Shuru
Apke Nagar Ki App…
దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ మురళీ నాయక్… ఆయన త్యాగానికి ఇవే మా ఘన నివాళులు… పుట్టపర్తిలో అమర జవాన్ మురళి నాయక్‌కు ఘన నివాళులు అర్పించారు. పుట్టపర్తి పట్టణంలోని శిల్పారామంలో సోమవారం అమర జవాన్ మురళి నాయక్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, అధికారులు, మురళి నాయక్ కుటుంబ సభ్యులతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆగస్టు 10న మురళి నాయక్ జన్మదినం సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. దేశం కోసం మురళి నాయక్ చేసిన త్యాగం, అందించిన సేవలు దేశానికి గర్వకారణమని కలెక్టర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, జవాన్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అమర జవాన్ మురళి నాయక్ త్యాగానికి శతకోటి వందనాలు.
Saddala Adi
దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ మురళీ నాయక్… ఆయన త్యాగానికి ఇవే మా ఘన నివాళులు… పుట్టపర్తిలో అమర జవాన్ మురళి నాయక్‌కు ఘన నివాళులు అర్పించారు. పుట్టపర్తి పట్టణంలోని శిల్పారామంలో సోమవారం అమర జవాన్ మురళి నాయక్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, అధికారులు, మురళి నాయక్ కుటుంబ సభ్యులతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆగస్టు 10న మురళి నాయక్ జన్మదినం సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. దేశం కోసం మురళి నాయక్ చేసిన త్యాగం, అందించిన సేవలు దేశానికి గర్వకారణమని కలెక్టర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, జవాన్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అమర జవాన్ మురళి నాయక్ త్యాగానికి శతకోటి వందనాలు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- మిత్రమా కంపెనీ చాలా జెన్యూన్ గా ఉన్నది ఈ కివార్ కోడ్ స్కాన్ చేసి మీరు ఐడిని రిజిస్టర్ చేసుకోగలరు1
- అప్పనపల్లి పంచాయతీలో రూ.2 కోట్లకు పైగా నిధుల అక్రమాలపై ACB / Vigilance & Enforcement విచారణకు డిమాండ్ 14వ, 15వ ఆర్థిక సంఘం, అమృత్ సరోవర్ నిధుల వినియోగంపై సమగ్ర దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్‌కు వినతి.. ప్రెస్ నోట్ కడప జిల్లా: కాజీపేట మండలం అప్పనపల్లి గ్రామ పంచాయతీలో 2021 నుండి 2025 సంవత్సరం చివరి వరకు 14వ, 15వ ఆర్థిక సంఘం మరియు అమృత్ సరోవర్ పథకం కింద మంజూరైన నిధుల వినియోగంపై తీవ్రమైన ఆర్థిక అక్రమాల ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, ఈ వ్యవహారంపై సాధారణ పంచాయతీరాజ్ శాఖ విచారణకు మాత్రమే పరిమితం కాకుండా ACB / Vigilance & Enforcement ద్వారా స్వతంత్ర సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్‌కు వినతిపత్రం సమర్పించారు.జనతా వారిది కార్యక్రమంలో భాగంగా ఈ వినతిపత్రాన్ని సమర్పించిన వారిలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు మాలకొండయ్య, కాలా వీరబ్రహ్మం, అధ్యక్షుడు పోకల శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.అప్పనపల్లి గ్రామ పంచాయతీలో ప్రభుత్వ నిధుల వినియోగానికి సంబంధించి ప్రాథమికంగా అందుబాటులో ఉన్న సమాచారం, పత్రాలు మరియు ఇతర ఆధారాల ఆధారంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వారు తెలిపారు. ముఖ్యంగా అమృత్ సరోవర్ మరియు ఇతర పంచాయతీ నిధులకు సంబంధించి రూ.2 కోట్లకు పైగా ఆర్థిక అక్రమాలు జరిగి ఉండవచ్చనే ఆరోపణలు ఉన్నాయని, ఇందులో సుమారు రూ.1,43,30,108/- వరకు నిధులు వాస్తవ పనులు లేకుండానే లేదా పనుల వాస్తవికతపై అనుమానాలు ఉన్న పరిస్థితుల్లో డ్రా/వినియోగం చేసినట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. అమృత్ సరోవర్ పనులపై భౌతిక పరిశీలన చేయాలి అమృత్ సరోవర్ పథకం కింద వాస్తవంగా చెరువులు లేదా పనులు లేని ప్రదేశాల్లో పనులు జరిగినట్లు చూపించి నిధులు డ్రా చేశారనే ఆరోపణలు ఉన్నందున, ప్రతి పని ప్రదేశాన్ని అధికారులు భౌతికంగా పరిశీలించి రికార్డుల్లో చూపిన పనులతో వాస్తవ పరిస్థితిని పోల్చి చూడాలని వారు కోరారు.అలాగే Measurement Books (MBs), బిల్లులు, వౌచర్లు, మస్టర్ రోల్స్, జియోట్యాగ్ ఫోటోలు, GPS వివరాలు, పని పూర్తి ధృవీకరణ పత్రాలు, బ్యాంకు లావాదేవీలు తదితర రికార్డులను సమగ్రంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగినట్లు విచారణలో నిర్ధారణ అయితే, బాధ్యుల నుండి ప్రభుత్వ నిధులను పూర్తిగా రికవరీ చేయడంతో పాటు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది, సంబంధిత అధికారులు, సాంకేతిక సిబ్బంది, కాంట్రాక్టర్లు లేదా ఇతరుల పాత్రను గుర్తించి క్రిమినల్, శాఖాపరమైన మరియు ఆర్థిక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఏదైనా విచారణ జరిగి ఉంటే, దానికే పరిమితం కాకుండా ACB / Vigilance & Enforcement ద్వారా స్వతంత్ర పునర్విచారణ చేపట్టాలని కోరారు.విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత అసలు రికార్డులు, కంప్యూటర్ డేటా, డిజిటల్ రికార్డులు మరియు ఇతర ఆధారాలను భద్రపరచాలని కూడా జిల్లా కలెక్టర్‌ను కోరారు.ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై వాస్తవాలు వెలుగులోకి తీసుకువచ్చి, నిధుల రికవరీతో పాటు బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు కోరారు.3
- కడప:🪷 మన డివిజన్ – మన బాధ్యత మీ సమస్య… మా బాధ్యత. 🪷 *8వ రోజు(10/08/2026) సోమవారం* ప్రజల మధ్యే బీజేపీ..🇮🇳 కడప:🪷 మన డివిజన్ – మన బాధ్యత మీ సమస్య… మా బాధ్యత. 🪷 *8వ రోజు(10/08/2026) సోమవారం* ప్రజల మధ్యే బీజేపీ..🇮🇳 *బీజేపీ కడప జిల్లా అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి* గారి సూచనల మేరకు, *జిల్లా ఉపాధ్యక్షులు & 12వ డివిజన్ ఇంచార్జ్ యెర్రు మల్లికార్జున రెడ్డి* గారి ఆధ్వర్యంలో ఈ రోజు అనగా సోమవారం *ఛత్రపతినగర్,శ్రీనగర్ ,మహాలక్ష్మి నగర్, ప్రాంతంలో* ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నాము. *ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో* దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు, స్థానిక సమస్యలను నమోదు చేసి వాటి పరిష్కారం కోసం ప్రజల తరఫున నిరంతరం పోరాడతామని హామీ ఇచ్చాము. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి ప్రజాభిమానికీ మరియు డివిజన్ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.1
- *వై.ఎస్.ఆర్ కడప జిల్లా..* ➡️ సిద్దవటం పోలీస్ స్టేషన్ పరిధిలోని బొగ్గిడివారిపల్లి గ్రామం లో అదృశ్యమైన బాలుడు లివేశ్ రెడ్డి, వయసు 16 నెలలు ను సురక్షితంగా తల్లితండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు *వై.ఎస్.ఆర్ కడప జిల్లా..* ➡️ సిద్దవటం పోలీస్ స్టేషన్ పరిధిలోని బొగ్గిడివారిపల్లి గ్రామం లో అదృశ్యమైన బాలుడు లివేశ్ రెడ్డి, వయసు 16 నెలలు ను సురక్షితంగా తల్లితండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు. ➡️ ఈరోజు, 10 న సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు పోలీసు వారికి సమాచారము అందగా విస్తృతంగా గాలించి సాయంత్రము 4.15 నిమిషాలకు బాలుని గుర్తించి సురక్షితంగా అప్పగించడమైనది. ➡️ జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు ఒంటిమిట్ట సి.ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సర్కిల్ ఎస్.ఐ లు, సిబ్బంది తో విస్తృత గాలింపు చర్యలు.. ➡️ అరటి తోటలో బాలుడిని గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు.. ➡️ పోలీసు శాఖకు కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు.. ➡️ ఒంటిమిట్ట సి.ఐ ఆధ్వర్యంలోని ఎస్.ఐ లు, సిబ్బంది ని అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు1
- బద్వేలులో డీఎస్సీలో అవకతవకలపై ర్యాలీ.. జిల్లా అధ్యక్షులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి , ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి , ఎమ్మెల్యే డాక్టర్ సుధ , బద్వేలు,ఆగస్టు 10: వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో డీఎస్సీ మీద ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో బద్వేలులో మొదటగా పట్టణంలో నీ సిద్ధవటం రోడ్డులో గల దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. బద్వేలు పట్టణంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర విద్యార్థి విభాగ ప్రధాన కార్యదర్శి ఆదిత్య రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి , ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి , ఎమ్మెల్యే డాక్టర్ సుధ , నియోజవర్గం లోని నలుమూలలు నుంచి వచ్చిన అగ్రశ్రేణి వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరూ ర్యాలీ కార్యక్రమాన్ని భగ్నం చేయాలని కంకణం కట్టుకొని అధికార మదంతో పోలీసులు అడ్డం పెట్టుకొని అణిచివేతకు గురి చేశారు, ఏమైనాప్పటికీ వైఎస్ఆర్సిపి శ్రేణులు బద్వేల్ పట్టణంలో తమ నిరసనను ప్రభుత్వం మీద వ్యతిరేకతను డీఎస్సీ లో జరిగిన మోసాన్ని ఎండ కట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి వైయస్సార్ కడప జిల్లా వైసీపీ కడప జిల్లా ఎస్సిసి అధ్యక్షుడు సింగమాల వెంకటేశ్వర్లు, పుల్లయ్య నియోజకవర్గం లోని అన్ని మండలాల వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.4
- పులివెందులలో వైసీపీ నాయకులు కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్ పులివెందులలో వైసీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. డీఎస్సీ అంశంపై నిరసన కార్యక్రమంలో సోమవారం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందించేందుకు ఎంపీ అవినాశ్ రెడ్డి, సతీశ్ రెడ్డి వైసీపీ శ్రేణులతో వెళ్లారు. కార్యాలయ గేట్లు వేసి పోలీసులు అడ్డుకోవడంతో కార్యకర్తలు లోపలకు వెళ్లేందుకు ఒక్కసారిగా ప్రయత్నించారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు.1