logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రూ.3.40 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఏదులలో తహసీల్దార్ భవనం*_ _*విద్యుత్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన*_ _*రేవల్లిలో ఆధునిక ఎక్స్‌రే యూనిట్ ప్రారంభం*_ _*గ్రామాల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది*_ _*ఎమ్మెల్యే మేఘారెడ్డి*_ _*వనపర్తినియోజకవర్గంలోని ఏదుల మండల కేంద్రంలో శనివారం వనపర్తి ఎమ్మెల్యే శ్రీ తూడి మేఘారెడ్డి రూ.3.40 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.*_ _*గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తూ ప్రజలకు నాణ్యమైన ప్రభుత్వ సేవలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.*_ _*ఈ సందర్భంగా రూ.2.25 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన తహసీల్దార్ కార్యాలయ భవన సముదాయానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.*_ _*ఈ భవనం ద్వారా రెవెన్యూ సేవలు ప్రజలకు మరింత వేగంగా, సమర్థవంతంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు.*_ _*అనంతరం రూ.65 లక్షల వ్యయంతో గ్రామానికి ఏర్పాటు చేస్తున్న ఆల్టర్నేట్ విద్యుత్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు*_ _*మండల కేంద్రంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు రూ.24 లక్షలతో చేపట్టిన విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను ప్రారంభించారు*_ _*అలాగే గ్రామంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రూ.8 లక్షల వ్యయంతో చేపట్టనున్న అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులకు కూడా ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.*_ _*రేవల్లి మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో రూ.18 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన అత్యాధునిక ఎక్స్‌రే యూనిట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు.*_ _*ఈ సదుపాయం ద్వారా గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య నిర్ధారణ సేవలు స్థానికంగానే అందుబాటులోకి వస్తాయని, జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని తెలిపారు.*_ _*ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.*_ _*పారదర్శక పాలనతో ప్రతి రూపాయి ప్రజల సంక్షేమం, అభివృద్ధికే ఖర్చు చేస్తున్నామని తెలిపారు.*_ _*విద్యుత్, వైద్యం, రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, మౌలిక వసతుల అభివృద్ధితో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని పేర్కొన్నారు.*_ _*వనపర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి స్పష్టం చేశారు.*_ _*కార్యక్రమంలో మండల మార్కెట్ యార్డ్ అధ్యక్షులు వెంకటేష్, ఉపాధ్యక్షులు సత్యశీలారెడ్డి, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, జిల్లా గృహ నిర్మాణశాఖ అధికారి విటోబా, సింగిల్ విండో అధ్యక్షులు రఘు, మండల అధ్యక్షులు సుఖేందర్ రెడ్డి,గ్రామ సర్పంచ్ పరుశురాం, రాష్ట్ర ఎస్సీ సెల్ డిపార్ట్మెంట్ ప్రధాన కార్యదర్శి కొంకి వెంకటేష్, ఏదుల మండలం ఇంచార్జ్ కోళ్ల వెంకటేష్, నాయకులు పర్వతాలు, జమ్మి మల్లేష్, జానకి రాములు, ఆయన మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు, పెద్దలు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు*_

3 hrs ago
user_A Rajasheker
A Rajasheker
Lawyer పాంగల్, వనపర్తి, తెలంగాణ•
3 hrs ago
69b6439a-06d4-4e5e-a28a-d66a25a958da

రూ.3.40 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఏదులలో తహసీల్దార్ భవనం*_ _*విద్యుత్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన*_ _*రేవల్లిలో ఆధునిక ఎక్స్‌రే యూనిట్ ప్రారంభం*_ _*గ్రామాల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది*_ _*ఎమ్మెల్యే మేఘారెడ్డి*_ _*వనపర్తినియోజకవర్గంలోని ఏదుల మండల కేంద్రంలో శనివారం వనపర్తి ఎమ్మెల్యే శ్రీ తూడి మేఘారెడ్డి రూ.3.40 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.*_ _*గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తూ ప్రజలకు నాణ్యమైన ప్రభుత్వ సేవలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.*_ _*ఈ సందర్భంగా రూ.2.25 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన తహసీల్దార్ కార్యాలయ భవన సముదాయానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.*_ _*ఈ భవనం ద్వారా రెవెన్యూ సేవలు ప్రజలకు మరింత వేగంగా, సమర్థవంతంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు.*_ _*అనంతరం రూ.65 లక్షల వ్యయంతో గ్రామానికి ఏర్పాటు చేస్తున్న ఆల్టర్నేట్ విద్యుత్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు*_ _*మండల కేంద్రంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు రూ.24 లక్షలతో చేపట్టిన విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను ప్రారంభించారు*_ _*అలాగే గ్రామంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రూ.8 లక్షల వ్యయంతో చేపట్టనున్న అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులకు కూడా ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.*_ _*రేవల్లి మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో రూ.18 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన అత్యాధునిక ఎక్స్‌రే యూనిట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు.*_ _*ఈ సదుపాయం ద్వారా గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య నిర్ధారణ సేవలు స్థానికంగానే అందుబాటులోకి వస్తాయని, జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని తెలిపారు.*_ _*ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.*_ _*పారదర్శక పాలనతో ప్రతి రూపాయి ప్రజల సంక్షేమం, అభివృద్ధికే ఖర్చు చేస్తున్నామని తెలిపారు.*_ _*విద్యుత్, వైద్యం, రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, మౌలిక వసతుల అభివృద్ధితో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని పేర్కొన్నారు.*_ _*వనపర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి స్పష్టం చేశారు.*_ _*కార్యక్రమంలో మండల మార్కెట్ యార్డ్ అధ్యక్షులు వెంకటేష్, ఉపాధ్యక్షులు సత్యశీలారెడ్డి, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, జిల్లా గృహ నిర్మాణశాఖ అధికారి విటోబా, సింగిల్ విండో అధ్యక్షులు రఘు, మండల అధ్యక్షులు సుఖేందర్ రెడ్డి,గ్రామ సర్పంచ్ పరుశురాం, రాష్ట్ర ఎస్సీ సెల్ డిపార్ట్మెంట్ ప్రధాన కార్యదర్శి కొంకి వెంకటేష్, ఏదుల మండలం ఇంచార్జ్ కోళ్ల వెంకటేష్, నాయకులు పర్వతాలు, జమ్మి మల్లేష్, జానకి రాములు, ఆయన మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు, పెద్దలు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు*_

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఘనంగా "శనివారం గుడి పిలుస్తోంది" కార్యక్రమం, దిగ్విజయంగా 21 వారం ఘనంగా "శనివారం గుడి పిలుస్తోంది" కార్యక్రమం, దిగ్విజయంగా 21 వారం హిందువులం వారి బంధువులం.. పత్తికొండ అభయాంజనేయస్వామి ఆలయంలో మహిళల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహణ బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఎస్. రామ్మోహన్ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమం పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళా భక్తులు పత్తికొండ పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న "గుడి పిలుస్తోంది" కార్యక్రమం ఈ వారం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగింది. మహిళల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఎస్. రామ్మోహన్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోగా, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఉదయం నుంచే ఆలయంలో భక్తులు తరలివచ్చి అభయాంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు ఎం. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో, ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, సమరసత్ సేవ ఫౌండేషన్, గిడ్డయ్య అన్నగారు, స్వామివారికి అభిషేకం, అర్చనలు, ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన పూజా కార్యక్రమాలు భక్తులను ఆధ్యాత్మిక అనుభూతికి గురిచేశాయి. గ్రామం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మహిళల కోసం నిర్వహించిన డీఐపీ కార్యక్రమం విశేష ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో పాల్గొన్న మహిళల్లో లాటరీ విధానంలో రంగమ్మ అనే మహిళ అదృష్టవంతురాలిగా ఎంపిక కావడంతో ఆమెకు చీరను బహూకరించి సత్కరించారు. చీర అందుకున్న రంగమ్మ ఆనందం వ్యక్తం చేస్తూ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ఇతర మహిళలు కూడా ఇలాంటి ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు తరచూ నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్. రామ్మోహన్ మాట్లాడుతూ, దేవాలయాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, ప్రతి కుటుంబం వారానికి కనీసం ఒకరోజు ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకోవాలని సూచించారు. "గుడి పిలుస్తోంది" కార్యక్రమం ద్వారా కుటుంబాల్లో ఆధ్యాత్మిక చైతన్యం పెరగడంతో పాటు సమాజంలో ఐక్యత, పరస్పర ప్రేమాభిమానాలు బలపడతాయని అన్నారు. మహిళల భాగస్వామ్యంతో కార్యక్రమం మరింత విజయవంతమైందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఆలయ నిర్వాహకులు ఎం. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రతి శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. భక్తుల సహకారంతో ఆలయ అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మహిళా భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, యువకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తులకు ప్రసాదం పంపిణీ చేయడంతో కార్యక్రమం ముగిసింది.
    1
    ఘనంగా "శనివారం గుడి పిలుస్తోంది" కార్యక్రమం, దిగ్విజయంగా 21 వారం
ఘనంగా "శనివారం గుడి పిలుస్తోంది" కార్యక్రమం, దిగ్విజయంగా 21 వారం హిందువులం వారి బంధువులం.. పత్తికొండ అభయాంజనేయస్వామి ఆలయంలో మహిళల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహణ
బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఎస్. రామ్మోహన్ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమం
పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళా భక్తులు
పత్తికొండ పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న "గుడి పిలుస్తోంది" కార్యక్రమం ఈ వారం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగింది. మహిళల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఎస్. రామ్మోహన్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోగా, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఉదయం నుంచే ఆలయంలో భక్తులు తరలివచ్చి అభయాంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు ఎం. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో,  ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, సమరసత్ సేవ ఫౌండేషన్, గిడ్డయ్య అన్నగారు, స్వామివారికి అభిషేకం, అర్చనలు, ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన పూజా కార్యక్రమాలు భక్తులను ఆధ్యాత్మిక అనుభూతికి గురిచేశాయి. గ్రామం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మహిళల కోసం నిర్వహించిన డీఐపీ కార్యక్రమం విశేష ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో పాల్గొన్న మహిళల్లో లాటరీ విధానంలో రంగమ్మ అనే మహిళ అదృష్టవంతురాలిగా ఎంపిక కావడంతో ఆమెకు చీరను బహూకరించి సత్కరించారు. చీర అందుకున్న రంగమ్మ ఆనందం వ్యక్తం చేస్తూ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ఇతర మహిళలు కూడా ఇలాంటి ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు తరచూ నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్. రామ్మోహన్ మాట్లాడుతూ, దేవాలయాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, ప్రతి కుటుంబం వారానికి కనీసం ఒకరోజు ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకోవాలని సూచించారు. "గుడి పిలుస్తోంది" కార్యక్రమం ద్వారా కుటుంబాల్లో ఆధ్యాత్మిక చైతన్యం పెరగడంతో పాటు సమాజంలో ఐక్యత, పరస్పర ప్రేమాభిమానాలు బలపడతాయని అన్నారు. మహిళల భాగస్వామ్యంతో కార్యక్రమం మరింత విజయవంతమైందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఆలయ నిర్వాహకులు ఎం. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రతి శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. భక్తుల సహకారంతో ఆలయ అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మహిళా భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, యువకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తులకు ప్రసాదం పంపిణీ చేయడంతో కార్యక్రమం ముగిసింది.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • ఆర్టీసీ డిపో మేనేజర్‌ని సస్పెండ్ చేయాలి: సీపీఐ యం ఎల్ లిబరేషన్ పార్టీ నేత వెంకటేశ్వర్లు ప్రజా సమస్యలను పరిష్కరించకుండా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న నందికొట్కూరు ఆర్టీసీ డిపో మేనేజర్ సస్పెండ్ చేయాలని సీపీఐ (యం ఎల్) లిబరేషన్ పార్టీ నేత వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆర్టీసీ బస్టాండ్‌లో నెలకొన్న సమస్యలపై వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన తమపై డిపో మేనేజర్ వ్యవహరించిన తీరును నిరసిస్తూ ధర్నా చేపట్టమన్నారు. అపరిశుభ్రత మురుగునీటి సమస్య ప్రయాణికులకు కనీస సౌకర్యాలు లేవని ఆరోపించారు.
    1
    ఆర్టీసీ డిపో మేనేజర్‌ని సస్పెండ్ చేయాలి: సీపీఐ యం ఎల్ లిబరేషన్ పార్టీ నేత వెంకటేశ్వర్లు
ప్రజా సమస్యలను పరిష్కరించకుండా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న నందికొట్కూరు ఆర్టీసీ డిపో మేనేజర్ సస్పెండ్ చేయాలని సీపీఐ (యం ఎల్) లిబరేషన్ పార్టీ నేత వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆర్టీసీ బస్టాండ్‌లో నెలకొన్న సమస్యలపై వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన తమపై డిపో మేనేజర్ వ్యవహరించిన తీరును నిరసిస్తూ ధర్నా చేపట్టమన్నారు. అపరిశుభ్రత మురుగునీటి సమస్య ప్రయాణికులకు కనీస సౌకర్యాలు లేవని ఆరోపించారు.
    user_Why not dinesh... yashaswi
    Why not dinesh... yashaswi
    News Anchor జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • ప్రధానమంత్రిని జెన్ జీ యువత తిడుతుంటే నా కళ్ళలో నీళ్లు వచ్చాయి: పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రిని జెన్ జీ యువత తిడుతుంటే నా కళ్లలో నీళ్లు వచ్చాయి కొత్త తరానికి ఏం తెలుసు ఆయన పడ్డ కష్టం ఒక్కరోజు కూడా ప్రధాని సెలవు తీసుకోలేదు - పవన్ కళ్యాణ్
    1
    ప్రధానమంత్రిని జెన్ జీ యువత తిడుతుంటే నా కళ్ళలో నీళ్లు వచ్చాయి: పవన్ కళ్యాణ్
ప్రధానమంత్రిని జెన్ జీ యువత తిడుతుంటే నా కళ్లలో నీళ్లు వచ్చాయి
కొత్త తరానికి ఏం తెలుసు ఆయన పడ్డ కష్టం 
ఒక్కరోజు కూడా ప్రధాని సెలవు తీసుకోలేదు 
- పవన్ కళ్యాణ్
    user_Sangareddy News
    Sangareddy News
    Local News Reporter Saidabad, Hyderabad•
    9 hrs ago
  • మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా స్వర్ణకార సంఘానికి నూతన అధ్యక్షుడు ఏకగ్రీవంగా బాహోజు పాండరి ఎన్నిక గజ్వేల్ మేడ్చల్, కుత్బుల్లాపూర్. ప్రజా తెలంగాణ న్యూస్/ తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం (టీ జీ ఎస్ ఎస్ ) అనుబంధంగా నిర్వహించిన మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా స్వర్ణకార సంఘం ఎన్నికలు–2026లో బాహోజు పాండరి జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.శనివారం కుత్బుల్లాపూర్ మండలంలోని శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో నిర్వహించిన నామినేషన్ ప్రక్రియలో అధ్యక్ష పదవికి బాహోజు పాండరి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో, ఎన్నికల అధికారులు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో పారదర్శకంగా నిర్వహించిన ఈ ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల పరిశీలకుడు వింజమూరి రాఘవాచారి, ఎన్నికల అధికారి చేపూరి వెంకటస్వామి సమక్షంలో నూతన అధ్యక్షుడికి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు బాహోజు పాండరి మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా స్వర్ణకారుల సంక్షేమం, సంఘ బలోపేతం, సభ్యుల ఐక్యత, అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అనంతరం సంఘ పెద్దలు, నాయకులు, సభ్యులు బాహోజు పాండరిని ఘనంగా అభినందించి, శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నాయకత్వంలో జిల్లా స్వర్ణకార సంఘం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా స్వర్ణకార సంఘంతెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం (టీ జీ యస్ యస్ ) ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
    4
    మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా స్వర్ణకార సంఘానికి నూతన అధ్యక్షుడు
ఏకగ్రీవంగా బాహోజు పాండరి ఎన్నిక

గజ్వేల్ మేడ్చల్, కుత్బుల్లాపూర్. ప్రజా తెలంగాణ న్యూస్/
తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం (టీ జీ ఎస్ ఎస్ ) అనుబంధంగా నిర్వహించిన మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా స్వర్ణకార సంఘం ఎన్నికలు–2026లో బాహోజు పాండరి జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.శనివారం కుత్బుల్లాపూర్ మండలంలోని శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో నిర్వహించిన నామినేషన్ ప్రక్రియలో అధ్యక్ష పదవికి బాహోజు పాండరి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో, ఎన్నికల అధికారులు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో పారదర్శకంగా నిర్వహించిన ఈ ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల పరిశీలకుడు వింజమూరి రాఘవాచారి, ఎన్నికల అధికారి చేపూరి వెంకటస్వామి సమక్షంలో నూతన అధ్యక్షుడికి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు బాహోజు పాండరి మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా స్వర్ణకారుల సంక్షేమం, సంఘ బలోపేతం, సభ్యుల ఐక్యత, అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అనంతరం సంఘ పెద్దలు, నాయకులు, సభ్యులు బాహోజు పాండరిని ఘనంగా అభినందించి, శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నాయకత్వంలో జిల్లా స్వర్ణకార సంఘం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా స్వర్ణకార సంఘంతెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం (టీ జీ యస్ యస్ ) ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    24 min ago
  • అంబీర్ చెరువులో ఎస్టీపీ నిర్మాణాన్ని నిలిపివేయాలి: ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి హైదరాబాద్‌లోని హైదర్‌నగర్ డివిజన్ ఆదిత్యనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీ ప్రతినిధులు అంబీర్ చెరువులో ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) ప్రాంతంలో చట్టవిరుద్ధంగా ఎస్టీపీ ప్లాంట్ నిర్మిస్తున్నారని, దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వివరించారు. స్థానిక ఎమ్మెల్యేను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో కోర్టును కూడా ఆశ్రయించినట్లు తెలిపారు. ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ఒకప్పుడు సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అంబీర్ చెరువు కబ్జాల కారణంగా 150 ఎకరాలకు కుదించబడిందని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఎస్టీపీ ప్లాంట్‌ను అడ్డుకుంటామని, ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కాలనీవాసుల పోరాటానికి పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ, సుందరీకరణ పేరుతో చెరువులను ఆక్రమించి ప్రజా ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఆదిత్యనగర్ కాలనీ ప్రజల సమస్యను తమ సమస్యగా భావించి, ఎస్టీపీ నిర్మాణాన్ని నిలిపివేసే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘ ప్రతినిధులు, బీజేపీ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
    3
    అంబీర్ చెరువులో ఎస్టీపీ నిర్మాణాన్ని నిలిపివేయాలి: ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి
హైదరాబాద్‌లోని హైదర్‌నగర్ డివిజన్ ఆదిత్యనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాలనీ ప్రతినిధులు అంబీర్ చెరువులో ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) ప్రాంతంలో చట్టవిరుద్ధంగా ఎస్టీపీ ప్లాంట్ నిర్మిస్తున్నారని, దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వివరించారు. స్థానిక ఎమ్మెల్యేను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో కోర్టును కూడా ఆశ్రయించినట్లు తెలిపారు.
ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ఒకప్పుడు సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అంబీర్ చెరువు కబ్జాల కారణంగా 150 ఎకరాలకు కుదించబడిందని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఎస్టీపీ ప్లాంట్‌ను అడ్డుకుంటామని, ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కాలనీవాసుల పోరాటానికి పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ, సుందరీకరణ పేరుతో చెరువులను ఆక్రమించి ప్రజా ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఆదిత్యనగర్ కాలనీ ప్రజల సమస్యను తమ సమస్యగా భావించి, ఎస్టీపీ నిర్మాణాన్ని నిలిపివేసే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘ ప్రతినిధులు, బీజేపీ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
    user_Jeetender
    Jeetender
    Mobile Phone Accessory Shop సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • ప్రధానమంత్రిని జెన్ జీ యువత తిడుతుంటే నా కళ్లలో నీళ్లు వచ్చాయి: పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రిని జెన్ జీ యువత తిడుతుంటే నా కళ్లలో నీళ్లు వచ్చాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త తరానికి ఏం తెలుసు ఆయన పడ్డ కష్టం అంటూ మాట్లాడారు. ఒక్కరోజు కూడా ప్రధాని సెలవు తీసుకోలేదని కంటతడి పెట్టుకున్నారు.
    1
    ప్రధానమంత్రిని జెన్ జీ యువత తిడుతుంటే నా కళ్లలో నీళ్లు వచ్చాయి: పవన్ కళ్యాణ్

ప్రధానమంత్రిని జెన్ జీ యువత తిడుతుంటే నా కళ్లలో నీళ్లు వచ్చాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
కొత్త తరానికి ఏం తెలుసు ఆయన పడ్డ కష్టం అంటూ మాట్లాడారు. ఒక్కరోజు కూడా ప్రధాని సెలవు తీసుకోలేదని కంటతడి పెట్టుకున్నారు.
    user_Anji
    Anji
    Mahabubnagar Rural, Telangana•
    9 hrs ago
  • సచివాలయ సిబ్బందిని సస్పెండ్ చేయాలి: సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు జూపాడు బంగ్లా మండలం మండ్లెం సచివాలయ సిబ్బందిని సస్పెండ్ చేయాలని సీపీఎం నేత నాగేశ్వరరావు పేర్కొన్నారు. పంట నష్టపరిహారం నమోదు చేసుకోవడానికి పలువురు రైతులు వచ్చారని అయితే నాలుగు గంటలకే సచివాలయ సిబ్బంది రైతు కేంద్రాలకు తాళం వేసి ఉండడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యమన్నారు. సచివాలయ సిబ్బందికి ఫోన్ చేసి సంప్రదించిన ఫోన్ ఎత్తలేదని విచారణ వ్యక్తం చేశారు. కలెక్టర్ స్పందించి వీరిని సస్పెండ్ చేయాలన్నారు.
    1
    సచివాలయ సిబ్బందిని సస్పెండ్ చేయాలి: సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు
జూపాడు బంగ్లా మండలం మండ్లెం సచివాలయ సిబ్బందిని సస్పెండ్ చేయాలని సీపీఎం నేత నాగేశ్వరరావు పేర్కొన్నారు. పంట నష్టపరిహారం నమోదు చేసుకోవడానికి పలువురు రైతులు వచ్చారని అయితే నాలుగు గంటలకే సచివాలయ సిబ్బంది రైతు కేంద్రాలకు తాళం వేసి ఉండడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యమన్నారు. సచివాలయ సిబ్బందికి ఫోన్ చేసి సంప్రదించిన ఫోన్ ఎత్తలేదని విచారణ వ్యక్తం చేశారు. కలెక్టర్ స్పందించి వీరిని సస్పెండ్ చేయాలన్నారు.
    user_Why not dinesh... yashaswi
    Why not dinesh... yashaswi
    News Anchor జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • ఈ రోజు హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద Ola, Uber, Rapido క్యాబ్‌లు గంటల తరబడి బారులు తీరాయి. ఓలా, ఉబెర్ రాపిడ్ యాప్‌లను నమ్ముకుని లోన్‌లు తీసుకుని కార్లు కొనుగోలు చేసిన వేలాది మంది డ్రైవర్లు నేడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తగిన ఆదాయం లేక, పెరుగుతున్న ఖర్చులు, ఈఎంఐలు చెల్లిస్తూ కుటుంబాన్ని పోషించడమే భారంగా మారింది. ఎన్నిసార్లు ధర్నాలు, నిరసనలు చేసినా ప్రభుత్వం, సంబంధిత అగ్రిగేటర్ సంస్థలు డ్రైవర్ల సమస్యలపై సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పనిచేసే ప్రతి డ్రైవర్‌కు గౌరవప్రదమైన జీవనం హక్కు. వారి సమస్యలను ప్రభుత్వం, Ola, Uber, Rapido సంస్థలు వెంటనే పరిష్కరించి, న్యాయమైన ఛార్జీలు, పారదర్శక విధానాలు, జీవనోపాధికి భరోసా కల్పించాలని కోరుతున్నరూ
    3
    ఈ రోజు హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద Ola, Uber, Rapido క్యాబ్‌లు గంటల తరబడి బారులు తీరాయి.
ఓలా, ఉబెర్ రాపిడ్ యాప్‌లను నమ్ముకుని లోన్‌లు తీసుకుని కార్లు కొనుగోలు చేసిన వేలాది మంది డ్రైవర్లు నేడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తగిన ఆదాయం లేక, పెరుగుతున్న ఖర్చులు, ఈఎంఐలు చెల్లిస్తూ కుటుంబాన్ని పోషించడమే భారంగా మారింది.
ఎన్నిసార్లు ధర్నాలు, నిరసనలు చేసినా ప్రభుత్వం, సంబంధిత అగ్రిగేటర్ సంస్థలు డ్రైవర్ల సమస్యలపై సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కష్టపడి పనిచేసే ప్రతి డ్రైవర్‌కు గౌరవప్రదమైన జీవనం హక్కు.
వారి సమస్యలను ప్రభుత్వం, Ola, Uber, Rapido సంస్థలు వెంటనే పరిష్కరించి, న్యాయమైన ఛార్జీలు, పారదర్శక విధానాలు, జీవనోపాధికి భరోసా కల్పించాలని కోరుతున్నరూ
    user_CHERUKU RAMESH
    CHERUKU RAMESH
    Chiropractor మేడిపల్లి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    6 hrs ago
  • విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీజేవైఎం నిరసన.. విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దిల్‌సుఖ్‌నగర్‌లో బీజేవైఎం నిరసన.. హైదరాబాద్:-తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో దిల్‌సుఖ్‌నగర్ బస్ స్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి విద్యార్థులను "క్రిమినల్స్"గా అభివర్ణించడాన్ని బీజేవైఎం నేతలు తీవ్రంగా ఖండించారు. విద్యార్థులను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని, ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండేతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిరసన నేపథ్యంలో దిల్‌సుఖ్‌నగర్ బస్ స్టాండ్ పరిసరాల్లో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొనగా, శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
    4
    విద్యార్థులను ఉద్దేశించి 
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీజేవైఎం నిరసన..
విద్యార్థులను ఉద్దేశించి 
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దిల్‌సుఖ్‌నగర్‌లో బీజేవైఎం నిరసన..
హైదరాబాద్:-తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో దిల్‌సుఖ్‌నగర్ బస్ స్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ముఖ్యమంత్రి విద్యార్థులను "క్రిమినల్స్"గా అభివర్ణించడాన్ని బీజేవైఎం నేతలు తీవ్రంగా ఖండించారు. 
విద్యార్థులను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని, ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసనలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండేతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 
నిరసన నేపథ్యంలో దిల్‌సుఖ్‌నగర్ బస్ స్టాండ్ పరిసరాల్లో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొనగా, శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
    user_Praveen
    Praveen
    రిపోర్టర్ బాలాపూర్, రంగారెడ్డి, తెలంగాణ•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.