Shuru
Apke Nagar Ki App…
గ్రామపంచాయతీల సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ)పై అధికారులకు శిక్షణ నిర్మల్ జిల్లా భైంసా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై నియోజకవర్గంలోని ఎంపిడిఓ, ఎంపీఓ,ఏపీఓ, ఏంఏఓలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. జీపీడీపీలోని పలు అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో డిపిఓ శ్రీనివాస్,పిఎడి నాగవర్ధన్ పాల్గొన్నారు.
Murali
గ్రామపంచాయతీల సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ)పై అధికారులకు శిక్షణ నిర్మల్ జిల్లా భైంసా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై నియోజకవర్గంలోని ఎంపిడిఓ, ఎంపీఓ,ఏపీఓ, ఏంఏఓలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. జీపీడీపీలోని పలు అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో డిపిఓ శ్రీనివాస్,పిఎడి నాగవర్ధన్ పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యం: ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన, సకాలంలో వైద్య సేవలు అందించాలని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవల తీరును సమీక్షించారు. ఆసుపత్రిలోని వివిధ వార్డులను పరిశీలించి చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, వైద్య సిబ్బంది పనితీరు, ఇతర సౌకర్యాల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. రోజురోజుకు రోగుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ సిటీ స్కాన్ యంత్రం పనిచేయకపోవడం, ఎక్స్‌రే ఫిలింల కొరత ఉండడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమస్యలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి సిటీ స్కాన్ మరమ్మతులు చేపట్టడంతో పాటు ఎక్స్‌రే ఫిలింల కొరత లేకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ నిధులు రూ. 25 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ ఆసుపత్రి భవనం పూర్తయిందని, ప్రారంభోత్సవం అనంతరం ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. దీంతో జిల్లా ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయని పేర్కొన్నారు. ఆసుపత్రి ఆవరణను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్‌ను ఆదేశించారు. ప్రతిరోజూ ఫాగింగ్ నిర్వహించాలని సూచించారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించడంతో పాటు రోగులతో ఆప్యాయంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ స్థానిక కౌన్సిలర్ గంజి రాజు, కౌన్సిలర్లు జింక సూరి, శ్రీరామోజు నరేష్, ఈశ్వర్, అర్జున్, విఠల్, సూరజ్, సాత్విక్, BJYM జిల్లా అధ్యక్షులు నిరంజన్ రెడ్డి, బీజేపీ నాయకులు జుట్టు దినేష్, జాప ప్రసాద్, కందుల హరీష్, అచ్యుత్ రావు, తో పాటు వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1
- భారతీయ సంస్కృతికి, ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి ప్రతీకగా నిలిచిన శ్రీరామ జన్మభూమి భూమిపూజ వార్షికోత్సవం ఎంతో అపూర్వమైనది. ఆ ధర్మమూర్తి చూపిన మార్గంలో నడుస్తూ మన సంప్రదాయ వారసత్వాన్ని గర్వంగా ముందుకు తీసుకెళ్దాం.1
- ఆదిలాబాద్ గిరిజన డిగ్రీ కళాశాలలో ఘనంగా ప్రెషర్స్ డే... ఆదిలాబాద్‌లోని గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాలలో నూతనంగా చేరిన ప్రథమ సంవత్సరం విద్యార్థులకు సీనియర్లు ఆత్మీయ స్వాగతం పలికారు. మంగళవారం కళాశాలలో నిర్వహించిన 'ప్రెషర్స్ వెల్కమ్' వేడుకల్లో సీనియర్ విద్యార్థులు నూతన విద్యార్థులకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు, ఆటలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రిన్సిపల్ డా. ఎం. శివకృష్ణ, వైస్ ప్రిన్సిపల్ డా. ముంతాజ్ బేగం మాట్లాడారు. నూతన విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, నిబద్ధతతో చదివి కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.1
- ఆదిలాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు స్థానిక వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. జన్మదిన సందర్భంగా ఆత్మ కమిటీ చైర్మన్ గీమ్మ సంతోష్ రావు ఆధ్వర్యంలో స్థానిక కేఆర్కే కాలినిలోని వృద్ధాశ్రమంలో వృద్ధులతో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అనంతరం వారికి అన్నదానం చేసి పండ్లు పంపిణీ చేశారు. "సేవలోనే సంతోషం అనే స్ఫూర్తితో మానవత్వమే మహోన్నతమైన సేవ అని ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శంతన్ రావ్, దీపక్ రావ్ మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కంది శ్రీనివాస్ రెడ్డి ఆయురారోగ్యాలతో, అజేయమైన సేవా ప్రయాణం కొనసాగాలని వారు పేర్కొన్నారు.1
- కోరుట్ల పీబీ గార్డెన్స్‌లో "సైబర్ జాగృతిక దివాస్ జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్1
- రోటిగూడా గ్రామంలో ఘనంగా ఊరు అంపుడు, గ్రామ దేవతలకు పూజలు జన్నారం మండలంలోని రోటిగూడలో ఊరు అంపుడు కార్యక్రమాన్ని గ్రామస్తులు, భక్తులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆషాడ మాసం బోనాల సందర్భంగా బుధవారం సాయంత్రం గ్రామంలో ఊరు అంపుడు ప్రారంభమైంది. రాత్రి గ్రామస్తులు, భక్తులు ఊరేగింపు నిర్వహిస్తూ గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఊరు బాగుండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని వారు మొక్కులు తీర్చుకుంటున్నారు. బుధవారం మధ్యాహ్నం వరకు కార్యక్రమం కొనసాగనుంది.1
- సాంప్రదాయ పద్ధతిలో అమ్మవారికి బోనాలు సమర్పించిన భక్తులు.. నిర్మల్ లోని ద్యాగవాడ వారి ఆధ్వర్యంలో బోనాల పండుగ అత్యంత సాంప్రదాయ బద్దంగా నిర్వహించుకున్నారు. పురుషులు, మహిళలు తలపాగా పెట్టుకొని పురవీధులలో నిర్వహించిన బోనాల శోభాయాత్ర స్థానికులను ఆకర్శించింది. ఈ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. సమృద్ధిగా పాడి పంటలు పండాలని, వర్షాలు కురవాలని,అందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఏడాది తమ పూర్వీకుల కాలం నుంచి ఈ పండుగను నిర్వహించుకుంటమన్నారు.1
- ఆంధ్రప్రదేశ్ డెయిరీ రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు మోదీ ప్రభుత్వం రూ.115 కోట్లకు పాడి రైతులకు శుభవార్త పైగా నిధులతో ప్రత్యేక ప్రోత్సాహాన్ని అందించింది. ఉచిత పశు టీకాలు మరియు మౌలిక వసతుల అభివృద్ధి ద్వారా రాష్ట్ర పాడి పరిశ్రమకు కేంద్రం కొత్త ఊపిరి పోసింది.1
- తానూర్ : చిన్నారులను చితకబాదిన సర్పంచ్ భర్త... కేసు నమోదు నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని సింగన్ గావ్ లో పాఠశాల సమీపంలో నిర్మిస్తున్న గ్రామపంచాయతీ భవనం కోసం ఆవరణలో ఇసుక నిల్వచేశారు. దీంతో చిన్నారులు ఇసుక కుప్పలపై ఆడుకుంటున్నారు.ఈ క్రమంలో ఇసుక పాడవుతుందని పిల్లలపై సర్పంచ్ భర్త రాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారులు వినకపోవడంతో రాములు వారిని పచ్చికట్టెతో ఒకరిని కాలుపై.. మరో ఇద్దరిని మెడపై కొట్టడంతో గాయాలయ్యాయి.చిన్నారుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సింగన్ గావ్ సర్పంచ్ సరిగిరి అన్నపూర్ణ భర్త రాములుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై షేక్ జుబేర్ తెలిపారు.1