Shuru
Apke Nagar Ki App…
వాసం నరేష్ యాదవ్ హీరో గా నిర్మిస్తున్న జయహో జనార్ధన చిత్రం గోడపత్రిక ఆవిష్కరణ మహబూబాబాద్ జిల్లా చెట్ల ముప్పారం గ్రామ వాసి వాసం నరేశ్ యాదవ్ హీరోగా పానుగంటి శరత్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం జయహో జనార్దన సినిమా పోస్టర్ ఆవిష్కరణ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడామైదానంలో మా అసోసియేషన్ కార్యదర్శి మందుల రఘు అద్యక్షతన వాకర్స్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అంబెడ్కర్ సంఘం అద్యక్షులు కామ సంజీవ రావు, గూడురు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరన్న,తూము యశ్వంత్,చిదిరాల వినయ్,వంగ రామన్న తదితరులు పాల్గొన్నారు.
Guru Prasad chilakamari
వాసం నరేష్ యాదవ్ హీరో గా నిర్మిస్తున్న జయహో జనార్ధన చిత్రం గోడపత్రిక ఆవిష్కరణ మహబూబాబాద్ జిల్లా చెట్ల ముప్పారం గ్రామ వాసి వాసం నరేశ్ యాదవ్ హీరోగా పానుగంటి శరత్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం జయహో జనార్దన సినిమా పోస్టర్ ఆవిష్కరణ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడామైదానంలో మా అసోసియేషన్ కార్యదర్శి మందుల రఘు అద్యక్షతన వాకర్స్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అంబెడ్కర్ సంఘం అద్యక్షులు కామ సంజీవ రావు, గూడురు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరన్న,తూము యశ్వంత్,చిదిరాల వినయ్,వంగ రామన్న తదితరులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- వరంగల్ జిల్లా:రాయపర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్, ఇండీ కూటమి నేతలు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాయపర్తి మండల అధ్యక్షుడు నూనె అనిల్ యాదవ్ మాట్లాడుతూ, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం దేశ చరిత్రలో నల్ల దినంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ దానిని అడ్డుకుని మహిళా ద్రోహం చేసిందని విమర్శించారు. వెంటనే కాంగ్రెస్, ఇండీ కూటమి నేతలు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళా లోకం ఏకమై కాంగ్రెస్ పార్టీని దేశంలో నుండి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వడ్లకొండ రవి, గడ్డం నరేందర్, రావుల అనిల్, మైస మహేందర్, మందపూరి రాజు, బూరుగు నవీన్, వీరబ్రహ్మం, గోరంట్ల ప్రభాకర్, చిర్ర నాగరాజు, పెండ్యాల గణేష్, మంచాల సుమన్ యాదవ్, బండారి దినేష్, జక్కుల సందీప్ యాదవ్, సిద్దు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.1
- నల్గొండ నల్ల రిబ్బన్లతో రోడ్డెక్కిన కాంగ్రెస్ శ్రేణులు.. బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు... తెలంగాణను పాకిస్తాన్ విభజనతో పోల్చడం దుర్మార్గ రాజకీయమని మండిపడ్డ పున్న కైలాష్ నేత.! సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల కల సాకారం చేసింది... బిజెపి తెలంగాణపై విషం చిమ్ముతుంది.. అనేకమంది బలిదానాలు పోరాటాలు, త్యాగాలను అవహేళన చేస్తుంది... ఖబర్దార్ బిజెపి నాయకుల్లారా! తెలంగాణలో బిజెపి పార్టీని భూస్థాపితం చేస్తాం అంటూ హెచ్చరిక.. మహిళా బిల్లు ముసుకులో బీజేపీ కాంగ్రెస్పై తప్పుడు ఆరోపణలు చేస్తూ చర్చలు పక్క ద్రోవ పట్టిస్తుంది... త్వరలో తెలంగాణలో బిజెపి గద్దెలు కూలుతాయని హెచ్చరిక... డిలిమిటేషన్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం లేకే బీజేపీ డ్రామాలు చేస్తోందని విమర్శ... తేజస్వి సూర్య చేసిన వాక్యాలపై మోడీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్.. కార్యక్రమంలో ఎండి ముంతాజ్ అలీ, పేరిక వెంకటేశ్వర్లు, నోముల జనార్ధన్, కోమటిరెడ్డి అంజిరెడ్డి, వేముల గోపీనాథ్, అంబల హరీష్, పల్లా రవితేజతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.1
- ప్రజల సమస్యలను పరిష్కరించడానికి గ్రామాలకే స్వయంగా వస్తానని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో సుమారు 2 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి శంకుస్థాపన చేసి, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ధర్మారం మండలంలోని అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని చెప్పారు. విద్యార్థులకు సాంకేతిక విద్య అందించేందుకు ఎర్రగుంటపల్లిలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ధర్మారం మండల కేంద్రంలోని ఎస్టీ మినీ గురుకుల పాఠశాలను పదవ తరగతి వరకు అప్‌గ్రేడ్ చేసి, 75 శాతం ట్రైబల్ విద్యార్థులకు, 25 శాతం ఇతర వర్గాలకు సీట్లు కేటాయిస్తామని తెలిపారు. మండల కేంద్రంలో మినీ స్టేడియం ఏర్పాటు చర్యలు తీసుకుంటున్నామని, ఇది యువతకు క్రీడల్లో ప్రోత్సాహం కలిగిస్తుందని మంత్రి పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా వారంలో మూడు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటిస్తూ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. మొక్కజొన్న రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరమైతే ధర్మారం మండల కేంద్రంలో కూడా మక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు.1
- అచ్చంపేట మహిళలకు మూడో వంతు రిజర్వేషన్ కల్పించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో,లోక్‌సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం, ప్రతిపక్షాల మహిళా వ్యతిరేక మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు దేశెట్టి అనంత నాయుడు అన్నారు. ఇది కేవలం ఒక బిల్లు మాత్రమే కాదు,దేశంలోని మహిళలను గౌరవించి,వారికి వారి హక్కులను కల్పించే ఒక అవకాశం అన్నారు. పార్టీ రాజకీయాలకు అతీతంగా ఎదగాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజ్ఞప్తిని తిరస్కరించి, ప్రతిపక్షం తన సంకుచిత మనస్తత్వంతో మన మహిళల నమ్మకాన్ని, ఆశలను తుంచేసింది. ప్రతిపక్షాల ఈ మహిళా వ్యతిరేక ఆలోచనా విధానానికి భవిష్యత్తులో దేశ ప్రజలు తప్పకుండా ప్రతిస్పందిస్తారు. మహిళల గౌరవం, సాధికారత కోసం ఈ పోరాటం కొనసాగుతుంది. మహిళల హక్కులను బలోపేతం చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని అన్నారు.1
- Post by Yekula lakshmanarao Yekula1
- సాధన సురుల ఇంద్రజాల విన్యాసాలు... గన్నేరువరం మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సాధనసురుల ఇంద్రజాల విన్యాసాలు. సాధన సూర్యుల విన్యాసాలలో శత్రువుల నుండి మనం ఎలా రక్షించుకోవాలో కర్రతో కళాకారులు చేసిన విన్యాసాలు. అలాగే మట్టి తో మాణిక్యాలు తయారు చేసి రాళ్లతో దేవుళ్లను తయారు చేసి ప్రజలను ఆశ్చర్యపరుస్తున్న ఇంద్రజాల విన్యాసాలకు మండల కేంద్రంలో చప్పట్ల కేరింతల మధ్యన విన్యాసాలు చేశారు చివరిలో దయ్యం గెటప్తో అందర్నీ ఆశ్చర్యపరిచారు..1
- వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో జాతీయ రహదారిపై శనివారం పోలీసులు ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వాహనదారులకు గులాబీ పూలు అందించి, భద్రతా నియమాల ప్రాముఖ్యతను వివరించారు. అలాగే కార్లలో ప్రయాణించే వారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్సై సాయిబాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.1
- నల్లగొండ జిల్లాలో జాతీయ రహదారి నిర్మాణ పనులపై *నేషనల్ హైవే అధికారులు* హుటాహుటిన రంగంలోకి.. *బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగవర్షిత్ రెడ్డి* ఫిర్యాదుతో శుక్రవారం చీఫ్ ఇంజనీర్ ధర్మారెడ్డి, రీజనల్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ నేతృత్వంలోని బృందం ఆకస్మిక తనిఖీలు... పరిశీలించిన అధికారులు పనుల్లో లోపాలు ఉన్నాయన్న ప్రాథమిక సమాచారం... అధికారులు పలు ప్రాంతాల నుంచి మట్టి,మెటీరియల్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు సమాచారం... నివేదికలో అవకతవకలు తేలితే పెద్దఎత్తున చర్యలు తప్పవని, కాంట్రాక్టర్లపై ఉక్కుపాదం మోపే అవకాశం ఉందని అధికార వర్గాల్లో చర్చ.? నాణ్యత లేని మట్టితో రోడ్లు నిర్మిస్తున్నారని, నిబంధనలు తుంగలో తొక్కి కాంట్రాక్టర్లకు లాభాలు చేకూరుస్తున్నారని బీజేపీ తీవ్ర ఆరోపణలు... నల్లగొండ చుట్టుపక్కల చెరువుల నుంచి మట్టిని తరలించి హైవే పనులకు వినియోగిస్తున్నారని, ఇది భవిష్యత్తులో రోడ్డు కుంగిపోవడానికి దారితీస్తుందని వర్షిత్ రెడ్డి ఫైర్... "రాష్ట్రానికి ఆర్ అండ్ బీ మంత్రి అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత జిల్లాలోనే ఇలా జరుగుతుంటే మిగతా జిల్లాల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు ఆలోచించాలి" అంటూ ఘాటు విమర్శలు... ఈ వ్యవహారం జిల్లాలో రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారగా, మంత్రి సమాధానం చెప్పాలని బీజేపీ డిమాండ్... సమాధానం రాకపోతే హైవే పనుల వద్ద మహాధర్నా, చలో కలెక్టరేట్, రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని *బీజేపీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి* హెచ్చరిక చేశారు...☝️1
- ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ లో ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. ఆర్టీసీ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ 1 డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ధర్నా చేశారు. నిరసనలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటుపరం చేసే దిశగా ప్రభుత్వం పని చేస్తోందని ఆరోపిస్తూ, “మా భూములు మాకే – మా ఆస్తులు మాకే” అంటూ నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి కాకుండా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తోందని, అలాంటి పరిస్థితిలో ఆస్తులను అమ్మేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం సరికాదని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వ పరంగా కొనసాగించాలని, వాటి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి లాభం చేకూర్చే విధంగా కాకుండా ప్రజా రవాణా బలోపేతానికి ఉపయోగించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల హక్కులను కాపాడాలని, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.1