Shuru
Apke Nagar Ki App…
భారీ వర్షాల హెచ్చరిక: కన్నెపల్లిలో టాంటాం ప్రచారం.......... కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం కన్నెపల్లి గ్రామంలో టాంటాం ద్వారా ప్రజలకు అప్రమత్తత సూచనలు అందించారు. రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఈ ప్రచారం చేపట్టారు. అత్యవసర పరిస్థితి తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. చిన్నపిల్లలు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, వాగులు, కాలువలు, చెరువులు, విద్యుత్ స్తంభాలు, చెట్లకు దూరంగా ఉండాలని కోరారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా వెంటనే గ్రామపంచాయతీ అధికారులకు సమాచారం ఇవ్వాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Krishna
భారీ వర్షాల హెచ్చరిక: కన్నెపల్లిలో టాంటాం ప్రచారం.......... కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం కన్నెపల్లి గ్రామంలో టాంటాం ద్వారా ప్రజలకు అప్రమత్తత సూచనలు అందించారు. రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఈ ప్రచారం చేపట్టారు. అత్యవసర పరిస్థితి తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. చిన్నపిల్లలు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, వాగులు, కాలువలు, చెరువులు, విద్యుత్ స్తంభాలు, చెట్లకు దూరంగా ఉండాలని కోరారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా వెంటనే గ్రామపంచాయతీ అధికారులకు సమాచారం ఇవ్వాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
More news from తెలంగాణ and nearby areas
- చెరువుల కబ్జాలే జన్నారం వరదలకు కారణమా? గ్రామాల్లోనూ హైడ్రా తరహా చర్యలపై చర్చ జన్నారం మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి వర్షాలతో పలు గ్రామాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం చెరువులు, కాలువలు, సహజ నీటి మార్గాలపై జరిగిన ఆక్రమణలేనని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. గతంలో వర్షపు నీరు చెరువులు, వాగులు, కాలువల ద్వారా సాఫీగా వెళ్లేదని, అయితే క్రమంగా చెరువుల పరిధిలో నిర్మాణాలు, ఆక్రమణలు పెరగడంతో నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడ్డాయని గ్రామస్థులు చెబుతున్నారు. దీంతో భారీ వర్షాలు కురిసిన ప్రతిసారీ నీరు బయటకు వెళ్లే మార్గం లేక నేరుగా కాలనీలు, ఇళ్లలోకి చేరుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో అమలు చేస్తున్న హైడ్రా తరహా చర్యలు గ్రామీణ ప్రాంతాల్లోనూ చేపట్టాలని జన్నారం మండల ప్రజలు కోరుతున్నారు. చెరువుల పూర్తి సర్వే నిర్వహించి ఆక్రమణలను తొలగిస్తేనే భవిష్యత్తులో ఇలాంటి వరద సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే చెరువుల ఆక్రమణలే ప్రస్తుత వరద పరిస్థితులకు ఏకైక కారణమా అనే అంశంపై అధికారుల నుంచి అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది. గ్రామాల్లో నీటి పారుదల మార్గాల పరిరక్షణ, ఆక్రమణల నివారణపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.3
- జగిత్యాల పట్టణంలోని యావర్ రోడ్డులో శ్రీనివాస టాకీస్ ఎదుట ఉన్న మొబైల్ టిఫిన్ సెంటర్లలో కొనుగోలు చేసిన వడలో బొద్దింక కనిపించిందని ఓ వ్యక్తి ఆరోపించారు. బుధవారం రాత్రి పిల్లల కోసం ఇడ్లీ, వడ పార్సిల్ తీసుకెళ్లి ఇంట్లో విప్పి చూడగా వడలో బొద్దింక ఉన్నట్లు గుర్తించానన్నారు.1
- ఎల్లంపల్లి ప్రాజెక్టు లో పెరిగిన వరద నీరు., అప్రమత్తంగా ఉండాలన్న ప్రాజెక్టు అధికారులు అతిభారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం (ఇన్‌ఫ్లో) గణనీయంగా పెరిగే అవకాశం ఉందనీ ఎల్లంపల్లి ప్రాజెక్టు అధికారి రవీంద్ర చారి పేర్కొన్నారు.1
- కుష్ణపల్లి ఒర్రె వరద ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే హరీష్ బాబు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం కుష్ణపల్లి శివారులో ఉధృతంగా ప్రవహిస్తున్న ఒర్రె వరద ప్రాంతాన్ని సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు పరిశీలించారు. వరదల కారణంగా కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో పరిస్థితిని అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అనుమతులు లేకపోవడంతో బెజ్జూర్ మండలంలోని కొన్ని గ్రామాలకు శాశ్వత రవాణా సౌకర్యాలు కల్పించడంలో జాప్యం జరుగుతోందని తెలిపారు. ఈ అంశాన్ని రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అవసరమైన అటవీ అనుమతులు సాధించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మార్వో, ఎంపీడీవో, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.1
- లక్షెట్టిపేట పట్టణంలో పెను ప్రభావం చూపించిన భారీ వర్షాలు లక్షెట్టిపేట పట్టణంలో కురిసిన భారీ వర్షాలు పెను ప్రభావాన్ని చూపించాయి. భారీ వర్షాలకు పట్టణంలోని ప్రధాన రహదారులపై వరద నీరు ప్రవహిస్తోంది. పట్టణంలోని బస్టాండ్ నుండి స్థానిక ఐబీ, అంగన్ బజార్ మీదుగా అంగడి బజార్ వరకు వరద నీరు ప్రవహించింది. ఇక్కడే రోడ్డు విస్తరణ ఏర్పాట్లు జరుగుతుండడంతో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఊట్కూర్ చౌరస్తా నుండి రైస్ మిల్క్ వెళ్లే దారిలో వరద నీరు భారీగా నిలిచిపోయింది1