*మెట్‌పల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికల్లో బీజేపి కోవర్టు రాజకీయాలు..?దేశం కోసం ధర్మం కోసం మా ఓటు.. స్వార్థం కోసం మీ ఓటా,ఎం జరగాలి? ఎం జరిగింది? ఎందుకు జరిగింది* మెట్ పెల్లి ఫిబ్రవరి 19 ప్రజా ముద్ర న్యూస్ కోరుట్ల నియోజకవర్గం మెట్‌పల్లి పురపాలక సంఘ ఎన్నికల్లో 10 స్థానాల్లో గెలిచిన బీజేపికి మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్, వైస్ చైర్మన్ అయ్యే సువర్ణ అవకాశం వచ్చిందనే చెప్పాలి. ఆ రోజు అక్కడ నెలకొన్న రాజకీయ పరిస్థితి బీజేపికి పూర్తిగ అనుకూలంగానే వున్నదని చెప్పాలి. అక్కడ జరగాల్సింది బీజేపి చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక అన్నట్టుగానే వాతావరణం కనిపించింది. అదే గనక జరిగితే రాజకీయంగా కోరుట్ల నియోజకవర్గంలో బీజేపికి మంచి స్థితికి వచ్చేదన్న వాదన వచ్చింది. ఫలితాలు వచ్చాకా చాలామంది బీఆరఎస్, కాంగ్రెస్, ఇండిపెండెంట్లు కలిసిపోతారు అని చాలామంది భావించారు. బీజేపికి ఇక అధికారం అందని ద్రాక్షలే అని చాలామంది అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నిక సమయంలో అటు బీఆరఎస్, ఇటు కాంగ్రెస్ తమ అభ్యర్థుల్ని నిలబెట్టింది. దీనితో బీజేపికి రెండు విజయాలు సులభం అని అందరు భావించారు. కాని అనూహ్యంగా మీనా అనే కౌన్సిలర్ కాంగ్రెస్‌కు మద్ధతు తెలుపడంతో బీజేపి శ్రేణులు నిరాశకు లోనవడమే కాకుండా పార్టీ తీరుతెన్నులపై, క్రమశిక్షణా తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ అవేశంతోనే బీజేపి జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబుపై బౌతికదాడికి దిగారు. దాడి చేసిన కార్యకర్తలు ఎందుకు విప్ సమయానికి అందించలేదు అనే ఆరోపణ చేశారు. నేను ఎం తప్పు చేసినా? నాదేం తప్పు అని యాదగిరిబాబు దాడికి దిగిన కార్యకర్తలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఈలోగా గొడవ జరగడం, మెట్‌పల్లి సిఐ అనిల్‌కుమార్ సహ పోలీసులు వచ్చి పరిస్థితిని కంట్రోల్ చేశారు. తెర వెనుక..? ఒక సీనియర్ బీజేపి నాయకుని కుటుంబానికి చెందిన కౌన్సిలర్ అయిన మీనా కాంగ్రెస్‌కు ఓటువేయడం వెనక భిన్నమైన ఆరోపణలు వస్తున్నాయి. అందులో ముఖ్యమైది. ప్రస్తుతం కొలువుదీరిన మున్సిపల్ కౌన్సిల్ లో కో ఆప్షన్ సభ్యత్వం ఆ కుటుంబానికి ఇస్తామన్న వాగ్దానంతో పాటుగా ఇతరత్రా లాంఛనాలు పూర్తి చేశారన్న పుకార్లు వినిపిస్తున్నాయి. నియోజకవర్గం బీజేపిలో ముఖ్యపాత్ర పోషిస్తున్న ఓ నాయకుని కనుసన్నల్లో ఈ కోవర్టు ఆపరేషన్ చాలా రహస్యంగా జరిగిందన్న ఆరోపణ కూడా వస్తున్నది. జిల్లా అధ్యక్షునిది కేవలం పేక్షకపాత్ర మాత్రమే అని కొందరు చెబుతున్నారు. నాటకంలో తెరమీద కనిపించే తోలుబోమ్మలాంటి పాత్రనే యాదగిరిబాబుకు ఇచ్చారని, వెనక వుండి బొమ్మను కదిలించి డ్యాన్స్‌లు చేయించింది మరికొందరు అని చెబుతున్నారు. కార్యకర్తలు ఏం అంటున్నారంటే…! బీజేపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావ్ మీడియా సమావేశంలో విప్ అందచేశారని చెప్పిన సమయానికి స్థానిక నాయకులు చెబుతున్న సమయానికి అసలు పొంతనే లేదు. విప్ ఎప్పుడిచ్చారు అనే సందిగ్దం వీడాలంలే జిల్లా అధ్యక్షుడు ఎన్ని గంటలకు విప్ పత్రాలను అధికారులకు అప్పగించాడు? అప్పగించిన సమయం ఎప్పుడు? అని తేలాలి. అంతేకాకుండా అధికారులకు అప్పగించిన విప్ పత్రాలు సరియైనవా? లేక కలర్ జిరాక్స్ పత్రాలో కూడా తెలియాల్సి వుంది అని చాలా మంది కార్యకర్తలు అంటున్నారు. ఒకవేళ విప్ పత్రాలు సరి అయిన సమయంలో గనుక అధికారులకు అప్పగిస్తే చట్ట ప్రకారం మీనా పై తగు చర్యలు తీసుకోవాలని కార్యకర్తలు అంటున్నారు ఒక పకడ్భంది ప్రణాళికతోనే కొందరు నాయకులు పార్టీని భ్రష్ఠు పట్టించే పని చేశారని కార్యకర్తలు విమర్శిస్తున్నారు. నిజం తెలియాలంటే జిల్లా అధ్యక్షుడు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా వుందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. అలా వీలుకాకపోతే ఎంపి ధర్మపురి అరవింద్ స్వయంగా ఈ విషయంపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం వుందన్న వాదన వస్తున్నది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా బీజేపి శ్రేణుల్లో అలజడి, నిరాశకు గురిచేసిన ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ సంఘటన అనంతరం “దేశం కోసం ధర్మం కోసం మేము బీజేపికి ఓటువేస్తే.. స్వార్థం కోసం స్వలాభం కోసం ఆ ఓటుతో వచ్చిన అధికారంతో మీరు కాంగ్రెస్‌కు ఓటు వేస్తారా?“ అని బీజేపి సానుభూతిపరులు ప్రశ్నిస్తున్నది మాత్రం నిజమనే వాదన వస్తున్నది.
*మెట్‌పల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికల్లో బీజేపి కోవర్టు రాజకీయాలు..?దేశం కోసం ధర్మం కోసం మా ఓటు.. స్వార్థం కోసం మీ ఓటా,ఎం జరగాలి? ఎం జరిగింది? ఎందుకు జరిగింది* మెట్ పెల్లి ఫిబ్రవరి 19 ప్రజా ముద్ర న్యూస్ కోరుట్ల నియోజకవర్గం మెట్‌పల్లి పురపాలక సంఘ ఎన్నికల్లో 10 స్థానాల్లో గెలిచిన బీజేపికి మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్, వైస్ చైర్మన్ అయ్యే సువర్ణ అవకాశం వచ్చిందనే చెప్పాలి. ఆ రోజు అక్కడ నెలకొన్న రాజకీయ పరిస్థితి బీజేపికి పూర్తిగ అనుకూలంగానే వున్నదని చెప్పాలి. అక్కడ జరగాల్సింది బీజేపి చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక అన్నట్టుగానే వాతావరణం కనిపించింది. అదే గనక జరిగితే రాజకీయంగా కోరుట్ల నియోజకవర్గంలో బీజేపికి మంచి స్థితికి వచ్చేదన్న వాదన వచ్చింది. ఫలితాలు వచ్చాకా చాలామంది బీఆరఎస్, కాంగ్రెస్, ఇండిపెండెంట్లు కలిసిపోతారు అని చాలామంది భావించారు. బీజేపికి ఇక అధికారం అందని ద్రాక్షలే అని చాలామంది అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నిక సమయంలో అటు బీఆరఎస్, ఇటు కాంగ్రెస్ తమ అభ్యర్థుల్ని నిలబెట్టింది. దీనితో బీజేపికి రెండు విజయాలు సులభం అని అందరు భావించారు. కాని అనూహ్యంగా మీనా అనే కౌన్సిలర్ కాంగ్రెస్‌కు మద్ధతు తెలుపడంతో బీజేపి శ్రేణులు నిరాశకు లోనవడమే కాకుండా పార్టీ తీరుతెన్నులపై, క్రమశిక్షణా తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ అవేశంతోనే బీజేపి జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబుపై బౌతికదాడికి దిగారు. దాడి చేసిన కార్యకర్తలు ఎందుకు విప్ సమయానికి అందించలేదు అనే ఆరోపణ చేశారు. నేను ఎం తప్పు చేసినా? నాదేం తప్పు అని యాదగిరిబాబు దాడికి దిగిన కార్యకర్తలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఈలోగా గొడవ జరగడం, మెట్‌పల్లి సిఐ అనిల్‌కుమార్ సహ పోలీసులు వచ్చి పరిస్థితిని కంట్రోల్ చేశారు. తెర వెనుక..? ఒక సీనియర్ బీజేపి నాయకుని కుటుంబానికి చెందిన కౌన్సిలర్ అయిన మీనా కాంగ్రెస్‌కు ఓటువేయడం వెనక భిన్నమైన ఆరోపణలు వస్తున్నాయి. అందులో ముఖ్యమైది. ప్రస్తుతం కొలువుదీరిన మున్సిపల్ కౌన్సిల్ లో కో ఆప్షన్ సభ్యత్వం ఆ కుటుంబానికి
ఇస్తామన్న వాగ్దానంతో పాటుగా ఇతరత్రా లాంఛనాలు పూర్తి చేశారన్న పుకార్లు వినిపిస్తున్నాయి. నియోజకవర్గం బీజేపిలో ముఖ్యపాత్ర పోషిస్తున్న ఓ నాయకుని కనుసన్నల్లో ఈ కోవర్టు ఆపరేషన్ చాలా రహస్యంగా జరిగిందన్న ఆరోపణ కూడా వస్తున్నది. జిల్లా అధ్యక్షునిది కేవలం పేక్షకపాత్ర మాత్రమే అని కొందరు చెబుతున్నారు. నాటకంలో తెరమీద కనిపించే తోలుబోమ్మలాంటి పాత్రనే యాదగిరిబాబుకు ఇచ్చారని, వెనక వుండి బొమ్మను కదిలించి డ్యాన్స్‌లు చేయించింది మరికొందరు అని చెబుతున్నారు. కార్యకర్తలు ఏం అంటున్నారంటే…! బీజేపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావ్ మీడియా సమావేశంలో విప్ అందచేశారని చెప్పిన సమయానికి స్థానిక నాయకులు చెబుతున్న సమయానికి అసలు పొంతనే లేదు. విప్ ఎప్పుడిచ్చారు అనే సందిగ్దం వీడాలంలే జిల్లా అధ్యక్షుడు ఎన్ని గంటలకు విప్ పత్రాలను అధికారులకు అప్పగించాడు? అప్పగించిన సమయం ఎప్పుడు? అని తేలాలి. అంతేకాకుండా అధికారులకు అప్పగించిన విప్ పత్రాలు సరియైనవా? లేక కలర్ జిరాక్స్ పత్రాలో కూడా తెలియాల్సి వుంది అని చాలా మంది కార్యకర్తలు అంటున్నారు. ఒకవేళ విప్ పత్రాలు సరి అయిన సమయంలో గనుక అధికారులకు అప్పగిస్తే చట్ట ప్రకారం మీనా పై తగు చర్యలు తీసుకోవాలని కార్యకర్తలు అంటున్నారు ఒక పకడ్భంది ప్రణాళికతోనే కొందరు నాయకులు పార్టీని భ్రష్ఠు పట్టించే పని చేశారని కార్యకర్తలు విమర్శిస్తున్నారు. నిజం తెలియాలంటే జిల్లా అధ్యక్షుడు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా వుందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. అలా వీలుకాకపోతే ఎంపి ధర్మపురి అరవింద్ స్వయంగా ఈ విషయంపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం వుందన్న వాదన వస్తున్నది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా బీజేపి శ్రేణుల్లో అలజడి, నిరాశకు గురిచేసిన ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ సంఘటన అనంతరం “దేశం కోసం ధర్మం కోసం మేము బీజేపికి ఓటువేస్తే.. స్వార్థం కోసం స్వలాభం కోసం ఆ ఓటుతో వచ్చిన అధికారంతో మీరు కాంగ్రెస్‌కు ఓటు వేస్తారా?“ అని బీజేపి సానుభూతిపరులు ప్రశ్నిస్తున్నది మాత్రం నిజమనే వాదన వస్తున్నది.
- జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ గా ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో శ్రీమతి సమిండ్ల వాణి శ్రీనివాస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా బుధవారం హైదరాబాద్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సంక్షేమ శాఖ మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి, జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ గా తన నియామకంకు సహకరించినందుకు కృతజ్ఞతలుచెపుతూ, జగిత్యాలఅభివృద్ధికి సహక్రించాలని శ్రీమతి సమిండ్ల వాణి శ్రీనివాస్ దంపతులు కోరారు.1
- Post by KR NEWS 3691
- నగరంలో సాధన సంస్థ నెల రోజులపాటు నిర్వహించనున్న బాల్యవివాహల నిరోధక ప్రచార రథాన్ని జూనియర్ సివిల్ జడ్జి ఖుష్బూ ఉపాధ్యాయ జిల్లా కోర్టు ఆవరణలో ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బాలల శరీర ఆకృతి పెరిగే వయసులో, మేధస్సు కూడా పెరుగుతుందన్నారు. పెరిగే క్రమంలో విరిగే పనులు చేయరాదని, ఎదగనిద్దామని ఆమె పేర్కొన్నారు. బాలల భవిష్యత్ భద్రతకు బాల్య వివాహలు గొడ్డలి పెట్టులాంటివని తెలిపారు. బాల్యవివాహలు చేసిన వారు, ప్రోత్సహించిన వారు కూడా చట్ట ప్రకారం శిక్షార్హులేనని అన్నారు. బాల్యవివాహలను చట్టం ద్వారా నిషేదించడం జరిగిందని జూనియర్ సివిల్ జడ్జి ఖుష్బూ ఉపాధ్యాయ అన్నారు. బాలల చదువుకే ప్రాధాన్యతనివ్వాలని, చదువు వారిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని తెలిపారు. ఎదిగి ఎదగని వయసులో బాల్య వివాహలు చేయడం అంటే చిగురించే మొక్కలను చిదిమివేయడమేనని ఆమె అన్నారు. చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్ మాట్లాడుతూ సాధన సంస్థ ఒక మంచి ప్రచారశైలికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు పద్మ, చైతన్య, సాధన, సిబ్బంది మధుసూదన్, వినీష్, నిరీక్ష, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ పర్యవేక్షకురాలు శైలజ రెడ్డి, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.1
- కరీంనగర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు మండలం దేవంపల్లి గ్రామానికి చెందిన వివాహిత పోలవేణి అనుష (25) కాకతీయ కెనాల్‌లో పడి మృతి చెందింది. ఇంటి వద్ద నుంచి బయటకు వెళ్లిన ఆమె కోసం గాలింపు చేపట్టగా రంగపేట శివారులో మృతదేహం లభ్యమైంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు.1
- కామారెడ్డి : రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని కామారెడ్డి పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె పట్టణంలోని బుర్ర మత్తడి, ఫిల్టర్ బెడ్లను మున్సిపల్ అధికారులతో కలిసి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ సూచన మేరకు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా ఫిల్టర్ బెడ్ల పనితీరును పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడుతూ పట్టణంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. బుర్ర మత్తడి వద్ద ప్రస్తుతం ఉన్న వనరులకు అదనంగా మరో మూడు కొత్త బోర్లు వేయించాలని, వీటికి అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేకంగా ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, ఏఈ వేణు ప్రసాద్‌లకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఫిల్టర్ బెడ్ల వద్ద పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదని, ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించాలని సూచించారు. ప్రతి ఇంటికి తాగునీరు సక్రమంగా అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. వేసవి ప్రణాళికలో ఏవైనా లోపాలు ఉంటే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి,ఏఈ వేణు ప్రసాద్‌లతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు అన్వర్,కాల్ల గణేష్, భాస్కర్ గౌడ్,గడ్డమీద మహేష్,అంజద్,లడ్డు, భూపతి,గంగాధర్, వాజిద్,లోలం శ్రీనివాస్, జెర్సీ నర్సింహులు, మామిడి లక్ష్మణ్,కె. లలిత, బబ్లు,మాజీద్, జావేద్,యూనుస్, సిద్దిఖ్,గ్యార సాయిలు, మన్సూర్ మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1
- సిర్పూర్ నియోజకవర్గం బెజ్జుర్ మండలం ముంజంపల్లి గ్రామంలో శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. శివాజీ దేశభక్తి, పరాక్రమం నేటి యువతకు ఆదర్శమని పేర్కొంటూ సమాజంలో ఐక్యత పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జయంతి సందర్భంగా ర్యాలీ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.1
- బాల్క సుమన్ కి 14 రోజుల రిమాండ్. ఆదిలాబాద్ జిల్లా జైలు కు తరలింపు. ప్రధాన నిందితుడుగా బాల్క సుమన్.. రెండవ నిందితుడిగా చెన్నూరుకు చెందిన మూల రాజిరెడ్డి పై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశ పెట్టిన పోలీసులు.. ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మంచిర్యాల కవిత ఎదుట హాజరు పరిచిన పోలీసులు...! 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఆదేశాలిచ్చిన న్యాయమూర్తి..! మరికొద్ది సేపట్లో ఆదిలాబాద్ జిల్లా జైలు కు తరలించనున్న పోలీసులు. ప్రస్తుతం ఇంకా కోర్టులోనే ఉన్న బాల్క సుమన్...! ....1
- నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, నందిపేట్ మండల కేంద్రాలలో గల భవిత సెంటర్లను కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం సందర్శించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ఉద్దేశించిన ఈ కేంద్రాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అధికారులను ఆదేశించారు. ముందుగా ఆర్మూర్ పట్టణంలోని భవిత కేంద్రంను తనిఖీ చేసి, నిర్వహణ తీరుతెన్నులను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. చిన్నారులను కలెక్టర్ ఆప్యాయంగా పలకరించి కరచాలనం చేస్తూ, వారికి చాక్లెట్లు పంచి పెట్టారు. పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, వారిని గాయపర్చే పదునైన వస్తువులు వంటివి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. యాక్టివిటీ రూమ్, థెరపీ రూమ్, టాయిలెట్స్, ఆఫీసు గదితో పాటు భవిత కేంద్రంలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం నందిపేట్ మండల కేంద్రంలో నిర్మాణం జరుగుతున్న భవిత సెంటర్ ను సందర్శించారు. పనులను వేగంగా, నాణ్యతతో జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. చిన్నారులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ర్యాంపు వంటి వసతులు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, జిల్లా విద్యా శాఖ అధికారి పి.అశోక్, ఇంజినీరింగ్ విభాగం అధికారులు జి.రవి, ఉదయ్ కిరణ్ తదితరులు ఉన్నారు.1