logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గంగాధర మండలంలోని మధురానగర్ గ్రామంలో గుర్తు తెలియని దుండగులు ఒక ఉపాధ్యాయుడి ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు రెండు గ్రాముల బంగారు ఉంగరాలతో పాటు, అద్దెకు ఉన్న వ్యక్తికి చెందిన ఒక పల్సర్‌ మోటార్‌ సైకిల్‌ కూడా అపహరణకు గురైంది. గ్రామానికి చెందిన బోడ్ల శ్రీనివాస్ (43) అనే ఎస్‌జీటీ ఉపాధ్యాయుడు తన పిల్లల విద్యాభ్యాసం నిమిత్తం నెల రోజుల క్రితం కుటుంబంతో కరీంనగర్‌కు మారారు. మధురానగర్‌లోని తన ఇంటి మొదటి అంతస్తును విజయ్ అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చి, ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లే సమయంలో ఇంటిని పరిశీలించేవారు. జూలై 7న సాయంత్రం 5 గంటల సమయంలో ఇంటిని చూసి వెళ్లినప్పుడు అన్నీ సక్రమంగా ఉన్నాయని శ్రీనివాస్ తెలిపారు. అయితే, బుధవారం జూలై 8న ఉదయం సుమారు 5:59 గంటలకు అద్దెదారు విజయ్ ఫోన్ చేసి ఇంటి తాళాలు పగులగొట్టినట్లు శ్రీనివాస్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న శ్రీనివాస్ ప్రధాన ద్వారం తాళాలతో పాటు ఇంట్లోని అల్మిరాల తాళాలు కూడా పగులగొట్టినట్లు గుర్తించారు. దుండగులు అల్మిరాలో ఉంచిన సుమారు 2 గ్రాముల బంగారు ఉంగరాలను దొంగిలించడంతో పాటు, అద్దెదారు విజయ్‌కు చెందిన TS 02 FJ 1298 రిజిస్ట్రేషన్ నంబర్ గల పల్సర్ మోటార్ సైకిల్‌ను కూడా ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు గంగాధర ఎస్సై వంశీకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

18 hrs ago
user_శ్రీధర్ సూర్య రిపోటర్
శ్రీధర్ సూర్య రిపోటర్
చొప్పదండి, కరీంనగర్, తెలంగాణ•
18 hrs ago

గంగాధర మండలంలోని మధురానగర్ గ్రామంలో గుర్తు తెలియని దుండగులు ఒక ఉపాధ్యాయుడి ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు రెండు గ్రాముల బంగారు ఉంగరాలతో పాటు, అద్దెకు ఉన్న వ్యక్తికి చెందిన ఒక పల్సర్‌ మోటార్‌ సైకిల్‌ కూడా అపహరణకు గురైంది. గ్రామానికి చెందిన బోడ్ల శ్రీనివాస్ (43) అనే ఎస్‌జీటీ ఉపాధ్యాయుడు తన పిల్లల విద్యాభ్యాసం నిమిత్తం నెల రోజుల క్రితం కుటుంబంతో కరీంనగర్‌కు మారారు. మధురానగర్‌లోని తన ఇంటి మొదటి అంతస్తును విజయ్ అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చి, ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లే సమయంలో ఇంటిని పరిశీలించేవారు. జూలై 7న సాయంత్రం 5 గంటల సమయంలో ఇంటిని చూసి వెళ్లినప్పుడు అన్నీ సక్రమంగా ఉన్నాయని శ్రీనివాస్ తెలిపారు. అయితే, బుధవారం జూలై 8న ఉదయం సుమారు 5:59 గంటలకు అద్దెదారు విజయ్ ఫోన్ చేసి ఇంటి తాళాలు పగులగొట్టినట్లు శ్రీనివాస్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న శ్రీనివాస్ ప్రధాన ద్వారం తాళాలతో పాటు ఇంట్లోని అల్మిరాల తాళాలు కూడా పగులగొట్టినట్లు గుర్తించారు. దుండగులు అల్మిరాలో ఉంచిన సుమారు 2 గ్రాముల బంగారు ఉంగరాలను దొంగిలించడంతో పాటు, అద్దెదారు విజయ్‌కు చెందిన TS 02 FJ 1298 రిజిస్ట్రేషన్ నంబర్ గల పల్సర్ మోటార్ సైకిల్‌ను కూడా ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు గంగాధర ఎస్సై వంశీకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • గంగాధర మండలంలోని మధురానగర్ గ్రామంలో గుర్తు తెలియని దుండగులు ఒక ఉపాధ్యాయుడి ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు రెండు గ్రాముల బంగారు ఉంగరాలతో పాటు, అద్దెకు ఉన్న వ్యక్తికి చెందిన ఒక పల్సర్‌ మోటార్‌ సైకిల్‌ కూడా అపహరణకు గురైంది. గ్రామానికి చెందిన బోడ్ల శ్రీనివాస్ (43) అనే ఎస్‌జీటీ ఉపాధ్యాయుడు తన పిల్లల విద్యాభ్యాసం నిమిత్తం నెల రోజుల క్రితం కుటుంబంతో కరీంనగర్‌కు మారారు. మధురానగర్‌లోని తన ఇంటి మొదటి అంతస్తును విజయ్ అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చి, ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లే సమయంలో ఇంటిని పరిశీలించేవారు. జూలై 7న సాయంత్రం 5 గంటల సమయంలో ఇంటిని చూసి వెళ్లినప్పుడు అన్నీ సక్రమంగా ఉన్నాయని శ్రీనివాస్ తెలిపారు. అయితే, బుధవారం జూలై 8న ఉదయం సుమారు 5:59 గంటలకు అద్దెదారు విజయ్ ఫోన్ చేసి ఇంటి తాళాలు పగులగొట్టినట్లు శ్రీనివాస్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న శ్రీనివాస్ ప్రధాన ద్వారం తాళాలతో పాటు ఇంట్లోని అల్మిరాల తాళాలు కూడా పగులగొట్టినట్లు గుర్తించారు. దుండగులు అల్మిరాలో ఉంచిన సుమారు 2 గ్రాముల బంగారు ఉంగరాలను దొంగిలించడంతో పాటు, అద్దెదారు విజయ్‌కు చెందిన TS 02 FJ 1298 రిజిస్ట్రేషన్ నంబర్ గల పల్సర్ మోటార్ సైకిల్‌ను కూడా ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు గంగాధర ఎస్సై వంశీకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    1
    గంగాధర మండలంలోని మధురానగర్ గ్రామంలో గుర్తు తెలియని దుండగులు ఒక ఉపాధ్యాయుడి ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు రెండు గ్రాముల బంగారు ఉంగరాలతో పాటు, అద్దెకు ఉన్న వ్యక్తికి చెందిన ఒక పల్సర్‌ మోటార్‌ సైకిల్‌ కూడా అపహరణకు గురైంది.

గ్రామానికి చెందిన బోడ్ల శ్రీనివాస్ (43) అనే ఎస్‌జీటీ ఉపాధ్యాయుడు తన పిల్లల విద్యాభ్యాసం నిమిత్తం నెల రోజుల క్రితం కుటుంబంతో కరీంనగర్‌కు మారారు. మధురానగర్‌లోని తన ఇంటి మొదటి అంతస్తును విజయ్ అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చి, ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లే సమయంలో ఇంటిని పరిశీలించేవారు. జూలై 7న సాయంత్రం 5 గంటల సమయంలో ఇంటిని చూసి వెళ్లినప్పుడు అన్నీ సక్రమంగా ఉన్నాయని శ్రీనివాస్ తెలిపారు. అయితే, బుధవారం జూలై 8న ఉదయం సుమారు 5:59 గంటలకు అద్దెదారు విజయ్ ఫోన్ చేసి ఇంటి తాళాలు పగులగొట్టినట్లు శ్రీనివాస్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న శ్రీనివాస్ ప్రధాన ద్వారం తాళాలతో పాటు ఇంట్లోని అల్మిరాల తాళాలు కూడా పగులగొట్టినట్లు గుర్తించారు. దుండగులు అల్మిరాలో ఉంచిన సుమారు 2 గ్రాముల బంగారు ఉంగరాలను దొంగిలించడంతో పాటు, అద్దెదారు విజయ్‌కు చెందిన TS 02 FJ 1298 రిజిస్ట్రేషన్ నంబర్ గల పల్సర్ మోటార్ సైకిల్‌ను కూడా ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఫిర్యాదు మేరకు గంగాధర ఎస్సై వంశీకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    user_శ్రీధర్ సూర్య రిపోటర్
    శ్రీధర్ సూర్య రిపోటర్
    చొప్పదండి, కరీంనగర్, తెలంగాణ•
    18 hrs ago
  • దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా నేడు కరీంనగర్‌లోని డిసిసి కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే మరియు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం గారు హాజరయ్యారు. కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య తదితరులతో కలిసి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు చిన్న వయసులోనే శాసనసభకు ఎన్నికై మంత్రిగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా, రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. 2003లో రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘమైన పాదయాత్ర చేపట్టి, 2004లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు దేశంలోనే 'సంక్షేమం' అనే పదానికి పూర్తి చిరునామాగా నిలిచారని, వారి హయాంలో పేద ప్రజలకు ఉపయోగపడేలా రాజీవ్ ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ సేవలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి ఎన్నో పథకాలు అమలు చేశారని వివరించారు. ముఖ్యంగా రైతాంగానికి అండగా నిలిచి, జలయజ్ఞం ద్వారా అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు మరియు వరద కాలువల నిర్మాణం చేపట్టిన గొప్ప నాయకుడిగా ఆయన ప్రశంసలు అందుకున్నారని తెలిపారు. వారి హయాంలోనే కరీంనగర్ జిల్లాలో శాతవాహన యూనివర్సిటీ, చొప్పదండి నియోజకవర్గంలో జేఎన్టీయూ వంటి ఎన్నో విద్యాసంస్థలను నెలకొల్పడం ద్వారా ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారని, నేటికీ కీర్తించబడుతున్నారని అన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఇంకా ఎన్నో సేవలు అందించాల్సి ఉన్నప్పటికీ, దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించి రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను శోకసంద్రంలో ముంచారని మేడిపల్లి సత్యం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి స్ఫూర్తితో సంక్షేమ పరిపాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు చూపిన పోరాట పటిమను ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అందిపుచ్చుకోవాలని కోరుతూ, కాంగ్రెస్ పార్టీకి, ప్రజలకు ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకారపు భాస్కర్ రెడ్డి, ఎండి తాజ్, మడుపు మోహన్, కర్ర సత్య ప్రసన్న, బానోతు శ్రావన్ నాయక్, వెన్న రాజమల్లయ్య, సిరాజ్ హుస్సేన్, సురేందర్ రెడ్డి ముదుగంటి, గంట శ్రీనివాస కళ్యాణి, కాంతాల జగన్ రెడ్డి, చర్ల పద్మ, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, వంగల విద్యాసాగర్, దిండిగాల మధు, మాదాసు శ్రీనివాస్, కుంభాల రాజు కుమార్, కల్వల రామ్ చందర్, షబానా మహమ్మద్, పోరండ్ల రమేష్, గడప శ్రీనివాస్, మంద మహేష్, శిల్ప, స్వప్నశ్రీ, అందే శంకర్, తోట అంజయ్య, భారీ, మూల కృష్ణారెడ్డి, నూనె గోపాల్ రెడ్డి, మాలోతు మహాలక్ష్మి, హైమద్, మహమ్మద్ చాంద్, గన్ను మహేందర్ రెడ్డి, హనీఫ్, జొన్నల రమేష్, ముక్క భాస్కర్, సత్తినేని శ్రీకాంత్, విక్టర్, శారద, కట్టెకోల ప్రభాకర్, జ్యోతి రెడ్డి, కాంపల్లి కీర్తి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
    1
    దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా నేడు కరీంనగర్‌లోని డిసిసి కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే మరియు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం గారు హాజరయ్యారు. కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య తదితరులతో కలిసి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు చిన్న వయసులోనే శాసనసభకు ఎన్నికై మంత్రిగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా, రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. 2003లో రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘమైన పాదయాత్ర చేపట్టి, 2004లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు దేశంలోనే 'సంక్షేమం' అనే పదానికి పూర్తి చిరునామాగా నిలిచారని, వారి హయాంలో పేద ప్రజలకు ఉపయోగపడేలా రాజీవ్ ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ సేవలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి ఎన్నో పథకాలు అమలు చేశారని వివరించారు. ముఖ్యంగా రైతాంగానికి అండగా నిలిచి, జలయజ్ఞం ద్వారా అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు మరియు వరద కాలువల నిర్మాణం చేపట్టిన గొప్ప నాయకుడిగా ఆయన ప్రశంసలు అందుకున్నారని తెలిపారు. వారి హయాంలోనే కరీంనగర్ జిల్లాలో శాతవాహన యూనివర్సిటీ, చొప్పదండి నియోజకవర్గంలో జేఎన్టీయూ వంటి ఎన్నో విద్యాసంస్థలను నెలకొల్పడం ద్వారా ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారని, నేటికీ కీర్తించబడుతున్నారని అన్నారు.

రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఇంకా ఎన్నో సేవలు అందించాల్సి ఉన్నప్పటికీ, దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించి రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను శోకసంద్రంలో ముంచారని మేడిపల్లి సత్యం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి స్ఫూర్తితో సంక్షేమ పరిపాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు చూపిన పోరాట పటిమను ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అందిపుచ్చుకోవాలని కోరుతూ, కాంగ్రెస్ పార్టీకి, ప్రజలకు ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నాయకులు ఆకారపు భాస్కర్ రెడ్డి, ఎండి తాజ్, మడుపు మోహన్, కర్ర సత్య ప్రసన్న, బానోతు శ్రావన్ నాయక్, వెన్న రాజమల్లయ్య, సిరాజ్ హుస్సేన్, సురేందర్ రెడ్డి ముదుగంటి, గంట శ్రీనివాస కళ్యాణి, కాంతాల జగన్ రెడ్డి, చర్ల పద్మ, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, వంగల విద్యాసాగర్, దిండిగాల మధు, మాదాసు శ్రీనివాస్, కుంభాల రాజు కుమార్, కల్వల రామ్ చందర్, షబానా మహమ్మద్, పోరండ్ల రమేష్, గడప శ్రీనివాస్, మంద మహేష్, శిల్ప, స్వప్నశ్రీ, అందే శంకర్, తోట అంజయ్య, భారీ, మూల కృష్ణారెడ్డి, నూనె గోపాల్ రెడ్డి, మాలోతు మహాలక్ష్మి, హైమద్, మహమ్మద్ చాంద్, గన్ను మహేందర్ రెడ్డి, హనీఫ్, జొన్నల రమేష్, ముక్క భాస్కర్, సత్తినేని శ్రీకాంత్, విక్టర్, శారద, కట్టెకోల ప్రభాకర్, జ్యోతి రెడ్డి, కాంపల్లి కీర్తి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    16 hrs ago
  • కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రామడుగు మండలం, వెలిచాల గ్రామంలో బుధవారం “పోలీస్ మీ కోసం” అవగాహన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన 40 సీసీటీవీ కెమెరాలను పోలీసు ఉన్నతాధికారులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సదస్సులో దాదాపు 500 మందికి పైగా గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా మాట్లాడిన పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, శాంతిభద్రతల పరిరక్షణలో మరియు నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానం, ముఖ్యంగా సీసీటీవీ కెమెరాల ప్రాధాన్యతను వివరించారు. వెలిచాల గ్రామంలో పాత కెమెరాల స్థానంలో నలభై అధునాతన సాంకేతికతతో కూడిన కొత్త సీసీటీవీ కెమెరాలను అమర్చినట్లు తెలిపారు. కమిషనరేట్ పరిధిలోని ప్రతి గ్రామం, పట్టణం, ప్రతి మూలను సీసీటీవీ నిఘా నీడలోకి తీసుకురావడమే పోలీసుల ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో కమిషనరేట్ పరిధిలో లోపాలను అధిగమిస్తూ మరో 700 కొత్త కెమెరాలను అమర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. కమీషనర్ ప్రజలకు సైబర్ నేరాలు, డ్రగ్స్, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ప్రస్తుతం సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, వాటి వల్ల జరిగే నష్టాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, యువత ఆన్‌లైన్ గేమింగ్ బారిన పడి ఆత్మహత్యలకు పాల్పడటం లేదా డబ్బులు నష్టపోవడం వంటి ఘటనలు కరీంనగర్ జిల్లాలో కూడా వెలుగు చూస్తున్నాయని, ఈ విషయంలో తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిరంతరం నిఘా ఉంచాలని ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. యువత డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాల అలవాట్లకు దూరంగా ఉండాలని, గ్రామీణ ప్రాంతాల్లో వీటి సరఫరా లేదా వాడకంపై సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 ద్వారా తెలియజేయాలని పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని ఆయన కోరారు. రహవీర్ పథకం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చి వారి ప్రాణాలు కాపాడితే ప్రభుత్వం అందించే 25 వేల రూపాయల పథకాన్ని గూర్చి కూడా అవగాహన కల్పించారు. ఈ అవగాహన కార్యక్రమం, సీసీటీవీల ఏర్పాటుకు సహకరించిన స్థానిక సర్పంచ్ వీర్ల నర్సింగ రావు, గ్రామ ప్రజాప్రతినిధులకు, అలాగే గ్రామ ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఏసీపీ విజయకుమార్, చొప్పదండి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్, యాంటీ నార్కోటిక్ యూనిట్ ఇన్స్పెక్టర్ రఫీక్, రామడుగు ఎస్సై రాజు, స్థానిక సర్పంచ్ వీర్ల నర్సింగ రావు, స్థానిక పోలీస్ సిబ్బంది మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
    4
    కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రామడుగు మండలం, వెలిచాల గ్రామంలో బుధవారం “పోలీస్ మీ కోసం” అవగాహన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన 40 సీసీటీవీ కెమెరాలను పోలీసు ఉన్నతాధికారులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సదస్సులో దాదాపు 500 మందికి పైగా గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం సందర్భంగా మాట్లాడిన పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, శాంతిభద్రతల పరిరక్షణలో మరియు నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానం, ముఖ్యంగా సీసీటీవీ కెమెరాల ప్రాధాన్యతను వివరించారు. వెలిచాల గ్రామంలో పాత కెమెరాల స్థానంలో నలభై అధునాతన సాంకేతికతతో కూడిన కొత్త సీసీటీవీ కెమెరాలను అమర్చినట్లు తెలిపారు. కమిషనరేట్ పరిధిలోని ప్రతి గ్రామం, పట్టణం, ప్రతి మూలను సీసీటీవీ నిఘా నీడలోకి తీసుకురావడమే పోలీసుల ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో కమిషనరేట్ పరిధిలో లోపాలను అధిగమిస్తూ మరో 700 కొత్త కెమెరాలను అమర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు.

కమీషనర్ ప్రజలకు సైబర్ నేరాలు, డ్రగ్స్, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ప్రస్తుతం సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, వాటి వల్ల జరిగే నష్టాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, యువత ఆన్‌లైన్ గేమింగ్ బారిన పడి ఆత్మహత్యలకు పాల్పడటం లేదా డబ్బులు నష్టపోవడం వంటి ఘటనలు కరీంనగర్ జిల్లాలో కూడా వెలుగు చూస్తున్నాయని, ఈ విషయంలో తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిరంతరం నిఘా ఉంచాలని ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. యువత డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాల అలవాట్లకు దూరంగా ఉండాలని, గ్రామీణ ప్రాంతాల్లో వీటి సరఫరా లేదా వాడకంపై సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 ద్వారా తెలియజేయాలని పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని ఆయన కోరారు. రహవీర్ పథకం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చి వారి ప్రాణాలు కాపాడితే ప్రభుత్వం అందించే 25 వేల రూపాయల పథకాన్ని గూర్చి కూడా అవగాహన కల్పించారు.

ఈ అవగాహన కార్యక్రమం, సీసీటీవీల ఏర్పాటుకు సహకరించిన స్థానిక సర్పంచ్ వీర్ల నర్సింగ రావు, గ్రామ ప్రజాప్రతినిధులకు, అలాగే గ్రామ ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఏసీపీ విజయకుమార్, చొప్పదండి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్, యాంటీ నార్కోటిక్ యూనిట్ ఇన్స్పెక్టర్ రఫీక్, రామడుగు ఎస్సై రాజు, స్థానిక సర్పంచ్ వీర్ల నర్సింగ రావు, స్థానిక పోలీస్ సిబ్బంది మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    19 hrs ago
  • కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామస్తులు తీవ్ర నిరసన చేపట్టారు. రేకొండ గ్రామం నుండి ఎగ్లాస్పూర్ గ్రామానికి వెళ్లే తొక్కుడు బండల వాగుపై బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తూ టెంటు వేసుకొని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామం చుట్టూ ఉన్న లో లెవెల్ రహదారులపై కూడా బ్రిడ్జిలను నిర్మించాలని వారు కోరారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు వాగుపై బ్రిడ్జిని నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. వర్షాకాలంలో వాగు ప్రవాహం పెరిగి, వాగుకు అవతలి వైపు ఉన్న ఊర్లకు, పంట పొలాలకు వెళ్లడానికి ఇబ్బందిగా మారుతోందని రైతులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వాగులో ఉన్న బండలు నీటి ప్రవాహానికి పాకురు పడుతుండడంతో వాటిపై నుండి వెళ్లే వాహనదారులు, రైతులు జారిపడి తీవ్ర గాయాల పాలవుతున్నారని తెలిపారు. వాగు ప్రవాహం పెరిగిన సమయంలో అవతలి వైపు వెళ్లాలంటే 10 నుండి 15 కిలోమీటర్ల దూరం తిరిగి ప్రయాణించాల్సి వస్తోందని పేర్కొన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ, ఇంతవరకు నిర్మాణం చేపట్టలేదని బిఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఈ విషయమై వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి బ్రిడ్జిల నిర్మాణం చేపట్టి తమ ఇబ్బందులను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. బ్రిడ్జిల నిర్మాణం వెంటనే చేపట్టకుంటే తీవ్ర ఆందోళనలు చేపడతామని, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
    1
    కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామస్తులు తీవ్ర నిరసన చేపట్టారు. రేకొండ గ్రామం నుండి ఎగ్లాస్పూర్ గ్రామానికి వెళ్లే తొక్కుడు బండల వాగుపై బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తూ టెంటు వేసుకొని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామం చుట్టూ ఉన్న లో లెవెల్ రహదారులపై కూడా బ్రిడ్జిలను నిర్మించాలని వారు కోరారు.

స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు వాగుపై బ్రిడ్జిని నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. వర్షాకాలంలో వాగు ప్రవాహం పెరిగి, వాగుకు అవతలి వైపు ఉన్న ఊర్లకు, పంట పొలాలకు వెళ్లడానికి ఇబ్బందిగా మారుతోందని రైతులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వాగులో ఉన్న బండలు నీటి ప్రవాహానికి పాకురు పడుతుండడంతో వాటిపై నుండి వెళ్లే వాహనదారులు, రైతులు జారిపడి తీవ్ర గాయాల పాలవుతున్నారని తెలిపారు. వాగు ప్రవాహం పెరిగిన సమయంలో అవతలి వైపు వెళ్లాలంటే 10 నుండి 15 కిలోమీటర్ల దూరం తిరిగి ప్రయాణించాల్సి వస్తోందని పేర్కొన్నారు.

గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ, ఇంతవరకు నిర్మాణం చేపట్టలేదని బిఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఈ విషయమై వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి బ్రిడ్జిల నిర్మాణం చేపట్టి తమ ఇబ్బందులను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. బ్రిడ్జిల నిర్మాణం వెంటనే చేపట్టకుంటే తీవ్ర ఆందోళనలు చేపడతామని, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    14 hrs ago
  • జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ బుధవారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో జగిత్యాల పట్టణంలోని 37వ వార్డులో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌.ఐ.ఆర్) కార్యక్రమాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఓటరికి అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి ఎస్‌.ఐ.ఆర్. ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని, ఓటర్లకు ఫారాల పంపిణీ, వివరాల నమోదు, అవగాహన కల్పన తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి అర్హులైన ఓటర్లకు ఫారాలను అందజేయాలని, ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిబంధనల ప్రకారం పని చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఓటర్ల నుంచి అందిన ఫారాలను నిర్ణీత గడువులోగా స్వీకరించి, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ ప్రక్రియలో ప్రజలు కూడా చురుకుగా పాల్గొని సరైన సమాచారం అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్, బి.ఎల్.వో లు మరియు తదితరులు పాల్గొన్నారు.
    1
    జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ బుధవారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో జగిత్యాల పట్టణంలోని 37వ వార్డులో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌.ఐ.ఆర్) కార్యక్రమాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఓటరికి అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి ఎస్‌.ఐ.ఆర్. ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని, ఓటర్లకు ఫారాల పంపిణీ, వివరాల నమోదు, అవగాహన కల్పన తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు.

ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి అర్హులైన ఓటర్లకు ఫారాలను అందజేయాలని, ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిబంధనల ప్రకారం పని చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఓటర్ల నుంచి అందిన ఫారాలను నిర్ణీత గడువులోగా స్వీకరించి, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ ప్రక్రియలో ప్రజలు కూడా చురుకుగా పాల్గొని సరైన సమాచారం అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్, బి.ఎల్.వో లు మరియు తదితరులు పాల్గొన్నారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    18 hrs ago
  • వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని, వరదలు, అగ్నిప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు 12 మంది సభ్యులతో కూడిన జిల్లా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) బృందం పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉందని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పట్టణ పరిధిలోని నాంపెళ్లి గ్రామ చెరువులో భారీ వర్షాలు, వరదలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో చేపట్టాల్సిన సహాయక చర్యలపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) సభ్యులతో కలిసి రెస్క్యూ బోటులో ప్రయాణించి, సహాయక చర్యల నిర్వహణను ఎస్పీ పరిశీలించారు. అనంతరం DRF అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేస్తూ, అత్యవసర పరిస్థితులు ఎదురైన వెంటనే వేగంగా స్పందించి ప్రజల ప్రాణాలను రక్షించేలా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. జిల్లా ప్రజలు వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, భారీ వర్షాలు, వరదలు, అగ్నిప్రమాదాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు జిల్లా పోలీసులతో పాటు DRF బృందం కూడా తక్షణమే సహాయక చర్యలకు సిద్ధంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. జిల్లా DRF బృందం వద్ద రెస్క్యూ బోటు, మోటార్, మెడికల్ స్ట్రెచర్, లైఫ్ జాకెట్లు, లైఫ్ బాయ్స్, వుడ్ కట్టర్ యంత్రాలు తదితర ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయని ఎస్పీ తెలిపారు. ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం, DRF బృందం 24×7 అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఎవరైనా ఆపదలో ఉన్నట్లు గమనించినా లేదా సహాయం అవసరమైనా వెంటనే స్థానిక పోలీసు అధికారులకు సమాచారం అందించాలని, సమాచారం అందిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభిస్తామని జిల్లా ఎస్పీ వెల్లడించారు. గత ఏడాది వర్షాకాలంలో వరదల సమయంలో, అలాగే గణేష్ నిమజ్జనాల సందర్భంగా వివిధ అత్యవసర పరిస్థితుల్లో జిల్లా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) సిబ్బంది సమయోచితంగా స్పందించి ప్రజలకు అందించిన సేవలను ఆయన అభినందించారు. అదే సేవా స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా అప్రమత్తంగా ఉంటూ ప్రతి అత్యవసర పరిస్థితిలో వేగంగా స్పందించి ప్రజల ప్రాణాలను రక్షించేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ శ్రీనివాసులు, సి.ఐ వీరప్రసాద్, ఆర్.ఐ అడ్మిన్ సురేష్, ఆర్.ఎస్.ఐ లు సాయి కిరణ్, శ్రావణ్ యాదవ్, DRF సిబ్బంది పాల్గొన్నారు.
    4
    వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని, వరదలు, అగ్నిప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు 12 మంది సభ్యులతో కూడిన జిల్లా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) బృందం పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉందని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పట్టణ పరిధిలోని నాంపెళ్లి గ్రామ చెరువులో భారీ వర్షాలు, వరదలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో చేపట్టాల్సిన సహాయక చర్యలపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) సభ్యులతో కలిసి రెస్క్యూ బోటులో ప్రయాణించి, సహాయక చర్యల నిర్వహణను ఎస్పీ పరిశీలించారు. అనంతరం DRF అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేస్తూ, అత్యవసర పరిస్థితులు ఎదురైన వెంటనే వేగంగా స్పందించి ప్రజల ప్రాణాలను రక్షించేలా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. జిల్లా ప్రజలు వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, భారీ వర్షాలు, వరదలు, అగ్నిప్రమాదాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు జిల్లా పోలీసులతో పాటు DRF బృందం కూడా తక్షణమే సహాయక చర్యలకు సిద్ధంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

జిల్లా DRF బృందం వద్ద రెస్క్యూ బోటు, మోటార్, మెడికల్ స్ట్రెచర్, లైఫ్ జాకెట్లు, లైఫ్ బాయ్స్, వుడ్ కట్టర్ యంత్రాలు తదితర ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయని ఎస్పీ తెలిపారు. ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం, DRF బృందం 24×7 అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఎవరైనా ఆపదలో ఉన్నట్లు గమనించినా లేదా సహాయం అవసరమైనా వెంటనే స్థానిక పోలీసు అధికారులకు సమాచారం అందించాలని, సమాచారం అందిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభిస్తామని జిల్లా ఎస్పీ వెల్లడించారు.

గత ఏడాది వర్షాకాలంలో వరదల సమయంలో, అలాగే గణేష్ నిమజ్జనాల సందర్భంగా వివిధ అత్యవసర పరిస్థితుల్లో జిల్లా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) సిబ్బంది సమయోచితంగా స్పందించి ప్రజలకు అందించిన సేవలను ఆయన అభినందించారు. అదే సేవా స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా అప్రమత్తంగా ఉంటూ ప్రతి అత్యవసర పరిస్థితిలో వేగంగా స్పందించి ప్రజల ప్రాణాలను రక్షించేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ శ్రీనివాసులు, సి.ఐ వీరప్రసాద్, ఆర్.ఐ అడ్మిన్ సురేష్, ఆర్.ఎస్.ఐ లు సాయి కిరణ్, శ్రావణ్ యాదవ్, DRF సిబ్బంది పాల్గొన్నారు.
    user_Gampa mahesh
    Gampa mahesh
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    19 hrs ago
  • కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో గ్రామస్తులు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రేకొండ-ఎగ్లాస్‌పూర్ గ్రామాల మధ్య ఉన్న తొక్కుడు బండల వాగుపై శాశ్వత బ్రిడ్జిని నిర్మించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు టెంటు ఏర్పాటు చేసి ఆందోళన నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని నిరసనకారులు కోరారు. వర్షాకాలంలో వాగు ఉప్పొంగడంతో రైతులు, గ్రామస్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. వాగు దాటలేని పరిస్థితుల్లో 10 నుంచి 15 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో నిధులు మంజూరైనా పనులు ప్రారంభం కాలేదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరిగినట్లు కూడా పేర్కొన్నారు.
    1
    కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో గ్రామస్తులు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రేకొండ-ఎగ్లాస్‌పూర్ గ్రామాల మధ్య ఉన్న తొక్కుడు బండల వాగుపై శాశ్వత బ్రిడ్జిని నిర్మించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు టెంటు ఏర్పాటు చేసి ఆందోళన నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని నిరసనకారులు కోరారు.

వర్షాకాలంలో వాగు ఉప్పొంగడంతో రైతులు, గ్రామస్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. వాగు దాటలేని పరిస్థితుల్లో 10 నుంచి 15 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో నిధులు మంజూరైనా పనులు ప్రారంభం కాలేదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.

వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరిగినట్లు కూడా పేర్కొన్నారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    22 hrs ago
  • మార్కెట్ రోడ్ వెంకటేశ్వర దేవాలయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, MLC అభ్యర్థి డాక్టర్ శ్రీ ఊటుకూరు నరేందర్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని, భవిష్యత్తులో గొప్ప పదవులు పొందాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రజిత రెడ్డి ఆధ్వర్యంలో నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు ఆకారపు భాస్కర్ రెడ్డి, రాజిరెడ్డి, గన్ను మహేశ్వర్ రెడ్డి, శ్రీకాంత్, డివిజన్ అధ్యక్షురాలు సత్యలక్ష్మి, మమత, వెంకటలక్ష్మి, ఉమా, సబిత, వసంత, వసంత స్వరూప, సంపూర్ణ, పద్మ, వాణి, మున్నా సహా పలువురు పాల్గొన్నారు.
    1
    మార్కెట్ రోడ్ వెంకటేశ్వర దేవాలయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, MLC అభ్యర్థి డాక్టర్ శ్రీ ఊటుకూరు నరేందర్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని, భవిష్యత్తులో గొప్ప పదవులు పొందాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రజిత రెడ్డి ఆధ్వర్యంలో నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు ఆకారపు భాస్కర్ రెడ్డి, రాజిరెడ్డి, గన్ను మహేశ్వర్ రెడ్డి, శ్రీకాంత్, డివిజన్ అధ్యక్షురాలు సత్యలక్ష్మి, మమత, వెంకటలక్ష్మి, ఉమా, సబిత, వసంత, వసంత స్వరూప, సంపూర్ణ, పద్మ, వాణి, మున్నా సహా పలువురు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.