logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సైబర్ నేరగాళ్ల వలలో పడి ఎవరు మోసపోవద్దు, జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ సైబర్ నేరగాళ్ల వలలో పడి ఎవరు మోసపోవద్దని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో సైబర్ జాగృతిక దివాస్ సందర్భంగా కళాశాలల విద్యార్థులకు సైబర్ నేరాలపై అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ మాట్లాడుతూ... సైబర్ నేరగాళ్లు మాయమాటలతో మోసాలు చేస్తున్నారని, అపరిచిత వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేసి వ్యక్తిగత సమాచారం అడిగితే ఇవ్వొద్దని, అంతే కాకుండా ఫోన్ కు వచ్చే మెసేజ్ లకు స్పందించి ఓటీపీలు వంటి సమాచారం చెప్పొద్దని సూచించారు. బ్యాంకు వ్యక్తిగత పిన్ నంబర్లు సైతం గోప్యంగా ఉంచుకోవాలన్నారు. దొంగతనాల నివారణకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ చేతన్ నితిన్, డీఎస్పీ రాములు, కోరుట్ల సీఐ లక్ష్మి నారాయణ, కళాశాలల ప్రిన్సిపల్, విద్యార్థులు పాల్గొన్నారు.

7 hrs ago
user_Vsk
Vsk
Metpalli, Jagitial•
7 hrs ago

సైబర్ నేరగాళ్ల వలలో పడి ఎవరు మోసపోవద్దు, జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ సైబర్ నేరగాళ్ల వలలో పడి ఎవరు మోసపోవద్దని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో సైబర్ జాగృతిక దివాస్ సందర్భంగా కళాశాలల విద్యార్థులకు సైబర్ నేరాలపై అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ మాట్లాడుతూ... సైబర్ నేరగాళ్లు మాయమాటలతో మోసాలు చేస్తున్నారని, అపరిచిత వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేసి వ్యక్తిగత సమాచారం అడిగితే ఇవ్వొద్దని, అంతే కాకుండా ఫోన్ కు వచ్చే మెసేజ్ లకు స్పందించి ఓటీపీలు వంటి సమాచారం చెప్పొద్దని సూచించారు. బ్యాంకు వ్యక్తిగత పిన్ నంబర్లు సైతం గోప్యంగా ఉంచుకోవాలన్నారు. దొంగతనాల నివారణకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ చేతన్ నితిన్, డీఎస్పీ రాములు, కోరుట్ల సీఐ లక్ష్మి నారాయణ, కళాశాలల ప్రిన్సిపల్, విద్యార్థులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • కోరుట్ల పీబీ గార్డెన్స్‌లో "సైబర్ జాగృతిక దివాస్ జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
    1
    కోరుట్ల పీబీ గార్డెన్స్‌లో "సైబర్ జాగృతిక దివాస్

జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
    user_MD. YOUSUF ALI KHAN
    MD. YOUSUF ALI KHAN
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    6 hrs ago
  • ఖానాపూర్ దిలావపూర్ రేంకోని వాగు బ్రిడ్జ్ దగ్గర మూలమలుపు భయంకరంమైన ములమలుపు ఖానాపూర్ దిలావపూర్ రేంకోని వాగు బ్రిడ్జి కంప్లీట్ చేయకపోగా భయంకరంగా మూలమలుపు తయారైందని స్థానిక ప్రజలు వాహనదారులు తెలియజేశారు ఇప్పటికైనా అధికారులు రోడ్ల వెడల్పు పనులు చేపట్టి పూర్తిచేయాలని ప్రజలు వాహనదారులు తెలియజేశారు
    1
    ఖానాపూర్   దిలావపూర్  రేంకోని వాగు బ్రిడ్జ్ దగ్గర మూలమలుపు భయంకరంమైన ములమలుపు 
ఖానాపూర్ దిలావపూర్ రేంకోని వాగు  బ్రిడ్జి కంప్లీట్ చేయకపోగా భయంకరంగా మూలమలుపు తయారైందని స్థానిక ప్రజలు వాహనదారులు తెలియజేశారు ఇప్పటికైనా అధికారులు రోడ్ల వెడల్పు పనులు చేపట్టి  పూర్తిచేయాలని ప్రజలు వాహనదారులు తెలియజేశారు
    user_ఆకుల  శ్రీనివాస్
    ఆకుల శ్రీనివాస్
    Farmer ఖానాపూర్, నిర్మల్, తెలంగాణ•
    5 hrs ago
  • *అధికారులు అప్రమత్తంగా ఉండాలి* *ఎగువ మానేరు పరిసర ప్రాంతాల రైతులు, ప్రజలకు తెలియజేయాలి* *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్* *ఎగువ మా ప్రాజెక్టును పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ మహేష్ బి గితె* ఎగువ మానేరు ప్రాజెక్ట్ వద్ద నీటి పారుదల, రెవెన్యూ, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్ట్ ను బుధవారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె, నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం, ఎగువ నుంచి వరద తదితర అంశాలపై జిల్లా నీటి పారుదల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. ఎగువ మానేరు ప్రాజెక్ట్ లోకి ప్రస్తుతం కూడవెల్లి, పాల్వంచ వాగుల నుంచి ఇన్ ఫ్లో లేదని, ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 2 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి మట్టం 1. 6 టీఎంసీల నీరు ఉందని నీటి పారుదల శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ఎగువ మానేరు ప్రాజెక్ట్ లోకి వరద చేరి పూర్తి స్థాయి నీరు నిండే అవకాశం ఉందని, నీటి పారుదల శాఖ, రెవెన్యూ, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీటి మట్టాన్ని పరిశీలిస్తూ.. ప్రాజెక్ట్ పరిధిలోని గ్రామాల రైతులు, ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయాలని ఆదేశించారు. ప్రాజెక్ట్ మత్తడి పారితే పోలీస్, రెవెన్యూ అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి.. రాకపోకలను నియంత్రించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. పరిశీలనలో సిరిసిల్ల ఆర్డీఓ శ్రీధర్ బాబు, జిల్లా నీటి పారుదల శాఖ అధికారి దయాకర్, ప్రశాంత్, తహసీల్దార్ మారుతి, సర్పంచ్ అర్చన తదితరులు పాల్గొన్నారు.
    4
    *అధికారులు అప్రమత్తంగా ఉండాలి*

*ఎగువ మానేరు పరిసర ప్రాంతాల రైతులు, ప్రజలకు 
తెలియజేయాలి*

*జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్*

*ఎగువ మా ప్రాజెక్టును పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ మహేష్ బి గితె*


ఎగువ మానేరు ప్రాజెక్ట్ వద్ద నీటి పారుదల, రెవెన్యూ, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. 
గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్ట్ ను బుధవారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె, నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. 
ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం, ఎగువ నుంచి వరద తదితర అంశాలపై జిల్లా నీటి పారుదల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. 
ఎగువ మానేరు ప్రాజెక్ట్ లోకి ప్రస్తుతం కూడవెల్లి, పాల్వంచ వాగుల నుంచి ఇన్ ఫ్లో లేదని, ప్రాజెక్టు పూర్తి  స్థాయి నీటి మట్టం 2 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి మట్టం 1. 6 టీఎంసీల నీరు ఉందని నీటి పారుదల శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళారు. 
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ఎగువ మానేరు ప్రాజెక్ట్ లోకి వరద చేరి పూర్తి స్థాయి నీరు నిండే అవకాశం ఉందని, నీటి పారుదల శాఖ, రెవెన్యూ, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీటి మట్టాన్ని పరిశీలిస్తూ.. ప్రాజెక్ట్ పరిధిలోని గ్రామాల రైతులు, ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయాలని ఆదేశించారు. ప్రాజెక్ట్ మత్తడి పారితే పోలీస్, రెవెన్యూ అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి.. రాకపోకలను నియంత్రించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. 
పరిశీలనలో సిరిసిల్ల ఆర్డీఓ శ్రీధర్ బాబు, జిల్లా నీటి పారుదల శాఖ అధికారి దయాకర్, ప్రశాంత్, తహసీల్దార్ మారుతి, సర్పంచ్ అర్చన తదితరులు పాల్గొన్నారు.
    user_Gampa mahesh
    Gampa mahesh
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    2 hrs ago
  • సిర్గాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎస్.హెచ్.జీ. (S.H.G.) వి.ఓ. భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దిలావర్ పూర్ మండలం సిర్గాపూర్ గ్రామంలో స్వయం సహాయక సంఘాల (S.H.G.) వి.ఓ. రూ. 10 లక్షలతో నూతనంగా నిర్మించిన భవనాన్ని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మహిళా సంఘాల బలోపేతం, గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇలాంటి మౌలిక సదుపాయాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు.మహిళల సాధికారతకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. అనంతరం మండలంలోని పలు గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, స్థానిక సమస్యలు మరియు ప్రజల అవసరాలపై మండల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేయడంతో పాటు ప్రజలకు నాణ్యమైన సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోండుగారి చైతన్య శంకర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్ , మండల అద్యక్షులు నర్సారెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు ముత్యం రెడ్డి , BJYM జిల్లా అద్యక్షులు నిరంజన్ రెడ్డి తో పాటు మహిళా సమైక్య సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
    2
    సిర్గాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎస్.హెచ్.జీ. (S.H.G.) వి.ఓ. భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
దిలావర్ పూర్ మండలం సిర్గాపూర్ గ్రామంలో  స్వయం సహాయక సంఘాల (S.H.G.) వి.ఓ.  రూ. 10 లక్షలతో నూతనంగా నిర్మించిన భవనాన్ని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా  బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మహిళా సంఘాల బలోపేతం, గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇలాంటి మౌలిక సదుపాయాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు.మహిళల సాధికారతకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.
అనంతరం మండలంలోని పలు గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, స్థానిక సమస్యలు మరియు ప్రజల అవసరాలపై మండల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేయడంతో పాటు ప్రజలకు నాణ్యమైన సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోండుగారి చైతన్య శంకర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్ , మండల  అద్యక్షులు నర్సారెడ్డి,  బీజేపీ సీనియర్ నాయకులు  ముత్యం రెడ్డి , BJYM జిల్లా అద్యక్షులు నిరంజన్ రెడ్డి తో పాటు  మహిళా సమైక్య సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
    user_SIDDU.ASRC
    SIDDU.ASRC
    నిర్మల్, తెలంగాణ•
    3 hrs ago
  • తల్లిపాలు చిన్నారులకు సంపూర్ణ ఆహారం: ఎంపీడీవో మధుసూదన్ తల్లిపాలు శిశువుకు సంపూర్ణ ఆహారం అని లక్షెట్టిపేట మండల ఎంపీడీవో మధుసూదన్ అన్నారు. బుధవారం మధ్యాహ్నం లక్షెట్టిపేట పట్టణంలోని బస్తీ దవాఖానాలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాలలో ఆయన పాల్గొన్నారు. తల్లిపాలు చిన్నారులలో రోగ నిరోధక శక్తిని పెంచి వారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్ వైజర్ మమత, RBSK డాక్టర్ శోభారాణి, ఫార్మసిస్ట్ అజయ్ కుమార్, Anm సుజాత, నాగ ప్రమీల ,అంగన్వాడీ టీచర్స్ లక్ష్మీ, శంకరమ్మ, ఆశా రాజేశ్వరి, లలిత, రాజమణి, ఆయా, తల్లులు, పిల్లలు, కిశోర బాలికలు పాల్గొన్నారు.
    1
    తల్లిపాలు చిన్నారులకు సంపూర్ణ ఆహారం: ఎంపీడీవో మధుసూదన్
తల్లిపాలు శిశువుకు సంపూర్ణ ఆహారం అని లక్షెట్టిపేట మండల ఎంపీడీవో మధుసూదన్ అన్నారు. బుధవారం మధ్యాహ్నం లక్షెట్టిపేట పట్టణంలోని బస్తీ దవాఖానాలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాలలో ఆయన పాల్గొన్నారు. తల్లిపాలు చిన్నారులలో రోగ నిరోధక శక్తిని పెంచి వారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్ వైజర్ మమత, RBSK డాక్టర్ శోభారాణి,  ఫార్మసిస్ట్ అజయ్ కుమార్,  Anm సుజాత, నాగ ప్రమీల ,అంగన్వాడీ టీచర్స్ లక్ష్మీ, శంకరమ్మ, ఆశా రాజేశ్వరి, లలిత, రాజమణి, ఆయా, తల్లులు, పిల్లలు, కిశోర బాలికలు పాల్గొన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    8 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం సిరిసిల్ల ఆర్టీసీ డిపోలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ మరియు డిప్యూటీ ఆర్ ఎం భూపతి రెడ్డి పవర్‌పాయింట్ ద్వారా డ్రైవర్లకు ప్రమాదాల నివారణ, సురక్షిత డ్రైవింగ్ విధానాలు, ట్రాఫిక్ నిబంధనల పాటింపు, వేగ నియంత్రణ, అలసటతో వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాలు మరియు ప్రయాణికుల భద్రతపై సమగ్రంగా వివరించారు.ఈ కార్యక్రమంలో ఎంవిఐ వంశీధర్, ఏఎంవిఐ పృథ్వీరాజ్, వర్మ సాగర్ , నిఖిల్ , సిరిసిల్ల ఆర్టీసీ డిఎం సిరిసిల్ల ప్రకాశ్ రావు, వేములవాడ ఆర్టీసీ డిఎం శ్రీనివాస్, రీజియన్ లోని 11 డిపోల ఆర్టీసీ డ్రైవర్లు,హైర్ బస్ డ్రైవర్స్ సిరిసిల్ల డిపో హైర్ బస్సు యజమానులు పాల్గొన్నారు.ఈ అవగాహన కార్యక్రమం డ్రైవర్లలో రోడ్డు భద్రతపై మరింత చైతన్యం కలిగించేలా విజయవంతంగా నిర్వహించబడింది.
    4
    రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం
సిరిసిల్ల ఆర్టీసీ డిపోలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ మరియు డిప్యూటీ ఆర్ ఎం భూపతి రెడ్డి పవర్‌పాయింట్ ద్వారా డ్రైవర్లకు ప్రమాదాల నివారణ, సురక్షిత డ్రైవింగ్ విధానాలు, ట్రాఫిక్ నిబంధనల పాటింపు, వేగ నియంత్రణ, అలసటతో వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాలు మరియు ప్రయాణికుల భద్రతపై సమగ్రంగా వివరించారు.ఈ కార్యక్రమంలో ఎంవిఐ వంశీధర్, ఏఎంవిఐ పృథ్వీరాజ్, వర్మ సాగర్  , నిఖిల్ , సిరిసిల్ల ఆర్టీసీ డిఎం సిరిసిల్ల ప్రకాశ్ రావు, వేములవాడ ఆర్టీసీ డిఎం శ్రీనివాస్, రీజియన్ లోని 11 డిపోల ఆర్టీసీ డ్రైవర్లు,హైర్ బస్ డ్రైవర్స్ సిరిసిల్ల డిపో హైర్ బస్సు యజమానులు పాల్గొన్నారు.ఈ అవగాహన కార్యక్రమం డ్రైవర్లలో రోడ్డు భద్రతపై మరింత చైతన్యం కలిగించేలా విజయవంతంగా నిర్వహించబడింది.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    23 hrs ago
  • మీరు కట్టిన కాళేశ్వరం ఏమైంది జగిత్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు నందయ్యా రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు
    1
    మీరు కట్టిన కాళేశ్వరం ఏమైంది జగిత్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు నందయ్యా రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు
    user_MD. YOUSUF ALI KHAN
    MD. YOUSUF ALI KHAN
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    20 hrs ago
  • సైబర్ నేరగాళ్ల వలలో పడి ఎవరు మోసపోవద్దు, జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ సైబర్ నేరగాళ్ల వలలో పడి ఎవరు మోసపోవద్దని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో సైబర్ జాగృతిక దివాస్ సందర్భంగా కళాశాలల విద్యార్థులకు సైబర్ నేరాలపై అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ మాట్లాడుతూ... సైబర్ నేరగాళ్లు మాయమాటలతో మోసాలు చేస్తున్నారని, అపరిచిత వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేసి వ్యక్తిగత సమాచారం అడిగితే ఇవ్వొద్దని, అంతే కాకుండా ఫోన్ కు వచ్చే మెసేజ్ లకు స్పందించి ఓటీపీలు వంటి సమాచారం చెప్పొద్దని సూచించారు. బ్యాంకు వ్యక్తిగత పిన్ నంబర్లు సైతం గోప్యంగా ఉంచుకోవాలన్నారు. దొంగతనాల నివారణకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ చేతన్ నితిన్, డీఎస్పీ రాములు, కోరుట్ల సీఐ లక్ష్మి నారాయణ, కళాశాలల ప్రిన్సిపల్, విద్యార్థులు పాల్గొన్నారు.
    1
    సైబర్ నేరగాళ్ల వలలో పడి ఎవరు మోసపోవద్దు, జగిత్యాల  ఎస్పీ అశోక్ కుమార్ 
సైబర్ నేరగాళ్ల వలలో పడి ఎవరు మోసపోవద్దని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో సైబర్ జాగృతిక దివాస్ సందర్భంగా కళాశాలల  విద్యార్థులకు సైబర్ నేరాలపై అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ మాట్లాడుతూ... సైబర్ నేరగాళ్లు మాయమాటలతో మోసాలు చేస్తున్నారని, అపరిచిత వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేసి వ్యక్తిగత సమాచారం అడిగితే ఇవ్వొద్దని, అంతే కాకుండా ఫోన్ కు వచ్చే మెసేజ్ లకు స్పందించి ఓటీపీలు వంటి సమాచారం చెప్పొద్దని సూచించారు. బ్యాంకు వ్యక్తిగత పిన్ నంబర్లు సైతం గోప్యంగా ఉంచుకోవాలన్నారు. దొంగతనాల నివారణకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ చేతన్ నితిన్, డీఎస్పీ రాములు, కోరుట్ల సీఐ లక్ష్మి నారాయణ, కళాశాలల ప్రిన్సిపల్, విద్యార్థులు పాల్గొన్నారు.
    user_Vsk
    Vsk
    Metpalli, Jagitial•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.