Shuru
Apke Nagar Ki App…
కేజీబీవీ విద్యార్థులకు కరాటే శిక్షణ, ప్రతిభ కనబరిచిన విద్యార్థినీలు కదిరి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. క స్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం లో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ కార్యక్రమం విద్యార్థుల లో ఉన్న ప్రతిభను కనపరిచారు. ముఖ్య అతిథులుగా ప్రధానోపాధ్యాయులు ఎస్.ఓ లక్ష్మీ , అన్నపూర్ణ , పి.ఇ.టి కోమల హాజరైయారు. కరాటే శిక్షణ పొందితే ఆత్మరక్షణతో పాటు మంచి ఆరోగ్యం లభిస్తుందన్నారు.
Srivartha news
కేజీబీవీ విద్యార్థులకు కరాటే శిక్షణ, ప్రతిభ కనబరిచిన విద్యార్థినీలు కదిరి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. క స్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం లో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ కార్యక్రమం విద్యార్థుల లో ఉన్న ప్రతిభను కనపరిచారు. ముఖ్య అతిథులుగా ప్రధానోపాధ్యాయులు ఎస్.ఓ లక్ష్మీ , అన్నపూర్ణ , పి.ఇ.టి కోమల హాజరైయారు. కరాటే శిక్షణ పొందితే ఆత్మరక్షణతో పాటు మంచి ఆరోగ్యం లభిస్తుందన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- *ఆర్థిక విధ్వంసం నుంచి సంక్షేమం, అభివృద్ధి దిశగా సాగుతున్న కూటమి* *మహిళా సాధికారతతోనే అభివృద్ధి సాధ్యం* *ఇంటికో మహిళా పారాశ్రామిక వేత్తను చేయడమే ప్రభుత్వ లక్ష్యం* ఆర్థిక విధ్వంసం నుంచి సంక్షేమం, అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం సాగుతున్నదని పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు పట్టణంలోని గుడియాత్తం రోడ్డులో గల బయప్పగారి పల్లి సింగిల్ విండో కార్యాలయం ఆధ్వర్యంలో నూతన ఫర్టిలైజర్ షాపును ప్రారంభించి రైతులకు యూరియా బస్తాలను ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి పంపిణి చేశారు. అనంతరం పలమనేరు ఎంపీడివో కార్యాలయం వద్దనున్న వెలుగు కార్యాలయంలో స్వయం సహాయక గ్రూప్ సభ్యులకు 80 మందికి ఈ - సైకిళ్లను ఆయన పంపిణి చేపట్టి, స్వచ్ఛ రథన్ని ప్రారంభించారు. అదేవిధంగా 499 స్వయం సహాయక సంఘాలకు రూ. 35 కోట్ల 39 లక్షల 59 వేల బ్యాంకు లింకేజీ మరియు శ్రీ నిధి రుణాలను ఆయన పంపిణి చేశారు.. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రశంగించారు. ఎన్టీ రామారావు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో (ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్) వారికి అవకాశాలు ఇచ్చి రాజకీయంగా ఎదిగేలా పునాది వేశారన్నారు. రాబోయే 2029 ఎన్నికల నాటికి చట్టసభల్లో (అసెంబ్లీ మరియు పార్లమెంట్) మహిళలకు కూడా తగిన స్థానం లభించేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గ్రామాల్లో రోడ్లు, విద్యుత్, పాఠశాలలు మరియు సురక్షితమైన తాగునీరు వంటి ప్రాథమిక అవసరాలను తీర్చడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని సూచించారు .గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఆగిపోయిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం మరియు అమరావతిని రాష్ట్ర రాజధానిగా అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వివరించారు. సుమారు ₹2,700 కోట్లతో చిత్తూరు జిల్లాలోని పడమటి నియోజకవర్గాలకు (కుప్పం, పలమనేరు, పుంగనూరు, మదనపల్లి, తంబళ్లపల్లె) గండికోట రిజర్వాయర్ నుండి పైపుల ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించే పథకాన్ని రెండేళ్లలో పూర్తి చేస్తారన్నారు . ఇక రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం ద్వారా వారి ఆర్థిక భారాన్ని తగ్గించామని మహిళల ఆరోగ్యం కోసం గతంలో చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన 'దీపం' పథకాన్ని కొనసాగిస్తూ, ఇప్పుడు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు . ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నా, ప్రతి బిడ్డకు ఈ పథకం కింద ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి బ్యాంకుల ద్వారా లక్షల కోట్ల రూపాయల రుణాలను (తాకట్టు లేకుండా) అందిస్తున్నారన్నారు. ఈ-సైకిల్స్ (E-Bicycles): మహిళల కోసం రాయితీపై (సుమారు ₹10,000 సబ్సిడీ) ఈ-సైకిళ్లను పంపిణీ చేస్తున్నామని ఇది పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా, ఇంట్లోని పిల్లలు లేదా పెద్దలు కూడా వాడుకోవడానికి వీలుగా ఉంటుందని తెలిపారు . కూటమి ప్రభుత్వం మహిళల సంక్షేమం, ఆరోగ్యం మరియు గ్రామీణ అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, ప్రజలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, సింగిల్ విండో చైర్మన్లు పెద్దబ్బ, వెంకట ముని రెడ్డి, టిడిపి నాయకులు నాగరాజు రెడ్డి, గణేష్, జగదీష్ నాయుడు, సెల్వరాజ్,రామూర్తి నాయుడు, గిరి, కవీంద్ర నాయుడు, అనిల్ మరియు పలమనేరు గంగమ్మ గుడి చైర్మన్ శ్రీధర్ , ఎంపీడీవో కార్యాలయ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.1
- కేరళం ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కాన్వాయ్‌పై దాడి కేరళంలోని మలప్పురం పరిధిలో వండూర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న శశిథరూర్ కాన్వాయ్‌పై, బైక్‌ల మీద వచ్చి దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన శశిథరూర్ గన్‌మెన్‌పై కూడా దాడి చేసిన దుండగులు.....1
- Post by Bondhu Suresh1
- Post by K AMPAIAH ACHARI1
- ధరూర్: మండలంలోని గుడ్డం దొడ్డి రిజర్వాయర్ కెనాల్ ద్వారా పంటలకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని రైతులు కోరారు. ప్రస్తుతం వరి పంట చివరి దశలో ఉన్నప్పటికీ వేరుశనగ సాగు చేసేందుకు రైతులను దుక్కులు తడుపుకునేందుకు, మామిడి, కూరగాయల పంటలు సాగుకు నీరు ఎంతగానో అవసరం ఉంది. ఇది ఇలా ఉంటే చివరి ఆయకట్టుకు మాత్రం చుక్కనీరు కోరడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు.1
- నల్గొండ: నల్గొండ నుంచి దేవరకొండ వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన ఉన్న ఎండిన చెట్లు వాహనదారులకు, పాదచారులకు ప్రమాదకరంగా మారాయి. ఈ మార్గంలో నిత్యం ప్రజలు పెద్ద ఎత్తున ప్రయాణిస్తుంటారు. ఎండిన చెట్ల కొమ్మలు విరిగి పడతాయనే భయంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కతాల్ గూడ నుంచి నల్గొండ వైపు వెళ్లే మార్గంలో కూడా ఇలాంటి ఎండిన చెట్లు ఉన్నాయని, ఏదైనా ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి వాడిని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సమస్యపై పడితేనే.. పట్టించుకుంటారా..! అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.1
- కదిరి మున్సిపాలిటీ పరిధిలోని కుటాగుళ గ్రామానికి చెందిన వైసిపి నాయకులు రమేష్ రెడ్డిని విమర్శించేస్తాయి టిడిపి కార్యకర్తలకు లేదని వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పుటాకుల గ్రామానికి ఎంతో అభివృద్ధి చేశా మన్నారు. లక్షల రూపాయలు ఖర్చుపెట్టి కుటాగుల గ్రామంలో దేవాలయం అభివృద్ధి చేసినట్లు వైసిపి నాయకులు తెలిపారు. అభివృద్ధి ఏంటో చేసి చూపించిన ఘనత వైసీపీకి దక్కిందన్నారు.1
- చిత్తూరు జిల్లా పలమనేరు:మానవత్వం చాటుకున్న నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ మాదేశ్ బృందం.పలమనేరు రూరల్, సముద్ర పల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తికి యాక్సిడెంట్ లో కాలు పోగొట్టుకున్నాడని తెలుసుకొని మొదటి విడతగా నిత్యవసర సరుకులు, రెండవ విడతగా గ్యాస్ మరియు బట్టలు, మూడవ విడతగా చెప్పిన మాట చెప్పినట్టుగా కృత్రిమ కాలు ఏర్పాటు చేయడం జరిగింది.రెండు రోజులుగా తమ సొంత నిధులతో బెంగుళూరు కు చెందిన ఓ హాస్పిటల్ లో రామాంజనేయులు అనే వ్యక్తికి కృత్రిమ కాలు ఏర్పాటు చేసి గురువారం తిరిగి వారి నివాసానికి చేర్పించారని నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ సౌత్ జోన్ ఇన్చార్జిక్రియ జిక్రియ తెలిపారు.1
- కూటమిలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయి కృపాలక్ష్మి* చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించుకుని మీడియాతో మాట్లాడిన వైసిపి నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి హిందువుల ఆరాధ్య దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో బట్టబయలైన బి ఆర్ నాయుడు రాసలీలలు ఇలాంటి వ్యక్తి దేవస్థానం చైర్మన్ గా కొనసాగడంపై కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాంటి చర్యలు తీసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు హోంశాఖామంత్రి అనిత మహిళలకు అండగా ఉంటాము అంటున్నారు. నడిరోడ్డుపై మహిళను పదవిలో ఉన్న ఎమ్మెల్యే కొడుతుంటే ఏలాంటి స్పందన లేదు. హోం శాఖ మంత్రి విమర్శలకే పరిమితమైంది. పల్నాడు జిల్లా, మాచర్లలో ఇంట్లో వున్న మహిళను కాళ్లు చేతులు కట్టేసి బలవంతంగా అఘాత్యానికి పాల్పడిన ఘటనపై బాధ్యత మహిళలకు ఇప్పటికీ న్యాయం జరగలేదు. వైసీపీ ప్రభుత్వంలో దిశ యాప్ ద్వారా మహిళలకు అండగా నిలిచాము. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని బిఆర్ నాయుడు పదవి నుంచి తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.1