logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతి తీరని లోటని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న ఆయన, మంగళవారం సాయంత్రం కన్నుమూశారని ఎంపీ తెలిపారు. కాపు ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం సాగించిన పోరాటాలు ఎన్నటికీ మరువలేనివని వైఎస్ అవినాష్ రెడ్డి కొనియాడారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు ఎంపీ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

on 15 July
user_K. Ravi Sekhar
K. Ravi Sekhar
పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
on 15 July
9d49c624-70d6-47d1-887a-e0be634cdcbe

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతి తీరని లోటని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న ఆయన, మంగళవారం సాయంత్రం కన్నుమూశారని ఎంపీ తెలిపారు. కాపు ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం సాగించిన పోరాటాలు ఎన్నటికీ మరువలేనివని వైఎస్ అవినాష్ రెడ్డి కొనియాడారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు ఎంపీ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ప్రభుత్వ పాఠశాలలు వెలవెల.. ప్రైవేట్ పాఠశాలలు కళకళ: తులసిరెడ్డి కూటమి ప్రభుత్వంలో బడులు వెలవెలబోతున్నాయి.ప్రైవేట్ బడులు కళకళలాడుతున్నాయని మాజీ ఎంపీ తులసిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వేంపల్లి లో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర విద్యాశాఖ నివేదిక ప్రకారం 2023–24లో ఉన్న 45,991 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు 2025-26 నాటికి 45,019కు తగ్గి 972 పాఠశాలలు మూతపడ్డాయన్నారు. ప్రభుత్వ బడులలో విద్యార్థుల సంఖ్య రూ.5.86 లక్షలు తగ్గగా.. ప్రైవేట్ పాఠశాలల్లో రూ.2.86 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు.
    1
    ప్రభుత్వ పాఠశాలలు వెలవెల.. ప్రైవేట్ పాఠశాలలు కళకళ: తులసిరెడ్డి
కూటమి ప్రభుత్వంలో బడులు వెలవెలబోతున్నాయి.ప్రైవేట్ బడులు కళకళలాడుతున్నాయని మాజీ ఎంపీ
తులసిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వేంపల్లి లో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర విద్యాశాఖ నివేదిక ప్రకారం 2023–24లో ఉన్న 45,991 ప్రభుత్వ, ఎయిడెడ్
పాఠశాలలు 2025-26 నాటికి 45,019కు తగ్గి 972 పాఠశాలలు మూతపడ్డాయన్నారు. ప్రభుత్వ బడులలో
విద్యార్థుల సంఖ్య రూ.5.86 లక్షలు తగ్గగా.. ప్రైవేట్ పాఠశాలల్లో రూ.2.86 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • లెన్స్‌కార్ట్ షోరూమ్‌కు వ్యతిరేకంగా స్థానిక ఆప్టికల్ వ్యాపారులు, ఉద్యోగులునిరసన శ్రీ సత్యసాయి జిల్లా,ధర్మవరం పుట్టపర్తి రోడ్డులో ఏర్పాటు లెన్స్‌కార్ట్ షోరూమ్‌కు వ్యతిరేకంగా స్థానిక ఆప్టికల్ వ్యాపారులు, ఉద్యోగులునిరసన చేస్తున్న శాంతియుతంగా నిరసన చేపట్టారు. స్థానికంగా సుమారు 200 కుటుంబాల జీవనోపాధిని కాపాడాలని డిమాండ్ చేశారు. షోరూమ్‌కు సంబంధించిన భవన నిర్మాణ అనుమతులు, ట్రేడ్ లైసెన్స్, ఫైర్ సేఫ్టీ, టౌన్ ప్లానింగ్ తదితర చట్టబద్ధ అనుమతులపై సమగ్ర విచారణ జరిపి ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని కోరారు. ఈ అంశంపై మున్సిపల్ కమిషనర్, ఆర్‌డీఓ, జిల్లా కలెక్టర్‌కు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఇప్పటివరకు స్పష్టమైన స్పందన లేకపోవడం ప్రజల్లో పలు అనుమానాలకు తావిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ప్రజల ఓట్లతో గెలిచిన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ స్థానిక చిన్న వ్యాపారులు, ఉద్యోగుల సమస్యలపై వెంటనే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. స్థానికుల సమస్యలపై స్పందన లేకపోవడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని, అలాగే చిరు వ్యాపారస్తులు స్థానిక వ్యాపారాల ఉనికి కనుమరుగయ్యే పరిస్థితి ఎదురవుతున్న కూడా స్థానిక మంత్రిగారు స్పందించకపోవడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు. చట్టం ముందు అందరూ సమానమే. స్థానిక ఉపాధిని కాపాడండి... చట్టబద్ధ అనుమతులపై పారదర్శక విచారణ జరపండి.
    1
    లెన్స్‌కార్ట్ షోరూమ్‌కు వ్యతిరేకంగా స్థానిక ఆప్టికల్ వ్యాపారులు, ఉద్యోగులునిరసన 
శ్రీ సత్యసాయి జిల్లా,ధర్మవరం పుట్టపర్తి రోడ్డులో ఏర్పాటు లెన్స్‌కార్ట్ షోరూమ్‌కు వ్యతిరేకంగా స్థానిక ఆప్టికల్ వ్యాపారులు, ఉద్యోగులునిరసన చేస్తున్న  శాంతియుతంగా నిరసన చేపట్టారు. స్థానికంగా సుమారు 200 కుటుంబాల జీవనోపాధిని కాపాడాలని డిమాండ్ చేశారు.
షోరూమ్‌కు సంబంధించిన భవన నిర్మాణ అనుమతులు, ట్రేడ్ లైసెన్స్, ఫైర్ సేఫ్టీ, టౌన్ ప్లానింగ్ తదితర చట్టబద్ధ అనుమతులపై సమగ్ర విచారణ జరిపి ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని కోరారు. ఈ అంశంపై మున్సిపల్ కమిషనర్, ఆర్‌డీఓ, జిల్లా కలెక్టర్‌కు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఇప్పటివరకు స్పష్టమైన స్పందన లేకపోవడం ప్రజల్లో పలు అనుమానాలకు తావిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
అలాగే ప్రజల ఓట్లతో గెలిచిన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ స్థానిక చిన్న వ్యాపారులు, ఉద్యోగుల సమస్యలపై వెంటనే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. స్థానికుల సమస్యలపై స్పందన లేకపోవడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని, అలాగే చిరు వ్యాపారస్తులు స్థానిక వ్యాపారాల ఉనికి కనుమరుగయ్యే పరిస్థితి ఎదురవుతున్న కూడా స్థానిక మంత్రిగారు స్పందించకపోవడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు.
చట్టం ముందు అందరూ సమానమే. స్థానిక ఉపాధిని కాపాడండి... చట్టబద్ధ అనుమతులపై పారదర్శక విచారణ జరపండి.
    user_Saddala Adi
    Saddala Adi
    ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • కడప జిల్లా. నందలూరు. తిరుమల తిరుపతి (టీటీడీ) దేవస్థానం ఆధ్వర్యంలో.... 🙏 తిరుమల వేద పండితులచే అంగరంగ వైభోవంగా శ్రీదేవి భూదేవి శ్రీ సోమ్యనాధ స్వామి కళ్యాణోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న స్వామి వారి భక్తులు. కడప జిల్లా ఏ స్పీ నచికేత్ విశ్వనాధ్ ఐపీస్, ఆదేశాలు మేరకు ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ ) పి. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్వామి వారి కళ్యాణత్సవం లో భక్తులకు మరియు ట్రాఫిక్ ఎలాంటి అవంచానియాలు జరగకుండా, రెండు డ్రోన్లు తో, 150 మంది పోలీస్ బందోదొబస్తుని ఏర్పాట్లు చేసి స్వామి వారి కల్యాణన్ని విజయవంతం చేసేరు. స్వామి వారి కల్యాణనికి.... NDA కూటమి పార్టీ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి,, సాయి లోకేష్,, తదితరులు మరియు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. మి.... కొర్రపాటి నాగరాజ ఆచార్య, సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్. కడప జిల్లా. నందలూరు. తిరుమల తిరుపతి (టీటీడీ) దేవస్థానం ఆధ్వర్యంలో.... 🙏 తిరుమల వేద పండితులచే అంగరంగ వైభోవంగా శ్రీదేవి భూదేవి శ్రీ సోమ్యనాధ స్వామి కళ్యాణోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న స్వామి వారి భక్తులు. కడప జిల్లా ఏ స్పీ నచికేత్ విశ్వనాధ్ ఐపీస్, ఆదేశాలు మేరకు ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ ) పి. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్వామి వారి కళ్యాణత్సవం లో భక్తులకు మరియు ట్రాఫిక్ ఎలాంటి అవంచానియాలు జరగకుండా, రెండు డ్రోన్లు తో, 150 మంది పోలీస్ బందోదొబస్తుని ఏర్పాట్లు చేసి స్వామి వారి కల్యాణన్ని విజయవంతం చేసేరు. స్వామి వారి కల్యాణనికి.... NDA కూటమి పార్టీ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి,, సాయి లోకేష్,, తదితరులు మరియు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. మి.... కొర్రపాటి నాగరాజ ఆచార్య, సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్.
    1
    కడప జిల్లా.
నందలూరు.

తిరుమల తిరుపతి (టీటీడీ) దేవస్థానం ఆధ్వర్యంలో....  🙏

తిరుమల వేద పండితులచే అంగరంగ వైభోవంగా  శ్రీదేవి భూదేవి శ్రీ సోమ్యనాధ స్వామి కళ్యాణోత్సవం.

అధిక సంఖ్యలో పాల్గొన్న స్వామి వారి భక్తులు.

కడప జిల్లా ఏ స్పీ నచికేత్ విశ్వనాధ్ ఐపీస్, ఆదేశాలు మేరకు ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ ) పి. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్వామి వారి కళ్యాణత్సవం లో భక్తులకు మరియు ట్రాఫిక్ ఎలాంటి అవంచానియాలు జరగకుండా, రెండు డ్రోన్లు తో, 150 మంది  పోలీస్ బందోదొబస్తుని ఏర్పాట్లు చేసి స్వామి వారి కల్యాణన్ని విజయవంతం చేసేరు.

స్వామి వారి కల్యాణనికి.... NDA కూటమి పార్టీ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి,, సాయి లోకేష్,, తదితరులు మరియు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

మి....
కొర్రపాటి నాగరాజ ఆచార్య, సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్.
కడప జిల్లా.
నందలూరు.
తిరుమల తిరుపతి (టీటీడీ) దేవస్థానం ఆధ్వర్యంలో....  🙏
తిరుమల వేద పండితులచే అంగరంగ వైభోవంగా  శ్రీదేవి భూదేవి శ్రీ సోమ్యనాధ స్వామి కళ్యాణోత్సవం.
అధిక సంఖ్యలో పాల్గొన్న స్వామి వారి భక్తులు.
కడప జిల్లా ఏ స్పీ నచికేత్ విశ్వనాధ్ ఐపీస్, ఆదేశాలు మేరకు ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ ) పి. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్వామి వారి కళ్యాణత్సవం లో భక్తులకు మరియు ట్రాఫిక్ ఎలాంటి అవంచానియాలు జరగకుండా, రెండు డ్రోన్లు తో, 150 మంది  పోలీస్ బందోదొబస్తుని ఏర్పాట్లు చేసి స్వామి వారి కల్యాణన్ని విజయవంతం చేసేరు.
స్వామి వారి కల్యాణనికి.... NDA కూటమి పార్టీ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి,, సాయి లోకేష్,, తదితరులు మరియు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
మి....
కొర్రపాటి నాగరాజ ఆచార్య, సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్.
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • సికె పల్లి మండలంలోని మేడాపురం గ్రామంలో గ్రామ దేవత పెద్దమ్మ తల్లి బోనాల కార్యక్రమం సందర్భంగా ఘనంగా పలకల కోలాటం సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం సికేపల్లి మండలంలోని మేడాపురం గ్రామంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గ్రామ దేవత పెద్దమ్మ తల్లికి బోనాల కార్యక్రమం సందర్భంగా పలకల కోలాటం అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు
    1
    సికె పల్లి మండలంలోని మేడాపురం గ్రామంలో గ్రామ దేవత పెద్దమ్మ తల్లి బోనాల కార్యక్రమం సందర్భంగా  ఘనంగా పలకల కోలాటం 
సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం సికేపల్లి మండలంలోని మేడాపురం గ్రామంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో  గ్రామ దేవత పెద్దమ్మ తల్లికి బోనాల కార్యక్రమం సందర్భంగా పలకల కోలాటం అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు
    user_పుట్టపర్తి మల్లికార్జున
    పుట్టపర్తి మల్లికార్జున
    చెన్నెకొత్తపల్లె, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • అందుబాటులోకి స్మార్ట్ కిచెన్ సెంటర్ పంచాయతీరాజ్ ఎస్ఈ మద్దన్న సిద్దవటం స్మార్ట్ కిచెన్ సెంటర్ ను మరో 10 రోజుల్లో అందుబాటులోకి తెస్తామని పంచాయతీరాజ్ ఎస్ఈ మద్దన్న తెలిపారు. సిద్దవటంలోని స్మార్ట్ కిచెన్ సెంటర్ ను మంగళవారం పంచాయతీరాజ్ ఎస్ఈ మద్దన్న పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చిన్న, చిన్న పెండింగ్ పనులను పూర్తి చేసి 10 రోజుల్లోగా కిచెన్ సెంటర్ ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. స్మార్ట్ కిచెన్ సెంటర్ లో అవసరమైన చోట్ల 15 ఇంచుల ఎక్జాస్ట్ ఫ్యాన్ బిగించాలని ఆదేశించామన్నారు. ఇంటర్నల్ డ్రైన్, వంట పరికరాలు, ఆర్ఓ ఫ్లాంటును పరిశీలించడం జరిగిందన్నారు. టెక్నీషియన్ వచ్చి స్మార్ట్ కిచెన్ సెంటర్ లో వంట పరికరాలు బిగిస్తే పనులు పూర్తి అవుతాయన్నారు. ఎల్ఈడి లైట్లు, పైపులను సక్రమంగా అమర్చాలని అధికారులు తనిఖీ చేసినప్పుడు చెడ్డపేరు వస్తుందని సిబ్బందికి సూచించామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఇంజనీర్ నాగరాజు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ శ్రీకర్, సైట్ ఇంజనీర్ తదితరులు పాల్గొన్నారు.
    1
    అందుబాటులోకి స్మార్ట్ కిచెన్ సెంటర్

పంచాయతీరాజ్ ఎస్ఈ మద్దన్న
సిద్దవటం స్మార్ట్ కిచెన్ సెంటర్ ను మరో 10 రోజుల్లో అందుబాటులోకి తెస్తామని పంచాయతీరాజ్ ఎస్ఈ మద్దన్న తెలిపారు. సిద్దవటంలోని స్మార్ట్ కిచెన్ సెంటర్ ను మంగళవారం పంచాయతీరాజ్ ఎస్ఈ మద్దన్న పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చిన్న, చిన్న పెండింగ్ పనులను పూర్తి చేసి 10 రోజుల్లోగా కిచెన్ సెంటర్ ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. స్మార్ట్ కిచెన్ సెంటర్ లో అవసరమైన చోట్ల 15 ఇంచుల ఎక్జాస్ట్ ఫ్యాన్ బిగించాలని ఆదేశించామన్నారు. ఇంటర్నల్ డ్రైన్, వంట పరికరాలు, ఆర్ఓ ఫ్లాంటును పరిశీలించడం జరిగిందన్నారు. టెక్నీషియన్ వచ్చి స్మార్ట్ కిచెన్ సెంటర్ లో వంట పరికరాలు బిగిస్తే పనులు పూర్తి అవుతాయన్నారు. ఎల్ఈడి లైట్లు, పైపులను సక్రమంగా అమర్చాలని అధికారులు తనిఖీ చేసినప్పుడు చెడ్డపేరు వస్తుందని సిబ్బందికి సూచించామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఇంజనీర్ నాగరాజు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ శ్రీకర్, సైట్ ఇంజనీర్ తదితరులు పాల్గొన్నారు.
    user_Patan Kwajamainuddin
    Patan Kwajamainuddin
    Local News Reporter సిధౌట్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగాల రెగ్యులరైజేషన్ కోసం జూలై 30 చలో కలెక్టరేట్ జయప్రదం చేయండి. బద్వేలు,జూలై 28 :స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం నందు బద్వేల్ మున్సిపల్ వర్కర్స్,ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఉద్యోగ- కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న చలో కలెక్టరేట్ ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని కార్మికులతో గేట్ మీటింగ్ నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు కాలువ నాగేంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, షెడ్యూల్ ఎంప్లాయిమెంట్ పరిశ్రమలలో పనిచేస్తున్న లక్షలాదిమంది కాంట్రాక్టు- ఔట్సోర్సింగ్ కార్మికులకు సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, శాశ్వత స్వభావం గల విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, ప్రైవేటీకరణ విధానాలను విరమించుకోవాలని, కార్మిక చట్టాల మార్పును ఉపసంహరించుకోవాలని, కార్మికుల సంఖ్యను పెంచాలని, చనిపోయిన కార్మికుల కుటుంబాలలో ఒకరికి ఉపాధి అవకాశం కల్పించాలని, పనిముట్లు రక్షణ పరికరాలు అందించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా జూలై 30వ తేదీ నాడు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద జరుగుతున్న ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు నాగరపు సత్యరాజు, ఉపాధ్యక్షురాలు దియ్యాల దేవమ్మ, కమిటీ సభ్యులు ఇండ్ల చంద్రశేఖర్ పలువురు కార్మికులు పాల్గొన్నారు.
    1
    సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగాల రెగ్యులరైజేషన్ కోసం జూలై 30 చలో కలెక్టరేట్ జయప్రదం చేయండి.
బద్వేలు,జూలై 28 :స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం నందు బద్వేల్ మున్సిపల్ వర్కర్స్,ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఉద్యోగ- కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న చలో కలెక్టరేట్ ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని కార్మికులతో గేట్ మీటింగ్ నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు కాలువ నాగేంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, షెడ్యూల్ ఎంప్లాయిమెంట్ పరిశ్రమలలో పనిచేస్తున్న లక్షలాదిమంది కాంట్రాక్టు- ఔట్సోర్సింగ్ కార్మికులకు సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, శాశ్వత స్వభావం గల విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, ప్రైవేటీకరణ విధానాలను విరమించుకోవాలని, కార్మిక చట్టాల మార్పును ఉపసంహరించుకోవాలని, కార్మికుల సంఖ్యను పెంచాలని, చనిపోయిన కార్మికుల కుటుంబాలలో ఒకరికి ఉపాధి అవకాశం కల్పించాలని, పనిముట్లు రక్షణ పరికరాలు అందించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా జూలై 30వ తేదీ నాడు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద జరుగుతున్న ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు నాగరపు సత్యరాజు, ఉపాధ్యక్షురాలు దియ్యాల దేవమ్మ, కమిటీ సభ్యులు ఇండ్ల చంద్రశేఖర్ పలువురు కార్మికులు పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • అన్నమయ్య జిల్లాలోని పలు దేవాలయాలలో వరుస విగ్రహాల చోరీ కేసును ఛేదించిన పుంగనూరు పోలీసులు. అన్నమయ్య జిల్లా: పుంగనూరు: అన్నమయ్య జిల్లాలోని పలు దేవాలయాలలో వరుస విగ్రహాల చోరీ కేసును ఛేదించిన పుంగనూరు పోలీసులు. పుంగునూరు టౌన్ శ్రీకృష్ణదేవరాయలు క్రాస్ వద్ద వాహనాల తనిఖీలలో పట్టుబడిన నిందితుడు. దేవాలయాలలో దొంగలించిన విగ్రహాలను విక్రయానికి తీసుకు వెళుతుండగా పట్టుకున్న పోలీసులు. నిందితుడు మదనపల్లికి చెందిన యలకపల్లి ప్రభాకర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. పంచలోహ విగ్రహాలు, ఇత్తడి హంస జ్యోతులు, కంచు గంటలు స్వాధీనం. పుంగనూరు పరిధిలోని సోమల,చౌడేపల్లి, సదుం, నిమ్మనపల్లి ప్రాంతాలలో చోరీలకు పాల్పడిన నిందితుడు. చోరీకి ఉపయోగించిన ఆటోను సీజ్ చేసి నిందితుడిని రిమాండ్ కు తరలించినన పోలీసులు. కేసును ఛేదించిన పుంగనూరు అర్బన్ పోలీసులను జిల్లా పోలీసు అధికారులు అభినందించారు.
    4
    అన్నమయ్య జిల్లాలోని పలు దేవాలయాలలో వరుస విగ్రహాల చోరీ కేసును ఛేదించిన పుంగనూరు పోలీసులు.
అన్నమయ్య జిల్లా: పుంగనూరు:
అన్నమయ్య జిల్లాలోని పలు దేవాలయాలలో వరుస విగ్రహాల చోరీ కేసును ఛేదించిన పుంగనూరు పోలీసులు.
పుంగునూరు టౌన్ శ్రీకృష్ణదేవరాయలు క్రాస్ వద్ద వాహనాల తనిఖీలలో పట్టుబడిన నిందితుడు.
దేవాలయాలలో దొంగలించిన విగ్రహాలను విక్రయానికి తీసుకు వెళుతుండగా పట్టుకున్న పోలీసులు.
నిందితుడు మదనపల్లికి చెందిన యలకపల్లి ప్రభాకర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
పంచలోహ విగ్రహాలు, ఇత్తడి హంస జ్యోతులు, కంచు గంటలు స్వాధీనం.
పుంగనూరు పరిధిలోని సోమల,చౌడేపల్లి, సదుం, నిమ్మనపల్లి ప్రాంతాలలో చోరీలకు పాల్పడిన నిందితుడు.
చోరీకి ఉపయోగించిన ఆటోను సీజ్ చేసి నిందితుడిని రిమాండ్ కు తరలించినన పోలీసులు.
కేసును ఛేదించిన పుంగనూరు అర్బన్ పోలీసులను జిల్లా పోలీసు అధికారులు అభినందించారు.
    user_Maheshbabu Kadiyala
    Maheshbabu Kadiyala
    Madanapalle, Annamayya•
    7 hrs ago
  • యర్రగుంట్ల హత్య కేసుపై వివరణ ఇచ్చిన సీఐ విశ్వనాథ్ రెడ్డి ఎర్రగుంట్లలో ఇటీవల జరిగిన హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ విశ్వనాథ్ రెడ్డి తెలిపారు. ఈ నెల 11న నడిఊరులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిని వీరాంజనేయులు ప్రశ్నించగా ఘర్షణ చోటుచేసుకుంది. నిందితులు కత్తితో దాడి చేయడంతో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. కేసు దర్యాప్తులో ప్రధాన నిందితుడు మేకగురు సాయి అలియాస్ శంకర్తోపాటు ఓ బాలుడిని అరెస్ట్ చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నారని తెలిపారు.
    1
    యర్రగుంట్ల హత్య కేసుపై వివరణ ఇచ్చిన సీఐ విశ్వనాథ్ రెడ్డి 
ఎర్రగుంట్లలో ఇటీవల జరిగిన హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ విశ్వనాథ్ రెడ్డి తెలిపారు. ఈ నెల 11న నడిఊరులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిని వీరాంజనేయులు ప్రశ్నించగా ఘర్షణ చోటుచేసుకుంది.
నిందితులు కత్తితో దాడి చేయడంతో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. కేసు దర్యాప్తులో ప్రధాన నిందితుడు మేకగురు సాయి అలియాస్ శంకర్తోపాటు
ఓ బాలుడిని అరెస్ట్ చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నారని తెలిపారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.