Shuru
Apke Nagar Ki App…
కోరుట్ల పీబీ గార్డెన్స్‌లో "సైబర్ జాగృతిక దివాస్ జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
MD. YOUSUF ALI KHAN
కోరుట్ల పీబీ గార్డెన్స్‌లో "సైబర్ జాగృతిక దివాస్ జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
More news from తెలంగాణ and nearby areas
- ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యం: ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన, సకాలంలో వైద్య సేవలు అందించాలని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవల తీరును సమీక్షించారు. ఆసుపత్రిలోని వివిధ వార్డులను పరిశీలించి చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, వైద్య సిబ్బంది పనితీరు, ఇతర సౌకర్యాల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. రోజురోజుకు రోగుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ సిటీ స్కాన్ యంత్రం పనిచేయకపోవడం, ఎక్స్‌రే ఫిలింల కొరత ఉండడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమస్యలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి సిటీ స్కాన్ మరమ్మతులు చేపట్టడంతో పాటు ఎక్స్‌రే ఫిలింల కొరత లేకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ నిధులు రూ. 25 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ ఆసుపత్రి భవనం పూర్తయిందని, ప్రారంభోత్సవం అనంతరం ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. దీంతో జిల్లా ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయని పేర్కొన్నారు. ఆసుపత్రి ఆవరణను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్‌ను ఆదేశించారు. ప్రతిరోజూ ఫాగింగ్ నిర్వహించాలని సూచించారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించడంతో పాటు రోగులతో ఆప్యాయంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ స్థానిక కౌన్సిలర్ గంజి రాజు, కౌన్సిలర్లు జింక సూరి, శ్రీరామోజు నరేష్, ఈశ్వర్, అర్జున్, విఠల్, సూరజ్, సాత్విక్, BJYM జిల్లా అధ్యక్షులు నిరంజన్ రెడ్డి, బీజేపీ నాయకులు జుట్టు దినేష్, జాప ప్రసాద్, కందుల హరీష్, అచ్యుత్ రావు, తో పాటు వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1
- *శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు* *రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనులను పరిశీలించిన విప్* *--రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్* శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు..దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ విస్తరణ, తూర్పు గోపుర నిర్మాణం, అన్విటి మండపం తదితర పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రతిపాదనలు, జిల్లా మంత్రులు సహకారంతో రాజన్న ఆలయ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే మంజూరైన రూ.150 కోట్లకు అదనంగా ఇటీవల రూ.99.40 కోట్లు విడుదల కావడంతో పనులను మరింత వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు... ప్రస్తుతం ఆలయ అభివృద్ధి పనుల్లో సుమారు 55 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించినట్లు విప్ తెలిపారు. తూర్పు గోపురాన్ని సుమారు 95 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్నామని, ఇందుకు అవసరమైన కృష్ణశిలలను దశలవారీగా సమీకరిస్తున్నామని చెప్పారు. మిగిలిన శిలలను కూడా త్వరితగతిన తెప్పించి పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. అన్విటి మండపం విస్తరణ పనులను కూడా ప్రణాళిక ప్రకారం కొనసాగిస్తున్నామని, ఆలయానికి వచ్చే భక్తులకు త్వరిత దర్శనం కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి సమీక్షలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజన్న ఆలయ అభివృద్ధి పురోగతిపై ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారని పేర్కొన్నారు. వేములవాడలో పర్యాటక అభివృద్ధిలో భాగంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో రూ.12 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన పార్కును ఇటీవల ప్రారంభించినట్లు గుర్తు చేశారు. అలాగే పట్టణ అభివృద్ధిలో భాగంగా రూ.47 కోట్లతో రోడ్ల విస్తరణ పనులు కొనసాగుతున్నాయని, బద్ది పోచమ్మ ఆలయాన్ని సుమారు రూ.10 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. త్వరలో శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ విధూశేఖర భారతి స్వామి వారిని కలిసి ఇప్పటివరకు పూర్తైన అభివృద్ధి పనులను వివరించి, మిగిలిన పనులపై వారి సూచనలు, అనుమతులు తీసుకుంటామని వెల్లడించారు. బాసర నుంచి భద్రాచలం వరకు ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు..రాజన్న ఆలయానికి ఇప్పటివరకు మొత్తం రూ.249.40 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని విప్ స్పష్టం చేశారు.4
- డ్రైనేజీలు లేక ఇబ్బంది పడుతున్న శివారు కాలనీల వాసులు..... జన్నారం పట్టణంలోని శివారు కాలనీలలో డ్రైనేజీలు, తదితర మౌలిక సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణ శివారులోని గాంధీనగర్, సుందరయ్య నగర్, శ్రీలంక కాలనీ, వరద బాధితుల కాలనీ, రామాలయం కొత్త కాలనీ, తదితర శివారు కాలనీలలో రోడ్లు, డ్రైనేజీలు సరిగ్గా లేవు. దీంతో ఆయా కాలనీలలో వర్షాకాలంలో ఇబ్బందులు తప్పడం లేదని ప్రజలు వాపోతున్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆయా కాలనీలలో వరద నీరు రోడ్లపైనే ప్రవహిస్తోందన్నారు. ప్రజలు వినియోగించిన నీరు సైతం రోడ్ల పక్కన ప్రవహించడంతో దుర్గంధ వాసన వస్తుందని స్థానికులు వాపోయారు. ఇప్పటికైనా పంచాయతీ పాలకవర్గ సభ్యులు శివారు కాలనీలలో అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపి మౌలిక సౌకర్యాలు కల్పించాలని వారు కోరుతున్నారు.1
- యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు నామినేట్ లో అవకాశం కల్పిస్తాం యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి, తెలంగాణ ఇంచార్జీ రోషిణి జైశ్వాల్. యూత్ కాంగ్రెస్ లో కష్టపడ్డ ప్రతీ కార్యకర్తకు సరైన గుర్తింపు ఉంటుందని, త్వరలో చేపట్టే నామినేట్ పోస్టుల్లో అవకాశం కప్పిస్తామని యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి, తెలంగాణ ఇంచార్జీ రోషిణి జైశ్వాల్ అన్నారు. కరీంనగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ సమీక్ష సమావేశం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం లో జిల్లా రివ్యూ మీటింగ్ అధ్యక్షులు ముత్యం శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రోషిణి, రాష్ట్ర ఉపాధ్యక్షులు దీపక్ ప్రజ్ఞ, థామస్ మరియు కరీంనగర్ జిల్లా ఇంచార్జి తేజస్విని, జోసెఫ్ మరియు జిల్లా వైస్ ప్రెసిడెంట్ గుర్రం వాసు, అసెంబ్లీ అధ్యక్షులు అట్లా అనిల్, కృప సాగర్, నగర అధ్యక్షులు విశాల్, వివిధ కమిటీ బాధ్యులు ఫహద్ ,తల్లపెల్లి శ్రీకాంత్, తోర్తి అరవింద్, జక్కుల అఖిలేష్, బుర్ర రాహుల్, తదితరులు పాల్గొన్నారు1
- సింగరేణి విద్యుత్ సరఫరా పునరుద్దరించకుంటే ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడిస్తాం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ రక్షణ సేన బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ బోడ జనార్దన్ అన్నారు. ఇటీవల బెల్లంపల్లి పట్టణంలోని పలు బస్తీలలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పర్యటించినప్పుడు సమస్యలను గుర్తించినట్లు తెలిపారు. ముఖ్యంగా సింగరేణి విద్యుత్ సరఫరా లేక సింగరేణి కార్మికులు, కార్మికేతర కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. స్థానికంగా ఎమ్మెల్యే లేకపోవడం, సింగరేణి జనరల్ మేనేజర్ పట్టించుకోకపోవడంతో చాలా కుటుంబాలు చీకట్లో మగ్గుతున్నాయన్నారు. సింగరేణి జిఎం మానవతా దృక్పథంతో స్పందించి సింగరేణి కార్మికులు, కార్మికేతర్లు ప్రభుత్వ విద్యుత్ కనెక్షన్ తీసుకునేంత వరకు సింగరేణి విద్యుత్తును పునరుద్దరించాలని కోరారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా ఎమ్మెల్యే గడ్డం స్థానికంగా ఉండి సింగరేణి జిఎంతో, ఇటు ప్రభుత్వం విద్యుత్ సంస్థ ఏఈతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.1
- "కన్యక పరమేశ్వరి ఆలయంలో ఆషాడ మాస పూజలు" ఆషాడ మాసం సందర్భంగా బీబీ పేటలో శ్రీ నగరేశ్వర దేవాలయంలో ప్రతిష్టించబడిన శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారికి ఈరోజు శాకాంబరి అలంకారం మరియు వాసవి మహిళలు అందరూ గోరింటాకు పూజ కార్యక్రమం అనంతరం తీర్థ ప్రసాదాలు అల్పాహారం స్వీకరించారు,తదుపరి ఆర్యవైశ్య మహిళలు సభ్యులందరికీ వనభోజన కార్యక్రమం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించబడినది ఇట్టి కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు మరియు వాసవి క్లబ్ సభ్యులు మహిళలు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు అని వాసవి క్లబ్ వైస్ గవర్నర్ బాశెట్టి నాగేశ్వర్ తెలిపారు "కన్యక పరమేశ్వరి ఆలయంలో ఆషాడ మాస పూజలు" ఆషాడ మాసం సందర్భంగా బీబీ పేటలో శ్రీ నగరేశ్వర దేవాలయంలో ప్రతిష్టించబడిన శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారికి ఈరోజు శాకాంబరి అలంకారం మరియు వాసవి మహిళలు అందరూ గోరింటాకు పూజ కార్యక్రమం అనంతరం తీర్థ ప్రసాదాలు అల్పాహారం స్వీకరించారు,తదుపరి ఆర్యవైశ్య మహిళలు సభ్యులందరికీ వనభోజన కార్యక్రమం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించబడినది ఇట్టి కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు మరియు వాసవి క్లబ్ సభ్యులు మహిళలు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు అని వాసవి క్లబ్ వైస్ గవర్నర్ బాశెట్టి నాగేశ్వర్ తెలిపారు1
- సాంప్రదాయ పద్ధతిలో అమ్మవారికి బోనాలు సమర్పించిన భక్తులు.. నిర్మల్ లోని ద్యాగవాడ వారి ఆధ్వర్యంలో బోనాల పండుగ అత్యంత సాంప్రదాయ బద్దంగా నిర్వహించుకున్నారు. పురుషులు, మహిళలు తలపాగా పెట్టుకొని పురవీధులలో నిర్వహించిన బోనాల శోభాయాత్ర స్థానికులను ఆకర్శించింది. ఈ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. సమృద్ధిగా పాడి పంటలు పండాలని, వర్షాలు కురవాలని,అందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఏడాది తమ పూర్వీకుల కాలం నుంచి ఈ పండుగను నిర్వహించుకుంటమన్నారు.1
- అన్ని రైల్ మిల్లులలో విజిలెన్స్ దాడులు జరగాలి.సియంఆర్ బియ్యం అమ్ముకున్న వారి పైన పిడి యాక్ట్ పెట్డాలి. గుంజపడుగు హరిప్రసాద్ జిల్లా బాధ్యుడు తెలంగాణ రక్షణ సేన, కరీంనగర్ విజిలెన్స్ దాడులలో వివక్ష ఎందుకు. పెద్దవారిని వదిలి పేట్టి చిన్న రైస్ మిల్లుల మీద కేసులు పెడుతున్నారు. కరీంనగర్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పౌరసరఫరాల అధికారులు పెద్దఎత్తున అక్రమాలు చేసిన వారిని వదిలి చిన్న రైస్ మిల్లుల మీద దాడులు చేసి కేసులు పెట్టి పెద్దవారిని వదిలి పెడుతున్నారని ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. ప్రభుత్వం పెద్దలు నిర్వహించిన సమీక్ష సమావేశంలో సివిల్ సప్లయ్ వ్యవస్థకు తూట్లు పొడిచిన వారిని, అనేక అక్రమాలకు అన్యాయాలకు పాల్పడిన వారిని పక్కన కూర్చోబెట్టుకుని సమీక్ష చేయడంలో అర్థం ఏమిటని వారు అన్నారు. కరీంనగర్ జిల్లాలో సివిల్ సప్లయ్ అధికారులు మరియు కొందరు బడా రైస్ మిల్లర్లు కుమ్మక్కై ప్రజాధనాన్ని దోచుకుంటున్న తీరును ప్రతిపక్ష పార్టీ కూడ ముగబోయయిఅని ఇంతా పెద్దఎత్తున సియంఆర్ బియ్యం గల్లంతు కావడం అంటే దీనికి పూర్తి బాధ్యత అధికారులదేనని వారు అన్నారు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అక్రమార్కులకు కట్టబెడుతున్న కరీంనగర్ సివిల్ సప్లయ్ అధికారుల తీరుపై ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. ఏసీకే బకాయిదారులుటెండర్ నిబంధనల ఉల్లంఘన చేసి జిల్లాలో వందల ఏసీకే బకాయిలు ఉన్నప్పటికీ, 2022-23 రబీ సీజన్‌కు సంబంధించిన ధాన్యం వేలంలో బకాయి డబ్బులు చెల్లించని వారికి మరియు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీలలో ధాన్యం నిల్వ లేనట్లు తేలిన 25% పెనాల్టీ చెల్లించాలన్న నాటి సివిల్ సప్లై కమిషనర్ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూన్న వ్యక్తులకు మళ్లీ మళ్ళీ ధాన్యాన్ని కట్టబెట్టడంలో మతులాబు ఏమిటని వారు అన్నారు. చిన్న మిల్లర్లపై కక్షసాధింపు చర్యలు బడా మిల్లర్లకు నిబంధనలకు విరుద్ధంగా లాభం చేకురుస్తూ సామాన్య, చిన్న రైస్ మిల్లర్లపైన మాత్రం కావాలనే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం కేవలం 10 శాతం బ్యాంకు గ్యారంటీ తీసుకోవాలని స్పష్టమైన సర్క్యులర్ జారీ చేసినప్పటికీ జిల్లాలో ఆనిబంధనను పక్కనపెట్టి అధికారుల అలసత్వం ప్రదర్శించడం వెనుక భారీ కుట్ర కోణం దాగి ఉందని వారు అన్నారు. కొన్ని రైస్ మిల్లులలో స్టాక్ లేకుండానే అక్రమ షిఫ్టింగ్ కొంతమంది బడా రైస్ మిల్లర్ల వద్ద ధాన్యం నిల్వ లేకపోయినా, ఉన్నట్లు చూపించి 25% పెనాల్టీ పడకుండా పెద్ద ఎత్తున షిఫ్టింగ్ చేస్తూ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న అధికారుల పైన త్వరలోనే ఆధారాలతో సహా పిర్యాదు చేస్తామని వారు అన్నారు. కావున జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి, సమగ్ర విచారణ జరిపించి, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన అధికారులపై మరియు మిల్లర్లపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కరీంనగర్ నియోజకవర్గ ఇంచార్జ్ అంకం శివరాణి, జిల్లా నాయకులు రంగరవేణి లక్ష్మణ్, శ్రీరాముల రమేష్, కుతాడి శ్రీనివాస్, గర్షకుర్తి విద్యాసాగర్, నూతి చరణ్ తదితరులు పాల్గొన్నారు1
- రామగుండం కార్మికుల హక్కులు – స్థానిక యువత ఉద్యోగాల కోసం ఎన్టీపీసీ ఛైర్మన్‌తో ఎంపీ గడ్డం వంశీ కృష్ణ కీలక భేటీ* *రామగుండం కార్మికుల హక్కులు – స్థానిక యువత ఉద్యోగాల కోసం ఎన్టీపీసీ ఛైర్మన్‌తో ఎంపీ గడ్డం వంశీ కృష్ణ కీలక భేటీ* *న్యూఢిల్లీ:* రామగుండం ప్రాంత కార్మికుల సమస్యల పరిష్కారం, స్థానిక యువతకు ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు *గడ్డం వంశీ కృష్ణ* గారు ఎన్టీపీసీ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ *Gurdeep Singh* గారిని కలిసి పలు కీలక డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు *గ్రేడ్-బి రేటింగ్* కల్పించి న్యాయమైన వేతనాలు, సంక్షేమ ప్రయోజనాలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. కాంట్రాక్ట్ కార్మికులకు అవసరమైన *మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌ను ఈఎస్ఐ ఆసుపత్రి ద్వారా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జారీ చేసే విధానాన్ని అమలు చేయాలని* విజ్ఞప్తి చేశారు. ఈఎస్ఐ సౌకర్యం ఉన్నప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో అదనపు ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పేరుతో కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్న పరిస్థితిని వెంటనే సరిదిద్దాలని, దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు. అదేవిధంగా ఎన్టీపీసీలో నిర్మాణంలో ఉన్న *800×3 మెగావాట్ల సూపర్ థర్మల్ విస్తరణ ప్రాజెక్టులో స్థానిక యువతకే మొదటి ప్రాధాన్యం కల్పించి భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని* ఎంపీ గడ్డం వంశీ కృష్ణ గారు ఎన్టీపీసీ యాజమాన్యాన్ని గట్టిగా కోరారు.1