క్విట్ ఇండియా స్ఫూర్తితో బూర్గంపాడు లో జైల్ బోరో కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాస్తారోకో కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాస్తారోకో.. పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బూర్గంపాడు, ఆగస్టు 10: క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం బూర్గంపాడు మండల కేంద్రంలో రాస్తారోకో, జైల్‌భరో కార్యక్రమం నిర్వహించారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాస్తారోకో నిర్వహిస్తున్న ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని వాహనాల్లో పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, కేవీపీఎస్ మండల కార్యదర్శి రాయల వెంకటేశ్వర్లుతో పాటు పలువురిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేయాలి ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలకు నష్టం కలిగించే విధానాలను అమలు చేస్తోందని ఆరోపించారు. నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లు-2025ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీని నిర్వీర్యం చేయొద్దు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్ర నిధుల వాటాలో మార్పులు తీసుకురావడం వల్ల వ్యవసాయ కూలీలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి కూలీలకు నిరంతర ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందలను రద్దు చెయ్యాలని విదేశాల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులు వల్ల దేశీయ రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. పత్తి దిగుమతుల కారణంగా దేశీయ పత్తి రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు దేశంలో పండుతున్న వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను చట్టబద్ధంగా బద్దంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు,కార్మికులు, వ్యవసాయ కూలీల హక్కుల పరిరక్షణ కోసం ప్రజా ఉద్యమాలను మరింత ఉదృతం చేస్తామని బత్తుల వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షురాలు ఎస్.కె అబిద, సిఐటియు మండల నాయకులు ఐద్వా మండల కార్యదర్శి పాపినేని సరోజన, కెవిపిఎస్ కార్యదర్శి రాయల వెంకటేశ్వర్లు, రైతు సంఘం మండల కార్యదర్శి కందుకూరి నాగేశ్వరరావు, మరియమ్మ, నిమ్మల అప్పారావు, ప్రదీప్, అదూరి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

- కర్రెగుట్టలను సందర్శించిన డీజీపీ సి వి ఆనంద్ ములుగు జిల్లాలో మొరుమూరు ప్రాంతంలోని కర్రెగుట్టలను సోమవారం సందర్శించిన తెలంగాణ రాష్ట్ర డిజిపి సివి ఆనంద్.1
- శ్రీరంగపట్నం కంబాల బంగారు కానుక మరియు పట్టు చీరలు పంపిణీ వేలాదిమంది మహిళలకు చీరలు పంపిణీ1
- మోడీని గద్దె దించాలి.. దేశాన్ని కాపాడాలి! కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఎం శ్రేణుల భగ్గుమన్న నిరసన నేషనల్ హైవేపై గంటపాటు రాస్తారోకో.. కార్యకర్తల అరెస్టు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో దంతాలపల్లి మండల కేంద్రంలో సోమవారం భారీ నిరసన చేపట్టారు. “మోడీ హటావో.. దేశ్ కీ బచావో” నినాదాలతో సీపీఎం అనుబంధ కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక, మహిళా, అంగన్‌వాడీ, ఆశా తదితర ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కారు. బస్టాండ్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించి అనంతరం నేషనల్ హైవేపై రాస్తారోకో చేపట్టారు. దీంతో హైవేపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు గంటపాటు రాస్తారోకో కొనసాగడంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. అనంతరం ఆందోళనకారులను అరెస్టు చేసి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆకుల రాజు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసే విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు. కేంద్రం తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక నల్ల చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని కోరారు.వ్యవసాయ కూలీలకు నష్టం కలిగించే విధంగా ఉపాధి హామీ పథకంలో మార్పులు చేయకుండా పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలని అన్నారు.అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చే విధానాలను కేంద్ర ప్రభుత్వం విడనాడాలని ఆకుల రాజు డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలను ఎన్ని నిర్బంధాలు విధించినా అడ్డుకోలేరని స్పష్టం చేశారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులకు న్యాయం జరిగే వరకు ఐక్య పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు దుండి వీరన్న, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బాణాల రాజన్న, ప్రజా సంఘాల మండల సమన్వయ కమిటీ కన్వీనర్ బండి శ్రీనివాస్, కారపాటి వెంకన్న, కందునూరి శ్రీనివాస్, సర్వం, పునుగుటి యాదగిరి, యాకూబ్, వెంకట్ నారాయణ, రామేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.3
- బీసీలకు ఉద్యోగాలు దక్కుతున్నాయి అంటే అది పుంజాల శివ శంకర్ గారి పుణ్యానే బీసీలకు ఉద్యోగాలు దక్కుతున్నాయి అంటే అది పుంజాల శివ శంకర్ గారి పుణ్యానే బీసీలు వెనుకబడినవారు అని చెప్పి మన బీసీలకు 27% రిజర్వేషన్ కల్పించిన మహనీయుడు శివ శంకర్ గారు ఆయనే లేకపోతే బీసీల గతి ఎలా ఉండేదో1
- నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేత నర్సంపేట: దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటుకు నిర్మించిన గద్దెను మున్సిపల్ అధికారులు కూల్చివేయడం నర్సంపేటలో వివాదానికి దారితీసింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదురుగా ఉన్న ప్రైవేట్ స్థలంలో విగ్రహం ఏర్పాటు చేసేందుకు గద్దె నిర్మించినట్లు నిర్వాహకులు తెలిపారు. విగ్రహ ఏర్పాటుకు అనుమతులు లేవంటూ మున్సిపల్ అధికారులు రాత్రి సమయంలో గద్దెను కూల్చివేశారని వారు ఆరోపించారు. ప్రైవేట్ స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నప్పటికీ అనుమతి లేదనే కారణంతో అధికారులు చర్యలు తీసుకోవడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో ఆయన అభిమానులు, అనుచరులు విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. గద్దె కూల్చివేతపై బీఆర్ఎస్ శ్రేణులు, పెద్ది అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.1
- నర్సంపేటలో ఉద్రిక్తత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కూల్చివేత నర్సంపేట మండలంలోని మెడికల్ కాలేజీ ఎదురుగా పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గద్దెను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేయడంతో, ధర్నాకు దిగిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇతర బీఆర్ఎస్ శ్రేణులు ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు1