండటంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు విపరీతంగా పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కాలువలను శుభ్రం చేసి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
    1
    మురికి కాలువలు శుభ్రం చేయక దుర్వాసన.. దేవునిగూడలో వ్యాధుల భయం
జన్నారం మండలం దేవునిగూడ గ్రామంలో గత కొద్ది రోజులుగా మురికి కాలువలను శుభ్రం చేయకపోవడంతో అవి గడ్డి, చెత్తాచెదారంతో పూర్తిగా నిండిపోయాయి. కాలువల్లో నీరు నిల్వ ఉండటంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు విపరీతంగా పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కాలువలను శుభ్రం చేసి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    9 hrs ago
  • కాగజ్‌నగర్ పట్టణంలోని ఎల్లగౌడ్ తోట ఏరియా ఆసుపత్రిలో ఉన్న డయాలసిస్ సెంటర్‌లో అదనంగా 5 డయాలసిస్ బెడ్లను సిర్పూర్ శాసనసభ్యుడు డా. పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్‌తో కలిసి ప్రారంభించారు. దీంతో సెంటర్‌లో మొత్తం బెడ్ల సంఖ్య 10కి పెరిగింది. అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించి, ఆరోగ్య శాఖ మంత్రి, కార్యదర్శిని ఒప్పించి ఈ బెడ్లు మంజూరు చేయించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. కౌటాల, బెజ్జూర్ మండలాల్లో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయని, ఆ రెండు ఆసుపత్రుల్లోనూ డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నూతన భవనాలు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది నియామకంతో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డా. అనివాష్, డాక్టర్లు హర్షవర్ధన్, అరుణ్ కుమార్, అరుణ పాల్గొన్నారు.
    2
    కాగజ్‌నగర్ పట్టణంలోని ఎల్లగౌడ్ తోట ఏరియా ఆసుపత్రిలో ఉన్న డయాలసిస్ సెంటర్‌లో అదనంగా 5 డయాలసిస్ బెడ్లను సిర్పూర్ శాసనసభ్యుడు డా. పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్‌తో కలిసి ప్రారంభించారు. దీంతో సెంటర్‌లో మొత్తం బెడ్ల సంఖ్య 10కి పెరిగింది.
అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించి, ఆరోగ్య శాఖ మంత్రి, కార్యదర్శిని ఒప్పించి ఈ బెడ్లు మంజూరు చేయించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. కౌటాల, బెజ్జూర్ మండలాల్లో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయని, ఆ రెండు ఆసుపత్రుల్లోనూ డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నూతన భవనాలు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది నియామకంతో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నట్టు తెలిపారు.
కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డా. అనివాష్, డాక్టర్లు హర్షవర్ధన్, అరుణ్ కుమార్, అరుణ పాల్గొన్నారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    12 hrs ago
  • ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి బిసి సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ వద్ద బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించి కలెక్టరేట్‌ను ముట్టడించాం. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అది మల్లేశం పటేల్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథాతథంగా అమలు చేయాలని, విద్యార్థులకు సంబంధించిన సుమారు రూ.8,000 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు పూర్తిచేసిన వేలాది మంది విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉద్యోగ అవకాశాలు వచ్చినా, విదేశీ ఉన్నత విద్యకు ఎంపికైనా, సర్టిఫికెట్లు లేక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరచూ జీవోలు జారీ చేస్తూ విద్యార్థుల్లో గందరగోళం సృష్టించడం సరైన విధానం కాదని, గత 18 సంవత్సరాలుగా అమలవుతున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం మోపే నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించి, ఫీజు బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం, బీసీ యువజన సంఘం నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి బిసి సంఘం ఆధ్వర్యంలో  కలెక్టరేట్ ముట్టడి
జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ వద్ద బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించి కలెక్టరేట్‌ను ముట్టడించాం.
ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అది మల్లేశం పటేల్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథాతథంగా అమలు చేయాలని, విద్యార్థులకు సంబంధించిన సుమారు రూ.8,000 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు పూర్తిచేసిన వేలాది మంది విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉద్యోగ అవకాశాలు వచ్చినా, విదేశీ ఉన్నత విద్యకు ఎంపికైనా, సర్టిఫికెట్లు లేక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తరచూ జీవోలు జారీ చేస్తూ విద్యార్థుల్లో గందరగోళం సృష్టించడం సరైన విధానం కాదని, గత 18 సంవత్సరాలుగా అమలవుతున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం మోపే నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించి, ఫీజు బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం, బీసీ యువజన సంఘం నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    22 hrs ago
  • అమాయకుడిపై దారుణ కుట్ర: గంజాయి కేసులో కానిస్టేబుల్ అరెస్ట్ సివిల్ తగాదాలో ప్రత్యర్థిని జైలుకు పంపేందుకు పగతో రగిలిపోయిన ఓ పోలీస్ కానిస్టేబుల్ తీరు కరీంనగర్‌లో తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం..ఈగల్ టీమ్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ మేడబోయిన నాగరాజు, తన మిత్రుడైన తోడేటి శ్రీనివాస్‌కు చెందిన భూ వివాదంలో జోక్యం చేసుకున్నాడు. ఎలాగైనా ప్రత్యర్థి శ్రీనివాస్‌రెడ్డిని క్రిమినల్ కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో వరంగల్ నుంచి గంజాయి తెప్పించి అతడి ఫెర్టిలైజర్ షాపులో పెట్టించాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదయ్యేలా చేశాడు. అయితే తెప్పించిన గంజాయిలో మిగిలిన 370 గ్రాములను నాగరాజు సీతారాంపూర్‌లోని తన ఇంట్లో దాచుకున్నాడు. పక్కా సమాచారంతో కొత్తపల్లి పోలీసులు దాడి చేసి,గంజాయితో పాటు 4 ఫోన్లను స్వాధీనం చేసుకుని కానిస్టేబుల్ నాగరాజును అరెస్ట్ చేసినట్లు ఏసిపి విజయ్ కుమార్ తెలిపారు.
    2
    అమాయకుడిపై దారుణ కుట్ర: గంజాయి కేసులో కానిస్టేబుల్ అరెస్ట్
సివిల్ తగాదాలో ప్రత్యర్థిని జైలుకు పంపేందుకు పగతో రగిలిపోయిన ఓ పోలీస్ కానిస్టేబుల్ తీరు కరీంనగర్‌లో తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం..ఈగల్ టీమ్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ మేడబోయిన నాగరాజు, తన మిత్రుడైన తోడేటి శ్రీనివాస్‌కు చెందిన భూ వివాదంలో జోక్యం చేసుకున్నాడు.
ఎలాగైనా ప్రత్యర్థి శ్రీనివాస్‌రెడ్డిని క్రిమినల్ కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో వరంగల్ నుంచి గంజాయి తెప్పించి అతడి ఫెర్టిలైజర్ షాపులో పెట్టించాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదయ్యేలా చేశాడు. అయితే తెప్పించిన గంజాయిలో మిగిలిన 370 గ్రాములను నాగరాజు సీతారాంపూర్‌లోని తన ఇంట్లో దాచుకున్నాడు. పక్కా సమాచారంతో కొత్తపల్లి పోలీసులు దాడి చేసి,గంజాయితో పాటు 4 ఫోన్లను స్వాధీనం చేసుకుని కానిస్టేబుల్ నాగరాజును అరెస్ట్ చేసినట్లు ఏసిపి విజయ్ కుమార్ తెలిపారు.
    user_P S REDDY
    P S REDDY
    Food Processing Company కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    23 hrs ago
  • ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో వరద నీరు., 5గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేసిన ప్రాజెక్టు అధికారులు అంతర్గం మండలం లోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 5 గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు.
    1
    ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో వరద నీరు., 5గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేసిన ప్రాజెక్టు అధికారులు
అంతర్గం మండలం లోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 5 గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    51 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.