logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కుష్ణపల్లి ఒర్రె వరద ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే హరీష్ బాబు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం కుష్ణపల్లి శివారులో ఉధృతంగా ప్రవహిస్తున్న ఒర్రె వరద ప్రాంతాన్ని సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు పరిశీలించారు. వరదల కారణంగా కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో పరిస్థితిని అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అనుమతులు లేకపోవడంతో బెజ్జూర్ మండలంలోని కొన్ని గ్రామాలకు శాశ్వత రవాణా సౌకర్యాలు కల్పించడంలో జాప్యం జరుగుతోందని తెలిపారు. ఈ అంశాన్ని రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అవసరమైన అటవీ అనుమతులు సాధించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మార్వో, ఎంపీడీవో, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

9 hrs ago
user_Krishna
Krishna
ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
9 hrs ago

కుష్ణపల్లి ఒర్రె వరద ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే హరీష్ బాబు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం కుష్ణపల్లి శివారులో ఉధృతంగా ప్రవహిస్తున్న ఒర్రె వరద ప్రాంతాన్ని సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు పరిశీలించారు. వరదల కారణంగా కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో పరిస్థితిని అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అనుమతులు లేకపోవడంతో బెజ్జూర్ మండలంలోని కొన్ని గ్రామాలకు శాశ్వత రవాణా సౌకర్యాలు కల్పించడంలో జాప్యం జరుగుతోందని తెలిపారు. ఈ అంశాన్ని రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అవసరమైన అటవీ అనుమతులు సాధించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మార్వో, ఎంపీడీవో, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • భారీ వర్షాల హెచ్చరిక: కన్నెపల్లిలో టాంటాం ప్రచారం.......... కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం కన్నెపల్లి గ్రామంలో టాంటాం ద్వారా ప్రజలకు అప్రమత్తత సూచనలు అందించారు. రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఈ ప్రచారం చేపట్టారు. అత్యవసర పరిస్థితి తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. చిన్నపిల్లలు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, వాగులు, కాలువలు, చెరువులు, విద్యుత్ స్తంభాలు, చెట్లకు దూరంగా ఉండాలని కోరారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా వెంటనే గ్రామపంచాయతీ అధికారులకు సమాచారం ఇవ్వాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
    1
    భారీ వర్షాల హెచ్చరిక: కన్నెపల్లిలో టాంటాం ప్రచారం..........
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం కన్నెపల్లి గ్రామంలో టాంటాం ద్వారా ప్రజలకు అప్రమత్తత సూచనలు అందించారు. రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఈ ప్రచారం చేపట్టారు.
అత్యవసర పరిస్థితి తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. చిన్నపిల్లలు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, వాగులు, కాలువలు, చెరువులు, విద్యుత్ స్తంభాలు, చెట్లకు దూరంగా ఉండాలని కోరారు.
ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా వెంటనే గ్రామపంచాయతీ అధికారులకు సమాచారం ఇవ్వాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    7 hrs ago
  • భారీ వర్షాల నేపథ్యంలో రాంనగర్ బ్రిడ్జిని పరిశీలించిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా* *ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... ప్రమాదాల నివారణకు అన్ని శాఖల సమన్వయంతో చర్యలు* రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, మంచిర్యాల జోన్ బెల్లంపల్లి పట్టణంలోని 27వ,33వ వార్డుల మధ్య ఉన్న రాంనగర్ బ్రిడ్జిపై వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితిని గురువారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహం, భద్రతా ఏర్పాట్లు, ప్రజల రాకపోకల పరిస్థితిని సమీక్షించి, పోలీసు,రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు అవసరమైన సూచనలు చేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ,భారీ వర్షాల కారణంగా ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు,కాలువలు, బ్రిడ్జిలను ఎట్టి పరిస్థితుల్లోనూ దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు. అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు,బ్యారికేడ్లను గౌరవిస్తూ పోలీసు, రెవెన్యూ,మున్సిపల్ అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని, చిన్నారులను నీటి ప్రవాహాల వద్దకు వెళ్లనివ్వకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.ఈ పరిశీలనలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్, మున్సిపల్ చైర్‌పర్సన్, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్,27వ, 33వ వార్డుల కౌన్సిలర్లు,బెల్లంపల్లి వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు, బెల్లంపల్లి రూరల్ సీఐ హనుక్,ఇతర ఎస్‌ఐలు,పోలీసు సిబ్బంది,మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
    3
    భారీ వర్షాల నేపథ్యంలో రాంనగర్ బ్రిడ్జిని పరిశీలించిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా*
*ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... ప్రమాదాల నివారణకు అన్ని శాఖల సమన్వయంతో చర్యలు*
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, మంచిర్యాల జోన్ బెల్లంపల్లి పట్టణంలోని 27వ,33వ వార్డుల మధ్య ఉన్న రాంనగర్ బ్రిడ్జిపై వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితిని గురువారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహం, భద్రతా ఏర్పాట్లు, ప్రజల రాకపోకల పరిస్థితిని సమీక్షించి, పోలీసు,రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు అవసరమైన సూచనలు చేశారు.
అనంతరం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ,భారీ వర్షాల కారణంగా ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు,కాలువలు, బ్రిడ్జిలను ఎట్టి పరిస్థితుల్లోనూ దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు. అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు,బ్యారికేడ్లను గౌరవిస్తూ పోలీసు, రెవెన్యూ,మున్సిపల్ అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని, చిన్నారులను నీటి ప్రవాహాల వద్దకు వెళ్లనివ్వకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.ఈ పరిశీలనలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్, మున్సిపల్ చైర్‌పర్సన్, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్,27వ, 33వ వార్డుల కౌన్సిలర్లు,బెల్లంపల్లి వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు, బెల్లంపల్లి రూరల్ సీఐ హనుక్,ఇతర ఎస్‌ఐలు,పోలీసు సిబ్బంది,మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
    user_పవన్ చారి
    పవన్ చారి
    బెల్లంపల్లి, మంచిర్యాల, తెలంగాణ•
    11 hrs ago
  • రాత్రి 7.30 నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గేట్ల ఎత్తివేత.. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కడెం ప్రాజెక్టు నుంచి వరద నీటి విడుదలతో పాటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 7.30 గంటల నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తి సుమారు లక్ష క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని ఇరిగేషన్ విభాగం తెలిపింది. దీంతో గోదావరి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చేపల వేట, పశువుల మేపు, వ్యవసాయ పనుల కోసం ఎవరూ నది పరివాహక ప్రాంతాల్లోకి వెళ్లరాదని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, పోలీసు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రజలకు ముందస్తు హెచ్చరికలు అందించాలని కోరారు.
    1
    రాత్రి 7.30 నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గేట్ల ఎత్తివేత.. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కడెం ప్రాజెక్టు నుంచి వరద నీటి విడుదలతో పాటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 7.30 గంటల నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తి సుమారు లక్ష క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని ఇరిగేషన్ విభాగం తెలిపింది. దీంతో గోదావరి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చేపల వేట, పశువుల మేపు, వ్యవసాయ పనుల కోసం ఎవరూ నది పరివాహక ప్రాంతాల్లోకి వెళ్లరాదని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, పోలీసు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రజలకు ముందస్తు హెచ్చరికలు అందించాలని కోరారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    8 hrs ago
  • కడెం ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తివేత:గోదావరి తీర ప్రాంత ప్రజలకు హెచ్చరిక! ​జన్నారం: కడెం ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో గోదావరి నదికి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని తహసీల్దార్ బక్కయ్య హెచ్చరించారు. మండలంలోని కలమడుగు, ధర్మారం, బాదంపెల్లి, చింతగూడ, రోటిగూడ, తపాల్పూర్ గ్రామాల ప్రజలు, మత్స్యకారులు, పశువుల కాపరులు ఎవరూ గోదావరి తీరం వైపు వెళ్లకూడదని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
    1
    కడెం ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తివేత:గోదావరి తీర ప్రాంత ప్రజలకు హెచ్చరిక!  
​జన్నారం: కడెం ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో గోదావరి నదికి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని తహసీల్దార్ బక్కయ్య హెచ్చరించారు. మండలంలోని కలమడుగు, ధర్మారం, బాదంపెల్లి, చింతగూడ, రోటిగూడ, తపాల్పూర్ గ్రామాల ప్రజలు, మత్స్యకారులు, పశువుల కాపరులు ఎవరూ గోదావరి తీరం వైపు వెళ్లకూడదని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
    user_Naveen journalist
    Naveen journalist
    Local News Reporter Jannaram, Mancherial•
    14 hrs ago
  • యువతకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం – పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలతో కలిసి నిరసనలో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ* *యువతకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం – పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలతో కలిసి నిరసనలో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ* *న్యూఢిల్లీ:* దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలకు నిరసనగా పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేపట్టిన ఆందోళనలో పెద్దపల్లి ఎంపీ *గడ్డం వంశీకృష్ణ* పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, యువత హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పరీక్షలు పారదర్శకంగా, ఎలాంటి పేపర్ లీకేజీలు లేకుండా నిర్వహించాలని యువత చేస్తున్న న్యాయమైన డిమాండ్‌కు కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇస్తోందని పేర్కొన్నారు. *పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కోట్లాది ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి యువతను నిరాశపరిచిందని విమర్శించారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగులు, పేపర్ లీకేజీల బాధితులు న్యాయం కోసం పోరాడుతుంటే, కాంగ్రెస్ పార్టీ వారి తరఫున పార్లమెంట్‌లో గొంతెత్తుతోందని అన్నారు.* అదేవిధంగా, తెలంగాణలో విద్యార్థుల సమస్యలపై రాజకీయాలు చేయకుండా వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
    1
    యువతకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం – పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలతో కలిసి నిరసనలో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ*
*యువతకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం – పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలతో కలిసి నిరసనలో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ*
*న్యూఢిల్లీ:*
దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలకు నిరసనగా పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేపట్టిన ఆందోళనలో పెద్దపల్లి ఎంపీ *గడ్డం వంశీకృష్ణ* పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, యువత హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పరీక్షలు పారదర్శకంగా, ఎలాంటి పేపర్ లీకేజీలు లేకుండా నిర్వహించాలని యువత చేస్తున్న న్యాయమైన డిమాండ్‌కు కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇస్తోందని పేర్కొన్నారు.
*పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కోట్లాది ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి యువతను నిరాశపరిచిందని విమర్శించారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగులు, పేపర్ లీకేజీల బాధితులు న్యాయం కోసం పోరాడుతుంటే, కాంగ్రెస్ పార్టీ వారి తరఫున పార్లమెంట్‌లో గొంతెత్తుతోందని అన్నారు.*
అదేవిధంగా, తెలంగాణలో విద్యార్థుల సమస్యలపై రాజకీయాలు చేయకుండా వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    9 hrs ago
  • భారీ వర్షాల నేపథ్యంలో విధి నిర్వహణలో మున్సిపల్ కార్మికులు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఎవరు బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నప్పటికీ మున్సిపల్ కార్మికులకు మాత్రం విధులు తప్పడం లేదు. కాగా గురువారం బెల్లంపల్లి బజార్ ఏరియాలో మున్సిపల్ చెత్త సేకరించే వాహనంలో డీజిల్ అయిపోవడంతో మున్సిపల్ సిబ్బంది కాసేపు ఇబ్బందిపడ్డారు. వర్షంలో తడుస్తూ వెళ్లి డీజిల్ తీసుకొచ్చి వాహనం ప్రారంభించి యధావిధిగా చెత్త సేకరణ ప్రారంభించడంతో విధుల పట్ల వారి నిబద్దత చూసి స్థానికులు గమనించి వారిని అభినందించారు.
    1
    భారీ వర్షాల నేపథ్యంలో విధి నిర్వహణలో మున్సిపల్ కార్మికులు 
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఎవరు బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నప్పటికీ మున్సిపల్ కార్మికులకు మాత్రం విధులు తప్పడం లేదు. కాగా గురువారం బెల్లంపల్లి బజార్ ఏరియాలో మున్సిపల్ చెత్త సేకరించే వాహనంలో డీజిల్ అయిపోవడంతో మున్సిపల్ సిబ్బంది కాసేపు ఇబ్బందిపడ్డారు. వర్షంలో తడుస్తూ వెళ్లి డీజిల్ తీసుకొచ్చి వాహనం ప్రారంభించి యధావిధిగా చెత్త సేకరణ ప్రారంభించడంతో విధుల పట్ల వారి నిబద్దత చూసి స్థానికులు గమనించి వారిని అభినందించారు.
    user_Bellampalli news
    Bellampalli news
    Local News Reporter బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    14 hrs ago
  • భారీ వర్షాలు.. వరద ప్రాంతాల్లో ఎస్పీ నితికా పంత్ పర్యటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా ఎస్పీ నితికా పంత్ క్షేత్రస్థాయిలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. కాగజ్‌నగర్ పెద్దవాగు, దహెగాం, పెంచికల్‌పేట్ మండలాల్లోని ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంతెనలను సందర్శించి పోలీసు అధికారులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలకు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. లైఫ్ జాకెట్లు, లైఫ్ బాయ్స్, రోపులు అందుబాటులో ఉంచి రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రమాదకర వాగులు, వంతెనల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 100/112 లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
    1
    భారీ వర్షాలు..

 వరద ప్రాంతాల్లో ఎస్పీ నితికా పంత్ పర్యటన
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా ఎస్పీ నితికా పంత్ క్షేత్రస్థాయిలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. కాగజ్‌నగర్ పెద్దవాగు, దహెగాం, పెంచికల్‌పేట్ మండలాల్లోని ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంతెనలను సందర్శించి పోలీసు అధికారులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలకు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.
లైఫ్ జాకెట్లు, లైఫ్ బాయ్స్, రోపులు అందుబాటులో ఉంచి రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రమాదకర వాగులు, వంతెనల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 100/112 లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    8 hrs ago
  • వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది, తరలి వచ్చిన ప్రజలు ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న భారీ వరద నీటితో గోదావరి నది ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టుతో పాటు వాగులు, వంకల నుండి భారీగా వరదనీరు గోదావరి నదిలో చేరుతుంది. దీంతో గురువారం సాయంత్రం జన్నారం మండలంలోని కలమడుగు, ధర్మారం, బాదంపల్లి, చింతగూడ, రాంపూర్, దండేపల్లి మండలంలోని గుడిరేవు, ద్వారక, గూడెం ప్రాంతాలలో గోదావరి నది రెండు ఒడ్డులను తాకుతూ వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి నది వైపు ప్రజలు, పశుకాపరులు వెళ్ళవద్దని జన్నారం దండేపల్లి మండలాల అధికారులు సూచించారు.
    1
    వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది, తరలి వచ్చిన ప్రజలు
ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న భారీ వరద నీటితో గోదావరి నది ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టుతో పాటు వాగులు, వంకల నుండి భారీగా వరదనీరు గోదావరి నదిలో చేరుతుంది. దీంతో గురువారం సాయంత్రం జన్నారం మండలంలోని కలమడుగు, ధర్మారం, బాదంపల్లి, చింతగూడ, రాంపూర్, దండేపల్లి మండలంలోని గుడిరేవు, ద్వారక, గూడెం ప్రాంతాలలో గోదావరి నది రెండు ఒడ్డులను తాకుతూ వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి నది వైపు ప్రజలు, పశుకాపరులు వెళ్ళవద్దని జన్నారం దండేపల్లి మండలాల అధికారులు సూచించారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.