*బస్సు ఎక్కబోతున్న వ్యక్తిని కాలితో తన్నిన కండక్టర్.. వీడియో వైరల్* _బెంగళూరులో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బస్సు ఎక్కబోతున్న వ్యక్తిని ఓ కండక్టర్ కాలితో తన్ని కిందికి తోసేయడం కలకలం రేపింది._ _ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు వెంటనే స్పందించారు._ _వైరల్ వీడియో ఆధారంగా కండక్టర్ కృష్ణమూర్తిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు._ _కండక్టర్ వాదనతో పాటు అందుబాటులో ఉన్న సాక్ష్యాలను పరిశీలించిన అనంతరం తదుపరి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు._ _ప్రాథమిక సమాచారం ప్రకారం, బాధితుడు భిక్షాటన చేసే వ్యక్తి అని తెలుస్తోంది. అతడిని బస్సు ఎక్కకుండా కాలితో తోసి రోడ్డుపై పడేసి, అక్కడే వదిలేసి బస్సుతో వెళ్లిపోయినట్లు సమాచారం._ _ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు._

- బకాయిల కోసం ఎదురుచూపులు.. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి ఆవేదన ఉద్యోగ విరమణ చేసి నాలుగేళ్లు గడిచినా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్లు అందక ఓ రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు పెరుగుతున్న వైద్య ఖర్చులతో జీవితం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఎండీ నజీరుద్దీన్ తనకు రావాల్సిన రూ.19 లక్షల బకాయిలను వెంటనే విడుదల చేసి, తాను బతికుండగానే న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యాన్ని వేడుకుంటున్నారు.1
- పాఠశాల సమస్యలు పరిష్కరించకపోతే విద్యార్థులతో కలిసి ఉద్యమం చేస్తామని పీడీఎస్‌యూ హెచ్చరిక తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్‌లో విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించడం లేదని ఆరోపిస్తూ పీడీఎస్‌యూ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అనంతరం, పాఠశాల సమస్యల పరిష్కారం కోరుతూ మండల విద్యాశాఖ అధికారి రాంబాబుకు వినతిపత్రం అందజేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే విద్యార్థులతో కలిసి ఉద్యమాలు చేపడతామని పీడీఎస్‌యూ హెచ్చరించింది4
- మసాలాలు కల్తీ చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేయడం అభినందనీయం .. కల్తీగాళ్ళ మీద పెట్టే సెక్షన్లు మార్చాలి.. లేదంటే స్టేషన్ బెయిల్ తో బయటికి వచ్చేస్తున్నారు .. కల్తీ చేస్తున్న నేరస్తుల మీద పీడీ యాక్టు పెట్టాలి .. కల్తీ రాయుళ్ల వివరాలు బహిర్గతం చేస్తే ప్రజలు అప్రమత్తం అవుతారు .. కోటి లో డూప్లికేట్ ఎలక్ట్రికల్ వైర్లు, జగదీష్ మార్కెట్ లో డూప్లికేట్ ఫోన్లు అమ్ముతున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలి .. అసెంబ్లీ లో చర్చ చేసి కల్తీ నేరస్తులపై సెక్షన్ల మార్పు జీఓ తేవాలని cm revanthreddy కి విజ్ఞప్తి చేస్తున్నాను.....1
- - శ్రీరాముడు అందరివాడు. మర్యాద పురుషోత్తముడైన ఆయన అందరివాడని సామాజికవేత్త సయ్యద్ హుస్సేనీ చేసిన వ్యాఖ్యలు వైరల్ శ్రీరాముడు ఏ ఒక్కరి సొత్తు కాదని, మర్యాద పురుషోత్తముడైన ఆయన అందరివాడని సామాజికవేత్త సయ్యద్ హుస్సేనీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 'జై శ్రీరామ్' అని తాను కూడా అంటానని చెబుతూ రామరాజ్యంలో మహిళలకు పూర్తి రక్షణ ఉంటుందని రామరాజ్య విశిష్టతలను వివరించారు. 'దేవుళ్లందరూ ఒక్కటే. ముస్లింలు ఉండొద్దని దేవుళ్లు అనుకొని గాలిని ఇవ్వకపోతే చనిపోతాం కదా. దేవుళ్లకు లేని వివక్ష మనకెందుకు' అంటూ చెప్పుకొచ్చారు..🤟🏽1
- Breaking భద్రాద్రి కొత్తగూడెం .....భద్రాచలం వద్ద గోదావరి నది రెండో బ్రిడ్జి పనులు పరిశీలించిన మంత్రి తుమ్మల ...మంత్రి తుమ్మల కామెంట్స్ ........భద్రాచలం రామాలయం దర్శనానికి వచ్చే భక్తులు సౌకర్యం కోసం రెండో బ్రిడ్జి నిర్మాణం .....2015 లో గోదావరి పుష్కరాల సందర్భంగా వచ్చిన లక్షలాది మంది భక్తులకు ఒకే బ్రిడ్జి వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు .....అమరావతి టూ జగధల్ పూర్ జాతీయ రహదారి భద్రాచలం మీదుగా ప్లాన్ చేసి రెండో బ్రిడ్జి నిర్మాణం .....బ్రిడ్జి అప్రోచ్ వరద కోతకు గుర్వకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం ....ఈ నెలలో గోదావరి రెండో బ్రిడ్జి పై రాకపోకలు .....వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అందుబాటులోకి రెండో బ్రిడ్జి .....గత ప్రభుత్వంలో బ్రిడ్జి నిర్మాణం పనులు నత్త నడకన సాగాయి .....ఏపీ చత్తీస్ గడ్ ఒడిషా వయా భద్రాచలం వెళ్ళే ప్రయాణీకులకు రెండో బ్రిడ్జి ఎంతో సౌకర్యంగా మారుతుంది.3
- *బస్సు ఎక్కబోతున్న వ్యక్తిని కాలితో తన్నిన కండక్టర్.. వీడియో వైరల్* _బెంగళూరులో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బస్సు ఎక్కబోతున్న వ్యక్తిని ఓ కండక్టర్ కాలితో తన్ని కిందికి తోసేయడం కలకలం రేపింది._ _ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు వెంటనే స్పందించారు._ _వైరల్ వీడియో ఆధారంగా కండక్టర్ కృష్ణమూర్తిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు._ _కండక్టర్ వాదనతో పాటు అందుబాటులో ఉన్న సాక్ష్యాలను పరిశీలించిన అనంతరం తదుపరి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు._ _ప్రాథమిక సమాచారం ప్రకారం, బాధితుడు భిక్షాటన చేసే వ్యక్తి అని తెలుస్తోంది. అతడిని బస్సు ఎక్కకుండా కాలితో తోసి రోడ్డుపై పడేసి, అక్కడే వదిలేసి బస్సుతో వెళ్లిపోయినట్లు సమాచారం._ _ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు._1