Shuru
Apke Nagar Ki App…
బైక్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం అయ్యగారిపల్లి లో బైక్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన వేణు ఖమ్మం లో MLT సెకండ్ ఇయర్ చదువుతున్నాడు.కొత్త బైక్ కొని ఇవ్వమని ఇంట్లో అడగగా, తండ్రి కొనివ్వకపోవడం తో మనస్తాపం చెంది ఎలుకల మందు తిన్నాడు.అది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వేణు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు పిర్యాదు మేరకు ముదిగొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ARUNKUMAR
బైక్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం అయ్యగారిపల్లి లో బైక్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన వేణు ఖమ్మం లో MLT సెకండ్ ఇయర్ చదువుతున్నాడు.కొత్త బైక్ కొని ఇవ్వమని ఇంట్లో అడగగా, తండ్రి కొనివ్వకపోవడం తో మనస్తాపం చెంది ఎలుకల మందు తిన్నాడు.అది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వేణు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు పిర్యాదు మేరకు ముదిగొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- కూసుమంచి పోలీసులు అక్రమంగా తరలిస్తున్న 330 కేజీల గంజాయిని పట్టుకున్నారు ఖమ్మం జిల్లా కూసుమంచి పోలీసులు అక్రమంగా తరలిస్తున్న 330 కేజీల గంజాయిని పట్టుకున్నారు.కూసుమంచి పోలీసులు జీళ్ళ చెరువు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదం గా ఉన్న బొలెరో వాహనం తో పాటు కారు ను తనిఖీ చేశారు.వాటిలో ఒడిశా నుంచి కర్ణాటక కు అక్రమంగా తరలిస్తున్న330 కేజీల గంజాయిని పట్టుకుని ఎనిమిది మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు.పట్టుకున్న గంజాయి విలువ కోటీ యాబై లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు.1
- కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం...!! ఈ ప్రజా ప్రభుత్వంలో దొరలు పేదలు ఒకటే బువ్వ తింటున్నారు..!! సన్న బియ్యం ఇదొక సంచల నిర్ణయం...!! జై సోనియమ్మ జై జై రాహుల్ అన్న జయహో రేవంతన్న *కొండా దంపతుల నాయకత్వం వర్ధిల్లాలి..!!* *మీ... సిలివేరు అనిల్* యువజన కాంగ్రెస్ కొండా యువసేన రాష్ట్ర నాయకులు1
- అశ్వారావుపేట బ్లాక్ మనీ మోసం గుట్టు రట్టు.. నిందితుడు అరెస్ట్ అశ్వారావుపేట బ్లాక్ మనీ మోసం గుట్టు రట్టు.. నిందితుడు అరెస్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో బ్లాక్ మనీ పేరుతో అమాయకులను లక్ష్యంగా చేసుకుని కోట్ల ఆశలు చూపిస్తూ భారీ మోసాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రసాయనాలతో నల్లటి కాగితాలను అసలు కరెన్సీ నోట్లుగా మారుస్తామని నమ్మించి లక్షల రూపాయలు కాజేసిన నిందితుడి బండారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. అంతేకాదు, నకిలీ నోట్ల దందా కోసం వాట్సాప్ గ్రూపుల్లో సెల్ఫీ వీడియోలు విడుదల చేసి తనను సంప్రదించాలని ప్రచారం చేసినట్లు కూడా విచారణలో వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు… అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టిపాటి ప్రేమ్‌చందు అనే వ్యక్తి బ్లాక్ మనీ పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడనే ఫిర్యాదు అందడంతో పోలీసులు విచారణ చేపట్టారు.నిందితుడు మొదట రూ.500 అసలు నోటును ప్రత్యేక రసాయన ద్రావణంలో ముంచి, అదే విధంగా నల్లటి కాగితాలను కూడా అసలు నోట్లుగా మార్చవచ్చని బాధితుడిని నమ్మించాడు. ఈ మాయమాటలను నమ్మిన బాధితుడి నుంచి తొలుత రూ.11 లక్షలు, అనంతరం రసాయనాల కొనుగోలు పేరుతో మరో రూ.2 లక్షలు తీసుకుని మొత్తం రూ.13 లక్షలు కాజేసినట్లు పోలీసులు వెల్లడించారు. విచారణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు వాట్సాప్ గ్రూపుల్లో వీడియోలు విడుదల చేస్తూ, “నకిలీ నోట్లు, బ్లాక్ మనీ మార్పిడి” పేరుతో తనను సంప్రదించాలని ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. ఈ ప్రచారాన్ని నమ్మిన పలువురిని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.ఇక నిందితుడిపై గతంలో కూడా నకిలీ కరెన్సీ, మోటార్‌సైకిల్ దొంగతనాలు తదితర కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. బాచుపల్లి, రామచంద్రపురం, కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్లలో కూడా అతనిపై పలు కేసులు ఉన్నట్లు వెల్లడించారు. పోలీసులు నిందితుడి వద్ద నుంచి రూ.500 నోట్ల పరిమాణంలో కట్ చేసిన 20 వేల బ్లాక్ పేపర్లు,నోట్లుగా మారుస్తామని చెప్పేందుకు ఉపయోగించిన రెండు రసాయన ద్రావణాల సీసాలను స్వాధీనం చేసుకున్నారు.నిందితుడిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి, స్వాధీనం చేసుకున్న వస్తువులను సీజ్ చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.బ్లాక్ మనీ, నకిలీ నోట్లు, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని చెప్పే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని పోలీసులు ప్రజలకు హెచ్చరించారు. ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. బైట్: ఆర్. సతీష్ కుమార్, డీఎస్పీ, పాల్వంచ.3
- *బస్సు ఎక్కబోతున్న వ్యక్తిని కాలితో తన్నిన కండక్టర్.. వీడియో వైరల్* _బెంగళూరులో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బస్సు ఎక్కబోతున్న వ్యక్తిని ఓ కండక్టర్ కాలితో తన్ని కిందికి తోసేయడం కలకలం రేపింది._ _ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు వెంటనే స్పందించారు._ _వైరల్ వీడియో ఆధారంగా కండక్టర్ కృష్ణమూర్తిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు._ _కండక్టర్ వాదనతో పాటు అందుబాటులో ఉన్న సాక్ష్యాలను పరిశీలించిన అనంతరం తదుపరి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు._ _ప్రాథమిక సమాచారం ప్రకారం, బాధితుడు భిక్షాటన చేసే వ్యక్తి అని తెలుస్తోంది. అతడిని బస్సు ఎక్కకుండా కాలితో తోసి రోడ్డుపై పడేసి, అక్కడే వదిలేసి బస్సుతో వెళ్లిపోయినట్లు సమాచారం._ _ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు._1