నాన్యతా లోపం బీటలు వారిన ఓటాయి - పొగుళ్ళపల్లి బ్రిడ్జి ప్రజాధనం వృధా.. భయం గుప్పిట్లో ప్రయాణికులు అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వెరసి ఒక భారీ నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. ఓటాయి - పొగుళ్ళపల్లి గ్రామాల మధ్య ప్రజల రవాణా సౌకర్యం కోసం ఎంతో ప్రతిష్టాత్మకముగా, లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన బ్రిడ్జి ప్రారంభానికి ముందే కుంగిపోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో మొదటి నుంచీ నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిబంధనల ప్రకారం వాడాల్సిన సిమెంట్, ఇనుము వినియోగించకపోవడం వల్లే స్వల్ప కాలంలోనే వంతెనపై భారీ బీటలు వచ్చాయని విమర్శలు వినిపిస్తున్నాయి. వర్షాకాలం రాకముందే పరిస్థితి ఇలా ఉంటే, భారీ వాహనాలు వెళ్తే వంతెన మనుగడ సాధ్యమేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాలకు ఈ బ్రిడ్జి ప్రధాన కూడలిగా ఉంది. వంతెనపై ఏర్పడిన పగుళ్లు రానురాను పెద్దవి కావడంతో ప్రయాణికులు ప్రాణభయంతో ప్రయాణం సాగిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి, నాణ్యతపై విచారణ జరిపించాలని, పగుళ్లు వారిన ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టి వంతెన పటిష్టతను నిర్ధారించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

- కలెక్టరేట్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) మ్యాపింగ్‌పై జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సమీక్ష సమావేశం నిర్వహించారు. 2025 ఓటర్ జాబితాను 2002 ఎస్.ఐ.ఆర్‌తో మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రోజుకు కనీసం 50 మ్యాపింగ్‌లు పూర్తి చేసి, వారం రోజుల్లో ప్రక్రియ పూర్తిచేయాలని సూచించారు.1
- జనగామ జిల్లా చిల్పూర్ మండలం రాజావరం గ్రామంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని టి. రాజా సింగ్ ఆవిష్కరించారు. కార్యక్రమానికి హాజరైన రాజా సింగ్‌కు బీజేపీ కార్యకర్తలు, బజరంగ్ దళ్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. విగ్రహావిష్కరణ అనంతరం రాజా సింగ్‌కు ఖడ్గాన్ని బహుమతిగా అందించారు. ‘జై భవాని, జై శివాజీ, భారత్ మాతాకీ జై’ నినాదాలతో ప్రాంతం మార్మోగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజావరం బస్టాండ్ పరిసరాలు కాషాయ జెండాలతో కిటకిటలాడాయి.1
- అశ్వారావుపేట మండల కేంద్రంలో రింగ్ రోడ్ సెంటర్ వద్ద గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు రూ. 90 లక్షల వ్యయంతో నిర్మించబడనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రింగ్ రోడ్ సెంటర్‌లో తరచుగా ఎదురవుతున్న రహదారి సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించడమే ఈ పనుల ప్రధాన ఉద్దేశమని తెలిపారు సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయిన తరువాత వాహనదారులు వ్యాపారులు స్థానిక ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయం కలుగుతుందని పేర్కొన్నారు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులను నాన్యతగా చేపడుతున్నామని మండల కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు4
- మునుగోడు లో వైన్ షాపుల సమయపాలన నిర్వహణ తీరును పరిశీలించారు గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు.. మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని హైదరాబాద్ రోడ్ లో ఉన్న వైన్ షాప్ వద్ద ఆగి పరిసరాలను పరిశీలించారు.. సాయంత్రం 6 గంటల వరకు పర్మిట్ రూమ్ లో గాని చుట్టు పరిసరాల ప్రాంతాల్లో ఎవ్వరు కూడా మందు తాగొద్దని వైన్ షాప్ నిర్వాహకులకు మరో మారు గట్టిగా చెప్పారు... వైన్ షాపుల సమయపాలన నిర్వహణను పకడ్బందీగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు..1
- Post by Sk Noori4
- ఎస్సారెస్పీ అధికారులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. చేసిన పనులకు కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లించడంలో జాప్యంపై జగిత్యాల జిల్లా మెట్ పల్లి కార్యాలయ ఆస్తులు జప్తుకు ఆదేశాలు జారీచేసింది. గాయత్రి ప్రాజెక్ట్ లిమిటెడ్ కంపెనీ వారు 2002 లో మెట్ పల్లి ప్రాంతంలో ఎస్సారెస్పీ కెనాల్ లో రెండు ప్యాకేజీల క్రింద పనులు చేపట్టారు. ఆ పనులకు సంబంధించి 51 కోట్ల బకాయి. చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ కోర్టును ఆశ్రయించారు. 2018 లో క్రింది కోర్టు డబ్బులు చెల్లించాలని ఆర్డర్ ఇచ్చింది. అయినా బకాయిలు చెల్లించలేదు. దీంతో కంపెనీ ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించడంతో 2021లో పూర్తిస్థాయిలో డబ్బులు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం రంగారెడ్డి కోర్టులో కేసు నడుస్తుంది. డబ్బులు చెల్లించాలని ఆర్డర్ వచ్చినప్పటికీ ఎస్సారెస్పీ అధికారులు బిల్లుల చెల్లింపులో జాప్యం చేయడంతో మరోసారి కాంట్రాక్ట్ కంపెనీ కోర్టును ఆశ్రయించడంతో మెట్ పల్లి ఎస్సారెస్పీ కార్యాలయ ఆస్తులు జప్తుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆర్డర్ తో కంపెనీ ప్రతినిధులు మెట్ పల్లి సివిల్ కోర్ట్ అధికారులు ఎస్సారెస్పీ కార్యాలయానికి చేరారు. బకాయిలు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉన్నాయని,వారంలో బకాయిలు చెల్లిస్తామని రాతపూర్వకంగా ఎస్సారెస్పీ అధికారులు స్పష్టం చేయడంతో కంపెనీ ప్రతినిధులు కోర్టు అధికారులు వెనుతిరిగారు.1
- మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల అనంతారం, పెద్ద తండా, సిరోలు మండలంలోని తాళ్ల సంకీసా వసరం తండా మన్నెగూడెం మరియు కొత్త తండాలలో మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్, వరంగల్ ఎన్ఫోర్స్మెంట్, DTF- మహబూబాబాద్ & STF- హైదరాబాద్ టీంలు సంయుక్తంగా సారాయి స్థావరాలపై దాడులు నిర్వహించారు ఇట్టి దాడుల్లో (05) మంది ముద్దాయిలను అదుపులో కి తీసుకుని వారి పై కేసులు నమోదు చేసి, తదుపరి వారిని సంబంధిత తాహసిల్దార్ గారి ముందు బైండోవర్ చేసారు,ఈ దాడుల్లో (19) లీటర్ల సారాయి, (50) కిలోల బెల్లం,(30) కిలోల పటిక స్వాధీనం చేసుకుని (600)లీటర్ల సారాయి తయారీకి ఉపయోగించే బెల్లం పానకం ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.1
- వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా సర్పంచ్ జక్కి అనిత శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. శివాజీ చిత్రపటానికి నివాళులు అర్పించి వేణుగోపాలస్వామి ఆలయం నుంచి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జక్కి శ్రీకాంత్ మాట్లాడుతూ శివాజీ ఆశయాలను యువత అనుసరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.1
- లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఇల్లందు మండలం కొమరారం పరిధిలో ని విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ (మాస్ లైన్ )ఆధ్వర్యంలో ఆందోళన. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వేసవికాలంలో రైతులకు సాగు చేసిన మొక్కజొన్న పంటకు విద్యుత్ అంతరాయం శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు1