🚨 భానుగుడి నుంచి SP ఆఫీస్ వరకు వాహనాల భారీ క్యూ కాకినాడలో ఇంధన సంక్షోభం తీవ్రం ఈ రోజు ఉదయం 7 గంటల నుంచే పెట్రోల్, డీజిల్ కోసం బారులు పలు బంకుల్లో స్టాక్ లేక వాహనదారుల ఆవేదన అత్యవసర సేవలు సైతం ప్రభావితం వెంటనే సరఫరా పునరుద్ధరించాలని ప్రజల డిమాండ్ 🚨 కాకినాడలో ఇంధన సంక్షోభం – భానుగుడి నుంచి SP ఆఫీస్ వరకు వాహనాల భారీ క్యూ కాకినాడ: నగరంలో ఇంధన కొరత తీవ్రరూపం దాల్చింది. ఈ రోజు ఉదయం సుమారు 7 గంటల సమయంలో భానుగుడి జంక్షన్ నుంచి ఎస్పీ ఆఫీస్ వరకు పెట్రోల్, డీజిల్ కోసం వాహనాలు కిలోమీటర్ల మేర బారులుగా నిలిచిన దృశ్యాలు కనిపించాయి. పలు పెట్రోల్ బంకుల్లో స్టాక్ లేకపోవడంతో వాహనదారులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. డీలర్లు “స్టాక్ లేదు” అంటూ వినియోగదారులను వెనక్కి పంపుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంధనం అందక ఆటో డ్రైవర్లు, ఉద్యోగులు, అత్యవసర సేవల వాహనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొంతమంది వాహనదారులు రాత్రి నుంచే క్యూ లో నిలబడినట్లు సమాచారం. స్థానికులు ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వెంటనే ఇంధన సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. 👉 అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

- పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చెందుర్తి సమీపంలో జాతీయ రహదారిపై వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు,రోడ్డు పక్కన ఉన్న హైవే మెయింటెనెన్స్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం ప్రత్తిపాడు ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం... బస్సు అతివేగంగా ఉండటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై ట్రాఫిక్‌ను క్లియర్ చేసి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.2
- 🙏😭1
- Post by CHIYAAN1
- కాకినాడ జిల్లా తుని పట్టణంలో ఉన్న బంకుల్లో డీజిల్ కొరత తీవ్రంగా ఉందని కొనుగోలుదారులు వాపోతున్నారు.పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేశారు.ఏ బంక్ కి వెళ్లిన నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడం తో కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.అధికారులు ఆయిల్ కొరత లేదని చెప్తున్నా బొంకుల్లో ఆయిల్ సరఫరా లేదు.అధికారులు స్పందించి వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా యధావిధిగా ఆయిల్ సరఫరా చేయాలని కోరుతున్నారు. ఆదివారం కావడంతో పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొరత ఉందని వార్తలతో వాహనదారులు బారులు తీరారు.1
- Post by Syambabu6
- Post by V Ramarao4
- 🙏😭1
- పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. శనివారం నాడు పర్యటించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ పనులను క్షేత్రస్థాయిలో పర్యటించి ఆయన పరిశీలించారు. అనంతరం కాలువ నిర్మాణ పనులను డ్రోన్ విజువల్స్ తో పర్యవేక్షించారు. అనంతరం మంత్రి రామనాయుడు పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పోలవరం ప్రధాన ఎడమ కాలువ పనులు వీడియో ద్వారా మీరు వీక్షించవచ్చు.1
- Post by Shyam1