logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రాయదుర్గంలో కన్నుల పండుగలా సిడిమాను మహోత్సవ వేడుకలు నిర్వహణ రాయదుర్గం పట్టణంలోని కొండపై వెలసిన రస సిద్దేశ్వర స్వామి ఆలయంలో సిడిమాను మహోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆదివారం సాయంకాలం ఆలయంలో గంగ పూజ నిర్వహించిన అనంతరం ఓ బాలుడిని సిడిమానుకు కట్టి మహోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకి స్థానిక భక్తులే కాక ఇతర రాష్ట్రం నుండి భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

1 day ago
user_PHANI JOURNALIST
PHANI JOURNALIST
Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
1 day ago

రాయదుర్గంలో కన్నుల పండుగలా సిడిమాను మహోత్సవ వేడుకలు నిర్వహణ రాయదుర్గం పట్టణంలోని కొండపై వెలసిన రస సిద్దేశ్వర స్వామి ఆలయంలో సిడిమాను మహోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆదివారం సాయంకాలం ఆలయంలో గంగ పూజ నిర్వహించిన అనంతరం ఓ బాలుడిని సిడిమానుకు కట్టి మహోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకి స్థానిక భక్తులే కాక ఇతర రాష్ట్రం నుండి భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • డి హీరేహాల్ మండలంలోని మురిడి గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ ఆంజనేయుడు బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే లంకా దహనం వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం ముందు బాణసంచా పెంచి లంక దహన వేడుకలు నిర్వహించారు.
    1
    డి హీరేహాల్ మండలంలోని మురిడి గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ ఆంజనేయుడు బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే లంకా దహనం వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం ముందు బాణసంచా పెంచి లంక దహన వేడుకలు నిర్వహించారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర నిర్వహించారు. వేలాది మంది అభిమానులు, ఆత్మీయులు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో అంతిమయాత్ర సాగింది. 'పెద్దాయన'ను కడసారి చూసేందుకు ప్రజలు పోటెత్తడంతో గ్రామం జనసంద్రమైంది. విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన మరణం తీరని లోటన్నారు. 'ఉన్నం అమర్ రహే' నినాదాలతో యర్రంపల్లి మార్మోగింది.
    1
    అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర నిర్వహించారు. వేలాది మంది అభిమానులు, ఆత్మీయులు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో అంతిమయాత్ర సాగింది. 'పెద్దాయన'ను కడసారి చూసేందుకు ప్రజలు పోటెత్తడంతో గ్రామం జనసంద్రమైంది. విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన మరణం తీరని లోటన్నారు. 'ఉన్నం అమర్ రహే' నినాదాలతో యర్రంపల్లి మార్మోగింది.
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • కదిరి పట్టణంలోని జీమాను సర్కిల్లో చేపల మార్కెట్ వద్ద సముద్రపు లో ఉన్న అతిపెద్ద చేపను తెచ్చారు. 70 కేజీలు ఉన్న పెద్ద చేపను చూడడానికి ప్రజలు ఎగబడ్డారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న ప్రజలను పోలీసులు స్పందించి క్లియర్ చేశారు. చేపలలో ఎన్ని రకాలు ఉన్నాయో ఏవి తినాలో, ఏవి తినకూడదో అర్థం కావడం లేదని చేపలు కొనడానికి వచ్చిన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. 70 కేజీలు ఉన్న చేపను మొదటిసారిగా చూస్తున్నామన్నారు.
    1
    కదిరి పట్టణంలోని జీమాను సర్కిల్లో చేపల మార్కెట్ వద్ద సముద్రపు లో ఉన్న అతిపెద్ద చేపను తెచ్చారు. 70 కేజీలు ఉన్న పెద్ద చేపను  చూడడానికి ప్రజలు ఎగబడ్డారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న ప్రజలను పోలీసులు స్పందించి క్లియర్ చేశారు. చేపలలో ఎన్ని రకాలు ఉన్నాయో ఏవి తినాలో, ఏవి తినకూడదో అర్థం కావడం లేదని చేపలు కొనడానికి వచ్చిన  కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. 70 కేజీలు ఉన్న చేపను మొదటిసారిగా చూస్తున్నామన్నారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    5 hrs ago
  • సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన ఐఎస్ బీ ప్రతినిధులు, వివిధ పారిశ్రామిక వేత్తలు, సదస్సులో ది ఫ్యూచర్ ఆప్ ఎవ్రీతింగ్ అనే అంశంపై అభిప్రాయాలను వెల్లడించనున్న ముఖ్యమంత్రి
    1
    సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన ఐఎస్ బీ ప్రతినిధులు, వివిధ పారిశ్రామిక వేత్తలు, 
సదస్సులో ది ఫ్యూచర్ ఆప్ ఎవ్రీతింగ్ అనే అంశంపై అభిప్రాయాలను వెల్లడించనున్న ముఖ్యమంత్రి
    user_Mallikarjuna Akula
    Mallikarjuna Akula
    Organic farm కర్నూలు అర్బన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • Khan Coaching Centre in Proddatur offers the best coaching for EAPCET, NEET, JEE, POLYCET, ICET, RRB and Inter Foundation. Build strong basics, crack competitive exams and achieve top ranks with expert guidance, daily tests and hostel facility. Join now and secure your future.
    1
    Khan Coaching Centre in Proddatur offers the best coaching for EAPCET, NEET, JEE, POLYCET, ICET, RRB and Inter Foundation. Build strong basics, crack competitive exams and achieve top ranks with expert guidance, daily tests and hostel facility. Join now and secure your future.
    user_Khan Coachingcentre
    Khan Coachingcentre
    Educational institution ప్రొద్దుటూరు, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • ‎ ‎నా కుమారుడు 100 శాతం తప్పు చేయలేదు.. ఏలూరు ఎంపీ తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్. ‎ ‎.. బ్లడ్ శాంపిల్ తీసుకోకుండానే, బ్లడ్ టెస్టు రిపోర్టు ఎలా వచ్చిందో పోలీసులే చెప్పాలి. ‎.. ఇది మమ్మల్ని షాక్ కి, దిగ్భ్రాంతికి గురిచేసింది. ‎.. ఇంటికి వచ్చిన తర్వాత ప్రముఖ ల్యాబుల్లో సొంతంగా టెస్టులు చేయించాము. ‎.. అన్ని రిపోర్టుల్లో నెగెటివ్ గానే వచ్చింది. ‎.. విచారణ కొనసాగుతోంది. నిజాలు త్వరలోనే బయటకు వస్తాయి. ‎.. పార్టీ నుంచి అందిన షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చాము. ‎.. ఎంపీపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలపై స్పందించిన ఏలూరు ఎంపీ తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్. ‎ ‎మైదుకూరు/ఏలూరు, మార్చి 23: ‎తన కుమారుడు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన తండ్రి, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. సోమవారం మైదుకూరులో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ మాట్లాడారు. అనూహ్యంగా తన కుమారుడిపై వచ్చిన ఆరోపణల తాలూకు తీవ్ర దిగ్బ్రాంతి నుంచి తన కుటుంబం ఇంకా తేరుకోలేదన్నారు. తన కుమారుడు 100 శాతం తప్పు చేయలేదన్న సుధాకర్ యాదవ్, డ్రగ్స్ సహా ఎటువంటి దురలవాట్లు తన కుమారుడికి లేవని స్పష్టం చేశారు. ఒక డిన్నర్ పార్టీకి వచ్చిన ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్లిన తన కుమారుడు అక్కడి పరిస్థితి గమనించి బయటకు వచ్చేసే లోపే ఈగల్ టీమ్ పోలీసులు వచ్చి డ్రగ్స్ చెకింగ్ చేయాలని చెప్పి పోలీసుల సమక్షంలోనే యూరిన్ శాంపిల్ తీసుకున్నారని, 10 నిమిషాల తర్వాత పుట్టా మహేష్ కుమార్ కి నెగెటివ్ వచ్చిందని ఐదుగురికి మాత్రం పాజిటివ్ వచ్చిందని చెప్పడం ప్రజలంతా చూసారన్నారు. కొద్దిసేపటి తర్వాత మరోసారి శాంపిల్ తీసుకోవాలని చెబుతూ ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళి మళ్ళీ యూరిన్ శాంపిల్స్ మాత్రమే  తీసుకున్నారన్నారు. శాంపిల్స్ తీసుకున్న ఐదు గంటల తర్వాత ఎస్పీ మీడియా ముందుకు వచ్చి, బ్లడ్ శాంపిల్స్ లో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు పాజిటివ్ వచ్చిందని విచిత్రంగా ప్రకటించడం చూస్తే, దీని వెనుక  కుట్ర కోణం వంటిది ఏదో ఉందని తెలిసిపోతోందన్నారు. బ్లడ్ శాంపిలే తీసుకోకుండా, బ్లడ్ రిపోర్ట్ పాజిటివ్ గా వచ్చిందని ఏవిధంగా నిర్ధారించారో పోలీసులే చెప్పాలన్నారు. మొదటిసారి తీసిన యూరిన్ రిపోర్ట్ 10 నిమిషాల్లోనే బయటపెట్టగా, రెండో సారి తీసుకున్న యూరిన్  శాంపిల్ రిపోర్టు ఐదు గంటల తర్వాత బయటపెట్టడం కూడా అనుమానాస్పదంగా ఉందన్నారు.   ‎     ఈ సందర్బంగా, తన కుమారుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు 2021వ సంవత్సరంలో హార్ట్ సర్జరీ చేసి స్టంట్ వేసిన విషయాన్ని ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ మీడియాకు వివరించారు. ఆ సమయంలో డాక్టర్ హార్ట్ లో కొన్ని వెజల్స్ వీక్ గా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చారు.  హార్ట్ పల్స్ 120 దాటకుండా చూసుకోవాలని, 120 దాటితే ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్ చెప్పారన్నారు. దానిప్రకారంగా ఇప్పటివరకు  ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ, ప్రతి 3 నెలలకోసారి అన్ని ఆరోగ్య టెస్ట్ లు చేసుకుంటూ డాక్టర్స్ సలహాలు, సూచనలు పాటిస్తున్నారన్నారు. వైద్య నిపుణులు ఎవరైనా చెప్పేదాని ప్రకారం డ్రగ్స్ తీసుకుంటే మనిషి హార్ట్ పల్స్ 150 నుండి 180 వరకు కొట్టుకుంటుందని, కానీ పోలీసులు పరీక్షలు చేసినప్పుడు పల్స్ 97 మాత్రమే ఉందన్నారు. డ్రగ్స్ తీసుకుంటే ప్రాణాపాయం అని తెలిసీ తన కుమారుడు డ్రగ్స్ ఏ విధంగా తీసుకుంటాడని సుధాకర్ యాదవ్ ప్రశ్నించారు. పోలీసులు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ ప్రకారం అక్కడ AMPHETAMINE మరియు MATHA AMPHETAMINE  అనే డ్రగ్స్ ఆనవాలు ఉన్నాయని చెప్పారని, హార్ట్, షుగర్ వంటి వాటి కోసం తీసుకునే మందుల వల్ల కూడా అటువంటి రిపోర్టు వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ప్రఖ్యాత Oxford యూనివర్సిటీ వాళ్ళు చేసిన పరిశోధనలో కూడా తేలిన విషయం గమనించాలన్నారు. ‎ ‎పోలీసు విచారణ ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత హైదరాబాద్, ఢిల్లీ లోని ప్రముఖ ల్యాబుల్లో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సొంతంగా యూరిన్, రక్త పరీక్షలు చేయించుకోగా అన్ని రిపోర్టుల్లో "నెగెటివ్" గా తేలిందని సుధాకర్ యాదవ్ స్పష్టం చేశారు. ఢిల్లీలోని ప్రఖ్యాత AIIMS సెంట్రల్ గవర్నమెంట్ ఆస్పత్రిలో కూడా బ్లడ్ టెస్టు చేయించగా 48 గంటల తర్వాత వారు ఇచ్చిన రిపోర్టు చూస్తే డ్రగ్స్ తీసుకోలేదని తేలిందన్నారు. పోలీసు విచారణ జరుగుతున్న సమయంలో తాము మీడియాకు పూర్తి వివరాలు వెల్లడించలేని పరిస్థితి ఉందన్న ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్, త్వరలోనే తన కుమారుడు పుట్టా మహేష్ కుమార్ నిరపరాధిగా నిరూపించుకుని మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలు ఆధారాలతో సహా  వివరంగా చెబుతారన్నారు. పార్టీ అధిష్టానం నుంచి అందిన షోకాజ్ నోటీసుకు ఎంపీ తన వివరణ పంపించారని కూడా సుధాకర్ యాదవ్ తెలిపారు. ‎ ‎ఇట్లు ‎మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ గారి కార్యాలయం. ‎ ‎ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కవర్ చేయవలసిందిగా కోరుచున్నాము.
    1
    ‎
‎నా కుమారుడు 100 శాతం తప్పు చేయలేదు.. ఏలూరు ఎంపీ తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్.
‎
‎.. బ్లడ్ శాంపిల్ తీసుకోకుండానే, బ్లడ్ టెస్టు రిపోర్టు ఎలా వచ్చిందో పోలీసులే చెప్పాలి.
‎.. ఇది మమ్మల్ని షాక్ కి, దిగ్భ్రాంతికి గురిచేసింది.
‎.. ఇంటికి వచ్చిన తర్వాత ప్రముఖ ల్యాబుల్లో సొంతంగా టెస్టులు చేయించాము.
‎.. అన్ని రిపోర్టుల్లో నెగెటివ్ గానే వచ్చింది.
‎.. విచారణ కొనసాగుతోంది. నిజాలు త్వరలోనే బయటకు వస్తాయి.
‎.. పార్టీ నుంచి అందిన షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చాము.
‎.. ఎంపీపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలపై స్పందించిన ఏలూరు ఎంపీ తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్.
‎
‎మైదుకూరు/ఏలూరు, మార్చి 23:
‎తన కుమారుడు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన తండ్రి, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. సోమవారం మైదుకూరులో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ మాట్లాడారు. అనూహ్యంగా తన కుమారుడిపై వచ్చిన ఆరోపణల తాలూకు తీవ్ర దిగ్బ్రాంతి నుంచి తన కుటుంబం ఇంకా తేరుకోలేదన్నారు. తన కుమారుడు 100 శాతం తప్పు చేయలేదన్న సుధాకర్ యాదవ్, డ్రగ్స్ సహా ఎటువంటి దురలవాట్లు తన కుమారుడికి లేవని స్పష్టం చేశారు. ఒక డిన్నర్ పార్టీకి వచ్చిన ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్లిన తన కుమారుడు అక్కడి పరిస్థితి గమనించి బయటకు వచ్చేసే లోపే ఈగల్ టీమ్ పోలీసులు వచ్చి డ్రగ్స్ చెకింగ్ చేయాలని చెప్పి పోలీసుల సమక్షంలోనే యూరిన్ శాంపిల్ తీసుకున్నారని, 10 నిమిషాల తర్వాత పుట్టా మహేష్ కుమార్ కి నెగెటివ్ వచ్చిందని ఐదుగురికి మాత్రం పాజిటివ్ వచ్చిందని చెప్పడం ప్రజలంతా చూసారన్నారు. కొద్దిసేపటి తర్వాత మరోసారి శాంపిల్ తీసుకోవాలని చెబుతూ ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళి మళ్ళీ యూరిన్ శాంపిల్స్ మాత్రమే  తీసుకున్నారన్నారు. శాంపిల్స్ తీసుకున్న ఐదు గంటల తర్వాత ఎస్పీ మీడియా ముందుకు వచ్చి, బ్లడ్ శాంపిల్స్ లో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు పాజిటివ్ వచ్చిందని విచిత్రంగా ప్రకటించడం చూస్తే, దీని వెనుక  కుట్ర కోణం వంటిది ఏదో ఉందని తెలిసిపోతోందన్నారు. బ్లడ్ శాంపిలే తీసుకోకుండా, బ్లడ్ రిపోర్ట్ పాజిటివ్ గా వచ్చిందని ఏవిధంగా నిర్ధారించారో పోలీసులే చెప్పాలన్నారు. మొదటిసారి తీసిన యూరిన్ రిపోర్ట్ 10 నిమిషాల్లోనే బయటపెట్టగా, రెండో సారి తీసుకున్న యూరిన్  శాంపిల్ రిపోర్టు ఐదు గంటల తర్వాత బయటపెట్టడం కూడా అనుమానాస్పదంగా ఉందన్నారు.   
‎     ఈ సందర్బంగా, తన కుమారుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు 2021వ సంవత్సరంలో హార్ట్ సర్జరీ చేసి స్టంట్ వేసిన విషయాన్ని ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ మీడియాకు వివరించారు. ఆ సమయంలో డాక్టర్ హార్ట్ లో కొన్ని వెజల్స్ వీక్ గా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చారు.  హార్ట్ పల్స్ 120 దాటకుండా చూసుకోవాలని, 120 దాటితే ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్ చెప్పారన్నారు. దానిప్రకారంగా ఇప్పటివరకు  ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ, ప్రతి 3 నెలలకోసారి అన్ని ఆరోగ్య టెస్ట్ లు చేసుకుంటూ డాక్టర్స్ సలహాలు, సూచనలు పాటిస్తున్నారన్నారు. వైద్య నిపుణులు ఎవరైనా చెప్పేదాని ప్రకారం డ్రగ్స్ తీసుకుంటే మనిషి హార్ట్ పల్స్ 150 నుండి 180 వరకు కొట్టుకుంటుందని, కానీ పోలీసులు పరీక్షలు చేసినప్పుడు పల్స్ 97 మాత్రమే ఉందన్నారు. డ్రగ్స్ తీసుకుంటే ప్రాణాపాయం అని తెలిసీ తన కుమారుడు డ్రగ్స్ ఏ విధంగా తీసుకుంటాడని సుధాకర్ యాదవ్ ప్రశ్నించారు. పోలీసులు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ ప్రకారం అక్కడ AMPHETAMINE మరియు MATHA AMPHETAMINE  అనే డ్రగ్స్ ఆనవాలు ఉన్నాయని చెప్పారని, హార్ట్, షుగర్ వంటి వాటి కోసం తీసుకునే మందుల వల్ల కూడా అటువంటి రిపోర్టు వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ప్రఖ్యాత Oxford యూనివర్సిటీ వాళ్ళు చేసిన పరిశోధనలో కూడా తేలిన విషయం గమనించాలన్నారు.
‎
‎పోలీసు విచారణ ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత హైదరాబాద్, ఢిల్లీ లోని ప్రముఖ ల్యాబుల్లో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సొంతంగా యూరిన్, రక్త పరీక్షలు చేయించుకోగా అన్ని రిపోర్టుల్లో "నెగెటివ్" గా తేలిందని సుధాకర్ యాదవ్ స్పష్టం చేశారు. ఢిల్లీలోని ప్రఖ్యాత AIIMS సెంట్రల్ గవర్నమెంట్ ఆస్పత్రిలో కూడా బ్లడ్ టెస్టు చేయించగా 48 గంటల తర్వాత వారు ఇచ్చిన రిపోర్టు చూస్తే డ్రగ్స్ తీసుకోలేదని తేలిందన్నారు. పోలీసు విచారణ జరుగుతున్న సమయంలో తాము మీడియాకు పూర్తి వివరాలు వెల్లడించలేని పరిస్థితి ఉందన్న ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్, త్వరలోనే తన కుమారుడు పుట్టా మహేష్ కుమార్ నిరపరాధిగా నిరూపించుకుని మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలు ఆధారాలతో సహా  వివరంగా చెబుతారన్నారు. పార్టీ అధిష్టానం నుంచి అందిన షోకాజ్ నోటీసుకు ఎంపీ తన వివరణ పంపించారని కూడా సుధాకర్ యాదవ్ తెలిపారు.
‎
‎ఇట్లు
‎మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ గారి కార్యాలయం.
‎
‎ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కవర్ చేయవలసిందిగా కోరుచున్నాము.
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • కమిషన్ల చెల్లింపులు జాప్యం జరగడం వల్ల పెట్రోల్ సరఫరాకు అంతరాయం ఏర్పడి గిద్దలూరు పట్టణవాసులు పెట్రోల్ కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. శనివారం పట్టణ పరిసర ప్రాంతాలలో పెట్రోల్ కోసం ప్రజలు భారీగా పెట్రోల్ బంకుల వద్దకు చేరుకొని తమకు కావాల్సిన పెట్రోలు పట్టించుకుంటున్నారు. పట్టణంలో మూడు పెట్రోల్ బంకులు ఉండగా రెండు పెట్రోల్ బంకులలో స్టాక్ బోర్డ్లు వెలిశాయి. దీంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం వల్ల సంక్షోభం ఏమీ లేదని ఆయిల్ నిలవలు పుష్కలంగా ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు.
    1
    కమిషన్ల చెల్లింపులు జాప్యం జరగడం వల్ల పెట్రోల్ సరఫరాకు అంతరాయం ఏర్పడి గిద్దలూరు పట్టణవాసులు పెట్రోల్ కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. శనివారం పట్టణ పరిసర ప్రాంతాలలో పెట్రోల్ కోసం ప్రజలు భారీగా పెట్రోల్ బంకుల వద్దకు చేరుకొని తమకు కావాల్సిన పెట్రోలు పట్టించుకుంటున్నారు. పట్టణంలో మూడు పెట్రోల్ బంకులు ఉండగా రెండు పెట్రోల్ బంకులలో స్టాక్ బోర్డ్లు వెలిశాయి. దీంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం వల్ల సంక్షోభం ఏమీ లేదని ఆయిల్ నిలవలు పుష్కలంగా ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు.
    user_Sasi Kumar reddy
    Sasi Kumar reddy
    గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    11 min ago
  • నంబుల పూలకుంట మండలం లో కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్క జొన్న పంట, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ నష్టపోయిన రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నష్టపోయిన పంటల వివరాలను అంచనా వేయాలని వ్యవసాయ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రభుత్వపరంగా ఆదుకునేందుకు అన్ని విధాలుగా తోడుగా ఉంటానని రైతులకు ఎమ్మెల్యే భరోసాని ఇచ్చారు.
    1
    నంబుల పూలకుంట మండలం లో  కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్క జొన్న పంట, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్  నష్టపోయిన రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నష్టపోయిన పంటల వివరాలను అంచనా వేయాలని వ్యవసాయ  అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు.  ప్రభుత్వపరంగా ఆదుకునేందుకు అన్ని విధాలుగా తోడుగా ఉంటానని రైతులకు ఎమ్మెల్యే భరోసాని ఇచ్చారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.