భారీ వర్షాల నేపథ్యంలో రాంనగర్ బ్రిడ్జిని పరిశీలించిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా* *ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... ప్రమాదాల నివారణకు అన్ని శాఖల సమన్వయంతో చర్యలు* రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, మంచిర్యాల జోన్ బెల్లంపల్లి పట్టణంలోని 27వ,33వ వార్డుల మధ్య ఉన్న రాంనగర్ బ్రిడ్జిపై వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితిని గురువారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహం, భద్రతా ఏర్పాట్లు, ప్రజల రాకపోకల పరిస్థితిని సమీక్షించి, పోలీసు,రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు అవసరమైన సూచనలు చేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ,భారీ వర్షాల కారణంగా ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు,కాలువలు, బ్రిడ్జిలను ఎట్టి పరిస్థితుల్లోనూ దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు. అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు,బ్యారికేడ్లను గౌరవిస్తూ పోలీసు, రెవెన్యూ,మున్సిపల్ అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని, చిన్నారులను నీటి ప్రవాహాల వద్దకు వెళ్లనివ్వకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.ఈ పరిశీలనలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్, మున్సిపల్ చైర్‌పర్సన్, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్,27వ, 33వ వార్డుల కౌన్సిలర్లు,బెల్లంపల్లి వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు, బెల్లంపల్లి రూరల్ సీఐ హనుక్,ఇతర ఎస్‌ఐలు,పోలీసు సిబ్బంది,మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో రాంనగర్ బ్రిడ్జిని పరిశీలించిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా* *ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... ప్రమాదాల నివారణకు అన్ని శాఖల సమన్వయంతో చర్యలు* రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, మంచిర్యాల జోన్ బెల్లంపల్లి పట్టణంలోని 27వ,33వ వార్డుల మధ్య ఉన్న రాంనగర్ బ్రిడ్జిపై వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితిని గురువారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ
ఏ. భాస్కర్ తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహం, భద్రతా ఏర్పాట్లు, ప్రజల రాకపోకల పరిస్థితిని సమీక్షించి, పోలీసు,రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు అవసరమైన సూచనలు చేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ,భారీ వర్షాల కారణంగా ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు,కాలువలు, బ్రిడ్జిలను ఎట్టి పరిస్థితుల్లోనూ దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు. అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక
బోర్డులు,బ్యారికేడ్లను గౌరవిస్తూ పోలీసు, రెవెన్యూ,మున్సిపల్ అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని, చిన్నారులను నీటి ప్రవాహాల వద్దకు వెళ్లనివ్వకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.ఈ పరిశీలనలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్, మున్సిపల్ చైర్‌పర్సన్, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్,27వ, 33వ వార్డుల కౌన్సిలర్లు,బెల్లంపల్లి వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు, బెల్లంపల్లి రూరల్ సీఐ హనుక్,ఇతర ఎస్‌ఐలు,పోలీసు సిబ్బంది,మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
- భారీ వర్షాల నేపథ్యంలో రాంనగర్ బ్రిడ్జిని పరిశీలించిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా* *ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... ప్రమాదాల నివారణకు అన్ని శాఖల సమన్వయంతో చర్యలు* రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, మంచిర్యాల జోన్ బెల్లంపల్లి పట్టణంలోని 27వ,33వ వార్డుల మధ్య ఉన్న రాంనగర్ బ్రిడ్జిపై వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితిని గురువారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహం, భద్రతా ఏర్పాట్లు, ప్రజల రాకపోకల పరిస్థితిని సమీక్షించి, పోలీసు,రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు అవసరమైన సూచనలు చేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ,భారీ వర్షాల కారణంగా ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు,కాలువలు, బ్రిడ్జిలను ఎట్టి పరిస్థితుల్లోనూ దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు. అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు,బ్యారికేడ్లను గౌరవిస్తూ పోలీసు, రెవెన్యూ,మున్సిపల్ అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని, చిన్నారులను నీటి ప్రవాహాల వద్దకు వెళ్లనివ్వకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.ఈ పరిశీలనలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్, మున్సిపల్ చైర్‌పర్సన్, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్,27వ, 33వ వార్డుల కౌన్సిలర్లు,బెల్లంపల్లి వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు, బెల్లంపల్లి రూరల్ సీఐ హనుక్,ఇతర ఎస్‌ఐలు,పోలీసు సిబ్బంది,మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.3
- యువతకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం – పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలతో కలిసి నిరసనలో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ* *యువతకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం – పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలతో కలిసి నిరసనలో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ* *న్యూఢిల్లీ:* దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలకు నిరసనగా పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేపట్టిన ఆందోళనలో పెద్దపల్లి ఎంపీ *గడ్డం వంశీకృష్ణ* పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, యువత హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పరీక్షలు పారదర్శకంగా, ఎలాంటి పేపర్ లీకేజీలు లేకుండా నిర్వహించాలని యువత చేస్తున్న న్యాయమైన డిమాండ్‌కు కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇస్తోందని పేర్కొన్నారు. *పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కోట్లాది ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి యువతను నిరాశపరిచిందని విమర్శించారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగులు, పేపర్ లీకేజీల బాధితులు న్యాయం కోసం పోరాడుతుంటే, కాంగ్రెస్ పార్టీ వారి తరఫున పార్లమెంట్‌లో గొంతెత్తుతోందని అన్నారు.* అదేవిధంగా, తెలంగాణలో విద్యార్థుల సమస్యలపై రాజకీయాలు చేయకుండా వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు.1
- భారీ వర్షాల నేపథ్యంలో విధి నిర్వహణలో మున్సిపల్ కార్మికులు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఎవరు బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నప్పటికీ మున్సిపల్ కార్మికులకు మాత్రం విధులు తప్పడం లేదు. కాగా గురువారం బెల్లంపల్లి బజార్ ఏరియాలో మున్సిపల్ చెత్త సేకరించే వాహనంలో డీజిల్ అయిపోవడంతో మున్సిపల్ సిబ్బంది కాసేపు ఇబ్బందిపడ్డారు. వర్షంలో తడుస్తూ వెళ్లి డీజిల్ తీసుకొచ్చి వాహనం ప్రారంభించి యధావిధిగా చెత్త సేకరణ ప్రారంభించడంతో విధుల పట్ల వారి నిబద్దత చూసి స్థానికులు గమనించి వారిని అభినందించారు.1
- ఎల్లంపల్లి ప్రాజెక్టు లో పెరిగిన వరద నీరు., అప్రమత్తంగా ఉండాలన్న ప్రాజెక్టు అధికారులు అతిభారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం (ఇన్‌ఫ్లో) గణనీయంగా పెరిగే అవకాశం ఉందనీ ఎల్లంపల్లి ప్రాజెక్టు అధికారి రవీంద్ర చారి పేర్కొన్నారు.1
- భారీ వర్షాల హెచ్చరిక: కన్నెపల్లిలో టాంటాం ప్రచారం.......... కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం కన్నెపల్లి గ్రామంలో టాంటాం ద్వారా ప్రజలకు అప్రమత్తత సూచనలు అందించారు. రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఈ ప్రచారం చేపట్టారు. అత్యవసర పరిస్థితి తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. చిన్నపిల్లలు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, వాగులు, కాలువలు, చెరువులు, విద్యుత్ స్తంభాలు, చెట్లకు దూరంగా ఉండాలని కోరారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా వెంటనే గ్రామపంచాయతీ అధికారులకు సమాచారం ఇవ్వాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.1
- జగిత్యాల పట్టణంలోని యావర్ రోడ్డులో శ్రీనివాస టాకీస్ ఎదుట ఉన్న మొబైల్ టిఫిన్ సెంటర్లలో కొనుగోలు చేసిన వడలో బొద్దింక కనిపించిందని ఓ వ్యక్తి ఆరోపించారు. బుధవారం రాత్రి పిల్లల కోసం ఇడ్లీ, వడ పార్సిల్ తీసుకెళ్లి ఇంట్లో విప్పి చూడగా వడలో బొద్దింక ఉన్నట్లు గుర్తించానన్నారు.1
- తిలక్ నగర్ చౌరస్తాలో అక్రమ ప్రైవేట్ నిర్మాణాలను కూల్చిన సింగరేణి స్పెషల్ స్క్వాడ్ బృందం సింగరేణి భూముల్లో ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు (ప్రైవేట్ నిర్మాణాలు) చేపట్టడం చట్టవిరుద్ధమని తెలిపారు. భవిష్యత్తులో ఎవరైనా సింగరేణి భూమిలో అక్రమ నిర్మాణాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు నిర్మాణాలను వెంటనే తొలగిస్తామని హెచ్చరించారు.1
- భారీగా ప్రవహిస్తున్న ఒర్రెలు.. కమర్గాం గిరిజన గ్రామాలకు స్తంభించిన రాకపోకలు పెంచికల్పేట్ మండలంలోని కమ్మర్గాం,గుండె పెళ్లి, జిల్లెడ,మోర్లి గుడా తదితర గ్రామాలకు ఒర్రెలు ఉప్పొంగడంతో రాకపోకలు స్తంభించాయి. భారీగా వరద ప్రవాహం ప్రవహించడంతో ఎవరు కూడా ఒర్రెలనుండి దాటకూడదని తాసిల్దార్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు తెలిపారు.1