Shuru
Apke Nagar Ki App…
Talakondapally Laxmaiah
More news from తెలంగాణ and nearby areas
- ఉస్మానియా యూనివర్సిటీలో మార్చి 15న "మాల విద్యార్థుల, ఉద్యోగుల, అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనం" ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మాల స్టూడెంట్ జేఏసీ (malaStudent JAC) మరియు హంస ఆధ్వర్యంలో మార్చి 15వ తేదీన (ఆదివారం) నిర్వహించనున్న "మాల విద్యార్థుల, ఉద్యోగుల, అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనం" పోస్టర్‌ను నేడు ఆవిష్కరించారు. ఓయూ సైన్స్ కాలేజ్ సెమినార్ హాల్‌లో ఈ భారీ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని మాల సామాజిక వర్గ అభివృద్ధి కోసం, అన్ని రంగాల్లో మన ఉనికిని చాటుకోవడానికి ఈ వేదికను సిద్ధం చేసినట్లు తెలిపారు. కార్యక్రమ ముఖ్య ఉద్దేశాలు ఐక్యత చాటడం రాజకీయ సిద్ధాంతాలు ఏవైనా (నీలి జెండా నుండి ఎర్ర జెండా వరకు, ఆర్‌ఎస్‌యూ నుండి ఆర్‌ఎస్‌ఎస్ వరకు), మాల జాతి బిడ్డలందరూ ఒకే తాటిపైకి రావాలి. అభివృద్ధి ప్రణాళికలు విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాలలో మాల యువతను ఉన్నత శిఖరాలకు చేర్చేలా విధివిధానాల రూపకల్పన. రాజకీయ ప్రాతినిధ్యం రాజకీయ రంగంలో మాలల వాటాను, ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేసే దిశగా పోరాట కార్యాచరణ. మేధో చర్చ మాల జాతి మేధావులు, ప్రొఫెసర్లు, ఉద్యోగుల అనుభవాలను, సూచనలను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తు కార్యాచరణను రూపొందించడం. జాతి అభివృద్ధి కోసం జరుగుతున్న ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. మన ఆలోచనా విధానం మాల జాతి పురోగతికి తోడ్పడేలా ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో కమ్యూనిటీ ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించి, పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమ్మేళనానికి ఉద్యోగులు, మేధావులు, విద్యార్థులు, ప్రొఫెసర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని" నిర్వాహకులు పేరుపేరునా విజ్ఞప్తి చేశారు.ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్, మాల స్టూడెంట్ జేఏసీ చైర్మన్ మాదాసు రాహుల్ రావు, అంసా ఓయూ ప్రెసిడెంట్ నామ సైదులు, ప్రొఫెసర్ సవీన్ సౌడా, అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉదయ్, సేపూరి ప్రణయ్, మోహన్ బట్టపోతుల, గ్రేటర్ హైదరాబాద్ జేఏసీ ప్రెసిడెంట్ బత్తుల రమేష్, ఓయూ ప్రెసిడెంట్ దాసరి రవి, అరుణ్ నంద (ఓయూ), బత్తుల దిలీప్, అనీష్ వర్మ, పురమా మహేష్, అంజిబాబు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.1
- శివంపేట మండలం పరిధిలోని మక్దుంపూర్ గ్రామం 4వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రోడ్డు నిర్మాణానికి అడ్డంగా ఉన్న పాత గోడలను కూలగొట్టే పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కృష్ణవేణి, వార్డు సభ్యులు పాల్గొని పనులను పరిశీలించారు. గ్రామ అభివృద్ధి కోసం ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 11 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట: విద్యతో పాటు శాస్త్ర సాంకేతికతపై అవగాహన పెంపొందించుకొని సమాజం పట్ల గౌరవంతో ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు సాగాలని కావేరి వ్యవసాయ యూనివర్సిటీ వ్యవస్థాపకులు భాస్కర్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గౌరారం వద్ద గల కావేరి వ్యవసాయ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో గుర్తింపు పొందిన మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశ నుంచే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని పట్టుదలతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలకు శాలువాలతో సన్మానం చేశారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు నాటకాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.4
- నల్గొండ బ్రేకింగ్: నల్లగొండలో మొన్న జరిగిన యాక్సిడెంట్ కేసు తీవ్ర ఉద్రిక్తతకు దారి... యాక్సిడెంట్లో తీవ్ర గాయపడిన ముద్దస్సిర్ ఉద్దీన్ ఖాన్ హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుది శ్వాస విడిచాడు... నేడు హైదరాబాద్ పట్టణంలో చికిత్స పొందుతూ మరణించిన ముదస్సిర్ ను భారీ నిరసన ర్యాలీతో వీటి కాలనీ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు తీసుకొని వచ్చారు... నిరసనగా కుటుంబ సభ్యులు నల్లగొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టారు... యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని అదుపులో తీసుకోకుండా వదిలివేయడం ఏంటని నిరుత్సాహపరిచారు కుటుంబ సభ్యులు... వెంటనే ఆక్సిడెంట్ లో గాయపడిన మహిళకు మరియు ముదస్సిర్ ఖాన్ కుటుంబం కు న్యాయం చేయాలని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భారీగా నిరసన.. వీరికి మద్దతుగా నలగొండ ఏఐఎంఐఎం జిల్లా అధ్యక్షులు రజియోద్దీన్ మరియు ఏఐఎంఐఎం కార్పొరేటర్లు నదీమ్, హాజీ, మోయిన, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆక్టివ్ మెంబర్ మొహమ్మద్ అలీ మరియు టిఆర్ఎస్ మైనార్టీ నాయకులు జహంగీర్ బాబా, జమాల్ ఖాద్రి కాంగ్రెస్ మైనారిటీ కార్పొరేటర్లు మద్దతుగా ఉన్నారు.. డిప్యూటీ మేయర్ ఆమెర్ మాట్లాడుతూ ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించి బాధితుడికి 2 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగిందని, ప్రమాదంలో గాయపడిన వారికి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు తమకు పూర్తి న్యాయం జరిగేవరకు తమ వెంటే ఉంటామని ధైర్యం వ్యక్తం చేశారు.. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమకు పూర్తి భరోసా లభించే వరకు నిరసన కార్యక్రమాన్ని విరమించేది లేదని మృతుని ఆవేదన వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు...1
- NLG: నల్గొండ మండలం కొత్తపల్లి నాలుగో వార్డులో గత 20 రోజులుగా వీధి దీపం వెలగడం లేదని స్థానికులు చెబుతున్నారు. వార్డులో వీధి దీపం వెలగక పోవడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో బయటకు వెళ్లాలంటే చిమ్మ చీకటిగా ఉండటంతో పాటు కుక్కలు, పాముల బెడద ఎక్కువగా ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి, వీధి దీపం వెలిగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.1
- కర్నూలు జిల్లా ఆదోనిలో ఎమ్మెల్యే పార్థసారథి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద లబ్ధిదారులకు 12 చెక్కులు పంపిణీ చేశారు తద్వారా 7. 63 లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా ఆపద సమయాల్లో సీఎం చంద్రబాబు పెద్దకొడుకుల నిరుపేదల పండగ నిలుస్తున్నారని ఎమ్మెల్యే పివి పార్థసారథి తెలిపారు.4
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 11 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట: విద్యతో పాటు శాస్త్ర సాంకేతికతపై అవగాహన పెంపొందించుకొని సమాజం పట్ల గౌరవంతో ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు సాగాలని కావేరి వ్యవసాయ యూనివర్సిటీ వ్యవస్థాపకులు భాస్కర్ రావు సూచించారు. సిద్దిపేట జిల్లా గౌరారం వద్ద గల కావేరి వ్యవసాయ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో గుర్తింపు పొందిన మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకొని పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని సూచించారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలకు శాలువాలతో సన్మానం చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు నాటకాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.1
- కర్నూలు జిల్లా ఆదోనిలో సివిల్ సప్లై అధికారులు హోటళ్లపై ఆకస్మిక దాడులు.. చేసి 107 డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేశారు.4
- మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేరామాయంపేట మున్సిపల్ పాలకవర్గం సమావేశం బుధవారం నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్ పర్సన్ గజవాడ లావణ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి హాజరయ్యారు. మున్సిపాలిటీ పరిధిలోని పలురు అధికారులు, కౌన్సిలర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రావు పార్టీలకతీతంగా రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధి చేసుకుందామని అన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ మొదటి సాధారణ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మున్సిపల్ పాలకవర్గానికి దిశా నిర్దేశం చేశారు. వేసవికాలంలో మున్సిపాలిటీలో నీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తూ సీసీ రోడ్ల నిర్మాణం డ్రైనేజీల నిర్మాణం సీసీ కెమెరాలు మల్లె చెరువు సుందరి కరణకు పాటుపడతామన్నారు. గత పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ పాలకులు మున్సిపాలిటీ అభివృద్ధిని పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రామాయంపేట మున్సిపాలిటీ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు1