ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ. 4 లక్షల ఎల్.ఓ.సీ. అందజేత ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ బాల్కొండ నియోజకవర్గ నాయకులు ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన యెలుమల శంకర్ అనే వ్యక్తికి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన రూ. 4 లక్షల విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (LOC)ను సోమవారం అందజేశారు. పాలెం గ్రామానికి చెందిన యెలుమల శంకర్ గతంలో గుండెపోటుకు గురవ్వడంతో హైదరాబాద్‌లోని నిమ్స్ (NIMS) ఆస్పత్రిలో చేరారు. పరీక్షించిన వైద్యులు ఆయనకు గుండెలో మరో బ్లాక్ ఉందని, వెంటనే స్టంట్ వేయాలని సూచించారు. ఇందుకు సుమారు రూ. 4 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. శంకర్ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటంతో, అంత పెద్ద మొత్తాన్ని భరించే స్తోమత లేక ఆ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది. కుటుంబ సభ్యులు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముత్యాల సునీల్ కుమార్ రెడ్డిని కలిసి తమ పరిస్థితిని వివరించారు. తక్షణమే స్పందించిన ఆయన, ప్రభుత్వంతో మాట్లాడి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ. 4 లక్షల ఎల్.ఓ.సీ. మంజూరు చేయించారు. ఈ ఎల్‌ఓసీ పత్రాలను శంకర్ కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. తమ కష్టకాలంలో స్పందించి, వైద్య ఖర్చుల నిమిత్తం భారీ ఆర్థిక సాయం అందేలా కృషి చేసిన ముత్యాల సునీల్ కుమార్ రెడ్డికి శంకర్ కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ. 4 లక్షల ఎల్.ఓ.సీ. అందజేత ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ బాల్కొండ నియోజకవర్గ నాయకులు ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన యెలుమల శంకర్ అనే వ్యక్తికి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన రూ. 4 లక్షల విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (LOC)ను సోమవారం అందజేశారు. పాలెం గ్రామానికి చెందిన యెలుమల శంకర్ గతంలో గుండెపోటుకు గురవ్వడంతో హైదరాబాద్‌లోని నిమ్స్ (NIMS) ఆస్పత్రిలో చేరారు. పరీక్షించిన వైద్యులు ఆయనకు గుండెలో మరో బ్లాక్ ఉందని, వెంటనే స్టంట్ వేయాలని సూచించారు. ఇందుకు సుమారు రూ. 4 లక్షల
వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. శంకర్ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటంతో, అంత పెద్ద మొత్తాన్ని భరించే స్తోమత లేక ఆ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది. కుటుంబ సభ్యులు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముత్యాల సునీల్ కుమార్ రెడ్డిని కలిసి తమ పరిస్థితిని వివరించారు. తక్షణమే స్పందించిన ఆయన, ప్రభుత్వంతో మాట్లాడి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ. 4 లక్షల ఎల్.ఓ.సీ. మంజూరు చేయించారు. ఈ ఎల్‌ఓసీ పత్రాలను శంకర్ కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. తమ కష్టకాలంలో స్పందించి, వైద్య ఖర్చుల నిమిత్తం భారీ ఆర్థిక సాయం అందేలా కృషి చేసిన ముత్యాల సునీల్ కుమార్ రెడ్డికి శంకర్ కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
- మెట్‌పల్లి మార్చి 30: పట్టణంలోని 26వ వార్డులో భద్రతను బలోపేతం చేసే దిశగా బీజేపీ 26వ వార్డు కౌన్సిలర్, పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్ ఆధ్వర్యంలో ప్రతి వీధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీఎస్పీ రాములు, మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, సీఐ అనిల్, ఎస్సై కిరణ్, వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్ హాజరై సీసీ కెమెరాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడిన డీఎస్పీ రాములు, మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి మాట్లాడుతూ, ఈ సీసీ కెమెరాలు ప్రజలకు అన్నివేళలా నిఘా నేత్రాలుగా పనిచేస్తాయని తెలిపారు. వీటి ద్వారా చైన్ స్నాచింగ్, ఈవ్ టీజింగ్, దొంగతనాల వంటి ఘటనలను త్వరగా గుర్తించి నిందితులను పట్టుకోవడం పోలీసులకు సులభమవుతుందని వివరించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బొడ్ల ఆనంద్, ధర్మపురి స్వరూప, వేణు, నాయకులు బొడ్ల రాహుల్, సుంకేటి విజయ్, సతీష్, బొడ్ల గౌతం, అజిత్, సంజీవ్, అంజయ్య, జెట్టి రూపేష్, శ్రీకాంత్, లత, లక్ష్మి, రాజు, భాయ్, హరితతో పాటు వార్డు ప్రజలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.3
- జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో అర్ధరాత్రి భారీ వర్షం దంచికొట్టింది. సోమవారం అర్ధరాత్రి ఒంటిగంటకు జన్నారం, పలు గ్రామాలలో ఆకాశం పూర్తిగా మేఘావతమైంది. ఉరుములు, మెరుపులు భారీ ఈదురుగాళ్లతో వర్షం పడుతోంది. దీంతో చాలా గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సుమారు అరగంటకు పైగా భారీ ఈదురుగాలులతో వర్షం పడినట్టు సమాచారం అందుతుంది..మామిడి తోటల్లో మామిడి కాయలు రాలిపోయాయి. నష్టం వివరాలు ఇంకా అందాల్సి ఉంది.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ రైతు కార్యదర్శి జంగం అంజయ్య విద్యుత్ షాక్ తో మృతి. వెంకట్రాయుని చెరువు సమీపంలో పంట పొలం వద్ద ఘటన.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.3
- మెదక్ మున్సిపల్ బడ్జెట్ సమావేశాన్న మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతి రాజ్ అధ్యక్షతన జరిగింది సమావేశంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై అధికారుల తీరును కౌన్సిలర్ ఆంజనేయులు విమర్శించారు ఈ సమావేశంలో కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ డి ఈ మహేష్ ఏఈ అధికారులుకౌషన్సిలర్లు తధితరులు పాల్గొన్నారు1
- ఆదివారం రోజున కౌడిపల్లి సర్పంచ్ ఆధ్వర్యంలో. శ్రీ సీతారాములవారి పల్లకి సేవలను నిర్వహించడం జరిగింది. గ్రామ ప్రజలు అందరూ కలిసి శ్రీ సీతారాములవారి పల్లకినీ గ్రామంలో ఆటపాటలతో, వివిధ రకాల వేషధారణలతో శ్రీరామ భజన చేస్తూ కనుల పండుగగ నిర్వహించినరూ. ఇలాంటి వేడుకలను నిర్వహించినందుకు గ్రామ ప్రజలు గ్రామ సర్పంచ్ కు అభినందనలు తెలిపారు. ఇందులో భాగంగా గ్రామ సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్ గారు, ఉపసర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్ గారు, వాడు సభ్యులు మబ్బులు ,మురళి, దేవేందర్ ,రమేష్, మరియు గ్రామ పెద్దలు చంద్రం , మల్లేష్ ,దుర్గయ్య గౌడ్ ,టీ మల్లేష్, శ్రీనివాస్ గుప్తా, ఉడుత కృష్ణ తదితరులు పాల్గొన్నారు.4
- రాబోయే రోజుల్లో కరువు దుర్భిక్షాన్ని ఎదుర్కొనేందుకు ప్రాణహిత జలాలను సద్వినియోగం చేసుకునేలా కాలేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం లేకుండా తుమ్మిడి హెట్టి వద్ద బ్యారేజీ నిర్మించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్, బీర్పూర్ మండలాల్లో పర్యటించిన జీవన్ రెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బీర్పూర్ మండలం కొల్వాయి గ్రామంలో శ్రీ సీతారామ స్వామి వారి బ్రహ్మోత్సవములలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగిత్యాలలో విద్యుత్ అర్టిసన్ కార్మికుల సమ్మెలో పాల్గొని సంఘిభావం తెలిపారు. సారంగాపూర్ లో మీడియాతో మాట్లాడుతూ సాగునీటి సౌకర్యం మెరుగుపర్చేందుకు ఉమ్మడి రాష్ట్రంలో 2004 లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎస్సారెస్పీ దిగువన కడెం ప్రాజెక్టు నీటిని నిలువరింప చేసే విధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టబడడంతో పాటుగా తుమ్మడి హెట్టి నుండి ప్రాణహిత నది జలాలను పొందే విధంగా 152 మీటర్ లెవెల్ లో బ్యారేజ్ నిర్మాణం చేయాలనుకోవడం జరిగిందన్నారు. దానికి అనుగుణంగా కాలువలు కూడా తవ్వకం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి టిఆర్ఎస్ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి 152 లెవెల్ మీటర్స్ తుమ్మడి హెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణాన్ని 148 మీటర్స్ కుదించే విధంగా దానితో పాటుగా దిగువ 100 మీటర్ల లెవెల్ లో మేడిగడ్డ వద్ద దానికి ప్రతిగా ఇంకో బ్యారేజ్ నిర్మాణం చేపట్టాలని సంకల్పించి మేడిగడ్డ వద్ద కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం జరిగిందని తెలిపారు. దానికి అనుసంధానంగా అన్నారం, సుందిళ్ల వద్ద రెండు బ్యారేజీలు నిర్మించి ఎల్లంపల్లికి నీటిని తరలించే ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ అయిన నేపథ్యంలో దానికి మరమ్మత్తులు చేసేందుకు బడ్జెట్లో తగిన నిధులు కేటాయించకపోవడం, తుమ్మిడి హెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి తగిన ప్రణాళిక రూపొందించకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుందని విమర్శించారు. తుమ్మడిహేట్టి ప్రాణహిత నది జలాల కొరకు 52 కోట్లు బడ్జెట్లో ప్రవేశపెట్టి, కొడంగల్ ఇరిగేషన్ కు 1100 కోట్లు కెటాయించడంతో ఉత్తర తెలంగాణ ప్రాంతం పట్ల వివక్షత చూపడం కాదా అని ప్రశ్నించారు.3
- Post by Munna Khan1
- విద్యార్థులకు మెనూ కచ్చితంగా పాటిస్తూ నాణ్యమైన భోజనం ఇవ్వాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎంఆర్ఎస్) విద్యాలయంలో కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్, స్టోర్ రూమ్ లో ఆహార సామగ్రి, కోడి గుడ్లు, కూరగాయలు, విద్యార్థుల కోసం సిద్ధం చేసిన ఆహార పదార్థాలు, తరగతి, వసతి గదులను పరిశీలించారు. మెనూ ప్రకారం చికెన్, మటన్, కోడి గుడ్లు ఇస్తున్నారా అని ఆరా తీశారు. ప్రభుత్వ మెనూ ప్రకారం భోజనం పెట్టాలని ఆదేశించారు. పరీక్షలకు విద్యార్థులు సిద్ధమవు తుండగా, కలెక్టర్ వారితో మాట్లాడి.. పలు సూచనలు చేశారు. విద్యార్థులందరూ చదువు పై శ్రద్ధ పెట్టాలని, ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. తాము అనుకున్న ఉద్యోగాలు, ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు.1