యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు నామినేట్ లో అవకాశం కల్పిస్తాం యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి, తెలంగాణ ఇంచార్జీ రోషిణి జైశ్వాల్. యూత్ కాంగ్రెస్ లో కష్టపడ్డ ప్రతీ కార్యకర్తకు సరైన గుర్తింపు ఉంటుందని, త్వరలో చేపట్టే నామినేట్ పోస్టుల్లో అవకాశం కప్పిస్తామని యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి, తెలంగాణ ఇంచార్జీ రోషిణి జైశ్వాల్ అన్నారు. కరీంనగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ సమీక్ష సమావేశం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం లో జిల్లా రివ్యూ మీటింగ్ అధ్యక్షులు ముత్యం శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రోషిణి, రాష్ట్ర ఉపాధ్యక్షులు దీపక్ ప్రజ్ఞ, థామస్ మరియు కరీంనగర్ జిల్లా ఇంచార్జి తేజస్విని, జోసెఫ్ మరియు జిల్లా వైస్ ప్రెసిడెంట్ గుర్రం వాసు, అసెంబ్లీ అధ్యక్షులు అట్లా అనిల్, కృప సాగర్, నగర అధ్యక్షులు విశాల్, వివిధ కమిటీ బాధ్యులు ఫహద్ ,తల్లపెల్లి శ్రీకాంత్, తోర్తి అరవింద్, జక్కుల అఖిలేష్, బుర్ర రాహుల్, తదితరులు పాల్గొన్నారు
యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు నామినేట్ లో అవకాశం కల్పిస్తాం యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి, తెలంగాణ ఇంచార్జీ రోషిణి జైశ్వాల్. యూత్ కాంగ్రెస్ లో కష్టపడ్డ ప్రతీ కార్యకర్తకు సరైన గుర్తింపు ఉంటుందని, త్వరలో చేపట్టే నామినేట్ పోస్టుల్లో అవకాశం కప్పిస్తామని యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి, తెలంగాణ ఇంచార్జీ రోషిణి జైశ్వాల్ అన్నారు. కరీంనగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ సమీక్ష సమావేశం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం లో జిల్లా రివ్యూ మీటింగ్ అధ్యక్షులు ముత్యం శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రోషిణి, రాష్ట్ర ఉపాధ్యక్షులు దీపక్ ప్రజ్ఞ, థామస్ మరియు కరీంనగర్ జిల్లా ఇంచార్జి తేజస్విని, జోసెఫ్ మరియు జిల్లా వైస్ ప్రెసిడెంట్ గుర్రం వాసు, అసెంబ్లీ అధ్యక్షులు అట్లా అనిల్, కృప సాగర్, నగర అధ్యక్షులు విశాల్, వివిధ కమిటీ బాధ్యులు ఫహద్ ,తల్లపెల్లి శ్రీకాంత్, తోర్తి అరవింద్, జక్కుల అఖిలేష్, బుర్ర రాహుల్, తదితరులు పాల్గొన్నారు
- *శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు* *రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనులను పరిశీలించిన విప్* *--రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్* శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు..దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ విస్తరణ, తూర్పు గోపుర నిర్మాణం, అన్విటి మండపం తదితర పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రతిపాదనలు, జిల్లా మంత్రులు సహకారంతో రాజన్న ఆలయ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే మంజూరైన రూ.150 కోట్లకు అదనంగా ఇటీవల రూ.99.40 కోట్లు విడుదల కావడంతో పనులను మరింత వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు... ప్రస్తుతం ఆలయ అభివృద్ధి పనుల్లో సుమారు 55 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించినట్లు విప్ తెలిపారు. తూర్పు గోపురాన్ని సుమారు 95 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్నామని, ఇందుకు అవసరమైన కృష్ణశిలలను దశలవారీగా సమీకరిస్తున్నామని చెప్పారు. మిగిలిన శిలలను కూడా త్వరితగతిన తెప్పించి పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. అన్విటి మండపం విస్తరణ పనులను కూడా ప్రణాళిక ప్రకారం కొనసాగిస్తున్నామని, ఆలయానికి వచ్చే భక్తులకు త్వరిత దర్శనం కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి సమీక్షలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజన్న ఆలయ అభివృద్ధి పురోగతిపై ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారని పేర్కొన్నారు. వేములవాడలో పర్యాటక అభివృద్ధిలో భాగంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో రూ.12 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన పార్కును ఇటీవల ప్రారంభించినట్లు గుర్తు చేశారు. అలాగే పట్టణ అభివృద్ధిలో భాగంగా రూ.47 కోట్లతో రోడ్ల విస్తరణ పనులు కొనసాగుతున్నాయని, బద్ది పోచమ్మ ఆలయాన్ని సుమారు రూ.10 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. త్వరలో శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ విధూశేఖర భారతి స్వామి వారిని కలిసి ఇప్పటివరకు పూర్తైన అభివృద్ధి పనులను వివరించి, మిగిలిన పనులపై వారి సూచనలు, అనుమతులు తీసుకుంటామని వెల్లడించారు. బాసర నుంచి భద్రాచలం వరకు ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు..రాజన్న ఆలయానికి ఇప్పటివరకు మొత్తం రూ.249.40 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని విప్ స్పష్టం చేశారు.4
- కోరుట్ల పీబీ గార్డెన్స్‌లో "సైబర్ జాగృతిక దివాస్ జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్1
- "కన్యక పరమేశ్వరి ఆలయంలో ఆషాడ మాస పూజలు" ఆషాడ మాసం సందర్భంగా బీబీ పేటలో శ్రీ నగరేశ్వర దేవాలయంలో ప్రతిష్టించబడిన శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారికి ఈరోజు శాకాంబరి అలంకారం మరియు వాసవి మహిళలు అందరూ గోరింటాకు పూజ కార్యక్రమం అనంతరం తీర్థ ప్రసాదాలు అల్పాహారం స్వీకరించారు,తదుపరి ఆర్యవైశ్య మహిళలు సభ్యులందరికీ వనభోజన కార్యక్రమం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించబడినది ఇట్టి కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు మరియు వాసవి క్లబ్ సభ్యులు మహిళలు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు అని వాసవి క్లబ్ వైస్ గవర్నర్ బాశెట్టి నాగేశ్వర్ తెలిపారు "కన్యక పరమేశ్వరి ఆలయంలో ఆషాడ మాస పూజలు" ఆషాడ మాసం సందర్భంగా బీబీ పేటలో శ్రీ నగరేశ్వర దేవాలయంలో ప్రతిష్టించబడిన శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారికి ఈరోజు శాకాంబరి అలంకారం మరియు వాసవి మహిళలు అందరూ గోరింటాకు పూజ కార్యక్రమం అనంతరం తీర్థ ప్రసాదాలు అల్పాహారం స్వీకరించారు,తదుపరి ఆర్యవైశ్య మహిళలు సభ్యులందరికీ వనభోజన కార్యక్రమం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించబడినది ఇట్టి కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు మరియు వాసవి క్లబ్ సభ్యులు మహిళలు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు అని వాసవి క్లబ్ వైస్ గవర్నర్ బాశెట్టి నాగేశ్వర్ తెలిపారు1
- స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను ప్రతి ఒక్కరు ప్రతిష్టాత్మకంగా తీసుకొని త్వరిత గతిన పూర్తి చేయాలి వైద్యుల అంజన్ కుమార్ *డివిజన్ అధ్యక్షులు ఆగస్టు 15వ తారీకు లోపు డివిజన్ కమిటీలు నియమించాలి* *పార్టీ బలోపేతం కోసం ప్రతి నెలలో మూడుసార్లు సమావేశాలు ఏర్పాటు చేసుకుందాం* స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను ప్రతి ఒక్కరు ప్రతిష్టాత్మకంగా తీసుకొని త్వరిత గతిన పూర్తి చేయాలి వైద్యుల అంజన్ కుమార్ కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ అధ్యక్షతన జరిగిన డివిజన్ అధ్యక్షులు,కార్యవర్గ సభ్యుల సమావేశం లో అంజన్ కుమార్ మాట్లాడుతూ.. ఈరోజు మీటింగు ప్రధాన కారణం డివిజన్ అధ్యక్షులు డివిజన్ కమిటీలు ఆగస్టు 15వ తారీకు లోపు పూర్తి చేసి నగర కాంగ్రెస్ కార్యాలయంలో అందజేయాలి. కమిటీలో మహిళలకు 33 శాతం ప్రాధాన్యత ఇస్తూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గాలతో 21 మందితో కమిటీ వేయాలి. పని విభజనలో భాగంగా 10 డివిజన్లకు ఇన్చార్జిగా నియమించడం జరుగుతుంది. వీరు ఆయా డివిజన్లోని కార్యకర్తలను డివిజన్ అధ్యక్షులను కార్యవర్గ సభ్యులను సమన్వయ పరుస్తూ బాధ్యతలు నిర్వహిస్తారు. పార్టీ పటిష్టంగా ఉంటేనే, ప్రతిష్టంగా ఉంటాం, పార్టీ మనకేం చేసిందని కాదు, పార్టీకి మనమేం చేసినామని ఆలోచించాలి, మీరందరూ నాయకులుగా ఎదగాలి, దానికోసం ప్రతి ఒక్కరు శ్రమించాలి. అధిష్టానం పార్టీ టికెట్ ఎవరికీ ఇచ్చిన అందరూ కలిసి అభ్యర్థిని గెలిపించుకోవాలి, పార్టీ మీ మీద నమ్మకంతో బాధ్యతలు ఇచ్చింది. మీ అందరి మీద గురుతరమైన బాధ్యత ఉంది. డివిజన్ ప్రెసిడెంట్లు, కార్యవర్గ సభ్యులు వరుసగా మూడు కార్యక్రమాలకు హాజరు కాకపోతే వారిని పదవుల నుండి తొలగించడం జరుగుతుంది. సర్ కార్యక్రమంలో భాగంగా దీన్ని ప్రతి ఒక్కరు ప్రతిష్టాత్మకంగా తీసుకొని, అర్హులైన ప్రతి ఒక్క ఓటరును ఎన్రోల్ చేయించాలి, అనార్హులైన ఓటర్లను తొలగించే వరకు పోరాడాలి ఇది మీ బాధ్యత అని అన్నారు. ఈ సమావేశంలో నాయకులుఈ పర్వత మల్లేశం, కాంతాల జగన్ రెడ్డి, మడుపు మోహన్, కామ్ రెడ్డి రామ్ రెడ్డి,వంగల విద్యాసాగర్, గంట కళ్యాణి,మూల రవీందర్ రెడ్డి, నేహాల్, ఇమ్రాన్, కిమ్ ఫహాద్ ,కోడూరు రవీందర్ గౌడ్, దన్న సింగ్,కుంభాల రాజకుమార్,కలీముద్దీన్, రేగొండ సందీప్, పొన్నం మధు, అమేర్,వసీం,సరిల్ల రతన్ రాజు, మిరియాల రవీందర్ రెడ్డి, మూల జైపాల్, లైక్,గడప అజయ్,కంకణాల అనిల్ కుమార్ గుప్తా, కొలగాని అనిల్,సత్తినేని శ్రీకాంత్, బషీరుద్దీన్, అహమ్మద్ అలీ, హాజీ, సాయిని తిరుపతి, ఖదీర్, దండి రవీందర్,మంద మహేష్, ఇమ్రాన్ఘని,కపిల్ మాధవ్, పెంట శేఖర్, అట్టేపు వేణు,శిల్ప,రోళ్ళ సతీష్, జీలకర్ర రమేష్,చిలుక హనుమంత రెడ్డి, జ్యోతి రెడ్డి, వీర దేవేందర్, మాలోతు మహాలక్ష్మి, మాజీద్ అలీ ఖాన్, రాహుల్, అందే శంకర్, హైమద్, స్వప్న శ్రీ, పాషా,3
- కరీంనగర్ జిల్లాలో అలుగు పారుతున్న నాగులమల్యాల కొత్తచెరువు... గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా నీటి తరలింపుతో వరద కాలువ ద్వారా వచ్చిన నీటితో కొత్తపల్లి మండలం నాగుల మల్యాల కొత్తచెరువు జలకళను సంతరించుకుంది. కొత్తచెరువు పూర్తిస్థాయిలో నిండి అలుగు పారుతుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. అలుగు పారిన కొత్తచెరువును కరీంనగర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సందర్శించి సంబరాలు నిర్వహించారు. గంగమ్మకు పూలభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు గోదావరి జిల్లాలు మెడ్ మానేరు తరలించడం జరుగుతుందని తద్వారా కొత్త చెరువు నిండి అలుగు పారుతుందని స్పష్టం చేశారు. కాళేశ్వరం జలాలు అంటూ ప్రధాన ప్రతిపక్షం టిఆర్ఎస్ రాజకీయం చేస్తుందని ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలు మాత్రమే మిడ మానేరుకు వస్తున్నాయని స్పష్టం చేశారు. ఎల్ నేను ఎఫెక్ట్తో వర్షాబావ పరిస్థితులు నెలకొని కరువు వస్తుందని ఆందోళన చెందిన రైతులకు వరుడు కరుణించి కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించే పరిస్థితి వచ్చిందని తెలిపారు.2
- మీరు కట్టిన కాళేశ్వరం ఏమైంది జగిత్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు నందయ్యా రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు1
- నారాయణపూర్ సర్పంచ్ భర్త మధు ఆత్మహత్యాయత్నం...నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య ప్రయత్నం చేయడంతో ఆసుపత్రికి తరలింపు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ సర్పంచ్ భర్త దీకొండ మందు ఆత్మహత్యకు యత్నించడం కలకలం సృష్టిస్తుంది. గ్రామ సభలో గ్రామ సర్పంచిని సర్పంచ్ భర్త మధును టార్గెట్ చేసి కొందరు ప్రజలను రెచ్చగొట్టి అవమానకరంగా మాట్లాడడంతో సర్పంచ్ భర్త నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో మధును చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైతే హైదరాబాద్ కు తరలించాలని సూచించారు. సర్పంచ్ గెలిచినప్పటి నుంచి కొందరు వివక్షత చూపుతు అవమానకరంగా వ్యవహరించడంతోనే మధు ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం ముంపు గ్రామంగా ప్రకటించక కొంతవరకే పరిహారం ఇవ్వడంతో అక్కడ బాధితులు రెండు వర్గాలుగా విడిపోయి రాజకీయంగా విమర్శలు ఈ సంఘటనకు దారి తీసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. దశలవారీగా ముంపు గ్రామంగా ప్రకటించి పూర్తి పరిహారం అందిస్తామని ఇలా సర్పంచ్ పై నిందలు వేసి ఆయన ఆత్మహత్యకు పురిగోల్పడం సమంజసంకాదన్నారు.3