Shuru
Apke Nagar Ki App…
దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది విగ్రహ గద్దె కూల్చివేత... ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదురుగా దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి నిర్మించిన గద్దెను కూల్చివేసినట్లుతెలుస్తోంది. ఆదివారం రాత్రి విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదంటూ మున్సిపాలిటీ అధికారులు కూల్చివేసినట్లుగా స్థానికులు తెలిపారు.ప్రైవేట్ స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నా అనుమతి లేదంటూ రాత్రి వేళ అక్రమంగా కూల్చివేసారంటూ అధికారులపై బిఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Devender Pasunoori
దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది విగ్రహ గద్దె కూల్చివేత... ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదురుగా దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి నిర్మించిన గద్దెను కూల్చివేసినట్లుతెలుస్తోంది. ఆదివారం రాత్రి విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదంటూ మున్సిపాలిటీ అధికారులు కూల్చివేసినట్లుగా స్థానికులు తెలిపారు.ప్రైవేట్ స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నా అనుమతి లేదంటూ రాత్రి వేళ అక్రమంగా కూల్చివేసారంటూ అధికారులపై బిఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
More news from తెలంగాణ and nearby areas
- ముమ్మాటికి డబుల్ బెడ్ రూములు మా కెసిఆర్ కట్టినవే ఇద్దరు మంత్రులను ఒక ఆట ఆడుకున్న : హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ముమ్మాటికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మా కేసీఆర్ కట్టినవే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు తామే ఇచ్చామని చెప్పుకుంటూ సభ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మీరిచ్చే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించినవే అంటూ పొన్నం ప్రభాకర్‌తో వాగ్వాదానికి దిగిన కౌశిక్ రెడ్డిపొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ కౌశిక్ రెడ్డి కేసీఆర్ చేసిన అప్పుల వల్ల పథకాలు ఇవ్వడంలేదని చెప్పిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే లేచి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి అబద్ధాలు చెప్తున్నారంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై మండిపడ్డ కౌశిక్ రెడ్డి అప్పుల పేరుతో కాంగ్రెస్ తప్పించుకునే డ్రామాలు ఆపాలని పొంగులేటితో కౌశిక్ రెడ్డి వాగ్వాదం2
- యాదగిరిగుట్ట: ఏకశిఖరవాసుడి సన్నిధిలో ఏకాదశి విశేష పర్వాలు ఏకశిఖరవాసుడు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని విశేషపూజలు కొనసాగాయి. ఆలయ ముఖ మండపంలో లక్ష పుష్పార్చనలు, సువర్ణ పుష్పార్చనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. స్వామిని సుప్రభాతంతో మేల్కొలిపిన ఆచార్యులు నిజాభిషేకం, సుదర్శన హోమం, నిత్య కళ్యాణం జరిపారు. అలాగే పాతగుట్ట శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.1
- సోమవారం సువర్ణ శివలింగానికి అభిషేకాలు.. పెరిగిన భక్తుల రద్దీ సోమవారం సందర్భంగా రమణేశ్వర మహాక్షేత్రంలో సువర్ణ శివలింగానికి భక్తులు భక్తిశ్రద్ధలతో అభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.1
- బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల,రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తోంది..సిపిఎం జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల,రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తోంది..సిపిఎం జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ ఈ రోజు మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో జైలు భరో కార్యక్రమంలో రసవత్తరంగా సాగింది. కార్మికులు,కర్షికులు ప్రజలు పార్టీ శ్రేణులు వేలాదిగా తరలి వచ్చి పాల్గొన్నారు.మహబూబాబాద్ పట్టణంలో పోలీసులకు పార్టీ శ్రేణులకు మధ్య భారీగా తోపులాట జరగటంతో కార్యకర్తలు మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదలతో హోరేత్తించారు. అక్రమ అరెస్టులను వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్ను ముట్టడించిన మహిళలు. పార్టీ నాయకులను నిర్భంధింది అరెస్టులు చేసి పోలీసుస్టేషన్ కు తరలించారు తహసీల్దార్ కార్యాలయం ఏరియాలో సిపిఎం పార్టీ శ్రేణులకు పోలీసుల మధ్య భారీ ఉదృక్తత్త జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దెశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ కార్పొరేట్ అనుకూల విధానాలను శరా వేగంగా అమలు చేయడానికి పూనుకోవడం బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల,రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తోంది. అందుకే బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా నేడు జైల్ భరో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు ’ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మతోన్మాదాన్ని వ్యతిరేకించేందుకు శ్రామిక ప్రజలు పోరాడాల్సిన అవసరముందన్నారు. దేశ సమైక్యత, సమగ్రతల కోసం రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఎందరో పోరాటయోధుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న దేశ స్వాతంత్ర్యాన్ని, సంపదను, సార్వభౌమత్వాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం విదేశీ సంస్థలకు తాకట్టు పెడుతోందని విమర్శించారు. అనేక దశాబ్దాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న 29కార్మిక చట్టాలను ఒక్క కలం పోటుతో రద్దుచేసి వాటన్నింటినీ నాలుగు లేబర్ కోడ్ లుగా తీసుకరావడం అంటే కార్మికుల మౌలిక హక్కులను పూర్తిగా హరించివేయడమే విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని కార్పోరేట్ శక్తులకు కట్టబెడుతున్న 32 దేశాల వ్యవసాయ దిగుమతులను అనుమతులను రద్దు చేయాలి. స్వదేశి ఉత్పత్తులను ప్రొత్సహించాలి. మోడీ ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించాలని, కనీస మద్దతు ధరల చట్టం చేయాలని, పాత ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, రోజు వేతనం 600కు, పని దినాలు ఏడాదికి 200 రోజులకు పెంచాలని,పట్టణాల్లో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించాలి. లేబర్ కోడ్లు రద్దుచేసి కనీస వేతనం 31,000 /-ఇవ్వాలని , భవన నిర్మాణం, హమాలి, ట్రాన్స్పోర్ట్ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి. కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి ప్రభుత్వం బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి బానోత్ సీతారాం నాయక్,సీఐటీయూ జిల్లా కార్యదర్శి సమ్మెట రాజమౌలి,కుమ్మరి కుంట్ల నాగన్న,పట్ల మధు,గుండు సులోచన,కంపల్లి శ్రీనివాస్,కరుణ,నీలం కృష్ణ వేణి,కందునురి కవిత, బానోత్ వెంకన్న నాయక్,యమగాని వెంకన్న,బత్తుల వెంకన్న,గారే కోటేశ్వరావు,వెంకట్ నారాయణ,దేవత్ హేమనాయక్ ,బానోత్ ప్రకాష్ నాయక్,రావుల రాజు తదితరులు పాల్గున్నారు.1
- దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది విగ్రహ గద్దె కూల్చివేత... ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదురుగా దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి నిర్మించిన గద్దెను కూల్చివేసినట్లుతెలుస్తోంది. ఆదివారం రాత్రి విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదంటూ మున్సిపాలిటీ అధికారులు కూల్చివేసినట్లుగా స్థానికులు తెలిపారు.ప్రైవేట్ స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నా అనుమతి లేదంటూ రాత్రి వేళ అక్రమంగా కూల్చివేసారంటూ అధికారులపై బిఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- ధర్నాకు దిగిన మాజీమంత్రి ఎర్రబెల్లి : నర్సంపేటలో ఉద్రిక్తత ఉమ్మడి వరంగల్ నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గద్దెను ఆదివారం కూల్చివేయడంతో జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇతర బీఆర్ఎస్ శ్రేణులతో కల్సి ధర్నాకు దిగారు. సోమవారం అకస్మాత్తుగా చేస్తున్న ధర్నా స్థలం నుండి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. సంఘటన కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1