Shuru
Apke Nagar Ki App…
ధర్నాకు దిగిన మాజీమంత్రి ఎర్రబెల్లి : నర్సంపేటలో ఉద్రిక్తత ఉమ్మడి వరంగల్ నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గద్దెను ఆదివారం కూల్చివేయడంతో జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇతర బీఆర్ఎస్ శ్రేణులతో కల్సి ధర్నాకు దిగారు. సోమవారం అకస్మాత్తుగా చేస్తున్న ధర్నా స్థలం నుండి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. సంఘటన కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Devender Pasunoori
ధర్నాకు దిగిన మాజీమంత్రి ఎర్రబెల్లి : నర్సంపేటలో ఉద్రిక్తత ఉమ్మడి వరంగల్ నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గద్దెను ఆదివారం కూల్చివేయడంతో జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇతర బీఆర్ఎస్ శ్రేణులతో కల్సి ధర్నాకు దిగారు. సోమవారం అకస్మాత్తుగా చేస్తున్న ధర్నా స్థలం నుండి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. సంఘటన కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
More news from తెలంగాణ and nearby areas
- ముమ్మాటికి డబుల్ బెడ్ రూములు మా కెసిఆర్ కట్టినవే ఇద్దరు మంత్రులను ఒక ఆట ఆడుకున్న : హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ముమ్మాటికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మా కేసీఆర్ కట్టినవే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు తామే ఇచ్చామని చెప్పుకుంటూ సభ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మీరిచ్చే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించినవే అంటూ పొన్నం ప్రభాకర్‌తో వాగ్వాదానికి దిగిన కౌశిక్ రెడ్డిపొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ కౌశిక్ రెడ్డి కేసీఆర్ చేసిన అప్పుల వల్ల పథకాలు ఇవ్వడంలేదని చెప్పిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే లేచి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి అబద్ధాలు చెప్తున్నారంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై మండిపడ్డ కౌశిక్ రెడ్డి అప్పుల పేరుతో కాంగ్రెస్ తప్పించుకునే డ్రామాలు ఆపాలని పొంగులేటితో కౌశిక్ రెడ్డి వాగ్వాదం2
- యాదగిరిగుట్ట: ఏకశిఖరవాసుడి సన్నిధిలో ఏకాదశి విశేష పర్వాలు ఏకశిఖరవాసుడు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని విశేషపూజలు కొనసాగాయి. ఆలయ ముఖ మండపంలో లక్ష పుష్పార్చనలు, సువర్ణ పుష్పార్చనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. స్వామిని సుప్రభాతంతో మేల్కొలిపిన ఆచార్యులు నిజాభిషేకం, సుదర్శన హోమం, నిత్య కళ్యాణం జరిపారు. అలాగే పాతగుట్ట శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.1
- సోమవారం సువర్ణ శివలింగానికి అభిషేకాలు.. పెరిగిన భక్తుల రద్దీ సోమవారం సందర్భంగా రమణేశ్వర మహాక్షేత్రంలో సువర్ణ శివలింగానికి భక్తులు భక్తిశ్రద్ధలతో అభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.1
- పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యం: మంత్రిలు పొంగులేటి, పొన్నం హన్మకొండ జిల్లా:అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటిని అందించి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరు, మనేపల్లి తదితర గ్రామాల్లో 394 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఇళ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే సుమారు 8 లక్షల ఇళ్లకు అనుమతులు ఇచ్చామని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందే వరకు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇళ్లతో పాటు కాలనీల్లో తాగునీరు, రహదారులు, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి తెలిపారు. కులం, మతం, పార్టీతో సంబంధం లేకుండా అర్హతే ప్రామాణికంగా ఇళ్ల కేటాయింపులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ కమలాపూర్ మండలంలో 394 కుటుంబాలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు అందడం సంతోషకరమన్నారు. కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ లబ్ధిదారులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎంపిక చేశామని, అనర్హులు తేలితే కేటాయింపులు రద్దు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.1
- దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది విగ్రహ గద్దె కూల్చివేత... ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదురుగా దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి నిర్మించిన గద్దెను కూల్చివేసినట్లుతెలుస్తోంది. ఆదివారం రాత్రి విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదంటూ మున్సిపాలిటీ అధికారులు కూల్చివేసినట్లుగా స్థానికులు తెలిపారు.ప్రైవేట్ స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నా అనుమతి లేదంటూ రాత్రి వేళ అక్రమంగా కూల్చివేసారంటూ అధికారులపై బిఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- ధర్నాకు దిగిన మాజీమంత్రి ఎర్రబెల్లి : నర్సంపేటలో ఉద్రిక్తత ఉమ్మడి వరంగల్ నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గద్దెను ఆదివారం కూల్చివేయడంతో జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇతర బీఆర్ఎస్ శ్రేణులతో కల్సి ధర్నాకు దిగారు. సోమవారం అకస్మాత్తుగా చేస్తున్న ధర్నా స్థలం నుండి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. సంఘటన కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1