logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నల్గొండ వెంకటరమణ హీరో షోరూం లో అగ్నిప్రమాదం.. ఆహుతైన బైక్లు నల్గొండ పట్టణంలోని అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం... ​వెంకటరమణ బైక్ షోరూంలో చెలరేగిన మంటలు.. కాలిన బూడిదైన బైక్‌లు, స్పేర్ పార్ట్స్... స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది... రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను పూర్తిగా అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది... సంఘటన స్థలాన్ని పరిశీలించిన టూ టౌన్ సీఐ ఆదిరెడ్డి, ఎస్సై సైదా బాబు... ​ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం... కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు...

4 hrs ago
user_Journalist pk
Journalist pk
Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
4 hrs ago

నల్గొండ వెంకటరమణ హీరో షోరూం లో అగ్నిప్రమాదం.. ఆహుతైన బైక్లు నల్గొండ పట్టణంలోని అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం... ​వెంకటరమణ బైక్ షోరూంలో చెలరేగిన మంటలు.. కాలిన బూడిదైన బైక్‌లు, స్పేర్ పార్ట్స్... స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది... రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను పూర్తిగా అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది... సంఘటన స్థలాన్ని పరిశీలించిన టూ టౌన్ సీఐ ఆదిరెడ్డి, ఎస్సై సైదా బాబు... ​ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం... కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు...

More news from తెలంగాణ and nearby areas
  • నల్గొండ వెంకటరమణ హీరో షోరూం లో అగ్నిప్రమాదం.. ఆహుతైన బైక్లు నల్గొండ పట్టణంలోని అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం... ​వెంకటరమణ బైక్ షోరూంలో చెలరేగిన మంటలు.. కాలిన బూడిదైన బైక్‌లు, స్పేర్ పార్ట్స్... స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది... రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను పూర్తిగా అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది... సంఘటన స్థలాన్ని పరిశీలించిన టూ టౌన్ సీఐ ఆదిరెడ్డి, ఎస్సై సైదా బాబు... ​ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం... కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు...
    1
    నల్గొండ వెంకటరమణ హీరో షోరూం లో అగ్నిప్రమాదం.. ఆహుతైన బైక్లు 
నల్గొండ పట్టణంలోని  అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం...
​వెంకటరమణ బైక్ షోరూంలో చెలరేగిన మంటలు.. కాలిన బూడిదైన బైక్‌లు, స్పేర్ పార్ట్స్...
స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది...
రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను పూర్తిగా అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది...
సంఘటన స్థలాన్ని పరిశీలించిన టూ టౌన్ సీఐ ఆదిరెడ్డి, ఎస్సై  సైదా బాబు...
​ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం...
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు...
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    4 hrs ago
  • రైల్వే దుప్పట్లే శాలువాలుగా! - రైల్వేలో దారుణం బయటపడింది.. - WESTERN RAILWAY అని రాసి ఉన్న తెల్లటి దుప్పట్లను శాలువాలుగా కప్పుకొని తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులు... సూర్యాపేట సిటీ: ------------------------ ఇదిలా ఉండగా సంచలన RTI రిపోర్ట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. 2022 జనవరి నుంచి 2026 మే వరకు ఏకంగా 1.27 కోట్ల రైల్వే బెడ్ రోల్ వస్తువులు చోరీకి గురయ్యాయని తెలుస్తోంది. దీంతో కాంట్రాక్టర్లకు ఏకంగా రూ.104.51 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.
    1
    రైల్వే దుప్పట్లే శాలువాలుగా!

- రైల్వేలో దారుణం బయటపడింది..

- WESTERN RAILWAY అని రాసి ఉన్న తెల్లటి దుప్పట్లను శాలువాలుగా కప్పుకొని తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులు...
సూర్యాపేట సిటీ:
------------------------
ఇదిలా ఉండగా సంచలన RTI రిపోర్ట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. 
2022 జనవరి నుంచి 2026 మే వరకు ఏకంగా 1.27 కోట్ల రైల్వే బెడ్ రోల్ వస్తువులు చోరీకి గురయ్యాయని తెలుస్తోంది.
దీంతో కాంట్రాక్టర్లకు ఏకంగా రూ.104.51 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.
    user_YADLA VENUDHAR
    YADLA VENUDHAR
    Suryapet, Telangana•
    21 hrs ago
  • పెరిగిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిత్య ఆదాయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ తో పాటు ఆదాయం కూడా పెరిగింది. అందులో ప్రసాద విక్రయాల ద్వారా రూ.14.42 లక్షలు, VIP దర్శనాలతో రూ.5.68 లక్షలు, కార్ పార్కింగ్ తో రూ.7 లక్షలు, బ్రేక్ దర్శనాలతో రూ.3.63 లక్షలు, ప్రధాన బుకింగ్తో రూ.1.82 లక్షలు. తదితర విభాగాల నుంచి మొత్తం రూ.44,71,561 ఆదాయం వచ్చినట్లు ఈవో భవాని శంకర్ వెల్లడించారు.
    1
    పెరిగిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిత్య ఆదాయం
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ తో పాటు ఆదాయం కూడా పెరిగింది. అందులో ప్రసాద విక్రయాల ద్వారా రూ.14.42 లక్షలు, VIP దర్శనాలతో రూ.5.68 లక్షలు, కార్ పార్కింగ్ తో రూ.7 లక్షలు, బ్రేక్ దర్శనాలతో రూ.3.63 లక్షలు, ప్రధాన బుకింగ్తో రూ.1.82 లక్షలు. తదితర విభాగాల నుంచి మొత్తం రూ.44,71,561 ఆదాయం వచ్చినట్లు ఈవో భవాని శంకర్ వెల్లడించారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    17 hrs ago
  • ఆటపాటలతో సంస్కృతిని చాటిన లంబాడీలు:బంజారా సంస్కృతికి ప్రతీక ‘తీజ్’: జనగామలో ఘనంగా శోభాయాత్ర జనగామ: జిల్లా కేంద్రంలో మాజీ కౌన్సిలర్ వాంకుడోత్ అనిత నివాసం వద్ద తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో నిర్వహించిన బంజారా తీజ్ ఉత్సవాలు నిమజ్జన వేడుకతో ఘనంగా ముగిశాయి. ​అనిత నివాసం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర అంబేద్కర్ చౌరస్తా మీదుగా బతుకమ్మ కుంట వరకు సాగింది. బంజారా మహిళలు, యువత, ఉద్యోగులు, ప్రజలు సంప్రదాయ వేషధారణలతో ఆటపాటలు, నృత్యాలు చేస్తూ పెద్ద ఎత్తున తరలిరావడంతో జనగామ పురవీధులు బంజారా జనసంద్రంగా మారాయి. ​ఈ కార్యక్రమంలో కుసుంబాయి తండా సర్పంచ్ కొర్ర స్వరూప రాజేందర్ నాయక్‌తో పాటు పలువురు బంజారా నాయకులు, ప్రజాప్రతినిధులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశయాలు, సంస్కృతిని కాపాడుకోవాలని, మేరామాయాడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఉత్సవాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.
    1
    ఆటపాటలతో సంస్కృతిని చాటిన లంబాడీలు:బంజారా సంస్కృతికి ప్రతీక ‘తీజ్’: జనగామలో ఘనంగా శోభాయాత్ర
జనగామ: జిల్లా కేంద్రంలో మాజీ కౌన్సిలర్ వాంకుడోత్ అనిత నివాసం వద్ద తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో నిర్వహించిన బంజారా తీజ్ ఉత్సవాలు నిమజ్జన వేడుకతో ఘనంగా ముగిశాయి.
​అనిత నివాసం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర అంబేద్కర్ చౌరస్తా మీదుగా బతుకమ్మ కుంట వరకు సాగింది. బంజారా మహిళలు, యువత, ఉద్యోగులు, ప్రజలు సంప్రదాయ వేషధారణలతో ఆటపాటలు, నృత్యాలు చేస్తూ పెద్ద ఎత్తున తరలిరావడంతో జనగామ పురవీధులు బంజారా జనసంద్రంగా మారాయి.
​ఈ కార్యక్రమంలో కుసుంబాయి తండా సర్పంచ్ కొర్ర స్వరూప రాజేందర్ నాయక్‌తో పాటు పలువురు బంజారా నాయకులు, ప్రజాప్రతినిధులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశయాలు, సంస్కృతిని కాపాడుకోవాలని, మేరామాయాడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఉత్సవాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.
    user_Parushuram goud
    Parushuram goud
    Singer జనగాం, జనగాం, తెలంగాణ•
    7 hrs ago
  • కాలనీల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత.. నెల రోజుల్లో పనులు పూర్తి చేయాలి: ఎమ్మెల్యే నాయిని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని కాలనీల అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం 4వ డివిజన్ పరిధిలోని జ్యోతిబాస్ నగర్, పెద్దమ్మగడ్డ, అక్షర కాలనీ తదితర ప్రాంతాల్లో రూ.1.19 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ తదితర మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. ప్రారంభించిన పనులకు నిర్దిష్ట కాలపరిమితి విధించి నెల రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు చెప్పారు. జ్యోతిబాస్ నగర్‌లో ఇప్పటికే ప్రధాన రహదారులను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని, మిగిలిన రెండు చిన్న గల్లీల్లోనూ సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రతి కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ వ్యవస్థలో సమస్యలు లేకుండా సమగ్ర అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. మౌలిక వసతుల కల్పనతో పాటు పేదల సంక్షేమానికి కూడా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని నాయిని తెలిపారు. అర్హులైన పేద కుటుంబాలకు రేషన్ కార్డులు, పెన్షన్లు, సన్నబియ్యం, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ముఖ్యంగా స్లమ్ ప్రాంతాల్లో నివసించే పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పూర్తిస్థాయిలో అందేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.
    1
    కాలనీల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత.. నెల రోజుల్లో పనులు పూర్తి చేయాలి: ఎమ్మెల్యే నాయిని
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని కాలనీల అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం 4వ డివిజన్ పరిధిలోని జ్యోతిబాస్ నగర్, పెద్దమ్మగడ్డ, అక్షర కాలనీ తదితర ప్రాంతాల్లో రూ.1.19 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ తదితర మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. ప్రారంభించిన పనులకు నిర్దిష్ట కాలపరిమితి విధించి నెల రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు చెప్పారు.
జ్యోతిబాస్ నగర్‌లో ఇప్పటికే ప్రధాన రహదారులను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని, మిగిలిన రెండు చిన్న గల్లీల్లోనూ సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రతి కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ వ్యవస్థలో సమస్యలు లేకుండా సమగ్ర అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు.
మౌలిక వసతుల కల్పనతో పాటు పేదల సంక్షేమానికి కూడా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని నాయిని తెలిపారు. అర్హులైన పేద కుటుంబాలకు రేషన్ కార్డులు, పెన్షన్లు, సన్నబియ్యం, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ముఖ్యంగా స్లమ్ ప్రాంతాల్లో నివసించే పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పూర్తిస్థాయిలో అందేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    15 min ago
  • భైరవునిపల్లిలో ముత్యాలమ్మ తల్లి పండుగను ఘనంగా నిర్వహించారు. నేలకొండపల్లి మండలంలోని భైరవునిపల్లిలో ముత్యాలమ్మ తల్లి పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు ఉదయాన్నే బోనాలు తయారు చేసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొబ్బరికాయలు కొట్టి, కోళ్లు, యాటలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలో పండుగ సందడి నెలకొంది.
    1
    భైరవునిపల్లిలో ముత్యాలమ్మ తల్లి పండుగను  ఘనంగా నిర్వహించారు.
నేలకొండపల్లి మండలంలోని భైరవునిపల్లిలో ముత్యాలమ్మ తల్లి పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు ఉదయాన్నే బోనాలు తయారు చేసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొబ్బరికాయలు కొట్టి, కోళ్లు, యాటలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలో పండుగ సందడి నెలకొంది.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    2 hrs ago
  • హోటల్లో ఏం జరుగుతుందో నాకు తెలిసింది 10% మాత్రమే 90% నాకు తెలియదు మీకు తెలుసు హోటల్‌లో ఏం జరిగిందో మీకు తెలిసింది 10% మాత్రమే.. 90% మీకు తెలియదు నా రూం వాష్‌రూంలో వేరే వ్యక్తి ఉన్నందుకు నేను మాధురి రాథోడ్ వాష్‌రూం వాడుకోవడానికి వెళ్లాను అదే సమయంలో ఎవరో తప్పుడు సమాచారం ఇవ్వడంతో నా భార్య అక్కడకు వచ్చింది ఆ సమయంలో నేను చెప్తే వినే పరిస్థితిలో నా భార్య లేదు నేను, మాధురి రాథోడ్ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాం కానీ మా మధ్య అంత వరకు వెళ్లే ర్యాపో రాలేదు మా ఇద్దరి మధ్య ఎమోషనల్ కనెక్షన్ మాత్రమే ఉంది.. అది కూడా తప్పే ఇంత జరిగినందుకు మాధురి రాథోడ్‌కు నా తరపున సారీ.. ఇంక ఇంతటితో ఆపేయండి * ఫోక్ సాంగ్స్ యాక్టర్ ఈశ్వర్ సాయి
    1
    హోటల్లో ఏం జరుగుతుందో నాకు తెలిసింది 10% మాత్రమే 90% నాకు తెలియదు మీకు తెలుసు 
హోటల్‌లో ఏం జరిగిందో మీకు తెలిసింది 10% మాత్రమే.. 90% మీకు తెలియదు
నా రూం వాష్‌రూంలో వేరే వ్యక్తి ఉన్నందుకు నేను మాధురి రాథోడ్ వాష్‌రూం వాడుకోవడానికి వెళ్లాను
అదే సమయంలో ఎవరో తప్పుడు సమాచారం ఇవ్వడంతో నా భార్య అక్కడకు వచ్చింది
ఆ సమయంలో నేను చెప్తే వినే పరిస్థితిలో నా భార్య లేదు
నేను, మాధురి రాథోడ్ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాం కానీ మా మధ్య అంత వరకు వెళ్లే ర్యాపో రాలేదు
మా ఇద్దరి మధ్య ఎమోషనల్ కనెక్షన్ మాత్రమే ఉంది.. అది కూడా తప్పే
ఇంత జరిగినందుకు మాధురి రాథోడ్‌కు నా తరపున సారీ.. ఇంక ఇంతటితో ఆపేయండి
* ఫోక్ సాంగ్స్ యాక్టర్ ఈశ్వర్ సాయి
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    2 hrs ago
  • కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష.. దాస్యం వినయ్ భాస్కర్.. హనుమకొండ: హనుమకొండ నగరంలోని వైఎస్సార్ నగర్ కాలనీని మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాస్యం వినయ్ భాస్కర్ సోమవారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీలో పర్యటించిన ఆయన స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, మౌలిక సదుపాయాల లోపాలు, అభివృద్ధి అవసరాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాలనీవాసులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన దాస్యం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు సంబంధించిన ప్రతి అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. అలాగే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై నిరంతరం నిలదీస్తామని, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని దాస్యం వినయ్ భాస్కర్ వ్యాఖ్యానించారు.
    1
    కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష.. దాస్యం వినయ్ భాస్కర్..
హనుమకొండ: హనుమకొండ నగరంలోని వైఎస్సార్ నగర్ కాలనీని మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాస్యం వినయ్ భాస్కర్ సోమవారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీలో పర్యటించిన ఆయన స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, మౌలిక సదుపాయాల లోపాలు, అభివృద్ధి అవసరాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కాలనీవాసులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన దాస్యం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు సంబంధించిన ప్రతి అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తమ బాధ్యత అని పేర్కొన్నారు.
అలాగే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై నిరంతరం నిలదీస్తామని, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని దాస్యం వినయ్ భాస్కర్ వ్యాఖ్యానించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.