logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ముందస్తు అడ్మిషన్లు నిర్వహించే ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలలు,కళాశాలలపై చర్యలు తీసుకోండి-వీరభద్రం, పిడిఎస్ యూ, జిల్లా అధ్యక్షుడు కొత్తగూడెం పట్టణ కేంద్రంలోని శ్రీరామచంద్ర డిగ్రీ కళాశాలలో యూనిట్ కమిటీ ఆధ్వర్యంలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో, కళాశాలలో ముందస్తు అడ్మిషన్లు నిర్వహించే విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని, ముందస్తు అడ్మిషన్ల ప్రక్రియను తక్షణమే ఆపాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిడిఎస్ యూ జిల్లా అధ్యక్షులు బుర్ర వీరభద్రం మాట్లాడుతూ జిల్లాలో అనేక ప్రైవేట్, కార్పోరేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు 2026–27 విద్యా సంవత్సరానికి ముందస్తు అడ్మిషన్లు ప్రారంభిస్తున్నాయనీ, 'సీటు బుకింగ్' పేరుతో వేల రూపాయలు తల్లిదండ్రుల నుండి వసూలు చేస్తున్నారనీ, ఇది చట్టవిరుద్ధమనీ, ఇది దోపిడీ అయినప్పటికీ ప్రతి ఏడాది ఇదే పరిస్థితి నెలకొంటుందన్నారు. 'మీ పిల్లాడి సీటు పోతుంది' అని భయపెట్టి పేద, మధ్యతరగతి కుటుంబాల తల్లిదండ్రులను మోసగిస్తున్నారని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం -2009 హక్కులు అమలు కావడం లేదనీ, పేద పిల్లలకు 25 శాతం అడ్మిషన్లు కల్పించడం లేదన్నారు. ప్రైవేట్ కు విద్యార్థుల తల్లిదండ్రులు మొగ్గు చూపడంతో తెలంగాణలో 2,245 ప్రభుత్వ పాఠశాలల్లో 2024-25 యూడైస్ లెక్కల ప్రకారం సున్నా అడ్మిషన్లు నమోదయ్యాయనీ అన్నారు, ప్రభుత్వ పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉందనీ, తెలంగాణలో మొత్తం 42,901 ప్రభుత్వ పాఠశాలల్లో 12.70% పాఠశాలల్లో 10 కంటే తక్కువ పిల్లలే ఉన్నారన్నారు. తెలంగాణలో 1వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థులు కేవలం 26% మాత్రమే అన్నారు. రాష్ట్రంలో విద్యా బడ్జెట్ 10.9% నుండి 8.23% కు తగ్గిందనీ, ప్రభుత్వం ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తోందన్నారు. ప్రైవేటుకు ప్రత్యామ్నాయంగా ప్రీ ప్రైమరీ తరగతులను అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించాలనీ, రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలు వెంటనే భర్తీ చేయాలనీ, ఒకే ఉపాధ్యాయ పాఠశాలలు 5001 ఉన్నాయనీ, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, క్రీడా మైదానం, గ్రంథాలయం నిర్మించాలనీ, మధ్యాహ్న భోజన పథకం నాణ్యత మెరుగుపరచాలనీ, ఎస్సీ,ఎస్టీ,బీసి రెసిడెన్షియల్ హాస్టళ్ళ డైట్ మనీ పెంచాలనీ, విద్యా బడ్జెట్‌ను 8.23% నుండి కనీసం 20%కు పెంచాలనీ, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, ఇంటర్నెట్ సదుపాయాలు, ప్రయోగశాలలు ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొల్పాలనీ, ఇంగ్లీషు మీడియం, ఇంగ్లీషు భాషపై పట్టుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, కంప్యూటర్ విద్య ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించాలని కోరారు. ముందస్తు అడ్మిషన్ నిర్వహించే ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని, ఇంటర్మీడియట్ బోర్డు ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు ఎటువంటి అఫిలియేషన్స్ ఇవ్వలేదన్నారు. లేదంటే విద్యాసంస్థల ఎదుట బైఠాయించి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

10 hrs ago
user_VANAMA SRINIVAS RAO
VANAMA SRINIVAS RAO
జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
10 hrs ago
8f3ae021-c0f8-487d-9254-b3d2729f92ec

ముందస్తు అడ్మిషన్లు నిర్వహించే ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలలు,కళాశాలలపై చర్యలు తీసుకోండి-వీరభద్రం, పిడిఎస్ యూ, జిల్లా అధ్యక్షుడు కొత్తగూడెం పట్టణ కేంద్రంలోని శ్రీరామచంద్ర డిగ్రీ కళాశాలలో యూనిట్ కమిటీ ఆధ్వర్యంలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో, కళాశాలలో ముందస్తు అడ్మిషన్లు నిర్వహించే విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని, ముందస్తు అడ్మిషన్ల ప్రక్రియను తక్షణమే ఆపాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిడిఎస్ యూ జిల్లా అధ్యక్షులు బుర్ర వీరభద్రం మాట్లాడుతూ జిల్లాలో అనేక ప్రైవేట్, కార్పోరేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు 2026–27 విద్యా సంవత్సరానికి ముందస్తు అడ్మిషన్లు ప్రారంభిస్తున్నాయనీ, 'సీటు బుకింగ్' పేరుతో వేల

3ac3988b-05df-4d70-b819-9080bec59c70

రూపాయలు తల్లిదండ్రుల నుండి వసూలు చేస్తున్నారనీ, ఇది చట్టవిరుద్ధమనీ, ఇది దోపిడీ అయినప్పటికీ ప్రతి ఏడాది ఇదే పరిస్థితి నెలకొంటుందన్నారు. 'మీ పిల్లాడి సీటు పోతుంది' అని భయపెట్టి పేద, మధ్యతరగతి కుటుంబాల తల్లిదండ్రులను మోసగిస్తున్నారని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం -2009 హక్కులు అమలు కావడం లేదనీ, పేద పిల్లలకు 25 శాతం అడ్మిషన్లు కల్పించడం లేదన్నారు. ప్రైవేట్ కు విద్యార్థుల తల్లిదండ్రులు మొగ్గు చూపడంతో తెలంగాణలో 2,245 ప్రభుత్వ పాఠశాలల్లో 2024-25 యూడైస్ లెక్కల ప్రకారం సున్నా అడ్మిషన్లు నమోదయ్యాయనీ అన్నారు, ప్రభుత్వ పాఠశాలలు

1f5b321f-5393-4686-acce-f8ccd8ad2c32

మూతపడే ప్రమాదం ఉందనీ, తెలంగాణలో మొత్తం 42,901 ప్రభుత్వ పాఠశాలల్లో 12.70% పాఠశాలల్లో 10 కంటే తక్కువ పిల్లలే ఉన్నారన్నారు. తెలంగాణలో 1వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థులు కేవలం 26% మాత్రమే అన్నారు. రాష్ట్రంలో విద్యా బడ్జెట్ 10.9% నుండి 8.23% కు తగ్గిందనీ, ప్రభుత్వం ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తోందన్నారు. ప్రైవేటుకు ప్రత్యామ్నాయంగా ప్రీ ప్రైమరీ తరగతులను అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించాలనీ, రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలు వెంటనే భర్తీ చేయాలనీ, ఒకే ఉపాధ్యాయ పాఠశాలలు 5001 ఉన్నాయనీ, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, క్రీడా మైదానం, గ్రంథాలయం

bba5ef00-b927-44d1-a6a9-94ce6ae3ffd7

నిర్మించాలనీ, మధ్యాహ్న భోజన పథకం నాణ్యత మెరుగుపరచాలనీ, ఎస్సీ,ఎస్టీ,బీసి రెసిడెన్షియల్ హాస్టళ్ళ డైట్ మనీ పెంచాలనీ, విద్యా బడ్జెట్‌ను 8.23% నుండి కనీసం 20%కు పెంచాలనీ, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, ఇంటర్నెట్ సదుపాయాలు, ప్రయోగశాలలు ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొల్పాలనీ, ఇంగ్లీషు మీడియం, ఇంగ్లీషు భాషపై పట్టుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, కంప్యూటర్ విద్య ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించాలని కోరారు. ముందస్తు అడ్మిషన్ నిర్వహించే ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని, ఇంటర్మీడియట్ బోర్డు ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు ఎటువంటి అఫిలియేషన్స్ ఇవ్వలేదన్నారు. లేదంటే విద్యాసంస్థల ఎదుట బైఠాయించి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

More news from తెలంగాణ and nearby areas
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    10 hrs ago
  • Post by V Ramarao
    2
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    13 hrs ago
  • ​జనగామ జిల్లాలో అకస్మాత్తుగా కురిసిన అకాల వర్షం వ్యవసాయ రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీయగా, ముఖ్యంగా జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఆరబోసిన వేల క్వింటాళ్ల మక్కజొన్నలు వర్షపు నీటిలో తడిసి ముద్దయ్యాయి. యార్డ్‌లో సరైన డ్రైనేజీ సౌకర్యాలు లేకపోవడంతో వర్షపు నీరు నిలిచి చెరువును తలపిస్తుండగా, అష్టకష్టాలు పడి పండించిన పంట కళ్లముందే తడిసిపోవడం చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. కొన్ని చోట్ల మక్కలు, వడ్లు వర్షపు నీటిలో కొట్టుకుపోగా, మరికొన్ని చోట్ల తేమ శాతం పెరిగి పంట రంగు మారే ప్రమాదం ఉందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తేమ శాతంతో సంబంధం లేకుండా తడిసిన పంటను కొనుగోలు చేయాలని, అలాగే భవిష్యత్తులో ఇలాంటి నష్టాలు వాటిల్లకుండా మార్కెట్ యార్డ్‌లలో షెడ్ల సౌకర్యాన్ని పెంచాలని జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తోంది.
    4
    ​జనగామ జిల్లాలో అకస్మాత్తుగా కురిసిన అకాల వర్షం వ్యవసాయ రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీయగా, ముఖ్యంగా జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఆరబోసిన వేల క్వింటాళ్ల మక్కజొన్నలు వర్షపు నీటిలో తడిసి ముద్దయ్యాయి. యార్డ్‌లో సరైన డ్రైనేజీ సౌకర్యాలు లేకపోవడంతో వర్షపు నీరు నిలిచి చెరువును తలపిస్తుండగా, అష్టకష్టాలు పడి పండించిన పంట కళ్లముందే తడిసిపోవడం చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. కొన్ని చోట్ల మక్కలు, వడ్లు వర్షపు నీటిలో కొట్టుకుపోగా, మరికొన్ని చోట్ల తేమ శాతం పెరిగి పంట రంగు మారే ప్రమాదం ఉందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తేమ శాతంతో సంబంధం లేకుండా తడిసిన పంటను కొనుగోలు చేయాలని, అలాగే భవిష్యత్తులో ఇలాంటి నష్టాలు వాటిల్లకుండా మార్కెట్ యార్డ్‌లలో షెడ్ల సౌకర్యాన్ని పెంచాలని జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తోంది.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    9 hrs ago
  • మహబూబాబాద్ జిల్లా భవిష్యత్తులో వచ్చే ప్రమాదకరమైన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ఈ టీకా ఎంతో ఉపయోగకరమని డా. రవి నాయక్ తెలిపారు. మరిపెడ పట్టణంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోహెచ్పీవీ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.14 ఏళ్లు నిండిన బాలికలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డా. పూజిత, పీహెచ్ఎన్ఆ మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
    1
    మహబూబాబాద్ జిల్లా భవిష్యత్తులో వచ్చే ప్రమాదకరమైన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ఈ టీకా ఎంతో ఉపయోగకరమని డా. రవి నాయక్ తెలిపారు. మరిపెడ పట్టణంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోహెచ్పీవీ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.14 ఏళ్లు నిండిన బాలికలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డా. పూజిత, పీహెచ్ఎన్ఆ మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    9 min ago
  • నకిరేకల్ మున్సిపాలిటీ:- నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మకాయల మార్కెట్ యార్డులో దడువాయులకు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన మహాధర్నా 20వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దడువాయులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ మహాధర్నా కార్యక్రమానికి అధ్యక్షుడు వంటిపాక లక్ష్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించగా, ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్న పాల్గొన్నారు. కార్యక్రమంలో సభ్యులు సిహెచ్ వెంకన్న, ఏం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, ఎస్ రాజు, వి సైదులు, బి రమేష్, ఎస్ ధీరజ్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, బి యాదగిరి, జి శంకర్ తదితరులు పాల్గొని తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేశారు. దడువాయులకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించే వరకు తమ నిరసన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.
    3
    నకిరేకల్ మున్సిపాలిటీ:-
నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మకాయల మార్కెట్ యార్డులో దడువాయులకు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన మహాధర్నా 20వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దడువాయులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు.
ఈ మహాధర్నా కార్యక్రమానికి అధ్యక్షుడు వంటిపాక లక్ష్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించగా, ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్న పాల్గొన్నారు.
కార్యక్రమంలో సభ్యులు సిహెచ్ వెంకన్న, ఏం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, ఎస్ రాజు, వి సైదులు, బి రమేష్, ఎస్ ధీరజ్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, బి యాదగిరి, జి శంకర్ తదితరులు పాల్గొని తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేశారు.
దడువాయులకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించే వరకు తమ నిరసన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.
    user_Nagesh Kothapalli
    Nagesh Kothapalli
    Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
    12 hrs ago
  • అమరావతిలో భద్రత కట్టుదిట్టం: ఎస్పీ అమరావతి ప్రాంతంలో నిర్మాణ సంస్థల ప్రతినిధులతో భద్రత అంశాలపై చర్చించిన SP వకుల్ జిందాల్, CC కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, స్టాక్ ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఇప్పటికే ఆరు చెకోపోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు పెంచామని, రాత్రివేళ డ్రోన్ నిఘా, పెట్రోలింగ్ కొనసాగుతుందన్నారు.
    1
    అమరావతిలో భద్రత కట్టుదిట్టం: ఎస్పీ
అమరావతి ప్రాంతంలో నిర్మాణ సంస్థల ప్రతినిధులతో భద్రత అంశాలపై చర్చించిన SP వకుల్ జిందాల్, CC కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, స్టాక్ ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఇప్పటికే ఆరు చెకోపోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు పెంచామని, రాత్రివేళ డ్రోన్ నిఘా, పెట్రోలింగ్ కొనసాగుతుందన్నారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • ఈ సందర్భంగా పట్టణంలో ప్రమాద రహిత నగరంగా చేయాలని లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారని సిఐ లక్ష్మయ్య తెలిపారు... తాగి వాహనాలు నడిపి తమ ప్రాణాలకే ముప్పు కాకుండా ఇతరులకు ప్రాణహాని కలిగించే విధంగా చేసుకోకూడదని.... డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే జైలు శిక్ష కాకుండా భారీ జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరిక! ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలి... మైనర్లకు తమ తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి ఉంచి వాహనాలు నడపకుండా జాగ్రత్త వహించాలి... మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారి భవిష్యత్తే కాకుండా తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ... *నల్గొండ ట్రాఫిక్ సిఐ–మహా లక్ష్మయ్య..* ఈ కార్యక్రమంలో నల్గొండ ట్రాఫిక్ ఎస్ఐ విజయబాయి మరియు సిబ్బంది పాల్గొన్నారు...
    1
    ఈ సందర్భంగా పట్టణంలో ప్రమాద రహిత నగరంగా చేయాలని  లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారని సిఐ లక్ష్మయ్య తెలిపారు...
తాగి వాహనాలు నడిపి  తమ ప్రాణాలకే ముప్పు కాకుండా ఇతరులకు ప్రాణహాని కలిగించే విధంగా చేసుకోకూడదని....
డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే జైలు శిక్ష కాకుండా భారీ జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరిక! 
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలి...
మైనర్లకు తమ తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి ఉంచి వాహనాలు నడపకుండా జాగ్రత్త వహించాలి...
మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారి భవిష్యత్తే కాకుండా తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ...
*నల్గొండ ట్రాఫిక్ సిఐ–మహా లక్ష్మయ్య..*
ఈ కార్యక్రమంలో నల్గొండ ట్రాఫిక్ ఎస్ఐ విజయబాయి మరియు సిబ్బంది పాల్గొన్నారు...
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    14 hrs ago
  • Post by V Ramarao
    1
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.