చెరువుల కబ్జాలే జన్నారం వరదలకు కారణమా? గ్రామాల్లోనూ హైడ్రా తరహా చర్యలపై చర్చ జన్నారం మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి వర్షాలతో పలు గ్రామాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం చెరువులు, కాలువలు, సహజ నీటి మార్గాలపై జరిగిన ఆక్రమణలేనని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. గతంలో వర్షపు నీరు చెరువులు, వాగులు, కాలువల ద్వారా సాఫీగా వెళ్లేదని, అయితే క్రమంగా చెరువుల పరిధిలో నిర్మాణాలు, ఆక్రమణలు పెరగడంతో నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడ్డాయని గ్రామస్థులు చెబుతున్నారు. దీంతో భారీ వర్షాలు కురిసిన ప్రతిసారీ నీరు బయటకు వెళ్లే మార్గం లేక నేరుగా కాలనీలు, ఇళ్లలోకి చేరుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో అమలు చేస్తున్న హైడ్రా తరహా చర్యలు గ్రామీణ ప్రాంతాల్లోనూ చేపట్టాలని జన్నారం మండల ప్రజలు కోరుతున్నారు. చెరువుల పూర్తి సర్వే నిర్వహించి ఆక్రమణలను తొలగిస్తేనే భవిష్యత్తులో ఇలాంటి వరద సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే చెరువుల ఆక్రమణలే ప్రస్తుత వరద పరిస్థితులకు ఏకైక కారణమా అనే అంశంపై అధికారుల నుంచి అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది. గ్రామాల్లో నీటి పారుదల మార్గాల పరిరక్షణ, ఆక్రమణల నివారణపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
చెరువుల కబ్జాలే జన్నారం వరదలకు కారణమా? గ్రామాల్లోనూ హైడ్రా తరహా చర్యలపై చర్చ జన్నారం మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి వర్షాలతో పలు గ్రామాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం చెరువులు, కాలువలు, సహజ నీటి మార్గాలపై జరిగిన ఆక్రమణలేనని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. గతంలో వర్షపు నీరు చెరువులు, వాగులు, కాలువల ద్వారా
సాఫీగా వెళ్లేదని, అయితే క్రమంగా చెరువుల పరిధిలో నిర్మాణాలు, ఆక్రమణలు పెరగడంతో నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడ్డాయని గ్రామస్థులు చెబుతున్నారు. దీంతో భారీ వర్షాలు కురిసిన ప్రతిసారీ నీరు బయటకు వెళ్లే మార్గం లేక నేరుగా కాలనీలు, ఇళ్లలోకి చేరుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో అమలు చేస్తున్న హైడ్రా తరహా చర్యలు గ్రామీణ ప్రాంతాల్లోనూ చేపట్టాలని జన్నారం మండల ప్రజలు కోరుతున్నారు.
చెరువుల పూర్తి సర్వే నిర్వహించి ఆక్రమణలను తొలగిస్తేనే భవిష్యత్తులో ఇలాంటి వరద సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే చెరువుల ఆక్రమణలే ప్రస్తుత వరద పరిస్థితులకు ఏకైక కారణమా అనే అంశంపై అధికారుల నుంచి అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది. గ్రామాల్లో నీటి పారుదల మార్గాల పరిరక్షణ, ఆక్రమణల నివారణపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
- చెరువుల కబ్జాలే జన్నారం వరదలకు కారణమా? గ్రామాల్లోనూ హైడ్రా తరహా చర్యలపై చర్చ జన్నారం మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి వర్షాలతో పలు గ్రామాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం చెరువులు, కాలువలు, సహజ నీటి మార్గాలపై జరిగిన ఆక్రమణలేనని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. గతంలో వర్షపు నీరు చెరువులు, వాగులు, కాలువల ద్వారా సాఫీగా వెళ్లేదని, అయితే క్రమంగా చెరువుల పరిధిలో నిర్మాణాలు, ఆక్రమణలు పెరగడంతో నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడ్డాయని గ్రామస్థులు చెబుతున్నారు. దీంతో భారీ వర్షాలు కురిసిన ప్రతిసారీ నీరు బయటకు వెళ్లే మార్గం లేక నేరుగా కాలనీలు, ఇళ్లలోకి చేరుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో అమలు చేస్తున్న హైడ్రా తరహా చర్యలు గ్రామీణ ప్రాంతాల్లోనూ చేపట్టాలని జన్నారం మండల ప్రజలు కోరుతున్నారు. చెరువుల పూర్తి సర్వే నిర్వహించి ఆక్రమణలను తొలగిస్తేనే భవిష్యత్తులో ఇలాంటి వరద సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే చెరువుల ఆక్రమణలే ప్రస్తుత వరద పరిస్థితులకు ఏకైక కారణమా అనే అంశంపై అధికారుల నుంచి అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది. గ్రామాల్లో నీటి పారుదల మార్గాల పరిరక్షణ, ఆక్రమణల నివారణపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.3
- భారీ వర్షాలు.. వరద ప్రాంతాల్లో ఎస్పీ నితికా పంత్ పర్యటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా ఎస్పీ నితికా పంత్ క్షేత్రస్థాయిలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. కాగజ్‌నగర్ పెద్దవాగు, దహెగాం, పెంచికల్‌పేట్ మండలాల్లోని ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంతెనలను సందర్శించి పోలీసు అధికారులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలకు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. లైఫ్ జాకెట్లు, లైఫ్ బాయ్స్, రోపులు అందుబాటులో ఉంచి రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రమాదకర వాగులు, వంతెనల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 100/112 లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు.1
- తెలంగాణలోకి డిప్రెషన్ ఎంట్రీ రానున్న 12 గంటలు అత్యంత కీలకం1
- యువతకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం – పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలతో కలిసి నిరసనలో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ* *యువతకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం – పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలతో కలిసి నిరసనలో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ* *న్యూఢిల్లీ:* దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలకు నిరసనగా పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేపట్టిన ఆందోళనలో పెద్దపల్లి ఎంపీ *గడ్డం వంశీకృష్ణ* పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, యువత హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పరీక్షలు పారదర్శకంగా, ఎలాంటి పేపర్ లీకేజీలు లేకుండా నిర్వహించాలని యువత చేస్తున్న న్యాయమైన డిమాండ్‌కు కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇస్తోందని పేర్కొన్నారు. *పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కోట్లాది ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి యువతను నిరాశపరిచిందని విమర్శించారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగులు, పేపర్ లీకేజీల బాధితులు న్యాయం కోసం పోరాడుతుంటే, కాంగ్రెస్ పార్టీ వారి తరఫున పార్లమెంట్‌లో గొంతెత్తుతోందని అన్నారు.* అదేవిధంగా, తెలంగాణలో విద్యార్థుల సమస్యలపై రాజకీయాలు చేయకుండా వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు.1
- భారీ వర్షాల నేపథ్యంలో రాంనగర్ బ్రిడ్జిని పరిశీలించిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా* *ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... ప్రమాదాల నివారణకు అన్ని శాఖల సమన్వయంతో చర్యలు* రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, మంచిర్యాల జోన్ బెల్లంపల్లి పట్టణంలోని 27వ,33వ వార్డుల మధ్య ఉన్న రాంనగర్ బ్రిడ్జిపై వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితిని గురువారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహం, భద్రతా ఏర్పాట్లు, ప్రజల రాకపోకల పరిస్థితిని సమీక్షించి, పోలీసు,రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు అవసరమైన సూచనలు చేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ,భారీ వర్షాల కారణంగా ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు,కాలువలు, బ్రిడ్జిలను ఎట్టి పరిస్థితుల్లోనూ దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు. అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు,బ్యారికేడ్లను గౌరవిస్తూ పోలీసు, రెవెన్యూ,మున్సిపల్ అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని, చిన్నారులను నీటి ప్రవాహాల వద్దకు వెళ్లనివ్వకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.ఈ పరిశీలనలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్, మున్సిపల్ చైర్‌పర్సన్, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్,27వ, 33వ వార్డుల కౌన్సిలర్లు,బెల్లంపల్లి వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు, బెల్లంపల్లి రూరల్ సీఐ హనుక్,ఇతర ఎస్‌ఐలు,పోలీసు సిబ్బంది,మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.3
- కుష్ణపల్లి ఒర్రె వరద ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే హరీష్ బాబు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం కుష్ణపల్లి శివారులో ఉధృతంగా ప్రవహిస్తున్న ఒర్రె వరద ప్రాంతాన్ని సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు పరిశీలించారు. వరదల కారణంగా కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో పరిస్థితిని అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అనుమతులు లేకపోవడంతో బెజ్జూర్ మండలంలోని కొన్ని గ్రామాలకు శాశ్వత రవాణా సౌకర్యాలు కల్పించడంలో జాప్యం జరుగుతోందని తెలిపారు. ఈ అంశాన్ని రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అవసరమైన అటవీ అనుమతులు సాధించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మార్వో, ఎంపీడీవో, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.1
- *కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీకి పోటెత్తిన వరద నీరు 85 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు1
- జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులు అరెస్ట్ జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని దూలూరు గ్రామంలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పట్టుకొని పంచనామా నిర్వహించి వారి వద్ద నుండి 5206/- రూపాయలు మరియు 6 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కథలాపూర్ ఎస్సై రవి కిరణ్ తెలియజేసినారు.1