Shuru
Apke Nagar Ki App…
జి.మాడుగుల మండలం ఇందుగుల గ్రామంలో కనీస వసతులు కరువయ్యాయి. 79 ఏళ్ల స్వాతంత్ర్యంలోనూ రోడ్డు మార్గం లేకపోవడంతో పీఎం జన్మన్ ఇళ్ల నిర్మాణానికి కిలోమీటరు మేర సామగ్రిని గిరిజనులు కాలినడకన మోస్తున్నారు. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వీడాలని, తక్షణమే గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించాలని హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
Shyam
జి.మాడుగుల మండలం ఇందుగుల గ్రామంలో కనీస వసతులు కరువయ్యాయి. 79 ఏళ్ల స్వాతంత్ర్యంలోనూ రోడ్డు మార్గం లేకపోవడంతో పీఎం జన్మన్ ఇళ్ల నిర్మాణానికి కిలోమీటరు మేర సామగ్రిని గిరిజనులు కాలినడకన మోస్తున్నారు. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వీడాలని, తక్షణమే గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించాలని హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
More news from Kakinada and nearby areas
- పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చెందుర్తి సమీపంలో జాతీయ రహదారిపై వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు,రోడ్డు పక్కన ఉన్న హైవే మెయింటెనెన్స్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం ప్రత్తిపాడు ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం... బస్సు అతివేగంగా ఉండటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై ట్రాఫిక్‌ను క్లియర్ చేసి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.2
- 🙏😭 పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏😭1
- సూరంపాలెంలో చెరువు దోపిడీ బహిర్గతం – రాత్రివేళల్లో వందల లారీలతో అక్రమ తవ్వకాలు! 📍 వార్త వివరాలు: Aditya Engineering College సమీపంలోని చెరువులో భారీ స్థాయిలో అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్టు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాత్రి అంధకారాన్ని ఆసరాగా చేసుకుని ఎక్స్కవేటర్ల సహాయంతో చెరువులోని మట్టి, ఇసుకను భారీగా తవ్వి వందలాది లారీల ద్వారా తరలిస్తున్న దృశ్యాలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. స్థానికుల సమాచారం ప్రకారం, ప్రతి రోజు రాత్రి సమయంలో లారీలు వరుసగా వచ్చి చెరువును ఖాళీ చేస్తుండగా, భారీ యంత్రాల గర్జనలు ఆ ప్రాంతాన్ని కుదిపేస్తున్నాయి. ఈ తవ్వకాల కారణంగా చెరువు ఆకృతి మారిపోతూ, పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం నెలకొంది. ఇంత పెద్ద స్థాయిలో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నప్పటికీ, సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారుల నిర్లక్ష్యమా? లేక ఎవరి సహకారంతో ఈ దోపిడీ కొనసాగుతోందా? అన్న ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణకు కీలకమైన చెరువులు ఇలాగే నాశనం అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇది కేవలం అక్రమ తవ్వకం మాత్రమే కాకుండా, భవిష్యత్తులో నీటి కొరతకు దారితీసే తీవ్రమైన సమస్యగా మారే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ అక్రమ తవ్వకాలపై వెంటనే దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇకైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి చెరువును రక్షించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.1
- Post by Meenakshi1
- పాతపట్నంలోని శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయం వద్ద జాతీయ రహదారిపై ఓపెన్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ నిర్మాణం పూర్తయితే అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగుతాయని ఆలయ కమిటీ ఛైర్మన్ సన్యాసిరావు తెలిపారు. పనులు త్వరగా పూర్తి చేసేందుకు జాతీయ రహదారి ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.1
- శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాలి మండలంలో నౌపడ గ్రామంలో శ్రీ లక్ష్మీ నారాయణ దేవాలయంలో పాంచరాత్ర కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు దశమి ఆదివారం రోజున వైభవంగా ప్రారంభం అయ్యాయి ఈ సందర్భంగా స్వామివారి ముహూర్త పురాటా, పందిరిరాట వేసే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దేవాలయ అర్చక స్వామి ఆధ్వర్యంలో స్వామి విశేష పూజ నిర్వహించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చైత్ర శుద్ధఏకాదశి నుంచి చైత్ర పౌర్ణమి వరకు స్వామి కళ్యాణం పాంచరత కళ్యాణం నిర్వహిస్తామని, ఏకాదశి పర్వదినము రోజున శోభాయాత్ర ఊరేగింపు స్వామి తిరు కళ్యాణం నిర్వహిస్తామని అర్చకులు తెలిపారు.4
- కాకినాడ జిల్లా తుని పట్టణం శివారు కోమటి చెరువు ప్రాంతంలో ఆదివారం నాడు చేపల మార్కెట్ ను తలపించేలా మాంసాహార ప్రియులు బారులు తీరారు. చెరువులోని చేపలు పట్టి అక్కడికక్కడే వినియోగదారులకు విక్రయించడం తో స్థానికులు చేపలు కొనడానికి ఎగబడ్డారు. ఈ లైవ్ చేపలను కిలో 150 రూపాయలు చొప్పున కొనుగోలుదారులకు విక్రయించారు.1
- 🙏😭1
- 🚨 కాకినాడలో ఇంధన సంక్షోభం – భానుగుడి నుంచి SP ఆఫీస్ వరకు వాహనాల భారీ క్యూ కాకినాడ: నగరంలో ఇంధన కొరత తీవ్రరూపం దాల్చింది. ఈ రోజు ఉదయం సుమారు 7 గంటల సమయంలో భానుగుడి జంక్షన్ నుంచి ఎస్పీ ఆఫీస్ వరకు పెట్రోల్, డీజిల్ కోసం వాహనాలు కిలోమీటర్ల మేర బారులుగా నిలిచిన దృశ్యాలు కనిపించాయి. పలు పెట్రోల్ బంకుల్లో స్టాక్ లేకపోవడంతో వాహనదారులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. డీలర్లు “స్టాక్ లేదు” అంటూ వినియోగదారులను వెనక్కి పంపుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంధనం అందక ఆటో డ్రైవర్లు, ఉద్యోగులు, అత్యవసర సేవల వాహనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొంతమంది వాహనదారులు రాత్రి నుంచే క్యూ లో నిలబడినట్లు సమాచారం. స్థానికులు ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వెంటనే ఇంధన సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. 👉 అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.1