Shuru
Apke Nagar Ki App…
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. పలుచోట్ల పెట్రోల్ బంకులు పూర్తిగా ఖాళీ కావడంతో వాహనదారులు గంగారం ప్రాంతంలోని బంక్‌లకు భారీగా తరలివస్తున్నారు. క్యాన్లతో పాటు వాహనాలు తండోపందాలుగా రావడంతో రోడ్లపై భారీ ట్రాఫిక్ సమస్య నెలకొంది. గంగారం బెటాలియన్ బంక్ వద్ద పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి బెటాలియన్ పోలీసులు రంగంలోకి దిగారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ప్రతి వాహనానికి, క్యాన్లకు క్రమబద్ధంగా పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తూ పరిస్థితిని నియంత్రించారు.
V Ramarao
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. పలుచోట్ల పెట్రోల్ బంకులు పూర్తిగా ఖాళీ కావడంతో వాహనదారులు గంగారం ప్రాంతంలోని బంక్‌లకు భారీగా తరలివస్తున్నారు. క్యాన్లతో పాటు వాహనాలు తండోపందాలుగా రావడంతో రోడ్లపై భారీ ట్రాఫిక్ సమస్య నెలకొంది. గంగారం బెటాలియన్ బంక్ వద్ద పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి బెటాలియన్ పోలీసులు రంగంలోకి దిగారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ప్రతి వాహనానికి, క్యాన్లకు క్రమబద్ధంగా పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తూ పరిస్థితిని నియంత్రించారు.
More news from తెలంగాణ and nearby areas
- Post by V Ramarao4
- ఏలూరు జిల్లా పెదపాడు మండలం తాళ్లమూడి గ్రామానికి చెందిన కంభం శ్వేత 14 అనే బాలిక ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో అనారోగ్య సమస్యలతో ఏలూరు సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. అప్పటినుండి చికిత్స పొందుతున్న బాలిక హఠాత్తుగా ఆదివారం సాయంత్రం నోటి నుండి ముక్కు నుండి నురగ కక్కుతూ మృతి చెందింది. బాలిక మృతికి ఏలూరు సర్వజన ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమేనని ఆరోపిస్తూ బంధువులు ఎమర్జెన్సీ వద్ద ఆందోళన చేపట్టారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- Post by Syambabu6
- అమరావతి .. ఆర్యవైశ్య కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆదివారం అమ్మవారికి పుట్టినరోజు సందర్భంగా తెల్లవారు జామున నాలుగు గంటలకు గణపతి కి అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారికి పంచామృతాభిషేకాలు చేపట్టారు.అత్యంత వైభవంగా ఆలయ అర్చకులు ఈచర్ల బాలాజీ అమ్మవారిని అలంకరించారు. విచ్చేసిన భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కలిగించారు. ఆలయ కమిటీ వారు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆర్యవైశ్య మహిళా మండలి వారు అమ్మవారు లలితా సహస్రనామం పూజలు నిర్వహించారు. అమ్మవారికి లక్ష మల్లెల అర్చన అత్యంత వైభవంగా ఆర్యవైశ్య మహిళలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అధ్యక్షుడు చేగు రాము సెక్రెటరీ పసుమర్తి సుబ్బారావు గౌరవ అధ్యక్షులు పారేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యక్షులు పెండ్యాల శ్రీనివాసరావు పులిపాటి పవన్ కుమార్ కొప్పురావూరి గణేష్ తదితరులు పాల్గొన్నారు.2
- Post by CHIYAAN1
- మహబూబాబాద్ జిల్లా, కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు 15 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. గ్రామానికి చెందిన రైతులు కొమురయ్య (3 ఎకరాలు), సురేష్ (2 ఎకరాలు), ఐలయ్య (3 ఎకరాలు), జక్కుల కట్టమల్లు (3 ఎకరాలు), పుణ్యపుర్తి ఐలయ్య (4 ఎకరాలు)లకు చెందిన పంటలు మంటల్లో కాలిపోయాయి. ఒక్కసారిగా పొలాల్లో మంటలు వ్యాపించడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖకు తెలియజేయగా, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే పెద్ద మొత్తంలో పంట నష్టం జరిగిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో బాధిత రైతులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన పరిహారం అందించాలని కోరుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు ఘటన పై విచారణ ప్రారంభించారు.1
- హజ్ యాత్రకు బయలుదేరిన ముస్లిం సోదరునికి హిందూ సోదరుల సన్మానం.. గుంటూరులో మతసామరస్యం వెళ్లి విరిసింది. హజ్ యాత్రకు బయలుదేరుతున్న ఆర్టీసీ శుభానికి హిందూ సోదరులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు . హజ్ యాత్రకు బయలుదేరుతున్న ఆయన యాత్ర సుఖవంతంగా జరగాలని ప్రార్థన నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు1
- అమరావతి:ఆర్యవైశ్య కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి పుట్టినరోజు సందర్భంగా తెల్లవారుజామున నాలుగు గంటలకు గణపతి కి అభిషేకాలు చేశారు.అమ్మవారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు.అమ్మవారిని అత్యంత వైభవంగా ఆలయ అర్చకులు ఈచర్ల బాలాజీ అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు.ఆలయ కమిటీ వారు తీర్థ ప్రసాదాలు అందించారు.1