Shuru
Apke Nagar Ki App…
కూసుమంచి పోలీసులు అక్రమంగా తరలిస్తున్న 330 కేజీల గంజాయిని పట్టుకున్నారు ఖమ్మం జిల్లా కూసుమంచి పోలీసులు అక్రమంగా తరలిస్తున్న 330 కేజీల గంజాయిని పట్టుకున్నారు.కూసుమంచి పోలీసులు జీళ్ళ చెరువు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదం గా ఉన్న బొలెరో వాహనం తో పాటు కారు ను తనిఖీ చేశారు.వాటిలో ఒడిశా నుంచి కర్ణాటక కు అక్రమంగా తరలిస్తున్న330 కేజీల గంజాయిని పట్టుకుని ఎనిమిది మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు.పట్టుకున్న గంజాయి విలువ కోటీ యాబై లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
ARUNKUMAR
కూసుమంచి పోలీసులు అక్రమంగా తరలిస్తున్న 330 కేజీల గంజాయిని పట్టుకున్నారు ఖమ్మం జిల్లా కూసుమంచి పోలీసులు అక్రమంగా తరలిస్తున్న 330 కేజీల గంజాయిని పట్టుకున్నారు.కూసుమంచి పోలీసులు జీళ్ళ చెరువు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదం గా ఉన్న బొలెరో వాహనం తో పాటు కారు ను తనిఖీ చేశారు.వాటిలో ఒడిశా నుంచి కర్ణాటక కు అక్రమంగా తరలిస్తున్న330 కేజీల గంజాయిని పట్టుకుని ఎనిమిది మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు.పట్టుకున్న గంజాయి విలువ కోటీ యాబై లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- కూసుమంచి పోలీసులు అక్రమంగా తరలిస్తున్న 330 కేజీల గంజాయిని పట్టుకున్నారు ఖమ్మం జిల్లా కూసుమంచి పోలీసులు అక్రమంగా తరలిస్తున్న 330 కేజీల గంజాయిని పట్టుకున్నారు.కూసుమంచి పోలీసులు జీళ్ళ చెరువు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదం గా ఉన్న బొలెరో వాహనం తో పాటు కారు ను తనిఖీ చేశారు.వాటిలో ఒడిశా నుంచి కర్ణాటక కు అక్రమంగా తరలిస్తున్న330 కేజీల గంజాయిని పట్టుకుని ఎనిమిది మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు.పట్టుకున్న గంజాయి విలువ కోటీ యాబై లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు.1
- కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం...!! ఈ ప్రజా ప్రభుత్వంలో దొరలు పేదలు ఒకటే బువ్వ తింటున్నారు..!! సన్న బియ్యం ఇదొక సంచల నిర్ణయం...!! జై సోనియమ్మ జై జై రాహుల్ అన్న జయహో రేవంతన్న *కొండా దంపతుల నాయకత్వం వర్ధిల్లాలి..!!* *మీ... సిలివేరు అనిల్* యువజన కాంగ్రెస్ కొండా యువసేన రాష్ట్ర నాయకులు1
- అశ్వారావుపేట బ్లాక్ మనీ మోసం గుట్టు రట్టు.. నిందితుడు అరెస్ట్ అశ్వారావుపేట బ్లాక్ మనీ మోసం గుట్టు రట్టు.. నిందితుడు అరెస్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో బ్లాక్ మనీ పేరుతో అమాయకులను లక్ష్యంగా చేసుకుని కోట్ల ఆశలు చూపిస్తూ భారీ మోసాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రసాయనాలతో నల్లటి కాగితాలను అసలు కరెన్సీ నోట్లుగా మారుస్తామని నమ్మించి లక్షల రూపాయలు కాజేసిన నిందితుడి బండారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. అంతేకాదు, నకిలీ నోట్ల దందా కోసం వాట్సాప్ గ్రూపుల్లో సెల్ఫీ వీడియోలు విడుదల చేసి తనను సంప్రదించాలని ప్రచారం చేసినట్లు కూడా విచారణలో వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు… అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టిపాటి ప్రేమ్‌చందు అనే వ్యక్తి బ్లాక్ మనీ పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడనే ఫిర్యాదు అందడంతో పోలీసులు విచారణ చేపట్టారు.నిందితుడు మొదట రూ.500 అసలు నోటును ప్రత్యేక రసాయన ద్రావణంలో ముంచి, అదే విధంగా నల్లటి కాగితాలను కూడా అసలు నోట్లుగా మార్చవచ్చని బాధితుడిని నమ్మించాడు. ఈ మాయమాటలను నమ్మిన బాధితుడి నుంచి తొలుత రూ.11 లక్షలు, అనంతరం రసాయనాల కొనుగోలు పేరుతో మరో రూ.2 లక్షలు తీసుకుని మొత్తం రూ.13 లక్షలు కాజేసినట్లు పోలీసులు వెల్లడించారు. విచారణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు వాట్సాప్ గ్రూపుల్లో వీడియోలు విడుదల చేస్తూ, “నకిలీ నోట్లు, బ్లాక్ మనీ మార్పిడి” పేరుతో తనను సంప్రదించాలని ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. ఈ ప్రచారాన్ని నమ్మిన పలువురిని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.ఇక నిందితుడిపై గతంలో కూడా నకిలీ కరెన్సీ, మోటార్‌సైకిల్ దొంగతనాలు తదితర కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. బాచుపల్లి, రామచంద్రపురం, కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్లలో కూడా అతనిపై పలు కేసులు ఉన్నట్లు వెల్లడించారు. పోలీసులు నిందితుడి వద్ద నుంచి రూ.500 నోట్ల పరిమాణంలో కట్ చేసిన 20 వేల బ్లాక్ పేపర్లు,నోట్లుగా మారుస్తామని చెప్పేందుకు ఉపయోగించిన రెండు రసాయన ద్రావణాల సీసాలను స్వాధీనం చేసుకున్నారు.నిందితుడిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి, స్వాధీనం చేసుకున్న వస్తువులను సీజ్ చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.బ్లాక్ మనీ, నకిలీ నోట్లు, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని చెప్పే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని పోలీసులు ప్రజలకు హెచ్చరించారు. ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. బైట్: ఆర్. సతీష్ కుమార్, డీఎస్పీ, పాల్వంచ.3
- ప్రశ్నించిన తండ్రిపై తప్పుడు కేసా..? అంగన్‌వాడి అక్రమాలను నిలదీస్తే వీడియోల పేరుతో ఆరోపణలు.. కలెక్టర్‌కు గ్రామస్తుల ఫిర్యాదు మొబైల్‌లో ఆధారాలు లేకపోయినా సోషల్ మీడియాలో దుష్ప్రచారం.. నిష్పక్షపాత విచారణకు డిమాండ్ కలెక్టర్‌కు గ్రామస్తుల ఫిర్యాదు.. అంగన్‌వాడి టీచర్, ఆయాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ మొబైల్ తనిఖీలో ఆధారాలు లేవని చెబుతున్న బాధితుడు.. సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని ఆవేదన అధికారుల నిర్లక్ష్యంతో అమాయకులు బలికాకుండా నిజానిజాలు వెలికితీయాలని గ్రామస్తుల విజ్ఞప్తి. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో లోపాలను ప్రశ్నించిన వ్యక్తులపై తప్పుడు ఆరోపణలు చేసి వేధింపులకు గురిచేస్తున్నారా? పిల్లలకు అందాల్సిన పౌష్టికాహారం, అంగన్‌వాడి సిబ్బంది విధుల నిర్వహణపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందా? అనే అనుమానాలు మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దొనకొండ గ్రామంలో చోటుచేసుకున్న ఘటనతో వ్యక్తమవుతున్నాయి.దొనకొండ గ్రామ అంగన్‌వాడి కేంద్రంలో టీచర్, ఆయా విధుల నిర్వహణ సక్రమంగా లేదని, పిల్లలకు అందాల్సిన పౌష్టికాహారం పంపిణీలో నిర్లక్ష్యం జరుగుతోందని ప్రశ్నించిన గ్రామానికి చెందిన బోయిని నరేష్‌పై "బాత్రూమ్‌లో వీడియోలు తీశాడు" అంటూ నిరాధార ఆరోపణలు చేసి కేసు పెట్టించే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై గ్రామస్తులు బుధవారం జిల్లా కలెక్టర్, డీఆర్‌డీఓ, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులకు వినతిపత్రం సమర్పించి సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.బోయిని నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫిర్యాదు అందుకున్న దంతాలపల్లి ఎస్‌ఐ రవికుమార్ తనను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పూర్తిగా పరిశీలించారు. ఆరోపణలకు సంబంధించిన ఎలాంటి వీడియోలు, ఫొటోలు లేదా ఇతర ఆధారాలు లభించలేదని, అనంతరం మొబైల్‌ను తిరిగి అప్పగించారని ఆయన తెలిపారు. మరిన్ని ఆధారాలు ఉంటే అందించాలని పోలీసులే ఫిర్యాదుదారులకు సూచించారని పేర్కొన్నారు.పోలీసుల తనిఖీలో ఎలాంటి ఆధారాలు లభించకపోయినా, సంబంధిత శాఖలకు ఫిర్యాదు చేశామని పేర్కొంటూ సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల తన వ్యక్తిగత ప్రతిష్ఠకు, కుటుంబ గౌరవానికి తీవ్ర భంగం కలిగిందన్నారు.ఈ వ్యవహారంపై గ్రామస్తులు కలెక్టర్‌కు సమర్పించిన వినతిపత్రంలో అంగన్‌వాడి కేంద్రంలో టీచర్, ఆయా విధుల నిర్వహణ, హాజరు నమోదు, పిల్లలకు పౌష్టికాహారం పంపిణీ, ప్రభుత్వ నిబంధనల అమలుపై గ్రామస్థాయిలో సమగ్ర విచారణ (విలేజ్ ఎంక్వైరీ) నిర్వహించాలని కోరారు. విధుల్లో నిర్లక్ష్యం నిరూపితమైతే సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.టీచర్, ఆయా భర్తలు లింగయ్య, విజేందర్‌లు గ్రామ మాజీ సర్పంచ్ సమక్షంలో తనపై దాడికి యత్నించారని, ఆ ఘటనపై కూడా తాను పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించానని బోయిని నరేష్ తెలిపారు.గ్రామ పెద్దలు మాట్లాడుతూ... ప్రజా సమస్యలను ప్రశ్నించే వారిపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, వారి ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రచారం చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ఒకవేళ అంగన్‌వాడి సిబ్బందిపై వచ్చిన ఆరోపణలు నిజమైతే వారిపై చర్యలు తీసుకోవాలని, మరోవైపు నరేష్‌పై చేసిన ఆరోపణలు నిరాధారమైతే తప్పుడు ఫిర్యాదులు చేసిన వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని నిష్పక్షపాత విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ వ్యవస్థలో లోపాలను ప్రశ్నించినందుకు ఎవరూ వేధింపులకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చొప్పరి ఉప్పలయ్య, చిల్ల సత్యనారాయణ, కోడి లింగయ్య, పొన్నం యాకన్న, బోయిని బిక్షం, బోయిని సతీష్, బోయిని నరేష్ తదితరులు పాల్గొన్నారు.3