పలమనేరు పట్టణంలోని గుడియాత్తం రోడ్డులో గల బయప్పగారి పల్లి సింగిల్ విండో కార్యాలయం ఆధ్వర్యంలో నూతన ఫర్టిలైజర్ షాపు ప్రారంభం, 80 మందికి ఈ- సైకిళ్లు పంపిణీ, స్వయం సహాయక సంఘాలకు రుణాల పంపిణీ కార్యక్రమము *ఆర్థిక విధ్వంసం నుంచి సంక్షేమం, అభివృద్ధి దిశగా సాగుతున్న కూటమి* *మహిళా సాధికారతతోనే అభివృద్ధి సాధ్యం* *ఇంటికో మహిళా పారాశ్రామిక వేత్తను చేయడమే ప్రభుత్వ లక్ష్యం* ఆర్థిక విధ్వంసం నుంచి సంక్షేమం, అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం సాగుతున్నదని పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు పట్టణంలోని గుడియాత్తం రోడ్డులో గల బయప్పగారి పల్లి సింగిల్ విండో కార్యాలయం ఆధ్వర్యంలో నూతన ఫర్టిలైజర్ షాపును ప్రారంభించి రైతులకు యూరియా బస్తాలను ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి పంపిణి చేశారు. అనంతరం పలమనేరు ఎంపీడివో కార్యాలయం వద్దనున్న వెలుగు కార్యాలయంలో స్వయం సహాయక గ్రూప్ సభ్యులకు 80 మందికి ఈ - సైకిళ్లను ఆయన పంపిణి చేపట్టి, స్వచ్ఛ రథన్ని ప్రారంభించారు. అదేవిధంగా 499 స్వయం సహాయక సంఘాలకు రూ. 35 కోట్ల 39 లక్షల 59 వేల బ్యాంకు లింకేజీ మరియు శ్రీ నిధి రుణాలను ఆయన పంపిణి చేశారు.. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రశంగించారు. ఎన్టీ రామారావు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో (ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్) వారికి అవకాశాలు ఇచ్చి రాజకీయంగా ఎదిగేలా పునాది వేశారన్నారు. రాబోయే 2029 ఎన్నికల నాటికి చట్టసభల్లో (అసెంబ్లీ మరియు పార్లమెంట్) మహిళలకు కూడా తగిన స్థానం లభించేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గ్రామాల్లో రోడ్లు, విద్యుత్, పాఠశాలలు మరియు సురక్షితమైన తాగునీరు వంటి ప్రాథమిక అవసరాలను తీర్చడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని సూచించారు .గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఆగిపోయిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం మరియు అమరావతిని రాష్ట్ర రాజధానిగా అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వివరించారు. సుమారు ₹2,700 కోట్లతో చిత్తూరు జిల్లాలోని పడమటి నియోజకవర్గాలకు (కుప్పం, పలమనేరు, పుంగనూరు, మదనపల్లి, తంబళ్లపల్లె) గండికోట రిజర్వాయర్ నుండి పైపుల ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించే పథకాన్ని రెండేళ్లలో పూర్తి చేస్తారన్నారు . ఇక రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం ద్వారా వారి ఆర్థిక భారాన్ని తగ్గించామని మహిళల ఆరోగ్యం కోసం గతంలో చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన 'దీపం' పథకాన్ని కొనసాగిస్తూ, ఇప్పుడు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు . ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నా, ప్రతి బిడ్డకు ఈ పథకం కింద ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి బ్యాంకుల ద్వారా లక్షల కోట్ల రూపాయల రుణాలను (తాకట్టు లేకుండా) అందిస్తున్నారన్నారు. ఈ-సైకిల్స్ (E-Bicycles): మహిళల కోసం రాయితీపై (సుమారు ₹10,000 సబ్సిడీ) ఈ-సైకిళ్లను పంపిణీ చేస్తున్నామని ఇది పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా, ఇంట్లోని పిల్లలు లేదా పెద్దలు కూడా వాడుకోవడానికి వీలుగా ఉంటుందని తెలిపారు . కూటమి ప్రభుత్వం మహిళల సంక్షేమం, ఆరోగ్యం మరియు గ్రామీణ అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, ప్రజలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, సింగిల్ విండో చైర్మన్లు పెద్దబ్బ, వెంకట ముని రెడ్డి, టిడిపి నాయకులు నాగరాజు రెడ్డి, గణేష్, జగదీష్ నాయుడు, సెల్వరాజ్,రామూర్తి నాయుడు, గిరి, కవీంద్ర నాయుడు, అనిల్ మరియు పలమనేరు గంగమ్మ గుడి చైర్మన్ శ్రీధర్ , ఎంపీడీవో కార్యాలయ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

- పలమనేరు పట్టణంలోని విటిఎస్ కళ్యాణమండపం నందు పలమనేరు మాజీ శాసనసభ్యులు వెంకటే గౌడ గారి నాయకత్వంలో "నియోజకవర్గ స్థాయి బూత్ కమిటీ విస్తృత స్థాయి" సమావేశం నిర్వహించడం జరిగింది. వెంకటే గౌడ మాట్లాడుతూ పలమనేరు నియోజకవర్గంలో బూత్ కమిటీల ఏర్పాటుపై పార్టీ నాయకులతో సమావేశమై, భవిష్యత్ కార్యచరణపై దిశానిర్దేశం చేసారు.ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి, పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటానని.. మీ కష్టాన్ని నేనే గుర్తిస్తాని భరోసానిచ్చారు.. పలమనేరు నియోజకవర్గంలో పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని, ప్రతి కార్యకర్తను నా కుటుంబ సభ్యుడిగా భావిస్తానని..మీ కష్టంలో, సుఖంలో నేను ఎప్పుడూ మీ వెంటే ఉంటానని తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మనమందరం కలిసి పలమనేరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండాను రెపరెపలాడిద్దామని, పార్టీని అంకితభావంతో నడిపించే సైనికులందరికీ నేనున్నానంటూ వెంకటే గౌడ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలమనేరు నియోజకవర్గ పరశీలకలు వెంకటరెడ్డి యాదవ్ మరియు పలమనేరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.1
- Post by Doddagalla Munirathinam1
- పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని రాజేష్ థియేటర్ వద్ద అతి వేగంగా వచ్చి కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు కారు ముందు భాగం నుజ్జునుజ్జు అవ్వడంతో, కారులో ఇరుకున్న నలుగురు వ్యక్తులు ఈ ప్రమాదంలో శ్రీధర్ అనే సింగరేణి ఉద్యోగి మృతిచెందగా, తీవ్ర గాయాలపాలైన మరో ముగ్గురిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు1
- కదిరి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. క స్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం లో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ కార్యక్రమం విద్యార్థుల లో ఉన్న ప్రతిభను కనపరిచారు. ముఖ్య అతిథులుగా ప్రధానోపాధ్యాయులు ఎస్.ఓ లక్ష్మీ , అన్నపూర్ణ , పి.ఇ.టి కోమల హాజరైయారు. కరాటే శిక్షణ పొందితే ఆత్మరక్షణతో పాటు మంచి ఆరోగ్యం లభిస్తుందన్నారు.1
- బద్వేలు అర్బన్, ఏప్రిల్ 03 : బద్వేలు పట్టణంలోని సిద్ధవటం రోడ్ ఎస్సీ కాలనీ వద్ద శుక్రవారం ఉదయం శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి, అభయాంజనేయ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో పలువురు దాతల సహకారంతో వేసవి తాపాన్ని తీర్చేందుకు ఉచిత మంచినీటి చలివేంద్రాన్ని ఎక్సైజ్ శాఖ సీఐ సీతారామిరెడ్డి,బద్వేల్ అర్బన్ ఎస్సై కొండారెడ్డి డాక్టర్ వాసుదేవా రెడ్డి, డాక్టర్ సత్యప్రసాద్, ఫైర్ ఆఫీసర్ చేతుల మీదుగా ప్రారంభించారు,ఈ ఏర్పాటు చేసిన చలివేంద్రానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పలువురు అధికారులకు శాలువాలతో ఘనంగా వార్త స్టాప్ రిపోర్టర్ భూమిరెడ్డి వెంకటేష్,అర్బన్ రిపోర్టర్ వల్లo కొండు వెంకటరమణ మరియు కె.వి సుబ్బారావు సి,వి నాగేశ్వరరావు మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పబ్బతి చంద్రశేఖర్ చేతుల మీదుగా సత్కరించడం జరిగింది, ఈ సందర్భంగా సీఐ సీతారామి రెడ్డి,ఎస్ఐ కొండారెడ్డి, ఎక్సైజ్ శాఖ ఎస్సై సతీష్ కుమార్,వాసుదేవా హాస్పిటల్ డాక్టర్ వాసుదేవ రెడ్డి, ప్రసాద్ దంత వైద్యశాల నిపుణులు డాక్టర్ సత్యప్రసాద్ లు మాట్లాడుతూ బద్వేల్ పట్టణంలో గత ఏడు సంవత్సరాలుగా మంచినీటి చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల దాహార్తి తీర్చడం ఎంతో సంతోషకరమన్నారు, ఎండలు మండిపోతున్న ఈ సమయంలో బాటసారులకు, విద్యార్థులకు, డైలీ కూలీలకు, తోపుడు బండ్లు వ్యాపారస్తులకు, ఆటో వారికి దాహర్తిని తీర్చడం కన్నా గొప్ప పుణ్యకాలం మరొకటి లేదన్నారు, ప్రజల అవసరాలను గుర్తించి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం వల్ల సమాజంలో స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందన్నారు, వేసవిలో వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే మంచినీళ్లు ఎంతో కీలకమన్నారు, దాతలు ముందుకు వచ్చి ఇలాంటి ఏర్పాటు చేయడం వల్ల సామాన్య ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు, ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్న చలివేంద్రాలు ప్రస్తుత వేసవి కాలంలో ఎండల తీవ్రకు దృష్టి సామాన్య ప్రజలకు తాగునీరు అనేది అత్యవసరంగా మారిందన్నారు, మార్కెట్లో లీటర్ దాదాపు పది రూపాయలు విలువ ఉందని ఇటువంటి తరుణంలో రూపాయి ఖర్చు లేకుండా స్వచ్ఛమైన మినరల్ వాటర్ కూల్ వాటర్ ద్వారా ప్రజల దాహార్తి చేర్చడం ఎంతో గొప్ప విషయం అన్నారు, ఈ ఉచిత చలివేంద్రాలు వారి దాహర్తిని తీర్చడమే కాకుండా ఆర్థికంగా కూడా ఎంతో ఆసరాగా నిలుస్తాయని పలువురు కోరారు, మరికొందరు కూడా ముందుకు వచ్చి మరికొన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహర్తి తీర్చుట కొరకు కృషి చేయాలని వారు కోరారు, వేసవికాలంలో చలివేంద్రాల వద్ద ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా అందుబాటులో ఉండే విధంగా చలివేంద్ర నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాలని డాక్టర్ వాసుదేవరెడ్డి తెలిపారు, ఈ కార్యక్రమంలో మాజీ ఆర్యవైశ్య వర్తక సంగం అధ్యక్షులు కే,వీ సుబ్బారావు, ఆవోపా సెక్రటరీ సీ,వీ నాగేశ్వరరావు, వల్లం కొండు రాఘవేంద్ర, అనిత్, ఖాదర్ భాషా, ఆవులేటి శేఖర్ రాయల్,ఓబులేష్, బ్రహ్మయ్య, శీలం శంకర్, తో పాటు పలువురు సహకరించిన దాతలు ఎక్సైజ్, అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు3
- Post by Bondhu Suresh1
- యామవరం గ్రామం ముద్దనూరు మండలం కడప జిల్లా వాస్తవ్యులైన సాయికుమార్ మరియు లక్ష్మీదేవి గారి కుమారుడైన శ్రీ విష్ణు పుట్టుకతోనే LAD TYPE1 వ్యాధి తో పోరాడుతున్నాడు బాబు కి ఒక సంవత్సరం లోపు operation చేయకపోతే బాబు ప్రాణానికే ప్రమాదం. ఆపరేషన్ కి 30 లక్షలు అవుతుంది. పెద్ద మనసు చేసుకొని ఆ పిల్లాడికి కనీసం 100/- సహాయం చేసిన ఒక బాలుడి ప్రాణం నిలబడుతుంది. సహాయం చేయాలనుకునేవారు వీడియో లో స్కానర్ కి డబ్బులు వేయగలరు లేదా phone pay number:- 7207217664 Name :- Sai kumar1
- *ఆర్థిక విధ్వంసం నుంచి సంక్షేమం, అభివృద్ధి దిశగా సాగుతున్న కూటమి* *మహిళా సాధికారతతోనే అభివృద్ధి సాధ్యం* *ఇంటికో మహిళా పారాశ్రామిక వేత్తను చేయడమే ప్రభుత్వ లక్ష్యం* ఆర్థిక విధ్వంసం నుంచి సంక్షేమం, అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం సాగుతున్నదని పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు పట్టణంలోని గుడియాత్తం రోడ్డులో గల బయప్పగారి పల్లి సింగిల్ విండో కార్యాలయం ఆధ్వర్యంలో నూతన ఫర్టిలైజర్ షాపును ప్రారంభించి రైతులకు యూరియా బస్తాలను ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి పంపిణి చేశారు. అనంతరం పలమనేరు ఎంపీడివో కార్యాలయం వద్దనున్న వెలుగు కార్యాలయంలో స్వయం సహాయక గ్రూప్ సభ్యులకు 80 మందికి ఈ - సైకిళ్లను ఆయన పంపిణి చేపట్టి, స్వచ్ఛ రథన్ని ప్రారంభించారు. అదేవిధంగా 499 స్వయం సహాయక సంఘాలకు రూ. 35 కోట్ల 39 లక్షల 59 వేల బ్యాంకు లింకేజీ మరియు శ్రీ నిధి రుణాలను ఆయన పంపిణి చేశారు.. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రశంగించారు. ఎన్టీ రామారావు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో (ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్) వారికి అవకాశాలు ఇచ్చి రాజకీయంగా ఎదిగేలా పునాది వేశారన్నారు. రాబోయే 2029 ఎన్నికల నాటికి చట్టసభల్లో (అసెంబ్లీ మరియు పార్లమెంట్) మహిళలకు కూడా తగిన స్థానం లభించేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గ్రామాల్లో రోడ్లు, విద్యుత్, పాఠశాలలు మరియు సురక్షితమైన తాగునీరు వంటి ప్రాథమిక అవసరాలను తీర్చడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని సూచించారు .గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఆగిపోయిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం మరియు అమరావతిని రాష్ట్ర రాజధానిగా అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వివరించారు. సుమారు ₹2,700 కోట్లతో చిత్తూరు జిల్లాలోని పడమటి నియోజకవర్గాలకు (కుప్పం, పలమనేరు, పుంగనూరు, మదనపల్లి, తంబళ్లపల్లె) గండికోట రిజర్వాయర్ నుండి పైపుల ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించే పథకాన్ని రెండేళ్లలో పూర్తి చేస్తారన్నారు . ఇక రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం ద్వారా వారి ఆర్థిక భారాన్ని తగ్గించామని మహిళల ఆరోగ్యం కోసం గతంలో చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన 'దీపం' పథకాన్ని కొనసాగిస్తూ, ఇప్పుడు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు . ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నా, ప్రతి బిడ్డకు ఈ పథకం కింద ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి బ్యాంకుల ద్వారా లక్షల కోట్ల రూపాయల రుణాలను (తాకట్టు లేకుండా) అందిస్తున్నారన్నారు. ఈ-సైకిల్స్ (E-Bicycles): మహిళల కోసం రాయితీపై (సుమారు ₹10,000 సబ్సిడీ) ఈ-సైకిళ్లను పంపిణీ చేస్తున్నామని ఇది పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా, ఇంట్లోని పిల్లలు లేదా పెద్దలు కూడా వాడుకోవడానికి వీలుగా ఉంటుందని తెలిపారు . కూటమి ప్రభుత్వం మహిళల సంక్షేమం, ఆరోగ్యం మరియు గ్రామీణ అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, ప్రజలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, సింగిల్ విండో చైర్మన్లు పెద్దబ్బ, వెంకట ముని రెడ్డి, టిడిపి నాయకులు నాగరాజు రెడ్డి, గణేష్, జగదీష్ నాయుడు, సెల్వరాజ్,రామూర్తి నాయుడు, గిరి, కవీంద్ర నాయుడు, అనిల్ మరియు పలమనేరు గంగమ్మ గుడి చైర్మన్ శ్రీధర్ , ఎంపీడీవో కార్యాలయ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.1