Shuru
Apke Nagar Ki App…
రోటిగూడా గ్రామంలో ఘనంగా ఊరు అంపుడు, గ్రామ దేవతలకు పూజలు జన్నారం మండలంలోని రోటిగూడలో ఊరు అంపుడు కార్యక్రమాన్ని గ్రామస్తులు, భక్తులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆషాడ మాసం బోనాల సందర్భంగా బుధవారం సాయంత్రం గ్రామంలో ఊరు అంపుడు ప్రారంభమైంది. రాత్రి గ్రామస్తులు, భక్తులు ఊరేగింపు నిర్వహిస్తూ గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఊరు బాగుండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని వారు మొక్కులు తీర్చుకుంటున్నారు. బుధవారం మధ్యాహ్నం వరకు కార్యక్రమం కొనసాగనుంది.
P.G. Murthy
రోటిగూడా గ్రామంలో ఘనంగా ఊరు అంపుడు, గ్రామ దేవతలకు పూజలు జన్నారం మండలంలోని రోటిగూడలో ఊరు అంపుడు కార్యక్రమాన్ని గ్రామస్తులు, భక్తులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆషాడ మాసం బోనాల సందర్భంగా బుధవారం సాయంత్రం గ్రామంలో ఊరు అంపుడు ప్రారంభమైంది. రాత్రి గ్రామస్తులు, భక్తులు ఊరేగింపు నిర్వహిస్తూ గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఊరు బాగుండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని వారు మొక్కులు తీర్చుకుంటున్నారు. బుధవారం మధ్యాహ్నం వరకు కార్యక్రమం కొనసాగనుంది.
More news from తెలంగాణ and nearby areas
- రోటిగూడా గ్రామంలో ఘనంగా ఊరు అంపుడు, గ్రామ దేవతలకు పూజలు జన్నారం మండలంలోని రోటిగూడలో ఊరు అంపుడు కార్యక్రమాన్ని గ్రామస్తులు, భక్తులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆషాడ మాసం బోనాల సందర్భంగా బుధవారం సాయంత్రం గ్రామంలో ఊరు అంపుడు ప్రారంభమైంది. రాత్రి గ్రామస్తులు, భక్తులు ఊరేగింపు నిర్వహిస్తూ గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఊరు బాగుండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని వారు మొక్కులు తీర్చుకుంటున్నారు. బుధవారం మధ్యాహ్నం వరకు కార్యక్రమం కొనసాగనుంది.1
- కోరుట్లలో ఘనంగా T24X7NEWS స్టూడియో ప్రారంభం*నందయ్యా చేతుల మీదుగా ప్రారంభం.. ముఖ్య అతిథిగా జువ్వాడి కృష్ణారావు1
- నేతకాని' పేరుకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు – కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి వీరేంద్ర కుమార్‌ను కలిసి డిమాండ్ వినిపించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ *'నేతకాని' పేరుకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు – కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి వీరేంద్ర కుమార్‌ను కలిసి డిమాండ్ వినిపించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ* *న్యూఢిల్లీ:* పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు *శ్రీ గడ్డం వంశీకృష్ణ* నేతకాని సామాజిక వర్గం ఆత్మగౌరవానికి సంబంధించిన కీలక సమస్యను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర *సామాజిక న్యాయ & సాధికారత శాఖ మంత్రి శ్రీ వీరేంద్ర కుమార్* ను న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసి, ప్రభుత్వ రికార్డుల్లో తప్పుగా నమోదైన *'నెట్కాని'* అనే పేరును సరిచేసి, అసలు పేరు *నేతకాని* గా మార్చే ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి వీరేంద్ర కుమార్ ఈ అంశానికి సంబంధించిన పూర్తి పరిపాలనా విధానాన్ని ఎంపీ వంశీకృష్ణకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రతిపాదన రావడంతో పాటు, *రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (RGI)* మరియు *జాతీయ ఎస్సీ కమిషన్* నుంచి అవసరమైన సిఫార్సులు అందిన అనంతరం పేరు మార్పు ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. ఈ అంశంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలోని సంబంధిత అధికారులతో, ముఖ్యంగా *లక్ష్మణ్ కుమార్* గారితో కూడా చర్చించినట్లు ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తక్షణమే అధికారిక లేఖను కేంద్ర మంత్రిత్వ శాఖకు పంపేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. ఎన్నికల సమయంలో నేతకాని వర్గ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈ అంశాన్ని వ్యక్తిగతంగా తీసుకుని ముందుకు తీసుకెళ్తున్నామని ఎంపీ వంశీకృష్ణ స్పష్టం చేశారు. *"నేతకాని సమాజం గౌరవం, ఆత్మగౌరవం, గుర్తింపుకు సంబంధించిన ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు ప్రతి దశను స్వయంగా ఫాలోఅప్ చేస్తాను.*ప్రభుత్వ రికార్డుల్లో సరైన పేరు 'నేతకాని' నమోదయ్యే వరకు మా కృషి కొనసాగుతుంది"* అని ఆయన పేర్కొన్నారు. నేతకాని సమాజానికి చారిత్రక న్యాయం జరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం చేస్తూ, అవసరమైన అన్ని అనుమతులు, సిఫార్సులు త్వరితగతిన పూర్తయ్యేలా కృషి చేస్తానని ఎంపీ గడ్డం వంశీకృష్ణ హామీ ఇచ్చారు.1
- సింగరేణి విద్యుత్ సరఫరా పునరుద్దరించకుంటే ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడిస్తాం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ రక్షణ సేన బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ బోడ జనార్దన్ అన్నారు. ఇటీవల బెల్లంపల్లి పట్టణంలోని పలు బస్తీలలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పర్యటించినప్పుడు సమస్యలను గుర్తించినట్లు తెలిపారు. ముఖ్యంగా సింగరేణి విద్యుత్ సరఫరా లేక సింగరేణి కార్మికులు, కార్మికేతర కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. స్థానికంగా ఎమ్మెల్యే లేకపోవడం, సింగరేణి జనరల్ మేనేజర్ పట్టించుకోకపోవడంతో చాలా కుటుంబాలు చీకట్లో మగ్గుతున్నాయన్నారు. సింగరేణి జిఎం మానవతా దృక్పథంతో స్పందించి సింగరేణి కార్మికులు, కార్మికేతర్లు ప్రభుత్వ విద్యుత్ కనెక్షన్ తీసుకునేంత వరకు సింగరేణి విద్యుత్తును పునరుద్దరించాలని కోరారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా ఎమ్మెల్యే గడ్డం స్థానికంగా ఉండి సింగరేణి జిఎంతో, ఇటు ప్రభుత్వం విద్యుత్ సంస్థ ఏఈతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.1
- గుడిహత్నూర్‌లో భారీ ట్రాఫిక్ జామ్ గంటల కొద్దీ నిలిచిపోయిన వాహనాలు.. అవస్థలు పడ్డ ప్రయాణికులు గుడిహత్నూర్ జాతీయ రహదారిపై బుధవారం భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైవే సమీపంలో సర్వీస్ రోడ్డు నిర్మాణ పనుల కారణంగా మండల కేంద్రంలోని జవహర్ నగర్ వరకు వాహనాలు బారులుగా నిలిచిపోయాయి. గంటల కొద్దీ ట్రాఫిక్ స్తంభించడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దారి ఇరుకుగా ఉండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా, ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వాహనదారులు కోరుతున్నారు.1
- సిర్గాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎస్.హెచ్.జీ. (S.H.G.) వి.ఓ. భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దిలావర్ పూర్ మండలం సిర్గాపూర్ గ్రామంలో స్వయం సహాయక సంఘాల (S.H.G.) వి.ఓ. రూ. 10 లక్షలతో నూతనంగా నిర్మించిన భవనాన్ని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మహిళా సంఘాల బలోపేతం, గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇలాంటి మౌలిక సదుపాయాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు.మహిళల సాధికారతకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. అనంతరం మండలంలోని పలు గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, స్థానిక సమస్యలు మరియు ప్రజల అవసరాలపై మండల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేయడంతో పాటు ప్రజలకు నాణ్యమైన సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోండుగారి చైతన్య శంకర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్ , మండల అద్యక్షులు నర్సారెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు ముత్యం రెడ్డి , BJYM జిల్లా అద్యక్షులు నిరంజన్ రెడ్డి తో పాటు మహిళా సమైక్య సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.2
- తల్లిపాలు చిన్నారులకు సంపూర్ణ ఆహారం: ఎంపీడీవో మధుసూదన్ తల్లిపాలు శిశువుకు సంపూర్ణ ఆహారం అని లక్షెట్టిపేట మండల ఎంపీడీవో మధుసూదన్ అన్నారు. బుధవారం మధ్యాహ్నం లక్షెట్టిపేట పట్టణంలోని బస్తీ దవాఖానాలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాలలో ఆయన పాల్గొన్నారు. తల్లిపాలు చిన్నారులలో రోగ నిరోధక శక్తిని పెంచి వారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్ వైజర్ మమత, RBSK డాక్టర్ శోభారాణి, ఫార్మసిస్ట్ అజయ్ కుమార్, Anm సుజాత, నాగ ప్రమీల ,అంగన్వాడీ టీచర్స్ లక్ష్మీ, శంకరమ్మ, ఆశా రాజేశ్వరి, లలిత, రాజమణి, ఆయా, తల్లులు, పిల్లలు, కిశోర బాలికలు పాల్గొన్నారు.1
- సైబర్ నేరగాళ్ల వలలో పడి ఎవరు మోసపోవద్దు, జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ సైబర్ నేరగాళ్ల వలలో పడి ఎవరు మోసపోవద్దని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో సైబర్ జాగృతిక దివాస్ సందర్భంగా కళాశాలల విద్యార్థులకు సైబర్ నేరాలపై అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ మాట్లాడుతూ... సైబర్ నేరగాళ్లు మాయమాటలతో మోసాలు చేస్తున్నారని, అపరిచిత వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేసి వ్యక్తిగత సమాచారం అడిగితే ఇవ్వొద్దని, అంతే కాకుండా ఫోన్ కు వచ్చే మెసేజ్ లకు స్పందించి ఓటీపీలు వంటి సమాచారం చెప్పొద్దని సూచించారు. బ్యాంకు వ్యక్తిగత పిన్ నంబర్లు సైతం గోప్యంగా ఉంచుకోవాలన్నారు. దొంగతనాల నివారణకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ చేతన్ నితిన్, డీఎస్పీ రాములు, కోరుట్ల సీఐ లక్ష్మి నారాయణ, కళాశాలల ప్రిన్సిపల్, విద్యార్థులు పాల్గొన్నారు.1