logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రుసెగావ్ గేట్ సమీపంలో టైరు పగిలిపోవడంతో శీతల పానీయాలను తీసుకువెళ్తున్న ఒక వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. కామారెడ్డి జిల్లాలోని మదనూరు మండలంలోని రుసెగావ్ గేట్ సమీపంలో టైరు పగిలిపోవడంతో శీతల పానీయాలను తీసుకువెళ్తున్న ఒక వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది.ఆదివారం మండలంలోని జాతీయ రహదారి 161పై రుషెగావ్ గేట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం కారణంగా, వ్యాన్ నుండి స్పైట్ మరియు థమ్సప్ బాటిళ్లు రోడ్డుపై పడిపోయాయి. వందలాది బాటిళ్లు పగిలిపోయి, శీతల పానీయాలు రోడ్డు అంతటా వ్యాపించాయి. దీంతో ట్రాఫిక్కు కొంత అంతరాయం కలిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల నుండి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేశారు. గాయపడిన డ్రైవర్ను వెంటనే సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న కూల్డ్రింక్స్ ఏజెన్సీ యాజమాన్యం సంఘటనా స్థలానికి చేరుకుని నష్టాన్ని అంచనా వేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

1 hr ago
user_Dantulwar Sopan D
Dantulwar Sopan D
మద్నూర్, కామారెడ్డి, తెలంగాణ•
1 hr ago
c6d39671-987f-4c4e-9505-2fbf1799661a

రుసెగావ్ గేట్ సమీపంలో టైరు పగిలిపోవడంతో శీతల పానీయాలను తీసుకువెళ్తున్న ఒక వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. కామారెడ్డి జిల్లాలోని మదనూరు మండలంలోని రుసెగావ్ గేట్ సమీపంలో టైరు పగిలిపోవడంతో శీతల పానీయాలను తీసుకువెళ్తున్న ఒక వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది.ఆదివారం మండలంలోని జాతీయ రహదారి 161పై రుషెగావ్ గేట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం కారణంగా, వ్యాన్ నుండి స్పైట్ మరియు థమ్సప్ బాటిళ్లు రోడ్డుపై పడిపోయాయి. వందలాది బాటిళ్లు పగిలిపోయి, శీతల పానీయాలు రోడ్డు అంతటా వ్యాపించాయి. దీంతో ట్రాఫిక్కు కొంత అంతరాయం కలిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల నుండి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేశారు. గాయపడిన డ్రైవర్ను వెంటనే సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న కూల్డ్రింక్స్ ఏజెన్సీ యాజమాన్యం సంఘటనా స్థలానికి చేరుకుని నష్టాన్ని అంచనా వేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ బాసర గోదావరి తీరంలో పట్టపగలే వీధి దీపాలు వెలుగుతూ విద్యుత్తు వృధా అవుతోంది. విద్యుత్తు పొదుపు చేయాలని ప్రభుత్వం సూచిస్తున్నా, క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యంపై భక్తులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
    1
    నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ బాసర గోదావరి తీరంలో పట్టపగలే వీధి దీపాలు వెలుగుతూ విద్యుత్తు వృధా అవుతోంది. విద్యుత్తు పొదుపు చేయాలని ప్రభుత్వం సూచిస్తున్నా, క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యంపై భక్తులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
    user_Rameshwar Pimple
    Rameshwar Pimple
    Academy బాసర, నిర్మల్, తెలంగాణ•
    12 hrs ago
  • నిజాంసాగర్ మండలం : మంగ్లూరు నుంచి మోడీ బహిరంగ సభకు భారీగా తరలిన బిజెపి శ్రేణులు, మోదీ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న ప్రధాని మోదీ భారీ బహిరంగ సభకు నిజాంసాగర్ మండలం మంగ్లూర్ గ్రామం నుంచి బీజేపీ కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. గ్రామ సర్పంచ్ నర్మల రాజు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పయనమయ్యారు. ఈ సందర్భంగా మోదీ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేస్తూ ప్రత్యేక వాహనాల్లో బయలుదేరారు. ప్రధాని సభను విజయవంతం చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కదిలాయి.
    1
    నిజాంసాగర్ మండలం : మంగ్లూరు నుంచి మోడీ బహిరంగ సభకు భారీగా తరలిన బిజెపి శ్రేణులు, మోదీ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు
జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న ప్రధాని మోదీ భారీ బహిరంగ సభకు నిజాంసాగర్ మండలం మంగ్లూర్ గ్రామం నుంచి బీజేపీ కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. గ్రామ సర్పంచ్ నర్మల రాజు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పయనమయ్యారు. ఈ సందర్భంగా మోదీ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేస్తూ ప్రత్యేక వాహనాల్లో బయలుదేరారు. ప్రధాని సభను విజయవంతం చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కదిలాయి.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • మోర్తాడ్‌లో రైతులతో,బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం... బాల్కొండ ఎమ్మెల్యేవేముల పిలుపు.... ప్రభుత్వ వైఫల్యంతో ప్రవేట్ వ్యాపారులకు ఎక్కువగా వడ్లు అమ్ముకుంటున్న రైతన్నలు – క్వింటాల్‌కు రూ. 500 నష్ట పోతున్నారు. రైస్ మిల్లర్ల చేతుల్లో కీలుబొమ్మగా మారిన ప్రభుత్వం.. 45 కిలోల తరుగు పేరుతో క్వింటాల్‌కు 12.5 కిలోల దోపిడీ... నెల రోజులుగా కళ్ళాల దగ్గరే రైతులు.. కాంగ్రెస్ హయాంలో అన్నదాతలకు తప్పని తిప్పలు... జిల్లా కలెక్టర్ ఫోన్ ఎత్తడం లేదు.. శాసనసభ్యుడికే ఈ పరిస్థితి ఉంటే సామాన్యుల మాటేంటి? వడ్ల కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీనతను ఎండగట్టిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి... నిజామాబాద్ జిల్లాలో, ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో వడ్ల కొనుగోళ్లు అత్యంత నత్తనడకన సాగుతున్నాయని, రైతులు పంటను అమ్ముకోవడానికి గత నెల రోజులుగా ఇబ్బందులు పడుతున్నారని దీనికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత మూడు రోజులుగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో రైతుల కోరిక మేరకు పర్యటించి పలు కొనుగోలు కేంద్రాలను స్వయంగా సందర్శించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావడానికి, రైతులతో కలిసి నేడు సోమవారం రోజున నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మండల కేంద్రమైనమోర్తాడ్ లో రైతు లతో కలిసి భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, రైతులు, బి.ఆర్.ఎస్ .నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరై నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ, వేల్పూర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రసంగిస్తూ పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం వడ్ల కొనుగోలు చేస్తామని ప్రకటించి, సెంటర్లు తెరిచేసరికి 15 రోజులు, గన్నీ బ్యాగులు వచ్చేసరికి వారం, కాంటా పెట్టేసరికి మరో వారం అన్నట్లుగా 20 రోజుల పాటు కావాలనే జాప్యం చేసిందని విమర్శించారు. మద్దతు ధర రూ. 2390 ఉండగా, ప్రభుత్వ జాప్యం భరించలేక రైతులు గత్యంతరం లేక ప్రైవేటు వ్యక్తులకు రూ. 1750 నుండి 1900 లకే అమ్ముకుంటున్నారని, దీనివల్ల ఎకరాకు సుమారు రూ. 15,000 నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్లర్లు ప్రభుత్వాన్ని శాసిస్తున్నారని, తరుగు పేరుతో 40 కిలోలకు 5 కిలోల అదనపు వడ్లు (క్వింటాల్‌కు 12.5 కిలోలు) దోచుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ఇది కేవలం 1.5 కిలోలు మాత్రమే ఉండేదని గుర్తు చేశారు. రైతుల సమస్యలపై మాట్లాడేందుకు జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేస్తే, ఫోన్ ఎత్తడం లేదని, కనీసం స్పందించే తీరిక కూడా లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ పాలిసీ లో భాగమేన అని ఆయన దుయ్యబట్టారు. వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలి, వడ్ల రవాణాకు లారీలను పెంచాలి. గన్నీ బ్యాగుల కొరత తీర్చాలి. తరుగును తగ్గించి, పాత పద్ధతిలోనే వడ్లు సేకరించాలి. దొడ్డు రకానికి గ్రేడ్-1 రేటుతో పాటు రూ. 500 బోనస్ వెంటనే చెల్లించాలిఅని ప్రభుత్వానికి పలు డిమాండ్ చేశారు. రైతుల పక్షాన పోరాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచి రైతులకు న్యాయం చేసే వరకు విశ్రమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగా రేపు (సోమవారం) ఉదయం 10 గంటలకు మోర్తాడ్‌లో ప్రభుత్వ వైఖరికి నిరసనగ కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గంలోని రైతులందరూ, బీఆర్ఎస్ కార్యకర్తలు, పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ నిరసనను విజయవంతం చేయాలని వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
    1
    మోర్తాడ్‌లో రైతులతో,బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం...
బాల్కొండ ఎమ్మెల్యేవేముల పిలుపు....

ప్రభుత్వ వైఫల్యంతో ప్రవేట్ వ్యాపారులకు ఎక్కువగా వడ్లు అమ్ముకుంటున్న రైతన్నలు – క్వింటాల్‌కు రూ. 500 నష్ట పోతున్నారు.
రైస్ మిల్లర్ల చేతుల్లో కీలుబొమ్మగా మారిన ప్రభుత్వం.. 45 కిలోల తరుగు పేరుతో క్వింటాల్‌కు 12.5 కిలోల దోపిడీ...
నెల రోజులుగా కళ్ళాల దగ్గరే రైతులు.. కాంగ్రెస్ హయాంలో అన్నదాతలకు తప్పని తిప్పలు...
జిల్లా కలెక్టర్ ఫోన్ ఎత్తడం లేదు.. శాసనసభ్యుడికే ఈ పరిస్థితి ఉంటే సామాన్యుల మాటేంటి?
వడ్ల కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీనతను ఎండగట్టిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి...
నిజామాబాద్ జిల్లాలో, ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో వడ్ల కొనుగోళ్లు అత్యంత నత్తనడకన సాగుతున్నాయని, రైతులు పంటను అమ్ముకోవడానికి గత నెల రోజులుగా  ఇబ్బందులు పడుతున్నారని 
దీనికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి  తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత మూడు రోజులుగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో రైతుల కోరిక మేరకు పర్యటించి పలు కొనుగోలు కేంద్రాలను స్వయంగా సందర్శించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావడానికి, రైతులతో కలిసి నేడు సోమవారం రోజున నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మండల కేంద్రమైనమోర్తాడ్ లో రైతు లతో కలిసి భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, రైతులు, బి.ఆర్.ఎస్ .నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరై నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ, వేల్పూర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రసంగిస్తూ పిలుపునిచ్చారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,
ప్రభుత్వం వడ్ల కొనుగోలు చేస్తామని ప్రకటించి, సెంటర్లు తెరిచేసరికి 15 రోజులు, గన్నీ బ్యాగులు వచ్చేసరికి వారం, కాంటా పెట్టేసరికి మరో వారం అన్నట్లుగా 20 రోజుల పాటు కావాలనే జాప్యం చేసిందని విమర్శించారు.
మద్దతు ధర రూ. 2390 ఉండగా, ప్రభుత్వ జాప్యం భరించలేక రైతులు గత్యంతరం లేక ప్రైవేటు వ్యక్తులకు రూ. 1750 నుండి 1900 లకే అమ్ముకుంటున్నారని, దీనివల్ల ఎకరాకు సుమారు రూ. 15,000 నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైస్ మిల్లర్లు ప్రభుత్వాన్ని శాసిస్తున్నారని, తరుగు పేరుతో 40 కిలోలకు 5 కిలోల అదనపు వడ్లు (క్వింటాల్‌కు 12.5 కిలోలు) దోచుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ఇది కేవలం 1.5 కిలోలు మాత్రమే ఉండేదని గుర్తు చేశారు.
రైతుల సమస్యలపై మాట్లాడేందుకు జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేస్తే, ఫోన్ ఎత్తడం లేదని, కనీసం స్పందించే తీరిక కూడా లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ పాలిసీ లో భాగమేన అని ఆయన దుయ్యబట్టారు.
వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలి, వడ్ల రవాణాకు లారీలను పెంచాలి.
గన్నీ బ్యాగుల కొరత తీర్చాలి.
తరుగును తగ్గించి, పాత పద్ధతిలోనే వడ్లు సేకరించాలి.
దొడ్డు రకానికి గ్రేడ్-1 రేటుతో పాటు రూ. 500 బోనస్ వెంటనే చెల్లించాలిఅని ప్రభుత్వానికి పలు డిమాండ్ చేశారు.
రైతుల పక్షాన పోరాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచి రైతులకు న్యాయం చేసే వరకు విశ్రమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగా రేపు (సోమవారం) ఉదయం 10 గంటలకు మోర్తాడ్‌లో ప్రభుత్వ వైఖరికి నిరసనగ  కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గంలోని రైతులందరూ, బీఆర్ఎస్ కార్యకర్తలు, పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ నిరసనను విజయవంతం చేయాలని వేముల ప్రశాంత్ రెడ్డి  పిలుపునిచ్చారు.
    user_MOHAMMAD SHAIK HUSSAIN
    MOHAMMAD SHAIK HUSSAIN
    బాల్కొండ, నిజామాబాద్, తెలంగాణ•
    31 min ago
  • కేంద్ర సహాయ శాఖ హోంమంత్రి బండి సంజయ్ బర్తరఫ్ చేయాలి మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలి : మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి.. బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ను వెంటనే కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. మదర్స్ డే రోజున హైదరాబాద్‌కు వస్తున్న ప్రధాని మోదీ, మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై సమాధానం చెప్పాలని అన్నారు.మోడీ ప్రసంగం ప్రారంభించక ముందే బండి సంజయ్‌ను పదవి నుంచి తొలగించాలని, లేనిపక్షంలో ప్రజలు ప్రధాని మాటలను పట్టించుకోరనివ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రేవంత్ రెడ్డి హోంమంత్రిగా పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఒక మైనర్ బాలిక ఎఫ్‌ఐఆర్ నమోదు కోసం గంటల తరబడి పోలీస్ స్టేషన్‌లో వేచి ఉండాల్సి రావడం పోలీసుల వైఫల్యానికి నిదర్శనమన్నారు.మహిళా రిజర్వేషన్ల బిల్లుపై పార్లమెంట్‌లో గొప్పలు చెప్పుకున్న ప్రధాని మోదీ, మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో మాత్రం మౌనం వహిస్తున్నారని విమర్శించారు. బండి సంజయ్ కుమారుడిపై ఆరోపణలు ఉన్నప్పటికీ చర్యలు తీసుకోకపోవడం వల్ల కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు బయటపడ్డాయని అన్నారు. బాధిత బాలికకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని విమర్శించారు. బండి సంజయ్ కుమారుడిని వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు ఉపయోగపడే ఒక్క మాట కూడా బండి సంజయ్ మాట్లాడలేదని, రేవంత్ రెడ్డి ఆయనను కాపాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణపై ప్రధాని మోదీకి ప్రేమ లేదని, విభజన హామీలు ఇంకా అమలు కాలేదని విమర్శించారు.
    1
    కేంద్ర సహాయ శాఖ హోంమంత్రి బండి సంజయ్ బర్తరఫ్ చేయాలి మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి 
బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలి : మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి..
బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ను వెంటనే కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో  మాట్లాడుతూ.. మదర్స్ డే రోజున హైదరాబాద్‌కు వస్తున్న ప్రధాని మోదీ, మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై సమాధానం చెప్పాలని అన్నారు.మోడీ ప్రసంగం ప్రారంభించక ముందే బండి సంజయ్‌ను పదవి నుంచి తొలగించాలని, లేనిపక్షంలో ప్రజలు ప్రధాని మాటలను పట్టించుకోరనివ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రేవంత్ రెడ్డి హోంమంత్రిగా పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఒక మైనర్ బాలిక ఎఫ్‌ఐఆర్ నమోదు కోసం గంటల తరబడి పోలీస్ స్టేషన్‌లో వేచి ఉండాల్సి రావడం పోలీసుల వైఫల్యానికి నిదర్శనమన్నారు.మహిళా రిజర్వేషన్ల బిల్లుపై పార్లమెంట్‌లో గొప్పలు చెప్పుకున్న ప్రధాని మోదీ, మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో మాత్రం మౌనం వహిస్తున్నారని విమర్శించారు. బండి సంజయ్ కుమారుడిపై ఆరోపణలు ఉన్నప్పటికీ చర్యలు తీసుకోకపోవడం వల్ల కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు బయటపడ్డాయని అన్నారు. బాధిత బాలికకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని విమర్శించారు. బండి సంజయ్ కుమారుడిని వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు ఉపయోగపడే ఒక్క మాట కూడా బండి సంజయ్ మాట్లాడలేదని, రేవంత్ రెడ్డి ఆయనను కాపాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణపై ప్రధాని మోదీకి ప్రేమ లేదని, విభజన హామీలు ఇంకా అమలు కాలేదని విమర్శించారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    4 hrs ago
  • పటాన్చెరు పట్టణంలో హోటల్ లో అగ్ని ప్రమాదం తప్పిన ప్రమాదం పటాన్ చెరు బస్టాండ్ సమీపంలోని ఖానవల్లి హోటల్ లో షార్ట్ సర్క్యూట్ తో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. మంటలు వేగంగా వ్యాపించడంతో స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే స్పందించిన యాజమాన్యం హోటల్లో ఉన్న వారిని వెంటనే బయటకు పంపించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను ఆర్పి వేశారు. హోటల్ యజమాని జరప్పకు శిల్ప గాయాలు అయ్యాయి.
    1
    పటాన్చెరు పట్టణంలో హోటల్ లో అగ్ని ప్రమాదం తప్పిన ప్రమాదం
పటాన్ చెరు బస్టాండ్ సమీపంలోని ఖానవల్లి హోటల్ లో షార్ట్ సర్క్యూట్ తో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. మంటలు వేగంగా వ్యాపించడంతో స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే స్పందించిన యాజమాన్యం హోటల్లో ఉన్న వారిని వెంటనే బయటకు పంపించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను ఆర్పి వేశారు. హోటల్ యజమాని జరప్పకు శిల్ప గాయాలు అయ్యాయి.
    user_Praveen
    Praveen
    మున్‌పల్లె, సంగారెడ్డి, తెలంగాణ•
    4 hrs ago
  • చీర్లవంచ గ్రామ బీజేపీ నాయకులు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు తరలివెళ్లారు. జాతీయ నాయకుడి ప్రసంగాన్ని వినేందుకు వారు ఉత్సాహంగా బయలుదేరి వెళ్లారు.
    1
    చీర్లవంచ గ్రామ బీజేపీ నాయకులు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు తరలివెళ్లారు. జాతీయ నాయకుడి ప్రసంగాన్ని వినేందుకు వారు ఉత్సాహంగా బయలుదేరి వెళ్లారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    6 hrs ago
  • జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో ముస్లిం సోదరులు ప్రయాణికుల దాహం తీర్చడానికి చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి తీవ్రత దృష్ట్యా మంచినీటి సౌకర్యం కల్పించడం ద్వారా వారు మానవత్వాన్ని చాటుకున్నారు.
    1
    జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో ముస్లిం సోదరులు ప్రయాణికుల దాహం తీర్చడానికి చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి తీవ్రత దృష్ట్యా మంచినీటి సౌకర్యం కల్పించడం ద్వారా వారు మానవత్వాన్ని చాటుకున్నారు.
    user_అబ్దుల్ ముసవ్విర్
    అబ్దుల్ ముసవ్విర్
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    8 hrs ago
  • కామారెడ్డి జిల్లా : జిల్లాలో అక్రమ గోవదను అరికట్టాలని డిమాండ్ చేస్తూ బజరంగ్దళ్ నాయకులు పోలీసులకు వినతిపత్రం కామారెడ్డి జిల్లాలో అక్రమ గోవధను అరికట్టాలని డిమాండ్ చేస్తూ బజరంగ్ దళ్ నాయకులు పోలీస్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. గోమాతను ఆరాధ్యదైవంగా | పూజిస్తామని, వ్యవసాయం, ఆరోగ్యానికి గోవులు ఎంతో ముఖ్యమని వారు పేర్కొన్నారు. రానున్న పండుగల నేపథ్యంలో అక్రమ రవాణా, గోవధ పెరిగే అవకాశం ఉందని.. అధికారులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గోవులను తరలించే వారిపై నిఘా పెట్టాలని విజ్ఞప్తి చేశారు.
    1
    కామారెడ్డి జిల్లా : జిల్లాలో అక్రమ గోవదను అరికట్టాలని డిమాండ్ చేస్తూ బజరంగ్దళ్ నాయకులు పోలీసులకు వినతిపత్రం
కామారెడ్డి జిల్లాలో అక్రమ గోవధను అరికట్టాలని డిమాండ్ చేస్తూ బజరంగ్ దళ్ నాయకులు పోలీస్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. గోమాతను ఆరాధ్యదైవంగా | పూజిస్తామని, వ్యవసాయం, ఆరోగ్యానికి గోవులు ఎంతో ముఖ్యమని వారు పేర్కొన్నారు. రానున్న పండుగల నేపథ్యంలో అక్రమ రవాణా, గోవధ పెరిగే అవకాశం ఉందని.. అధికారులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గోవులను తరలించే వారిపై నిఘా పెట్టాలని విజ్ఞప్తి చేశారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.