తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం - కార్యదర్శి గా నియమించిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చైర్మన్ శ్రీ పెట్టెం నవీన్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం - కార్యదర్శి గా నియమించిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చైర్మన్ శ్రీ పెట్టెం నవీన్, నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ నియామకానికి సహకరించి నన్ను ప్రోత్సహించిన.. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్, ప్రభుత్వ విప్ & వేములవాడ శాసనసభ్యులు శ్రీ ఆది శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ సంగీతం శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీ KK మహేందర్ రెడ్డి గారికి* ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గతంలో సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యదర్శిగా, తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా, రెండు సార్లు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గా పార్టీ కోసం నిస్వార్థంగా పని చేశాను. నాకు అప్పగించిన ఈ బాధ్యతను మరింత నిబద్ధతతో, పార్టీ బలోపేతానికి, ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తానని తెలియజేస్తును.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం - కార్యదర్శి గా నియమించిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చైర్మన్ శ్రీ పెట్టెం నవీన్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం - కార్యదర్శి గా నియమించిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చైర్మన్ శ్రీ పెట్టెం నవీన్, నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ నియామకానికి సహకరించి నన్ను ప్రోత్సహించిన.. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్, ప్రభుత్వ విప్ & వేములవాడ శాసనసభ్యులు శ్రీ ఆది శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ సంగీతం శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీ KK మహేందర్ రెడ్డి గారికి* ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గతంలో సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యదర్శిగా, తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా, రెండు సార్లు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గా పార్టీ కోసం నిస్వార్థంగా పని చేశాను. నాకు అప్పగించిన ఈ బాధ్యతను మరింత నిబద్ధతతో, పార్టీ బలోపేతానికి, ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తానని తెలియజేస్తును.
- మెట్ పల్లిలో కవిత పర్యటనలో జేబుదొంగల చేతివాటం.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో బుధవారం కల్వకుంట్ల కవిత పర్యటన సందర్భంగా జేబుదొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పార్టీ కార్యకర్తల రద్దీలో మమేకమైన దుండగులు ఒకరి జేబులో నుంచి రూ.17 వేలు, మరో ఇద్దరి నుంచి రూ.2 వేల చొప్పున నగదు అపహరించారు. అనుమానితుడిని పట్టుకుని విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అప్పగించారు. మహారాష్ట్రకు చెందిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మహారాష్ట్ర అప్పగించారు. అనుమానితున్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు.1
- ఖని బస్స్టాండ్ అవుట్గేట్ వద్ద 1.050 కిలోల గంజాయి పట్టివేత – ఇద్దరు నిందితుల అరెస్ట్ : 1 టౌన్ పోలీసులు గోదావరిఖని బస్స్టాండ్ అవుట్గేట్ వద్ద గోదావరిఖని-I టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో, పోలీసులను గమనించి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న నిందితులను: 1) పిన్నోజి గోపి, తండ్రి రవి, వయస్సు 24 సంవత్సరాలు, వృత్తి కార్పెంటర్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నివాసి. 2) మాచర్ల పవన్ కుమార్, తండ్రి శివశంకర్, వయస్సు 19 సంవత్సరాలు, వృత్తి కటికపరి, దీనదయాల్ నగర్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నివాసి. నిందితుల వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా, అందులో ఎండిన గంజాయి ఆకులు, పండ్లు కలిగిన ప్యాకెట్ లభించింది. పంచుల సమక్షంలో నిందితులను విచారించగా, తాము మహారాష్ట్ర రాష్ట్రంలోని చంద్రపూర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేసి, హైదరాబాద్లో విక్రయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు చంద్రపూర్, మహారాష్ట్రకు వెళ్లి గంజాయి కొనుగోలు చేసి, రైలు మార్గంలో మంచిర్యాలకు చేరుకుని, అక్కడి నుండి ఆటోలో గోదావరిఖనికి వచ్చినట్లు, పోలీసుల తనిఖీలను తప్పించుకుని హైదరాబాద్కు వెళ్లే ప్రయత్నంలో ఉన్న సమయంలో పోలీసులకు పట్టుబడినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. వారి వద్ద నుండి మొత్తం 1.050 కిలోల గంజాయిని, దాని విలువ సుమారు రూ.52,500/- గా ఉండగా, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా గంజాయిని తరలించడానికి ఉపయోగించిన బ్యాగ్ మరియు గంజాయి విక్రయాల కోసం వినియోగించినట్లు భావిస్తున్న మొబైల్ ఫోన్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని పంచుల సమక్షంలో సీజ్ చేసి, సీల్ చేసి, సంబంధిత పంచనామా ప్రకారం భద్రపరిచారు. ఈ ఘటనపై గోదావరిఖని-I టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేసి, తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రజలు మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా విక్రయాల గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.1
- తాతకు 3300 ఎకరాల భూమి ఉండేది మా తాతకు ముగ్గురు భార్యలు ఒక్కో భార్యకు 1100 ఎకరాలు భూమి ఇచ్చాడు - టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మా తాతకు 3300 ఎకరాల భూమి ఉండేది మా తాతకు ముగ్గురు భార్యలు ఒక్కో భార్యకు 1100 ఎకరాలు భూమి ఇచ్చాడు - టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్1
- బెల్లంపల్లిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు నినాదాలతో ధర్నా బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలో విలీనం చేయొద్దని నినాదాలు చేశారు. యూనివర్సిటీలో విలీనం చేస్తే ఫీజుల భారం పెరిగి పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్య దూరమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.1
- పడగవిప్పి కదలకుండా కనువిందు చేసిన నాగుపాము............ జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు జాతీయ రహదారిపై నాగుపాము హల్ చల్ చేసిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది.పడగవిప్పి కదలకుండా కనువిందు చేస్తూ కనిపించిన నాగుపామును స్థానికులు ఆసక్తికరంగా తిలకించారు.అరగంట పాటు ఆసక్తిగా తిలకించిన వాహనదారులు పాదాచారులు దానంతట అదే రోడ్డు దాటి ఓపెన్ ప్లాట్ లలోని చెట్ల పొదల్లోకి నాగుపాము వెళ్లిన తర్వాత ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిపోయారు.1
- *జాతీయ మహాసభలను జయప్రదం చేయండి* *ఆలేరులో బైక్ ర్యాలీ – మహాసభల పోస్టర్ల ఆవిష్కరణ *జాతీయ మహాసభలను జయప్రదం చేయండి* *ఆలేరులో బైక్ ర్యాలీ – మహాసభల పోస్టర్ల ఆవిష్కరణ* రైతాంగాన్ని సమీకరించి, రైతుల సమస్యలపై దేశవ్యాప్త పోరాటాలను మరింత ఉధృతం చేయడానికి జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఏ.ఐ.కె.ఎం.ఎస్. జిల్లా అధ్యక్ష కారుదర్శులు కల్లెపు అడివయ్య, బేజాడి కుమార్ లు పిలుపునిచ్చారు. మహాసభల జయప్రదం చేయాలని పిలుపునిస్తూ ఆలేరులో ఏ.ఐ.కె.ఎం.ఎస్. ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జాతీయ మహాసభలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కల్లెపు అడివయ్య, బేజాడి కుమార్ మాట్లాడుతూ.. దేశంలో రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో రైతుల హక్కుల కోసం జరిగే పోరాటాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ రంగంపై ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, అప్పుల భారం వంటి సమస్యలు రైతాంగాన్ని సంక్షోభంలోకి నెడుతున్నాయని అన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు దేశవ్యాప్తంగా రైతాంగాన్ని ఐక్యం చేసి పోరాటాలను నిర్మించడమే లక్ష్యంగా ఏ.ఐ.కె.ఎం.ఎస్. పనిచేస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో జరగనున్న జాతీయ మహాసభలు భవిష్యత్ రైతాంగ పోరాటాలకు దిశానిర్దేశం చేసే కీలక వేదికగా నిలుస్తాయని అన్నారు. జాతీయ మహాసభల పిలుపును గ్రామగ్రామానికి తీసుకెళ్లేందుకు ఆలేరు ప్రాంతంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. బైక్ ర్యాలీ ద్వారా ప్రజలకు మహాసభల సందేశాన్ని చేరవేయడంతో పాటు, పోస్టర్లను ఆవిష్కరించి మహాసభల ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, యువత, ప్రజాతంత్రవాదులు పెద్ద సంఖ్యలో జాతీయ మహాసభలకు తరలివచ్చి విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏ.ఐ.కె.ఎం.ఎస్. జిల్లా గౌరవాధ్యక్షులు మామిడాల సోమయ్య, ఉపాధ్యక్షులు చిరబోయిన రాజయ్య, ఇక్కిరి సహదేవ్, సహాయ కార్యదర్శి మామిడాల బాలమల్లేష్, తమ్మడి అంజయ్య, పాకాల సరిత, రాఘవ రెడ్డి, గోపాల్ రెడ్డి, మేకల వెంకటేష్, మార్కొండయ్య , పాకాల నరేష్, బాల్ రెడ్డి,ఇక్కిరి శ్రీనివాస్, గడ్డం మంకన్న, మురళి, కుమార్, అంజిరెడ్డి, భూష శ్రీశైలం, బాలయ్య, రామ చంద్రయ్య, మశయ్య, ఆర్.ఉదయ్, పాల్గొన్నారు.2
- కరీంనగర్ నగర పాలక సంస్థలో వాటర్ పైప్‌లైన్ టెండర్ నిబంధనలపై తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ తీవ్ర ఆరోపణలు చేశారు. రిజిస్టర్డ్ కాంట్రాక్టర్లకు అవకాశం లేకుండా... కేవలం పైపుల తయారీ సంస్థలకే అవకాశం కల్పించేలా నిబంధనలు రూపొందించారని ఆరోపించారు. ఇదే పైప్‌లైన్ పనికి గతంలో 45 లక్షల రూపాయల టెండర్ నిర్వహించగా... దాదాపు 28 శాతం లెస్‌కు పని దక్కిందని, దీంతో నగర పాలక సంస్థకు సుమారు 12 లక్షల రూపాయలు ఆదా అయ్యాయని తెలిపారు. అయితే ఇప్పుడు అదే పనికి సంబంధించిన టెండర్ నిబంధనలను ఉన్నట్టుండి ఎందుకు మార్చారో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిబంధనల మార్పు వెనుక ఎవరికి ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశం ఉందో స్పష్టం చేయాలని కోరారు. మేయర్, కమిషనర్‌కు ఈ నిబంధనల మార్పు గురించి తెలుసా..? తెలియకుండానే జరిగిందా..? అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని హరిప్రసాద్ డిమాండ్ చేశారు. టెండర్ ప్రక్రియను వెంటనే నిలిపివేసి, ఎక్కువ మంది అర్హులైన కాంట్రాక్టర్లు పాల్గొనేలా పారదర్శకంగా టెండర్ నిర్వహించాలని కోరారు. అవినీతి ఆరోపణలపై స్పష్టత ఇవ్వకపోతే ఉన్నతాధికారులు, విజిలెన్స్‌కు ఫిర్యాదు చేసి ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.1
- కరీంనగర్ జిల్లా తనుగులలో అదృశ్యమైన వ్యక్తి హత్య... తల్లి అక్క బావలే నిందితులని తేల్చిన పోలీసులు మద్యం మత్తులో నిత్యం కన్న తల్లిని వేధింపులకు గురి చేసి ఇటీవల అదృశ్యమైన వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులు తేల్చారు. తల్లితో పాటు అక్క బావ నే నిందితులను నిర్థారించి అరెస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల గ్రామానికి చెందిన బొజ్జపల్లి రాజబాబు వృత్తి రీత్యా సుతారి పనిచేస్తూ జీవనం కొనసాగించేవాడు. అయితే క్రమేణా తాగుడుకు బానిసయ్యాడు. నిత్యం తాగి వచ్చి భార్యను వేధింపులకు గురి చేస్తుంటే మూడు సంవత్సరాల క్రితం భర్తను వదిలి భార్య వెళ్ళిపోయింది. దీంతో కూలి పనిచేసుకొని జీవించే తల్లిని, అక్క బావతో మద్యం మత్తులో నిత్యం గొడవ పడేవాడు. దీంతో విసుగు చెందిన తల్లి అక్క బావ మరో నలుగురితో కలిసి మంచానికి కట్టి ఉరి వేసి హత్య చేశారు. మృత దేహాన్ని తీసుకెళ్లి రాజబాబు వ్యవసాయ బావి వద్ద పూడ్చి పెట్టారు. అనంతరం పోలీసులకు రాజబాబు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు గా నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబ సభ్యులపై అనుమానాలు రావడంతో అదుపులో తీసుకొని విచారించారు. పోలీసు విచారణలో తామే హత్య చేసి పూడ్చి పెట్టమని నిందితులు ఒప్పుకోవడం తో నిందితులను రాజబాబును పూడ్చి పెట్టిన స్థలానికి తీసుకువచ్చి మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం కు తరలించారు. అయితే మద్యం సేవించి నిత్యం వేధించడమే హత్యకు గల కారణాలనీ పోస్టుమార్టం అనంతరం నిందితులను రిమాండ్ కు తరలిస్తామని హుజురాబాద్ ఏసిపి మాధవి తెలిపారు2
- ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రామగుండం కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్,అదనపు కలెక్టర్ అరుణశ్రీ నిర్లక్ష్యం., కమిషనర్ చాంబర్ ముందు బైఠాయించిన కాంగ్రెస్ కార్పొరేటర్లు రామగుండంలో అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్లు మంగళవారం రాత్రి ఆందోళన చేపట్టారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రామగుండం కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్,అదనపు కలెక్టర్ అరుణశ్రీ నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా దురుసుగా ప్రవర్తిస్తుందంటూ కమిషనర్ చాంబర్ ముందు బైఠాయించారు. అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టడం చర్చనీయాంశం అయింది. 45వ డివిజన్ కార్పొరేటర్ కౌటం సతీష్ తన డివిజన్లో మన సమస్యలపై కమిషనర్కు అర్జీ పెట్టుకున్నప్పటికీ సమస్యను పరిష్కరించడంలో జరుగుతున్న జాప్యాన్ని వివరణ కోరెందుకురాగా మీతో మాట్లాడేది ఏమీ లేదనీ చెబుతూ అటెండర్ తో బయటికి వెళ్ళగొట్టించారని కార్పొరేటర్ ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. ఇన్చార్జి కమిషనర్ దురుసు ప్రవర్తనను తప్పుపడుతూ కాంగ్రెస్ కార్పొరేటర్లు దొంత శ్రీను, సాగి సంతోష్ రావు, బిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య యాదవ్, సిపిఐ కార్పొరేటర్ మార్కాపురం సూర్య, కాంగ్రెస్ నాయకులు పాతపల్లి రవి, సిపిఐ నాయకుడు శనిగరం చంద్రశేఖర్ ఇన్చార్జి కమిషనర్ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ కార్పొరేటర్లు చేస్తున్న నిరసనలో బిఆర్ఎస్, సిపిఐ కార్పొరేటర్లు మద్దతు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.1