ప్రశ్నించిన తండ్రిపై తప్పుడు కేసా..? అంగన్‌వాడి అక్రమాలను నిలదీస్తే వీడియోల పేరుతో ఆరోపణలు.. కలెక్టర్‌కు గ్రామస్తుల ఫిర్యాదు మొబైల్‌లో ఆధారాలు లేకపోయినా సోషల్ మీడియాలో దుష్ప్రచారం.. నిష్పక్షపాత విచారణకు డిమాండ్ కలెక్టర్‌కు గ్రామస్తుల ఫిర్యాదు.. అంగన్‌వాడి టీచర్, ఆయాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ మొబైల్ తనిఖీలో ఆధారాలు లేవని చెబుతున్న బాధితుడు.. సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని ఆవేదన అధికారుల నిర్లక్ష్యంతో అమాయకులు బలికాకుండా నిజానిజాలు వెలికితీయాలని గ్రామస్తుల విజ్ఞప్తి. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో లోపాలను ప్రశ్నించిన వ్యక్తులపై తప్పుడు ఆరోపణలు చేసి వేధింపులకు గురిచేస్తున్నారా? పిల్లలకు అందాల్సిన పౌష్టికాహారం, అంగన్‌వాడి సిబ్బంది విధుల నిర్వహణపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందా? అనే అనుమానాలు మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దొనకొండ గ్రామంలో చోటుచేసుకున్న ఘటనతో వ్యక్తమవుతున్నాయి.దొనకొండ గ్రామ అంగన్‌వాడి కేంద్రంలో టీచర్, ఆయా విధుల నిర్వహణ సక్రమంగా లేదని, పిల్లలకు అందాల్సిన పౌష్టికాహారం పంపిణీలో నిర్లక్ష్యం జరుగుతోందని ప్రశ్నించిన గ్రామానికి చెందిన బోయిని నరేష్‌పై "బాత్రూమ్‌లో వీడియోలు తీశాడు" అంటూ నిరాధార ఆరోపణలు చేసి కేసు పెట్టించే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై గ్రామస్తులు బుధవారం జిల్లా కలెక్టర్, డీఆర్‌డీఓ, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులకు వినతిపత్రం సమర్పించి సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.బోయిని నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫిర్యాదు అందుకున్న దంతాలపల్లి ఎస్‌ఐ రవికుమార్ తనను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పూర్తిగా పరిశీలించారు. ఆరోపణలకు సంబంధించిన ఎలాంటి వీడియోలు, ఫొటోలు లేదా ఇతర ఆధారాలు లభించలేదని, అనంతరం మొబైల్‌ను తిరిగి అప్పగించారని ఆయన తెలిపారు. మరిన్ని ఆధారాలు ఉంటే అందించాలని పోలీసులే ఫిర్యాదుదారులకు సూచించారని పేర్కొన్నారు.పోలీసుల తనిఖీలో ఎలాంటి ఆధారాలు లభించకపోయినా, సంబంధిత శాఖలకు ఫిర్యాదు చేశామని పేర్కొంటూ సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల తన వ్యక్తిగత ప్రతిష్ఠకు, కుటుంబ గౌరవానికి తీవ్ర భంగం కలిగిందన్నారు.ఈ వ్యవహారంపై గ్రామస్తులు కలెక్టర్‌కు సమర్పించిన వినతిపత్రంలో అంగన్‌వాడి కేంద్రంలో టీచర్, ఆయా విధుల నిర్వహణ, హాజరు నమోదు, పిల్లలకు పౌష్టికాహారం పంపిణీ, ప్రభుత్వ నిబంధనల అమలుపై గ్రామస్థాయిలో సమగ్ర విచారణ (విలేజ్ ఎంక్వైరీ) నిర్వహించాలని కోరారు. విధుల్లో నిర్లక్ష్యం నిరూపితమైతే సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.టీచర్, ఆయా భర్తలు లింగయ్య, విజేందర్‌లు గ్రామ మాజీ సర్పంచ్ సమక్షంలో తనపై దాడికి యత్నించారని, ఆ ఘటనపై కూడా తాను పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించానని బోయిని నరేష్ తెలిపారు.గ్రామ పెద్దలు మాట్లాడుతూ... ప్రజా సమస్యలను ప్రశ్నించే వారిపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, వారి ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రచారం చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ఒకవేళ అంగన్‌వాడి సిబ్బందిపై వచ్చిన ఆరోపణలు నిజమైతే వారిపై చర్యలు తీసుకోవాలని, మరోవైపు నరేష్‌పై చేసిన ఆరోపణలు నిరాధారమైతే తప్పుడు ఫిర్యాదులు చేసిన వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని నిష్పక్షపాత విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ వ్యవస్థలో లోపాలను ప్రశ్నించినందుకు ఎవరూ వేధింపులకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చొప్పరి ఉప్పలయ్య, చిల్ల సత్యనారాయణ, కోడి లింగయ్య, పొన్నం యాకన్న, బోయిని బిక్షం, బోయిని సతీష్, బోయిని నరేష్ తదితరులు పాల్గొన్నారు.

- ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వరంగల్:వర్ధన్నపేట మండలంలోని కట్ర్యాల గ్రామంలో సహృదయ సేవా ట్రస్ట్, లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ ట్రైసిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు బుధవారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని ఆయన అన్నారు. ఆరోగ్య శిబిరాల ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స అందించవచ్చని పేర్కొన్నారు. అనంతరం రోగులకు మందులు పంపిణీ చేసి, రక్తదాతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, లయన్స్ క్లబ్ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.1
- కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం...!! ఈ ప్రజా ప్రభుత్వంలో దొరలు పేదలు ఒకటే బువ్వ తింటున్నారు..!! సన్న బియ్యం ఇదొక సంచల నిర్ణయం...!! జై సోనియమ్మ జై జై రాహుల్ అన్న జయహో రేవంతన్న *కొండా దంపతుల నాయకత్వం వర్ధిల్లాలి..!!* *మీ... సిలివేరు అనిల్* యువజన కాంగ్రెస్ కొండా యువసేన రాష్ట్ర నాయకులు1
- కూసుమంచి పోలీసులు అక్రమంగా తరలిస్తున్న 330 కేజీల గంజాయిని పట్టుకున్నారు ఖమ్మం జిల్లా కూసుమంచి పోలీసులు అక్రమంగా తరలిస్తున్న 330 కేజీల గంజాయిని పట్టుకున్నారు.కూసుమంచి పోలీసులు జీళ్ళ చెరువు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదం గా ఉన్న బొలెరో వాహనం తో పాటు కారు ను తనిఖీ చేశారు.వాటిలో ఒడిశా నుంచి కర్ణాటక కు అక్రమంగా తరలిస్తున్న330 కేజీల గంజాయిని పట్టుకుని ఎనిమిది మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు.పట్టుకున్న గంజాయి విలువ కోటీ యాబై లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు.1
- తాత్కాలిక పారిశుధ్య సిబ్బందికి తొలి నెల జీతాల చెక్కులు.. కార్మికులను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వరంగల్: వర్ధన్నపేట మున్సిపాలిటీలో పారిశుధ్య సిబ్బంది కొరతను అధిగమించేందుకు కొత్తగా నియమించిన 8 మంది తాత్కాలిక పారిశుధ్య కార్మికులకు తొలి నెల జీతాల చెక్కులను వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు బుధవారం అందజేశారు. మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కార్మికులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణలో పారిశుధ్య కార్మికుల సేవలు ఎంతో కీలకమని అన్నారు. ఎండ, వానలను లెక్కచేయకుండా ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించేందుకు వారు నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. పారిశుధ్య సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బెజ్జం పాపారావు, మలోతు దేవేందర్, తిరుపేల్లి వాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరకుడు వెంకటయ్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈగ దామోదర్, మండల పార్టీ అధ్యక్షుడు పోశాల వెంకన్న, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజిరెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు భాను ప్రసాద్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.1
- ప్రశ్నించిన తండ్రిపై తప్పుడు కేసా..? అంగన్‌వాడి అక్రమాలను నిలదీస్తే వీడియోల పేరుతో ఆరోపణలు.. కలెక్టర్‌కు గ్రామస్తుల ఫిర్యాదు మొబైల్‌లో ఆధారాలు లేకపోయినా సోషల్ మీడియాలో దుష్ప్రచారం.. నిష్పక్షపాత విచారణకు డిమాండ్ కలెక్టర్‌కు గ్రామస్తుల ఫిర్యాదు.. అంగన్‌వాడి టీచర్, ఆయాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ మొబైల్ తనిఖీలో ఆధారాలు లేవని చెబుతున్న బాధితుడు.. సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని ఆవేదన అధికారుల నిర్లక్ష్యంతో అమాయకులు బలికాకుండా నిజానిజాలు వెలికితీయాలని గ్రామస్తుల విజ్ఞప్తి. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో లోపాలను ప్రశ్నించిన వ్యక్తులపై తప్పుడు ఆరోపణలు చేసి వేధింపులకు గురిచేస్తున్నారా? పిల్లలకు అందాల్సిన పౌష్టికాహారం, అంగన్‌వాడి సిబ్బంది విధుల నిర్వహణపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందా? అనే అనుమానాలు మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దొనకొండ గ్రామంలో చోటుచేసుకున్న ఘటనతో వ్యక్తమవుతున్నాయి.దొనకొండ గ్రామ అంగన్‌వాడి కేంద్రంలో టీచర్, ఆయా విధుల నిర్వహణ సక్రమంగా లేదని, పిల్లలకు అందాల్సిన పౌష్టికాహారం పంపిణీలో నిర్లక్ష్యం జరుగుతోందని ప్రశ్నించిన గ్రామానికి చెందిన బోయిని నరేష్‌పై "బాత్రూమ్‌లో వీడియోలు తీశాడు" అంటూ నిరాధార ఆరోపణలు చేసి కేసు పెట్టించే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై గ్రామస్తులు బుధవారం జిల్లా కలెక్టర్, డీఆర్‌డీఓ, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులకు వినతిపత్రం సమర్పించి సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.బోయిని నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫిర్యాదు అందుకున్న దంతాలపల్లి ఎస్‌ఐ రవికుమార్ తనను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పూర్తిగా పరిశీలించారు. ఆరోపణలకు సంబంధించిన ఎలాంటి వీడియోలు, ఫొటోలు లేదా ఇతర ఆధారాలు లభించలేదని, అనంతరం మొబైల్‌ను తిరిగి అప్పగించారని ఆయన తెలిపారు. మరిన్ని ఆధారాలు ఉంటే అందించాలని పోలీసులే ఫిర్యాదుదారులకు సూచించారని పేర్కొన్నారు.పోలీసుల తనిఖీలో ఎలాంటి ఆధారాలు లభించకపోయినా, సంబంధిత శాఖలకు ఫిర్యాదు చేశామని పేర్కొంటూ సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల తన వ్యక్తిగత ప్రతిష్ఠకు, కుటుంబ గౌరవానికి తీవ్ర భంగం కలిగిందన్నారు.ఈ వ్యవహారంపై గ్రామస్తులు కలెక్టర్‌కు సమర్పించిన వినతిపత్రంలో అంగన్‌వాడి కేంద్రంలో టీచర్, ఆయా విధుల నిర్వహణ, హాజరు నమోదు, పిల్లలకు పౌష్టికాహారం పంపిణీ, ప్రభుత్వ నిబంధనల అమలుపై గ్రామస్థాయిలో సమగ్ర విచారణ (విలేజ్ ఎంక్వైరీ) నిర్వహించాలని కోరారు. విధుల్లో నిర్లక్ష్యం నిరూపితమైతే సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.టీచర్, ఆయా భర్తలు లింగయ్య, విజేందర్‌లు గ్రామ మాజీ సర్పంచ్ సమక్షంలో తనపై దాడికి యత్నించారని, ఆ ఘటనపై కూడా తాను పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించానని బోయిని నరేష్ తెలిపారు.గ్రామ పెద్దలు మాట్లాడుతూ... ప్రజా సమస్యలను ప్రశ్నించే వారిపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, వారి ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రచారం చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ఒకవేళ అంగన్‌వాడి సిబ్బందిపై వచ్చిన ఆరోపణలు నిజమైతే వారిపై చర్యలు తీసుకోవాలని, మరోవైపు నరేష్‌పై చేసిన ఆరోపణలు నిరాధారమైతే తప్పుడు ఫిర్యాదులు చేసిన వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని నిష్పక్షపాత విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ వ్యవస్థలో లోపాలను ప్రశ్నించినందుకు ఎవరూ వేధింపులకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చొప్పరి ఉప్పలయ్య, చిల్ల సత్యనారాయణ, కోడి లింగయ్య, పొన్నం యాకన్న, బోయిని బిక్షం, బోయిని సతీష్, బోయిని నరేష్ తదితరులు పాల్గొన్నారు.3